six injured
-
చంబాలో కుప్పకూలిన బ్రిడ్జి
-
చంబాలో కుప్పకూలిన బ్రిడ్జి
చంబా : హిమాచల్ ప్రదేశ్ చంబాలో కాంక్రీట్ బ్రిడ్జి కూలి ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, హిమాచల్ ప్రదేశ్‌లోని చాంబా ప్రాంతాన్ని కలిపే ఈ వంతెన గురువారం కూలిపోవడంతో.. దానిపై ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జవహర్ లాల్ నెహ్రు మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సుదేశ్ కుమార్ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...నిర్మించేటప్పుడు నాసిరకం మెటీరియల్ వాడడం వల్లే బ్రిడ్జి కూలిపోయినట్టు భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే బ్రిడ్జి నిర్మాణపు మ్యాప్‌లో లోపాలు కూడా ప్రమాదానికి కారణం కావచ్చని, దీనిపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జిపై కారు, మిని ట్రక్‌తో పాటు ద్విచక్ర వాహనం వెళుతున్నాయి, అయితే ఒక్కసారిగా బ్రిడ్జి కూలడంతో బైక్ నదిలో పడిపోతే, కారు, మిని ట్రక్ చిక్కుకు పోయాయి. కాగా 15 ఏళ్ల క్రితం నాబార్డు నిధుల కింద ఈ బ్రిడ్జిని నిర్మించారు. అయితే కాంట్రాక్టర్ల కక్కుర్తి, అలసత్వం వల్లే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. -
ఉస్మానియా ఆస్పత్రిలో కారు బీభత్సం
హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రి వద్ద గురువారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ కారు అదుపు తప్పిన రోగులపైకి దూసుకు వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. గాయపడినవారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పిచ్చికుక్క దాడి.. ఆరుగురికి గాయాలు
నార్పల : మండలంలోని కొట్టాలలో ఓ పిచ్చికుక్క ధాటికి జనం బెంబేలెత్తిపోతున్నారు. గురువారం ఇద్దరిపై దాడి చేసి గాయపరిచిన కుక్క..శుక్రవారం మరో నలుగురిని కరిచింది. బాధితులను వెంటనే స్థానిక ఆస్పతికి తరలించి చికిత్స అందించారు. కాగా కనిపించిన వారినల్లా కుక్క కరుస్తుండటంతో వీధుల్లో తిరగాలంటేనే భయంగా ఉందని స్థానికులు వాపోయారు. -
ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ ఆరుగురికి గాయలు
-
ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు
సోమందేపల్లి : గోరంట్ల నుంచి మంగళవారం వానవోలుకు వెళుతున్న ప్యాసింజర్ ఆటో ఎముకలగుట్టపల్లి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఆదెమ్మ, లక్ష్మి, మహేష్, రంగనాథనాయక్, శ్యామల, హరీష్ గాయపడ్డారు. వెంటనే వీరిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం
= ఆటోను, పాదచారులను ఢీకొన్న వైనం = వీఆర్ఏతో సహా ఆరుగురికి తీవ్ర గాయాలు నల్లమాడ: ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళుతున్న బస్సు ముందు వెళుతున్న ఆటోను, పాదచారులను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. వివరాల్లోకెళితే.. మంగళవారం సాయంత్రం నల్లమాడ నుంచి చౌటకుంటపల్లికి ప్రయాణికులతో ఆటో బయల్దేరింది. బస్టాండ్ కూడలి సమీపాన బ్రిడ్జిపైకి రాగానే వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన శ్రీబాలాజీ ఇంగ్లిష్ మీడియం పాఠశాల బస్సు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న చౌటకుంటపల్లికి చెందిన వీఆర్ఏ సికిందర్, వెంకటనర్సమ్మ, ఎద్దులవాండ్లపల్లికి చెందిన అనసూయమ్మ, తండాకు చెందిన సాకమ్మ తీవ్రంగా గాయపడ్డారు. సంతకొచ్చి నడుచుకుంటూ వెళుతున్న బాసంవారిపల్లికి చెందిన రామక్క, పెమనకుంటపల్లికి చెందిన ఈశ్వరమ్మలను కూడా ఢీకొనడంతో గాయాలపాలయ్యారు. ఎస్ఐ గోపీ తమ సిబ్బందితో తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులతో కలసి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎంపీడీఓ రాబర్ట్‌విల్సన్, సర్పంచ్ రంగలాల్‌నాయక్, పంచాయితీ కార్యదర్శి శంకరనాయుడు, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, పలువురు నాయకులు క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించండి: ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైఎస్సార్సీపీ పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమీప బంధువులకు చెందిన స్కూల్ బస్సు కావడంతో కేసు తారుమారయ్యే అవకాశముందున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
