Hussain
-
మా శవాలపైనే శంకుస్థాపన చేయాలి
కొడంగల్: తమ భూములు లాక్కుంటే.. తమ శవాలపైనే ఫార్మా కంపెనీలకు శంకుస్థాపన చేయాల్సి ఉంటుందంటూ రోటిబండతండా, లగచర్ల గ్రామ స్తులు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. రేవంత్‌రెడ్డికి సీఎం పదవి ఎంత ముఖ్యమో, తమకు తమ భూములూ అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. హుస్సేన్ నాయక్ సోమవారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని ఫార్మా బాధిత గ్రామాల్లో పర్యటించి గిరిజనులతో మాట్లాడారు.కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో పాటు ఇతర అధికారులపై దాడికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా ఫార్మా భూములకు సంబంధం లేని వ్యక్తులు ఒక్కసారిగా అధికారులపై దాడికి పాల్పడ్డారని ఈ సందర్భంగా బాధితులు ఎస్టీ కమిషన్ సభ్యుడికి వివరించారు. ఎవరో చేసిన తప్పిదాలకు తాము బలయ్యామని చెప్పారు. దాడి చేసిన రోజు అర్ధరాత్రి పోలీసులు మద్యం మత్తులో వచి్చ, మానసికంగా, శారీరకంగా వేధించారని ఆరోపించారు. పోలీసులు అత్యుత్సాహం మానుకోవాలి: హుస్సేన్ నాయక్ పోలీసులు అత్యుత్సాహం మానుకోవాలని ఎస్పీ నారాయణరెడ్డికి హుస్సేన్ నాయక్ సూచించారు. ఫార్మా బాధిత గ్రామాల నుంచి పోలీసులను వెనక్కి తీసుకోవాలని చెప్పారు. లగచర్లలో కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలో గ్రామసభ ఎలా నిర్వహిస్తారని అధికారులను ప్రశ్నించారు. రైతులతో మాట్లాడడానికి కలెక్టర్ లగచర్లకు వెళ్తుంటే పోలీసులు ఎందుకు భద్రత కలి్పంచలేదని నిలదీశారు. భూములు తీసుకోవాలంటే రైతులతో శాంతియుతంగా మాట్లాడాలని సూచించారు. ఆయన వెంట ఐజీ సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి, డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు. ఇలావుండగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, ప్రతినిధులు గోవింద్, సురేందర్ సోమవారం ఫార్మా బాధిత గ్రామాల్లో పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు.ఫార్మా పేరిట భూ దందా సంగారెడ్డి టౌన్: లగచర్లలో ఫార్మా పేరిట భూదందాకు తెరలేపారని హుస్సేన్ నాయక్ ఆరోపించారు. లగచర్ల ఘటనలో అరెస్టు అయ్యి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న 16 మందితో సోమవారం సాయంత్రం జాతీయ ఎస్టీ కమిషన్ బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ విలేకరులతో మాట్లాడారు. ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తాం..1,350 ఎకరాలు కావాలంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన విమర్శించారు. రైతులు భూమిని వదులు కోవడానికి సిద్ధంగా లేరని, వారి భూమికి బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
హుస్సేన్ సాగర్ లో బోట్ పోటీలు
-
వైఎస్ తొలి సంతకానికి తొలి సాక్షి
నిలువెత్తు నిజాయితీ, నిబద్ధత, నిపు ణతకు మారు పేరుగా 32 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సేవ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మరణం అత్యంత విషాదకరం. ఆయన మృతి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజ లకూ తీరని లోటు. పరిపాలనాధికారిగా ప్రజల సమస్యలు ఆయనకు కరతలామ లకం. జన చైతన్యానికీ, నాగరికతకూ, అభివృద్ధికీ ప్రజా జీవన ప్రమాణాల శీఘ్ర పురోగతికీ కేంద్రాలయిన నెల్లూరు, గుంటూరు జిల్లా లకు ఒకప్పుడు కలెక్టర్‌గా పనిచేసిన ఆయనఆ యా జిల్లాల పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా, వ్యవ సాయ శాఖ కమిషనర్‌గా, ఎక్సైజ్ శాఖ కమిష నర్గా ఆయన తన అసమాన ప్రతిభను కన పర్చారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా పనిచేసే రోజుల్లో జిల్లాల వారిగా మద్యం వ్యాపారాన్ని రాజకీయ మాఫీయా ఏ విధంగా ప్రభావితం చేస్తున్నదో సవివరమైన నివేదికను రూపొందించి, అప్పట్లో సంచలనం సృష్టించారు. ఆయన రూపొందించిన నివేదిక అక్షర సత్యం అనేది నేటికీ రుజువవుతున్నది. వ్యవసాయ శాఖ కమిషనర్‌గా ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా ఆయన రూపొందించిన వ్యూహం సత్ఫలితాలు ఇచ్చింది. 2002 – 03లో ఉమ్మడి రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర దుర్భిక్షం, కరువులను కేంద్ర పరిశీలక బృందానికి అత్యంత ప్రతిభావంతంగా వివ రించి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టగలిగారు. ఎవరికైనా జన్నత్ హుస్సేన్ పేరు స్ఫురణకు రాగానే ఆయనలోని సౌమ్యత, ముఖంలో ఉట్టిపడే సౌహార్ద్రత కళ్లల్లో మెదలు తాయి. వినయ విధేయతలకు మారు పేరు అయిన హుస్సేన్ దివంగత ముఖ్యమంత్రులు కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి మన్నన పొందారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాగానే అధికార గణం నుంచి తొలి ఎంపికగా జన్నత్ హుస్సేన్‌ను తన కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా నియమించుకున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే యావత్ రాష్ట్ర రైతులందరికీ ఉచిత విద్యుత్ వరాన్ని ప్రసాదిస్తూ జన్నత్ హుస్సేన్ రూపొందించిన ఫైల్‌పై తన తొలి సంతకాన్ని చేశారు. హుస్సేన్ ఉచిత విద్యు త్ను గట్టిగా సమర్థించేవారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో రైతులకు నేటికీ ఉచిత విద్యుత్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆనాడు ఉచిత విద్యుత్ ఫైల్‌పై వైఎస్ఆర్ తొలి సంతకం చేసే చారిత్రక సన్ని వేశానికి తొలి ప్రత్యక్ష సాక్షిగా జన్నత్ హుస్సేన్ ఎప్పటికీ చరిత్ర పుటలలో మిగిలిపోతారు. ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారిగా... చిత్తశుద్ధిగా పనిచేసే యువ ఐఎఎస్ అధికార్లను ప్రొత్స హించారు. అపోహలతో వారిని బదిలీ చేసినప్పుడు వారికి అండగా నిలిచి వారి బదిలీలను నిలిపి వేశారు. ఇంధన కార్యదర్శిగా ఆరంగం అభివృద్ధికి పాటు పడ్డారు. పదవీ విరమణ అనంతరం ప్రధాన సమా చార కమిషనర్‌గా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో తీర్పులు ఇచ్చారు. ఇలాంటి మహో న్నతమైన వ్యక్తిత్వం కల జన్నత్ హుస్సేన్‌తో నాకు దశాబ్దాల అనుబంధం ఉన్నందుకు గర్విస్తున్నాను. ఈ గొప్ప పాలనా దక్షుడికి అశ్రు నివాళి అర్పిస్తున్నాను. - వ్యాసకర్త ‘బీఈఈ’ మీడియా ఎడ్వైజర్, నాటి సీఎం వైఎస్ ప్రెస్ సెక్రటరీ - ఎ. చంద్రశేఖర రెడ్డి -
కాలనీలో కత్తిపోట్ల కలకలం..
నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధి చంద్రశేఖర్ కాలనీలో కత్తిపోట్ల కలకలం సృష్టించింది. పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది మధ్య జ రిగిన గొడవలో ఆవేశం పట్టలేక ఓ యువకుడు కత్తితో ముగ్గురిపై దాడి చేయగా వారు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రూరల్ ఎస్సై జి మహేశ్ తెలిపిన వివరాలు.. చంద్రశేఖర్ కాలనీ గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఓ విందులో ఎస్కే హుస్సేన్, ఎస్కే అక్బర్, అబ్దుల్, సద్దాం పాల్గొన్నారు. వీరిమధ్య మాటమాట పెరిగటంతో గొడవ జరిగింది. ఇంతలో సద్దాం తన స్నేహితుడు అమీర్‌ఖాన్‌కు ఫోన్‌చేసి తనను కొడుతున్నారని చెప్పాడు. దీంతో ఆయన స్నేహితులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. ఇందులో ఎస్కే నవీద్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి వెళ్లి ఏమైందని ఎందుకని కొడుతున్నారని అడుగగా కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో హుస్సేన్, అక్బర్, అమీర్‌ఖాన్‌కు గాయలు కాగా, ఎస్కే నవీద్‌ను సద్దాం కత్తితో పొడిచాడు. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అమీర్‌ఖాన్ బావ షేక్ మోబిన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కత్తితో దాడి చేసిన సద్దాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కఫన్
తెల్లవారుతూ ఉంది. అప్పుడే మర్కస్ మసీదు మీనారాల నుండి అల్లాహు అక్బర్ – అంటూ అజా రాగయుక్తంగా వినిపిస్తూ ఉంది. సకీనాబీ పరివారం అజా వినబడగానే నిదురనుండి లేచింది. సకీనాబీ, అత్త ఖాసింబీ, కూతురు షాహినాను ‘‘అజా ఇచ్చారు లేవండి’’ అని నిదుర లేపింది. అందరూ లేచి వజూ చేసుకుని, రెండు రకాతులు సున్నత్ నమాజ్, రెండు రకాతులు ఫర్జ్నమాజులు చదివి చేతులు పైకెత్తి జబ్బుపడ్డ తమ ఇంటి పెద్దను ఆరోగ్యవంతునిగా చేయమని దీనంగా కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించి, ఒక మూల మంచంపై అచేతనంగా పడివున్న హుసేన్‌ను శరీరంపై నిమిరి ఊదారు. ఇంటి యజమాని హుసేన్‌కు పక్షవాతము వచ్చి కుడికాలు, కుడిచేయి, నోరు పడిపోయి సరైన వైద్య సదుపాయం లేక రోజులు లెక్కిస్తున్నాడు. అత్త ఖాసింబీ.. కుమారుని దీనావస్థను చూసి, ‘‘బేటా ఎట్లా ఉంది?’’ అని అడిగింది. హుసేన్ కళ్లు తెరిచి చూశాడు. ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు. కళ్లవెంట కన్నీరు కారుతున్నాయి. భార్య సకీనాబీ భర్త కన్నీళ్లు తుడిచింది. ‘‘క్యాజీ నీళ్లు కావాలా?’’ అంటూ లేపి, నీళ్లు తాగించి మరలా పడుకోబెట్టింది. అత్తా కోడళ్లు హుసేన్ దీనావస్థను చూసి కన్నీరు కారుస్తూ కూచున్నారు. కూతురు షాహినా ఖురాన్ షరీఫ్ తీసి అందులోని యాసీన్ సూరాను ఎంతో భక్తి ప్రపృత్తులతో పఠించి తండ్రి ఆరోగ్యానికై చేతులెత్తి దీనంగా అల్లాహ్‌ను ప్రార్థించి, తన తండ్రి హుసేన్‌పై మూడు మార్లు ఊదింది. ఏమీ చేయలేని అసహాయస్థితిలో అచ్చటే ఒక మూల ఖురాన్ షరీఫ్ చదువుతూ కూర్చుంది. తూర్పున ప్రభాకరుడు అరురారుణ కాంతులతో ఎర్రని పొత్తిళ్ల నుండి ప్రభవిస్తూ తన కాలగమన రహస్యాన్ని చాటుతూ వెలుగు చిమ్ముతున్నాడు. సకీనాబీ ఇళ్లలో పాచి పని చేయడానికి వెళ్లిపోయింది. అత్త ఖాసింబీ తజ్బీ తిప్పుతూ, కుమారుడు హుసేన్ మంచం దగ్గర కూచోని ఉంది. హుసేన్ కాస్తో కూస్తో సంపాదిస్తున్న రోజుల్లో షాహినాను శ్రద్ధగా చదివించాడు. పదవ తరగతిలో జిల్లా ప్రథమ స్థానంలో పాస్ అయింది. ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజ్ వాళ్లే తమ కాలేజీలో చదివించారు. రీయింబర్స్‌మెంటు పుణ్యమా అని, ఇప్పుడు బీఈ ఆఖరి సంవత్సరం చదువుతోంది. అప్పటివరకు ఎంతో కొంత సహాయం చేసే తండ్రి మంచం పట్టాడు. ఇప్పుడు పూట గడవడానికి ఇతర ఇళ్లలో ఏదో పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. షాహినా చినిగిపోయిన పంజాబీ డ్రస్సు కుట్టుకుంటోంది. అది చూసి దాది ఖాసింబీ, ‘‘షాహినా! ఏం చేస్తున్నావమ్మా’’ అని అడిగింది. ‘‘దాదీ! ఈరోజు పరీక్షలు. పరీక్షలకు వెళ్లడానికి ఈ చినిగిపోయిన పంజాబీ డ్రస్సును కుట్టుకుంటున్నా’’.ఆ మాటలకు దాది మనసు చివుక్కుమంది. మళ్లీ షాహినా దీనంగా అంది, ‘‘దాదీ! ఒక బురఖా అయినా కొనిస్తే, లోపల ఎట్లా ఉన్నా పైన అది వేసుకొని పోవచ్చు. ఒక బురఖా కొనివ్వు..’’. ‘‘అమ్మా! నీకు పంజాబీ డ్రెస్సే కొనివ్వలేకపోయాం. ఇంక ఐదారొందలు పెట్టి బురఖా ఏం కొనిస్తాను తల్లీ! మూడు నెలలనుండి పింఛను రాలేదు. అది వస్తే నీకు గుడ్డలు కొనిస్తా తల్లీ! చూస్తున్నావుగా మన పరిస్థితి. అబ్బాజాన్‌కు సరైన మందులు ఇప్పించలేక ఇబ్బందులు పడుతున్నాం..’’ అంటూ చెమ్మగిల్లిన కన్నీళ్లను తన చినిగిపోయిన చెంగుతో తుడుచుకుంది. సంభాషణ అంతా అచేతనంగా పడివున్న హుసేన్ వింటున్నాడేమో, తన కుటుంబం దీన స్థితి, తన ముద్దుల కూతురు షాహినా స్థితి చూసి కన్నీళ్లు ధారగా కారసాగాయి. అది చూసి షాహినా తన కుట్టడం ఆపివేసి తండ్రి దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి బోరున విలపించింది. దాదీ షాహినాను ఓదార్చుతూ పక్కకు తీసుకొని పోయింది. ఉదయం 9 గంటలకు అమ్మ సకీనాబీ ఇళ్లలో పాచి పనిచేసి మిగిలిన తినుబండారాలు తీసుకొనివచ్చి వారి ముందు పెట్టింది. ఆ పాచి అన్నం అందరూ తిన్నారు. షాహిని పంజాబీ డ్రస్సు వేసుకుని చినుగులు కనబడకుండా ఉండడానికి చుట్టూ ఓణి కప్పుకొని, పుస్తకాలు తీసుకొని తండ్రి దీవెనలకై హుసేన్ దగ్గరకు వెళ్లింది. హుసేన్ కూతురుని చూశాడు. ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. తన మనసులోని ఆవేదనకు గుర్తుగా కనుల చివర నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఇదే ఆఖరు చూపేమో అనుకున్నాడు హుసేన్. షాహినాను అదే పనిగా చూస్తున్నాడు. సైగలతో దగ్గరకు పిలిచాడు. ఎత్తలేక ఎత్తలేక ఎడమచెయ్యి ఎత్తి షాహినా తలపై పెట్టాడు. ‘‘అమ్మా! బాగా చదివి కుటుంబాన్ని ఆదుకో తల్లి!’’ అని దీవించాడు. ఆరోజు తండ్రి ప్రవర్తన అదో రకంగా ఉండడం షాహినా గమనించింది. తండ్రి కన్నీరు తుడుస్తూ ‘‘అబ్బా జాన్! నేను విప్రో కంపెనీ వాళ్ల ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. హైద్రాబాద్‌లో ఉద్యోగం. నెలకు నలభై వేలు ఇస్తారట. పరీక్షలు అయిపోయిన తర్వాత నేను ఉద్యోగంలో చేరి నీకు మంచి మంచి మందులు ఇప్పిస్తా. అమ్మా! దాదీని బాగా చూస్తా. అధైర్యపడకు’’ అంటూ కన్నీళ్లు కారుస్తూ తండ్రి దగ్గర సెలవు తీసుకొని కాలేజీకి వెళ్లిపోయింది. కొత్తగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ప్రొబెషనరీగా షేక్ ఫజులుల్లా ఒంగోలు పట్టణానికి వచ్చాడు. ఆయన రోజూ తన సిబ్బందితో ఆ ఇంజనీరింగ్ కాలేజీ మార్గం గుండా వెళుతుంటే, ఆ దారిలో చుట్టూ ఓణి కప్పుకొని వెళుతున్న షాహినాను చాలాసార్లు చూశాడు. అతనికెందుకో అందరు అమ్మాయిలు రకరకాల దుస్తులు వేసుకుని, ఫ్యాషన్ వెళ్లబోస్తూ, నవ్వుతూ, కేరింతలు కొడుతూ, వెళ్తూ ఉంటే, ఏంది ఈ అమ్మాయి! వోణి కప్పుకొని కాలేజ్‌కు వెళ్తుందని ఆయన మనసులో ఒక రకమైన ఆలోచన కలిగింది. ఏదో ఉండి ఉంటుంది. అడిగి తెలుసుకుందామని అనుకున్నాడాయన. వెంటనే ఆయన బండిని ఆపి కానిస్టేబుల్‌ను పంపి, ‘‘ఆ పోయే అమ్మాయిని పిలుచుకొనిరా!’’ అని పంపాడు. ఆ కానిస్టేబుల్ ఆ అమ్మాయిని, ‘‘మా దొరగారు పిలుస్తున్నారు’’ అని పిలుచుకొని వచ్చాడు. వాళ్ల సిబ్బందికి ఇదంతా అర్థం కావడం లేదు. ఎందుకు బండి ఆపారు, ఎందుకు ఆ అమ్మాయిని పిలుస్తున్నాడని. షాహినా వచ్చి నిలబడింది. కమిషనరుగారు, ‘‘నీ పేరేంటి? నువ్వు ఎక్కడుంటున్నావ్? అందరి పిల్లల్లాగా కాకుండా ఎందుకు ఓణి చుట్టూ కప్పుకున్నావ్?’’ అడిగారు. ముందు షాహినా చెప్పడానికి జంకింది. తరువాత, ‘‘మాది కోటవీధి. నా పేరు షాహినా. మాది పేద కుటుంబం. మా నాన్న జబ్బు పడ్డాడు. నా పంజాబీ డ్రెస్ చినిగిపోతే అది కనబడుతుందని ఇలా ఓణి కప్పుకున్నాను’’ అని చెప్పింది. ఆమెకు తెలియకుండానే కళ్లవెంట కన్నీరు ఆమె లేత బుగ్గలను వొరుసుకుంటూ కారసాగాయి. ఆ మాటలకు కమిషనరు గారికి కూడా చెప్పకుండా కళ్లు చెమ్మగిల్లాయి. ఆ అమ్మాయి చెప్పిన మాటలకు అక్కడి సిబ్బంది కూడా చలించిపోయారు. వెంటనే కమిషనరు వెయ్యి రూపాయలు తీసి షాహినాకు ఇచ్చి, ‘‘ఈ డబ్బులతో బట్టలు కుట్టించుకో’’ అని చేతిలో బలవంతంగా డబ్బులు పెట్టి వెళ్లిపోయారు. షాహినా ఆ డబ్బులు తన పుస్తకంలో పెట్టుకొని పరీక్షలు రాసి తండ్రికి బాగా రాశానని చెప్పడానికి త్వరత్వరగా ఇంటికి బయలుదేరింది. ఇంటికి సమీపిస్తుండగానే ఇంటిముందు జనం గుమిగూడి ఉన్నారు. ఏదో జరిగిందని శంకిస్తూనే ఇంట్లోకి అడుగుపెట్టింది. హుసేన్ చుట్టూ, అమ్మా, దాదీ అందరూ చేరి ఏడుస్తున్నారు. షాహినా పుస్తకాలు అక్కడ పడేసి, ‘‘నాన్నా!’’ అంటూ నాన్న శరీరంపై పడిపోయింది. ఇల్లంతా రోదనలతో, విషాదంగా నిలబడిపోయింది. మయ్యత్ (ఖననము) చెయ్యడానికి డబ్బులు లేవు ఎట్లా అని తల్లి విలపిస్తూంటే, షాహినా తన దగ్గరున్న వెయ్యి రూపాయలు తీసి ఇచ్చి ఏడుస్తూ జరిగిన సంగతంతా చెప్పింది. తల్లీకూతుళ్లు ఒకరిని ఒకరు పట్టుకొని తనివితీరా విలపించారు. ఆ డబ్బులతో కఫన్ (శవానికి చుట్టే గుడ్డ), వగైరాలు తెప్పించి హుసేన్‌కు ఆచారం ప్రకారం ఖననం చేశారు. ఒక దీపం మలిగింది. మిగిలిన దీపాలకు అల్లాహ్‌నే నూనె పోస్తాడని ఆశిద్దాం.ఇంటికి సమీపిస్తుండగానే ఇంటిముందు జనం గుమిగూడి ఉన్నారు. ఏదో జరిగిందని శంకిస్తూనే ఇంట్లోకి అడుగుపెట్టింది. హుసేన్ చుట్టూ, అమ్మా, దాదీ అందరూ చేరి ఏడుస్తున్నారు. హాజీ షేక్ మహబూబ్ జాన్ -
