విశాఖపట్నం : ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన ఉన్న కేసులో జిల్లాలోని పూడిమడక మెరైన్ సీఐ హుస్సేన్పై సస్పెన్షన్ వేటు పడింది. బుధవారం విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎ. రవిచంద్ర ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో చేరిన నాటి నుంచి హుస్సేన్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఆ క్రమంలో అతడిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల ఏసీబీ అధికారులు హుస్సేన్ నివాసంపై దాడి చేశారు. అందులోభాగంగా హుస్సేన్... కోట్ల రూపాయిలు కూడబెట్టినట్లు గుర్తించారు. సీఐ హుస్సేన్ను అరెస్ట్ చేశారు. దీంతో డీఐజీ ఎ.రవిచంద్ర సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.