నలుగురి దుర్మరణం
వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు మరో ఆరుగురికి తీవ్ర గాయాలు బుక్కపట్నం : మండలంలో ఆదివారం రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. గశికవారిపల్లి సమీపంలో రాళ్లు కొట్టేందుకు వెళ్లిన ముదిగుబ్బకు చెందిన పెచ్చల రమణ (30) ప్రమాదవ శాత్తు రాయి మీద పడి మృతి చెందాడు. మరో ప్రమాదంలో బుక్కపట్నానికి చెందిన బోయ అంజి (38) బేల్దారి కొత్తచెరువు మండలం నారేపల్లిలో మొహర్రం ముగించుకుని బైక్‌లో బుక్కపట్నం వస్తుండగా కడపనాగేపల్లి, బుచ్చయ్యగారిపల్లి మధ్యలో ఆంజనేయస్వామి గుడి సమీపంలో అదుపు తప్పి తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు అతడిని ఆస్పత్రి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంకేపల్లి క్రాస్ సమీపంలో వేంపల్లె వాసి.. ముదిగుబ్బ : సంకేపల్లి క్రాస్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున వైఎస్సార్ జిల్లా వేంపల్లికి చెందిన కోనేటి ఆంజనేయులు (34) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బంధువుల వివరాల మేరకు.. కోనేటి ఆంజనేయులు సంకేపల్లి క్రాస్‌లో తన నర్సరీ వద్ద నుంచి తెల్లవారుజామున ద్విచక్ర వాహనంలో ముదిగుబ్బవైపు వెళ్తుండగా కదిరివైపు నుంచి వస్తున్న టాటా మ్యాజిక్ కారు ఢీకొనింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స కోసం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య భాగ్యలక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భిణి. ఎస్ఐ జయానాయక్ కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి పంపారు. గుత్తిలో వృద్ధురాలు.. గుత్తి: స్థానిక చెరువు బ్రిడ్జి కట్టపై ఆటో అదుపు తప్పిన ప్రమాదంలో విడపనకల్లు మండలం గడేకల్కు చెందిన సుంకమ్మ(68) అక్కడికక్కడే మరణించింది. అదే గ్రామానికి చెందిన లింగమ్మ, గుత్తి చెర్లోపల్లి కాలనీకి చెందిన ఎరికల రోగన్న, బాచుపల్లికి చెందిన గిడ్డమ్మ తీవ్రంగా గాయపడ్డారు. గొల్లలదొడ్డికి చెందిన ఆటో గుత్తి నుంచి గుంతకల్లుకు ప్రయాణికులతో బయలుదేరింది. మార్గమధ్యంలో గుత్తి చెరువు కట్టకు ఎదురుగానున్న బ్రిడ్జి కట్టపై ప్రయాణిస్తుండగా ఆటో ముందు టైరు పంక్చర్ అయింది. దీంతో అదుపు తప్పి బ్రిడ్జి పక్కన ఉన్న వరి మడుల్లో బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను గుత్తి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ మ««దlుసూదన్ గౌడ్, ఎస్ఐలు చాంద్‌బాషా, రామాంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ చలమయ్య తమ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బ్రాహ్మణపల్లి సమీపంలో మరో ముగ్గురికి గాయాలు సోమందేపల్లి : మండలంలోని బ్రాహ్మణపల్లి సమీపంలో ఆదివారం రెండు బైక్‌లు పరస్పరం ఢీకొని ముగ్గురు గాయపడ్డారని ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. సోమందేపల్లి వైపు నుంచి కేతగానిచెరువుకు బైక్‌లో బయలుదేరిన వెంకటేశులు, నారాయణప్పను మోతుకుపల్లి నుంచి ఈదుళబళ్లాపురానికి బయలుదేరి ఎదురొచ్చిన నల్లప్ప అనే మరో స్కూటరిస్టు ఢీకొనడంతో ముగ్గురూ గాయపడ్డారన్నారు. వారిని హిందూపురం ఆస్పత్రికి తరలంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు
చందర్లపాడు(కృష్ణా జిల్లా): వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం తోటరావుల్లపాడులో శుక్రవారం చోటుచేసుకుంది. తోటరావుల్లపాడులోని చెరువు కట్టపై నుంచి వస్తున్న ప్రయాణికుల ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన గ్రామస్తులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆటో - బస్సు ఢీ: ఆరుగురికి గాయాలు
ఒంగోలు : ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో - ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు
హైదరాబాద్ : శంషాబాద్ సమీపంలో శనివారం తెల్లవారుజామున కారు డివైడర్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదం ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం అందవలసి ఉంది. -
ఆటో - కారు ఢీ: ఆరుగురికి గాయాలు
నల్గొండ : నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి జాతీయరహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు గాయపడ్డారు. రహదారిపై వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులంతా పత్తి కూలీలని పోలీసులు తెలిపారు. -
నిమజ్జనంలో ఘర్షణ: ఆరుగురికి గాయాలు
కురబలకోట: వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ చోటు చేసుకుని ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం గంగావారిపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఓ వర్గానికి చెందిన వ్యక్తి మద్యం సేవించి రావడంతో అతణ్ని వేరే వర్గం వారు అడ్డుకున్నారు. ఆ వివాదం కాస్త పెద్దది కావడంతో ఇరు వైపుల వారు దాడి చేసుకున్నారు. దీంతో ఆరుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
స్కూలు ఆటో బోల్తా
ఆరుగురు విద్యార్థులకు గాయాలు ముగ్గురి పరిస్థితి విషమం చిత్తూరు: పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మిట్టపల్లి గ్రామ సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. మండల పరిధిలోని అట్టికుప్పం, సాకలి కుప్పం గ్రామాలకు చెందిన విద్యార్థులు కర్ణాటక సరిహద్దులోని రాజీపేట రోడ్‌లోని ప్రగతి పాఠశాలకు వెళ్తున్నారు. కాగా.. ప్రతి రోజు పాఠశాలకు చెందిన వ్యానులో వెళ్లే విద్యార్థులు ఈ రోజు వ్యాను చెడిపోవడంతో ఆటో ఎక్కారు. ఆటో మిట్టపల్లి వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. ఆటోలో ఉన్న ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భరత్(13), హేమ(12), చంటి(6) పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆటో బోల్తా: ఒకరి పరిస్థితి విషమం
చిత్తూరు: రోడ్డుపై వెళ్తున్న ఆటోకు కుక్కలు అడ్డురావడంతో వాటిని తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా, మరో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం జంగాలపల్లె గ్రామంలోని బస్టాప్ వద్ద జరిగింది. వివరాలు.. చిత్తూరు జిల్లా కందూరు మండలం నవాబ్‌పేట గ్రామానికి చెందిన ఉస్సేన్ పలమనేరు వెళ్లేందుకు ఆటోలో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆటో చౌడేపల్లి - పలమనేరు వెళ్తుండగా మార్గ మధ్యలో కుక్కలు అడ్డువచ్చాయి. డ్రైవర్ వీటిని తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది. దీంతో ఉస్సేన్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. అంతేకాకుండా ఆటోలో ఉన్న మరో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఉస్సేన్‌ను మెరుగైన వైద్యం కోసం 108లో పుంగనూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చౌడేపల్లి) -
రెచ్చిపోయిన పిచ్చికుక్క
పెనమలూరు(కృష్ణా జిల్లా): కృష్ణా జిల్లా పెనమలూరు మండలం సనత్‌నగర్‌లో ఓ పిచ్చికుక్క సోమవారం స్క్వైరవిహారం చేసింది. కనపడిన వారినందరినీ కరవడం ప్రారంభించింది. ఇప్పటికే ఆ కుక్క దాడిలో ఆరుగురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన చిన్నారులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా గ్రామస్తులు ఆ పిచ్చికుక్కను కొట్టి చంపేశారు. -