నిండు శోకంతో మొహర్రం
ఇమామ్ హుస్సేన్‌కు ఘన నివాళి గుమ్మటాలు, పీర్ల ఊరేగింపు ద్రాక్షారామ(రామచంద్రపురం రూరల్) : మహ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ సంతాప దినాలు (మొహర్రం సంతాప దినాలు), మొహర్రం పండుగగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటుంటారు. 6వ శతాబ్దంలో ఇరాన్‌లోని కర్బలాలో జరిగిన యుద్ధంలో మహ్మద్ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్, అతని పరివారాన్నిSప్రత్యర్థులు హతమార్చారు. అప్పటి నుంచి ఏటా ముస్లింలు మొహర్రం సంతాపదినాలను పాటిస్తున్నారు. ఈ నెల 2 న చంద్ర దర్శనంతో ఇస్లాం క్యాలండర్‌లోని మొదటి నెల మొహర్రం ప్రారంభమైంది. 11 రోజుల మొహర్రం సంతాప దినాలు బుధవారంతో ముగిశాయి. ఈ 11 రోజుల్లో ముఖ్యమైన రోజులలో జులూస్ (ఊరేగింపులు), నిప్పుల గుండంపై నడవడం, మజ్లిస్‌లు నిర్వహించారు. రంగురంగుల పీర్ల(అలం) ఊరేగింపు తదితర కార్యక్రమాలలో మహిళలు కూడా పాల్గొన్నారు. ఇమాం హుస్సేన్ వీర మరణం(షహీద్) పొందిన మొహర్రం పదకొండో రోజైన బుధవారం ముస్లింలు ద్రాక్షారామలోని పెద్ద మసీదు సెంటర్ నుంచి, హజరత్ అబ్బాస్ రోడ్డు వరకు తమ వీపులపైన, శిరస్సులపైన, ఛాతీలపైన రక్తం చిందేలా మాతం చేసి ఇమాం హుస్సేన్‌పై తమ భక్తిని చాటుకున్నారు. రాత్రి మొహర్రం సంతాప దినాలలో ప్రధాన ఘట్టమైన బార్ మే ఇమాం(తల్లి పీరు) ఊరేగింపు ఆగా వారి పెద్ద పంజా నుంచి మాతం నిర్వహించుకుంటూ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. పంజాముజావర్లు(ధర్మకర్తలు) భక్తులకు భోజన వసతులు కల్పించారు. మజ్లిస్ (ప్రార్థన) బోధించేందుకు ఇరాక్‌లోని నజఫ్ పట్టణంలో విద్యాభ్యాసం చేసిన మౌలానా షమీముల్ హసన్ నజఫీ విచ్చేశారు. ఆయన మొహర్రం ప్రాశస్త్యాన్ని వివరించారు. ముస్లింలు నల్ల దుస్తులు ధరించి పీరులను, గుమ్మటాలను చెరువుకు తీసుకుని వెళ్లి కడిగి శాంతింపజేశారు. ద్రాక్షారామతో పాటు హసన్‌బాద, పెడపర్తి, పసలపూడి, తాళ్లరేవు గ్రామాలలో పీర్ల పంజాలలో సంతాప దినాలు నిర్వహించారు. వివిధ ముస్లిం సంఘాలు ఏర్పాట్లను పర్యవేక్షించాయి. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మీరా›్జ ఖాసిం హుస్సేన్ (చోటు), డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీఐ కొమ్ముల శ్రీధర్‌కుమార్, ఎస్సై ఫజుల్ రహమన్, పంజా ధర్మకర్తలు, ఇమాంలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ద్రాక్షారామ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మామిడికుదురులో.. మామిడికుదురు : ముస్లింల ఆరాధ్య దైవం హజరత్ ఇమామ్ హుస్సేన్, ఆయన పరివారం అమరత్వం పొందిన రోజు (షహదత్) ను పురస్కరించుకుని మొహర్రం ను బుధవారం నిండు శోకంతో నిర్వహించారు. భక్తులు కత్తులు, బ్లేడులు, గొలుసులతో తమ శరీరాలను గాయపర్చుకుని రక్తం చిందిస్తూ ‘హుస్సేన్... హుస్సేన్’... అని నినదిస్తూ మాతం నిర్వహించారు. మామిడికుదురు, నగరం గ్రామాల్లోని సుమారు 45 పంజాల నుంచి పీర్లు, గుమ్మటాలను తీసి గ్రామ వీధుల్లో ఊరేగించారు. స్థానిక హజరత్ ఇమామ్ హుస్సేన్ పంజా నుంచి ప్రారంభమైన ఊరేగింపు నగరం పెద పంజీషా వరకు జరిగింది. నగరంలోని మంజిలే కర్బలా నుంచి రక్తం చిందిస్తూ మాతం నిర్వహిం చారు. పెద పంజీషాలో మౌలానా అలీ హైదర్ హైదరీ షహదత్ మజ్లిస్ ఆల పించారు. నగరంలోని చెరువులో పీర్లను శాంతింప చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ముస్లింలు నలుపు దుస్తులు ధరించి మొహర్రం సంతాప కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ ముస్లిం సంఘాల ప్రతినిధులు భక్తులకు ప్రసాద వితరణ చేశాయి. -
హజరత్ హుసేన్ త్యాగాలు చిరస్మరణీయం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): మహమ్మద్ ప్రవక్త మనుమడు హజరత్ హుసేన్, ఆయన కుటుంబ సభ్యులు ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రాణ త్యాగాలు చేశారని హజరత్ అజీముద్దీన్ దర్గా బ్రాదరే సజ్జాదే నషీన్ సయ్యద్ తాహెర్ పాషా ఖాద్రి పేర్కొన్నారు. మొహర్రం పండుగను పురస్కరించుకుని ముహిబ్బానే అహ్లెబైత్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఇస్లామియా అరబ్బిక్ కళాశాల మైదానంలో 'యాదే హుసైన్' పేరుతో గొప్ప బహిరంగ సభ నిర్వహించారు. లావుబాలీ దర్గా పీఠాధిపతి సయ్యద్ అబ్దుల్లా హుసేని బాద్షా ఖాద్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మన్షాద్ పాషా ఖాద్రి, సయ్యద్ రిజ్వాన్ పాషా ఖాద్రి, సయ్యద్ షఫి పాషా ఖాద్రి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. -
రుద్రవరం మండలం చందలూరులో దారుణం
కర్నూలు : జిల్లాలోని రుద్రవరం మండలం చందలూరులో బుధవారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. హుస్సేన్ అనే వ్యక్తిపై మాజీ సర్పంచ్ సంజీవరాయుడు కత్తిలో దాడి చేసి... తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అతడు అక్కడి నుంచి పరారైయ్యాడు. దీంతో హుస్సేన్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి... అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని... మెరుగైన వైద్య చికిత్స కోసం కర్నూలు తరలించాలని వైద్యులు తెలిపారు. దీంతో అతడిని కర్నూలు తరలిస్తున్నారు. కాగా చేతబడి చేశాడనే అనుమానంతోనే హుస్సేన్‌పై మాజీ సర్పంచ్ సంజీవరాయుడు దాడి చేశాడని..పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డెంగీతో బాలుడి మృతి
అనంతపురం రూరల్ : డెంగీతో బాలుడు మృతి చెందిన ఘటన రుద్రంపేట పంచాయతీ పరిధిలోని చంద్రబాబు కొట్టాలలో మంగళవారం చోటు చేసుకుంది. చంద్రబాబు కొట్టాలకు చెందిన ఫరూక్ బేగం, శర్మాస్ దంపతుల కుమారుడు హుస్సేన్ (4) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గలేదు. పరిస్థితి విషమించి చిన్నారి మృతి చెందాడు. -
ఐపీఎల్ బెట్టింగ్ నిందితుల అరెస్టు
మదనపల్లె క్రైం: మదనపల్లెలో ఆరుగురు ఐపీఎల్ బెట్టింగ్ నిందితులను ఒకటవ పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు హుస్సేన్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.2.1 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఇన్చార్జ్ సీఐ హనుమంతునాయక్ తెలిపారు. కదిరి రోడ్డు అమ్మచెరువుమిట్ట సమీపంలోని తులసీ దాబా వద్ద పట్టణంలోని కమ్మవీధికి చెందిన దేవరెడ్డి నరసింహులు కుమారుడు శ్రీధర్(42), గుండ్లూరి వీధికి చెందిన సోంపాళ్యం కృష్ణయ్య కుమారుడు రమేష్‌బాబు(37), సిపాయి వీధిలో ఉంటున్న రెడ్డి వెంకటరామయ్య కుమారుడు లక్ష్మణరావు అలియాస్ లల్లు(24), దేవళం వీధికి చెందిన సురేష్(32), అదే వీధిలోని ఆకుల నాగరాజు కుమారుడు శ్రీకాంత్(23), త్యాగరాజు వీధికి చెందిన జక్కల వెంకటేష్ కుమారుడు వెంకటస్వామి(27) ఒకచోట సమావేశమయ్యారని తెలిపారు. ఎస్ఐ సుకుమార్, సిబ్బంది శంకర, సిద్దు, రాజేష్, రాఘవతో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. హుస్సేన్‌కు జిల్లా బహిష్కరణ తప్పదు మాలిక్ ఫంక్షన్హాల్లో నివాసముంటున్న హుస్సేన్ గతంలోనూ పెద్ద ఎత్తున ఐపీఎల్ బెట్టింగ్‌లు ఆడుతూ అరెస్టు అయ్యాడని సీఐ హనుమంతునాయక్ తెలిపారు. బెయిల్‌పై వచ్చినా తన తీరులో మార్పులేదన్నారు. నిందితుడిని జిల్లా నుంచి బహిష్కరిస్తామని పేర్కొన్నారు. -
పెళ్లి ఇష్టంలేక యువకుని ఆత్మహత్య
గిద్దలూరు(ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నల్లబండబజారులో నివసిస్తున్న హుసేన్(25) అనే యువకుడు పెళ్లి ఇష్టంలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. పొరుగూరి అమ్మాయితో హుసేన్‌కు ఇటీవలే పెళ్లి కుదిరింది. పెళ్లి కూతురి ఇంటి వాళ్లతో పెళ్లి విషయమై మాట్లాడేందుకు కుటుంబసభ్యులు వెళ్లారు. దాంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న హుసేన్ మంగళవారం ఉదయం ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
సీఐ హుస్సేన్‌పై సస్పెన్షన్ వేటు
విశాఖపట్నం : ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన ఉన్న కేసులో జిల్లాలోని పూడిమడక మెరైన్ సీఐ హుస్సేన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. బుధవారం విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎ. రవిచంద్ర ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో చేరిన నాటి నుంచి హుస్సేన్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఆ క్రమంలో అతడిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఏసీబీ అధికారులు హుస్సేన్ నివాసంపై దాడి చేశారు. అందులోభాగంగా హుస్సేన్... కోట్ల రూపాయిలు కూడబెట్టినట్లు గుర్తించారు. సీఐ హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు. దీంతో డీఐజీ ఎ.రవిచంద్ర సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. -
వైఫైలా.. ఆయన చుట్టూ వివాదాలే
పని చేసిన చోటల్లా సెటిల్మెంట్లు.. అక్రమ వసూళ్లు సన్నిహితులు, బినామీల పేరుతో ఆస్తులు ‘సిమ్స్’ కేసులో భారీ ముడుపులు చేపల తిమ్మాపురంలో కళ్లు చెదిరే గెస్ట్‌హౌస్ ఏసీబీకి చిక్కిన హుస్సేన్ చరిత్ర ఇది బోర్డు తిప్పేసి ఖాతాదారులను ముంచిన సిమ్స్ నుంచి భారీ ముడుపులు దండుకొని బాధితులను నిలువునా ముంచేశారు.. ఓ దొంగ నుంచి రికవరీ చేసిన కోట్లాది రూపాయల్లో చాలావరకు నొకేశారు.. టూ టౌన్.. త్రీటౌన్.. నరసన్నపేట.. ఇలా ఏ స్టేషన్లో పని చేసినా.. వైఫైలా వివాదాలు ఆయన చుట్టూ ముసురుకునేవి!.. కూతురు, కుమారుడు, అల్లుడు.. చివరికి సన్నిహితురాలి పేరిట కూడా అక్రమాస్తులు కూడబెట్టిన ఆ ఘనుడి పేరు హుస్సేన్.. పాపాల చిట్టా పెరిగి.. ఏసీబీకి చిక్కిన ఈ పూడిమడక మెరైన్ పోలీస్ స్టేషన్ సీఐ సెటిల్మెంట్లలో దిట్టగా పేరుపొందారు.. విశాఖపట్నం:సామాన్య మధ్య తరగతి కుటుంబంలో విజయగనరం జిల్లా గరివిడి మండలం కోడూరులో పుట్టిన హుస్సేన్ హాస్టల్ వార్డెన్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1991లో ఎస్సైగా ఎంపికై పోలీస్ శాఖలో అడుగుపెట్టారు. పోలీస్ విధుల్లో రాటుదేలినట్లే.. అప్పటి నుంచి అవినీతిలో ఆరితేరారు. బినామీ పేర్లతో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు. చాలా కాలం పాటు నగరంలోని పలు స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. ఎక్కడికెళ్లినా వివాదాలతోనే సావాసం చేశారు. చివరికి ఏసీబీకి చిక్కారు. ‘సిమ్స్’ బాధితుల ఫిర్యాదులే ఆధారం ‘సిమ్స్’ అనే ఫైనాన్స్ సంస్థ ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించి బోర్డు తిప్పేసింది. ఆ సమయంలో విశాఖ నగరంలో విధులు నిర్వర్తిస్తున్న హుస్సేన్ దాని నిర్విహకుల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సిమ్స్ ఆస్తుల కేసు విచారణకు హుస్సేన్ ప్రత్యేకాధికారిగా పని చేశారు. ఆ సంస్థ డెరైక్టర్లకు అనుకూలంగా వ్యవహరించి పలు ఆస్తులు సంపాదించారనే ఆరోపణలున్నాయి. దాంతో సిమ్స్ బాధితులు హుస్సేన్ అక్రమాస్తులపై దృష్టి సారించారు. కొన్ని ఆధారాలతో ఏసీబీని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన అధికారులు బుధవారం దాడులు, సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారుల రాకను గమనించిన హుస్సేన్ బాత్రూమ్లోకి వెళ్లి తలుపులు వేసేసుకున్నారు. ఎంత పిలిచినా మీడియా ఉన్నంత వరకూ ఆయన బయటకు రాలేదు. 12 బృందాలు.. 16 ప్రాంతాలు ఏసీబీ అధికారులు 12 బృందాలుగా విడిపోయి నగరంలో 12 చోట్ల, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, ముంబైలతో కలిపి మొత్తం 16 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు చేశారు. హుస్సేన్ నివాసం ఉంటున్న పాత సీబీఐ కార్యాలయ సమీపంలోని సాయిసదన్ అపార్ట్మెంట్, ముంబైలోని కుమార్తె, అల్లుడి ఇంటిలో, విజయనగరంలో తండ్రి, శ్రీకాకుళంలో మామ నివాసంలో దాడులు జరిగాయి. హుస్సేన్ సన్నిహితురాలైన అనితను కూడా వదిలిపెట్టలేదు. ఆమె ఇంటిలోనూ తనిఖీలు చేశారు. పెందుర్తిలోని ముస్లిం కాలనీలో ఆమె పేరుపై ఓ ఫ్లాట్ ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం హుస్సేన్ అక్రమాస్తుల విలువ రూ.1.5 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. వాటి మార్కెట్ విలువ సుమారు రూ.16 కోట్లకుపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కళ్లు చెదిరే ఆస్తులు హుస్సేన్ ఆస్తుల్లో ఎక్కువ భాగం విల్లాలు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. పెందుర్తి సూర్యనగర్‌లో రెండు విల్లాలు ఉన్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, స్విమ్మింగ్ పూల్తో సహా అన్ని సదుపాయాలు ఈ విల్లాలో ఉన్నాయి. మరో రెండింటిని కొనేందుకు ఆడ్వాన్స్ ఇచ్చారు. తిమ్మాపురం, శ్రీనగర్ కాలనీ, ఎండాడల్లోనూ ఆస్తులు ఉన్నట్లు సోదాల్లో బయటపడింది. కుమార్తె, కుమారుడి పేరు మీద పరవాడలో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తున్న విషయం బయటపడింది. ముంబైలోని అల్లుడి నివాసంలో జరిపిన సోదాల్లో ఓ లాకర్ బయటపడింది. దానిలో 400 గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిసింది. అది తన తండ్రిదేనని కుమార్తె ఒప్పుకుంది. లాకర్ తెరవాల్సి ఉంది. ఇంకా పూడిమడక, దేశవానిపాలెం, నరవ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోందని, విచారణ జరుపుతామని డీఎస్పీ వెల్లడించారు. పేదల ఇళ్లకు బినామీల పేరు బీచ్ రోడ్డు కె.నగరప్పాలెం పంచాయతీ పరిధిలో ఉన్న చేపల తిమ్మాపురంలో మత్స్యకారులకు కేటాయించిన స్థలాలను తన సన్నిహితుడు, బినామీ అయిన శ్రీనివాస్ పేరుతో హుస్సేన్ కొనుగోలు చేసి అక్కడ డూప్లెక్స్ తరహాలో గెస్ట్‌హౌస్ నిర్మించారు. గెస్ట్‌హౌస్ తాళాలు తెరిచి లోపలికి వెళ్లిన ఏసీబీ అధికారులు నివ్వెరపోయారు. ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్‌పూల్, జిమ్, సోఫాసెట్లు, లక్షలు విలువ చేసే ఎల్ఈడీ టీవీ, హోం థియేటర్, ఖరీదైన ఫ్రిజ్‌లు అక్కడ కనిపించాయి. కొన్ని ఫైళ్లు కూడా దొరికాయి. ఆది నుంచీ వివాదాలే నగరంలోని 2, 3, 4, 5వ పట్టణ పోలీస్ స్టేషన్లతోపాటు పెందుర్తి, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటల్లో హుస్సేన్ విధులు నిర్వర్తించారు. పని చేసిన అన్ని చోట్లా ఆయన్ను అవినీతి, వివాదాలు వెంటాడాయి. త్రీ టౌన్ స్టేషన్లో పని చేస్తున్నప్పుడు ఓ దొంగ నుంచి కోట్లాది రూపాయలు రికవరీ చేసి వాటిని పక్కదారి పట్టించారని అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. సెటిల్మెంట్లు చేసి ముడుపులు దండుకోవడంలోనూ దిట్ట అని తెలిసింది. కొందరు పోలీసు ఉన్నతాధికారుల అండదండలు కూడా హుస్సేన్‌కు ఉన్నట్లు తెలుస్తోంది. కుమార్తె, కుమారుడు, బంధువులు, బినామీల పేర్లతో పలు వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఓ మహిళతో సన్నిహితంగా మెలుగుతూ ఆమె పేరుమీద కూడా ఆస్తులు సంపాదించారు. -
ఎర్రచందనం స్మగ్లర్ హుస్సేన్ అరెస్ట్
-
కనీస వసతుల కోసం
జేఎన్టీయూలో ఐదు గంటలపాటు బైఠాయించిన అమ్మాయిలు పుల్కల్ : ‘తోటి విద్యార్థిని కడుపు నొప్పి వచ్చి పడిపోతే కనీసపు మాత్రలు లేవు. స్థానికంగా ఉన్న ఏఎన్ఎన్ వద్దకు వెళితే ఆమె ఎలాంటి పరీక్షలూ చేయలేదు. ఇదేం హాస్టల్.. ఇదేం పర్యవేక్షణ..’ అంటూ అమ్మాయిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను నిలదీశారు. సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూలో కనీస వసతులు కల్పించాలంటూ శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఆందోళన వెనక ఆవేదన ఇది... గురువారం రాత్రి జేఎన్టీయూ బాలికల హాస్టల్లో ఉండే సీఎస్సీ ఫైనలియర్ విద్యార్ధిని జయ తీవ్రమైన కడుపునొప్పితో కిందపడింది. వెంటనే స్పందించిన తోటి విద్యార్థినులు ఆమెను స్థానికంగా ఉన్న ఏఎన్‌ఎన్‌కు తీసుకెళ్లారు. కానీ అక్కడున్నామె ఎలాంటి పరీక్షలూ చేయలేదు. కనీసం మాత్రలు కూడా అక్కడ అందుబాటులో లేవు. దీంతో జయ పరిస్థితి విషమంగా మారింది. దీనిపై విద్యార్థినులు ఫైర్ అయ్యారు. వందల మంది ఉండే హాస్టల్ క్యాంపస్‌లో ప్రథమ చికిత్సకు సంబంధించిన పరికరాలు, మందులు, సిబ్బంది లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీపం బీపీ మిషన్ కూడా ఉంచకపోవడంపై ప్రిన్సిపాల్ మంజూర్ హుస్సేన్‌ను నిలదీశారు. క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన నల్లాలు పనే చేయడం లేదని, ఫ్లోర్‌కు ఒక ట్యాప్ మాత్రమే పనిచేస్తుందన్నారు. దీంతో అవసరాలెలా తీర్చుకోవాలని ప్రశ్నించారు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదంటూ ఐదు గంటలపాటు క్యాంపస్‌లో బైఠాయించారు. సమస్యలు పరిష్కరించే వరకూ కదిలేది లేదని పట్టుబట్టారు. వారం రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తానని ప్రిన్సిపాల్ హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. -
ఆటో బోల్తా: ఒకరి పరిస్థితి విషమం
చిత్తూరు: రోడ్డుపై వెళ్తున్న ఆటోకు కుక్కలు అడ్డురావడంతో వాటిని తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా, మరో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం జంగాలపల్లె గ్రామంలోని బస్టాప్ వద్ద జరిగింది. వివరాలు.. చిత్తూరు జిల్లా కందూరు మండలం నవాబ్‌పేట గ్రామానికి చెందిన ఉస్సేన్ పలమనేరు వెళ్లేందుకు ఆటోలో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆటో చౌడేపల్లి - పలమనేరు వెళ్తుండగా మార్గ మధ్యలో కుక్కలు అడ్డువచ్చాయి. డ్రైవర్ వీటిని తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది. దీంతో ఉస్సేన్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. అంతేకాకుండా ఆటోలో ఉన్న మరో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఉస్సేన్‌ను మెరుగైన వైద్యం కోసం 108లో పుంగనూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చౌడేపల్లి) -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కక్షసాధింపు
కదిరాయుచెర్వు(కలకడ), న్యూస్‌లైన్: ఎన్నికలు ముగిసిపోయినా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ,జై సమైక్యాంధ్ర పార్టీ నేతలు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. అధికారులను ఉసిగొలిపి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గంగజాతర పేరుతో ఇళ్లతొలగింపునకు పూనుకుంటున్నారు. ఉత్సవాలు, ఊరేగింపులపేరుతో ఈ చర్యలకు పాల్పడుతున్నా రు. న్యాయం చేయాల్సిన అధికారులు టీడీపీ,జేఎస్పీ నేతలకు అండగా నిలవడంతో బాధితులు ఉన్నతాధికారులను కోర్టును ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కదిరాయచెరువు పంచాయతీలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు సుధాకర్, రెడ్డి హుస్సేన్ చాలా కా లం కిందట ఇళ్లు కట్టుకుని నివాసముం టున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారుైవైఎస్సార్సీపీ మద్దతుగా నిలిచా రు. తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న అక్కసుతో వీరి ఇళ్లను కూల్చివేసేందుకు జైసమైక్యాంధ్ర, టీడీపీకి చెందిన నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో నడివీధి గంగమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అమ్మవారిని ఊరేగించేందు కు, ప్రజలు వెళ్లేందుకు సిమెంటు రోడ్లు ఉ న్నాయి. అయినా వీరి ఇళ్లు అడ్డంగా ఉన్నాయని, ఇళ్లను తొలగించాలని అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. వా రం రోజులుగా ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై బాధితులు రెవెన్యూ,పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినా ఫలితం కనిపించలేదు. దీంతో వారు మదనపల్లె సబ్‌కలెక్టర్‌ను కలసి ఇళ్ల కూల్చివేతను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు ఆశ్రయించి నట్టు బాధితులు తెలిపారు. సోమవారం రాత్రి జాతర చాటింపు వేశారు. మంగళవారం ఉదయం అధికారులు వచ్చి ఇళ్లను కూల్చిలవేయాల్సిందేనని పట్టుబడుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఇంటి నిర్మాణం జరిగిన స్థలం, కొనుగోలు పత్రాలు, ఇంటిపన్ను, విద్యుత్ బిల్లు వంటివి ఉన్నప్పటికీ అధికారులు ఏకపక్షంగా ఇళ్ల కూల్చివేతకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్షలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
బాలికపై సామూహిక లైంగికదాడి
= పోలీసుల అదుపులో కామాంధుడు = అజ్ఞాతంలో నలుగురు = నమ్మించి సినిమాకు తీసుకు వెళ్లి.. = ఆలస్యంగా వెలుగులోకి బెంగళూరు, న్యూస్‌లైన్ : బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన సంఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. ఈ సంఘటనలో అబుల్లా అనే కామాంధుడిని ఇక్కడి హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేష్ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ రాజేష్ కథనం ప్రకారం... బెమెల్ లేఔట్‌లోని క్వార్టర్స్‌లో బాధితురాలి తల్లిదండ్రులు కూరగాయలు విక్రయిస్తుంటారు. వీరి కుమార్తె (15) ఆరో తరగతి వరకు చదువుకుంది. వ్యాపారంలో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటోంది. ఇదిలా ఉంటే బాలికకు హుస్సేన్ అనే యువకుడితో పరిచయం ఉంది. ఈనెల 23న హుస్సేన్ బాలికను నమ్మించి మధ్యాహ్నం సినిమాకు తీసుకెళ్లాడు. సాయంత్రం ఇద్దరు ఇంటికి బయలుదేరారు. మార్గం మధ్యలో బెమెల్ క్వార్టర్స్ సమీపంలోని బెమెల్ నీలగిరి తోటలోకి బాలికను లాక్కెళ్లి లైంగికదాడికి యత్నించాడు. ఆ సమయంలో బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. అదే సమయంలో సమీపంలో మకాం వేసిన హుస్సేన్ స్నేహితులు అబ్దుల్లా, జాఫర్, వాసీం, ఖాన్ అక్కడికి వచ్చారు. బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక సృహ కోల్పోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సృహలోకి వ చ్చిన బాలిక ఇంటికి చేరుకుని తండ్రికి చెప్పి కుప్పకూలిపోయింది. బాలికను ఆస్పత్రికి తరలించి తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాలిక వివరాల ఆధారంగా అబ్దుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని సోమవారం హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేష్ తెలిపారు. బాలిక ఇప్పటికి సరిగా మాట్లాడే పరిస్థితిలో లేదని, పూర్తిగా కోలుకున్న అనంతరం విచారించి అన్ని వివరాల వెల్లడిస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అజ్ఞాతంలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.