నెల్లూరు: మెడికల్ విద్యార్ధిని వేధిస్తున్న పోలీసు కానిస్టేబుల్ ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. స్నేహితుడితో ఉండగా ఫోటోలు తీసిన కానిస్టేబుల్ గోపీ తనను వేధిస్తున్నాడని జిల్లా ఎస్పీకు బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విద్యార్ధిని ఫిర్యాదు స్పందించిన ఎస్పీ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.