పెళ్లి ఆటో బోల్తా
ఆదిలాబాద్: మరో రెండు గంటల్లో పెళ్లి ముహూర్తం.. పచ్చని తోరణాల మధ్య, మంగళ వాయిద్యాలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఓ వ్యక్తి ఇంట విషాదం నెలకొంది. వరుడు సహా పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ఆటో ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం సర్వాయిపేట వద్ద బుధవారం ఉదయం బోల్తా పడింది. ఈ ఘటనలో వరుడు ఎస్.మల్లేశ్ సహా ఐదుగురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. పెళ్లి బృందం జైపూర్ మండలం వేలాల గ్రామం నుంచి కోటపల్లి మండలం సీతంపల్లికి వెళ్లాల్సి ఉంది. సీతంపేటలో ఉదయం 10.30 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. (కోటపల్లి ) -
ఆటో బోల్తా..ఆరుగురికి గాయాలు
తూర్పుగోదావరి: తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని చందుర్తి గ్రామ సమీపంలో 16వ నంబరు జాతీయరహదారిపై గురువారం తెల్లవారు జామున ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. (గొల్లప్రోలు) -
పిచ్చి కుక్క స్వైరవిహారం..
పశ్చిమగోదావరి: రంగంపేట మండలంలోని ఈలకొలను గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. కనిపించిన ప్రతి వ్యక్తినీ కరవడం మొదలు పెట్టింది. ఈ ఘటనలో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అదే గ్రామానికి చెందిన కడియపు బాబూరావు, శ్రీనివాసరావు, కయ్యరాజు, వీర్రాజు, సూరిబాబుతో పాటు ఒక పేరుతెలియని ప్రయాణికుడు ఈ దాడిలో గాయపడ్డారు. వీరిని చికిత్సకోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిచ్చికుక్క గురించి అధికారులకు సమాచారమిచ్చినా ఆదివారం కావడంతో పాటు భారత్-పాక్ మ్యాచ్ ఉన్నందున ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు తెలిపారు. (రంగంపేట) -
రోడ్డుపై లారీ బీభత్సం : ఆరుగురికి గాయాలు
హైదరబాద్: అధిక వేగంతో వస్తున్న లారీ బ్రేకులు ఫెయిలై రహదారిపై ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేసింది. ఎదురుగా వస్తున్న రెండు ఆటోలు, ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన బహుదూర్‌పూరా తాడ్‌బండ్ మోచీ కాలనీ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని... డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాలూరులో బాణాసంచా పేలుడు
విజయనగరం: దీపావళి పండగ పురస్కరించుకుని అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్న ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణిచగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు చిన్నవీధిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. పేలుడు ఘటనపై స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాక్ కాల్పుల్లో 20మందికి గాయాలు
జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బీఎస్ఎఫ్ శిబిరాలే లక్ష్యంగా సరిహద్దు వెంబడి జరిపిన కాల్పుల్లో ఇరవై మంది గాయపడ్డారు. గాయపడినవారిలో బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు 15మంది సామాన్య పౌరులు ఉన్నారు. సాంబ, కొత్వా జిల్లాలతో పాటు కానాచాక్, ఆర్నియా, పర్గావల్ ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. కొన్నిచోట్ల కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. పాక్ దాడులను భారత్ జవాన్లు తిప్పికొడుతున్నారు. కాగా 20 గ్రామాల్లోని సుమారు 20వేల కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాయి.మరోవైపు ప్రతిష్టంభన తొలగించడానికి ఇరు దేశాల సైనిక అధికారులు హాట్లైన్లో మాట్లాడుకున్నా ఫలితం లేకపోయింది. -
ఆకాశంలో ఢీకొన్న విమానాలు!!
