పద్మనాభం పీఎస్‌ ఘటన.. ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు | Visakhapatnam Padmanabham PS Third Degree Incident Three Suspended | Sakshi
Sakshi News home page

విశాఖ పద్మనాభం పీఎస్‌ ఘటన.. సీపీ రవి శంకర్‌ సీరియస్‌.. ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు

Published Mon, Oct 2 2023 2:01 PM | Last Updated on Mon, Oct 2 2023 6:51 PM

Visakhapatnam Padmanabham PS Third Degree Incident Three Suspended - Sakshi

సాక్షి, విశాఖపట్నం: పద్మనాభం పోలీస్ స్టేషన్ ఘటన పై సీపీ రవి శంకర్ సీరియస్ యాక్షన్‌కి దిగారు. యువకుడిపై థర్డ్ డిగ్రీ  ప్రయోగించిన కేసులో ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

భీమిలి పద్మనాభం మండలంలో బాందేవుపురం గ్రామానికి చెందిన వ్యక్తిపై పోలీసులు థర్ద్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ యువకుడిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి మరీ కాళ్లు విరగొట్టారని.. వాళ్లపై చర్యలు తీసుకోవాలని సోమవారం దళిత కులాల సంక్షేమ సేవా సంఘం  ఆందోళన సైతం చేపట్టింది. ఈ విషయం సీపీ రవిశంకర్‌ దృష్టికి రావడంతో ఆయన చర్యలకు ఉపక్రమించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement