ఆకలితో రగిలిపోయి, విసిగిపోయిన కాపుజాతి ఆఖరి పోరాటానికి సిద్ధమవుతోందని ప్రముఖ కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తాము మోసపోవడానికి సిద్ధంగా లేమని, తూర్పు గోదావరి జిల్లాలో ఎన్ని ఆంక్షలు విధిం చినా ర్యాలీలు, కాపు ఐక్య గర్జన సభ జరిపి తీరుతామని చెప్పారు. జిల్లాలో సెక్షన్ 30 అమలు చేస్తూ ఈ నెలాఖరు వరకూ ముందస్తు అనుమతి లేనిదే ర్యాలీలు, ధర్నాలు, సభలు నిర్వహించరాదంటూ పోలీసు శాఖ జారీ చేసిన ఆదేశాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. వీటిని నిరసిస్తూ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. వి.కొత్తూరులో కాపు ఐక్యగర్జన వేదిక ప్రాంతానికి మంగళవారం వచ్చిన ముద్రగడ ఈ లేఖను విడుదల చేశారు.