సాక్షి, అనంతపురం: ఆర్మ్‌డ్ రిజర్వు (ఏఆర్) కానిస్టేబుల్ ఆదినారాయణ అకృత్యం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధ్యత కల్గిన ఉద్యోగంలో ఉంటూ పోలీసు శాఖకే మచ్చతెచ్చేలా వ్యవహరించాడు. ఓ వివాహితను బలాత్కారం చేయబోయిన అతన్ని దిశ డీఎస్పీ ఎ.శ్రీనివాసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. ఆదినారాయణ 2005వ సంవత్సరంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరాడు. ప్రస్తుతం సెబ్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నాడు. అనంతపురంలోని రుద్రంపేటలో నివాసముంటున్నాడు. ఇతనికి నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో మిత్రుడు ఉన్నాడు. తరచూ అతని ఇంటికి వెళ్లేవాడు.
చదవండి: తండ్రి గేమ్ ఆడొద్దన్నాడని ఇంటర్ విద్యార్థిని దారుణం..
ఈ క్రమంలో మిత్రుడి ఇంట్లో బాడుగకు ఉంటున్న ఓ కుటుంబంలోని వివాహితపై కన్నేశాడు. ఈ నెల మూడున ఉదయం ఎవరూ లేని సమయంలో వివాహిత ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెతో మాటలు కలిపాడు. అతని వాలకాన్ని పసిగట్టిన ఆమె తన అన్నకు ఫోన్ చేసి.. మాట్లాడకుండా అలాగే ఉంచింది. ఆదినారాయణ బలాత్కారం చేయబోయాడు. అదే సమయంలో అన్న ఇంటికి చేరుకుని అతనికి చీవాట్లు పెట్టి అక్కడి నుంచి పంపేశాడు. అదే రోజు బాధిత మహిళ కుటుంబ సభ్యులతో కలిసి దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చదవండి: దారుణం: కారు బైక్ ఢీ.. మామ, కోడలు దుర్మరణం
దిశ డీఎస్పీ శ్రీనివాసులు ఈ విషయాన్ని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని ఎస్పీ ఆదేశించారు. అనంతరం ఆదినారాయణపై అత్యాచార యత్నం కింద కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం అతన్ని డీపీఓలో దిశ డీఎస్పీ అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు. కాగా.. ఆదినారాయణ సస్పెన్షన్‌కు రంగం సిద్ధమైంది. మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment