రోడ్డుపై వెళ్తున్న ఆటోకు కుక్కలు అడ్డురావడంతో వాటిని తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది.
చిత్తూరు: రోడ్డుపై వెళ్తున్న ఆటోకు కుక్కలు అడ్డురావడంతో వాటిని తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా, మరో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం జంగాలపల్లె గ్రామంలోని బస్టాప్ వద్ద జరిగింది. వివరాలు.. చిత్తూరు జిల్లా కందూరు మండలం నవాబ్‌పేట గ్రామానికి చెందిన ఉస్సేన్ పలమనేరు వెళ్లేందుకు ఆటోలో ప్రయాణిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఆటో చౌడేపల్లి - పలమనేరు వెళ్తుండగా మార్గ మధ్యలో కుక్కలు అడ్డువచ్చాయి. డ్రైవర్ వీటిని తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది. దీంతో ఉస్సేన్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. అంతేకాకుండా ఆటోలో ఉన్న మరో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఉస్సేన్‌ను మెరుగైన వైద్యం కోసం 108లో పుంగనూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చౌడేపల్లి)