ఎక్సైజ్‌ సీఐ, ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌ | Excise CI And Three Constables Suspended | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ సీఐ, ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

Published Mon, Jun 7 2021 9:04 AM | Last Updated on Mon, Jun 7 2021 9:07 AM

Excise CI And Three Constables Suspended - Sakshi

మహారాణిపేట (విశాఖ దక్షిణ): విశాఖపట్నంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు పక్కదారి పట్టిన వ్యవహారంలో మర్రిపాలెం ఎక్సైజ్‌ సీఐ సీహెచ్‌.నాగశ్రీనివాసరావు, ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటుపడింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్‌ కమిషనర్‌ రజత్‌భార్గవ ఉత్తర్వులిచ్చారు. విశాఖలోని మర్రిపాలెం స్పెన్సర్స్, లక్ష్మీనగర్, మల్కాపురం, శాంతిపురం మద్యం షాపుల్లో సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లు నకిలీ రశీదులతో రూ.33.5 లక్షలు పక్కదారి పట్టించారు.

ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌ సీఐ సీహెచ్‌ నాగశ్రీనివాసరావు పాత్ర ఉండడంతో అతడిని సస్పెండ్‌ చేశారు. ఈ అక్రమాలతో సంబంధం ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ కొండయ్య, కానిస్టేబుళ్లు జయరామ్, రామానాయుడులను సస్పెండ్‌ చేసినట్లు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ బెండపూడి శ్రీనివాసులు తెలిపారు. ఎస్‌ఐ విమలాదేవిపై చర్యలు తీసుకోవాలని ఎౖక్సైజ్‌ కమిషనర్‌కు సిఫార్సు చేసినట్లు చెప్పారు.

చదవండి: విషాదం: క్షణికావేశం..తీసింది ప్రాణం..  
మత్తు.. చిత్తు: అక్రమ రవాణాపై ఉక్కుపాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement