![Hyderabad Police Constable Arrested For Cheating Woman And Molested - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/28/molested.jpg.webp?itok=n3ps6KFD)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నాగోలు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడిన పోలీస్ కానిస్టేబుల్‌ను ఎల్‌బీనగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎల్‌బీనగర్ పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా గడివేడు మండలానికి చెందిన దాసరి రాములు(29) సైబరాబాద్‌లో కానిస్టేబుల్. రంగారెడ్డి జిల్లా నార్సింగి జాహిర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. 2017లో ఓ యువతి ఎస్‌ఐ కోచింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. అదే సెంటర్‌లో కోచింగ్ తీసుకుంటున్న రాములు యువతితో స్నేహం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నట్లు చెప్పాడు.
చదవండి: సైబర్ కేఫ్‌లో ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్
ఇనిస్టిట్యూట్‌కు వెళ్లిన ఆమెకు మయమాటలు చెప్పి స్నేహితుడి గదికి తీసుకెళ్లి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. గర్భిణి అని తెలియగానే గర్భస్రావం ట్యాబ్లెట్లు ఇచ్చాడు. 2020లో రాములు కానిస్టేబుల్‌గా ఎంపికై అక్టోబర్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. అనంతరం సైబరాబాద్ కమిషనరేట్‌లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని, నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని రాములును సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: పెళ్లయ్యి ఏడాది కాకముందే.. అబార్షన్ చేయించుకుందని!
Comments
Please login to add a commentAdd a comment