ఎక్కడైనా రోడ్డుమీద బస్సులు, ఇతర వాహనాలు ఢీకొనడం చూశాం. అయితే గతంలో ఎన్నడూ లేనట్లుగా ఆకాశంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ సంఘటన స్విట్జర్లాండ్‌లో జరిగింది. ఈ రెండూ చిన్న విమానాలే కావడంతో ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ రెండింటిలో ఒక విమానం సెయింట్ గాలెన్లోని కాంటన్ ప్రాంతంలో ఓ పొలంలో కూలిపోయింది. అందులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడినట్లు స్విస్ వార్తాసంస్థ ఏటీఎస్ తెలిపింది. రెండో విమానం అక్కడకు సమీపంలో ఉన్న సిట్టర్డార్ప్ ప్రాంతంలో అత్యవసరంగా దిగింది. అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు ఏంటో మాత్రం ఇంకా ఇంతవరకు తెలియలేదు. -
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు
జిల్లాలో బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయాలపాలయ్యారు. భామిని మండలం సతివాడ వద్ద బైక్ అదుపు తప్పి భార్యాభర్తలు, కంచిలి మండలం అంపురం కూడలి వద్ద ఆటో ఢీకొని ఇద్దరు గాయపడ్డారు. అలాగే సీతంపేటలో స్కూల్ బస్సు ఢీకొని అదే స్కూల్లో పనిచేస్తున్న విద్యార్థి, ఎచ్చెర్ల మండలం చిలకపాలెం టోల్‌ప్లాజా వద్ద లారీ ఢీకొని ఒకరు గాయపడ్డారు. బైక్ అదుపు తప్పి భార్యాభర్తలకు... కొత్తూరు, న్యూస్‌లైన్: భామిని మండలం సతివాడ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం చాకలిజయపురంనకు చెందిన భార్యాభర్తలు అంధవరపు వెంకటరావు, కళావతిలకు తీవ్రగాయాలు తగిలాయి. లోహరిజోల నుంచి కొత్తూరు వైపు వస్తుండగా ఒక్కసారి బైక్ ఆదుపు తప్పి పడిపోయింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలు తగిలాయి. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యాధికారి పద్మావతి ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు వైద్యాధికారి తెలిపారు. ప్రమాదంపై వివరాలు సేకరించిన హెచ్‌సీ రామారావు కేసును బత్తిలి పోలీస్ స్టేషన్‌కు బదిలీచేసినట్లు తెలిపారు. ఆటో ఢీకొని... కంచిలి: మండలంలోని అంపురం కూడలి వద్ద జాతీయ రహదారి మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. హరిపురం నుంచి బరంపురం వైపు ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న ఇద్దర్ని మఠంసరియాపల్లి వైపు వెళుతున్న లగేజ్ ఆటో ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం మీద వెళుతున్న బరంపురానికి చెందిన మురళి, అజయ్ తీవ్రగాయాల పాలయ్యారు. వీరిని ఎన్హెచ్ఏఐ అంబులెన్స్‌లో సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మురళి తలకు, శరీరమంతా బలమైన గాయాలై పరిస్థితి విషమంగా ఉంది. అజయ్‌కు కుడికాలు విరిగింది. ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం బరంపురం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు కంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థికి... సీతంపేట: స్థానిక వివేకానందా విద్యావిహార్(బెస్ట్అవైల్బుల్ స్కూల్)లో మూడో తరగతి చదువుతున్న పాలక శ్రీనివాసరావు అదే పాఠశాలకు చెందిన స్కూల్ బస్ ప్రమాదవశాత్తు బుధవారం ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. తరగతులు అయిన అనంతరం స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలోకి ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు మినీ స్టేడియం పనులు జరుగుతున్న చోట బోరు వేస్తుండడాన్ని చూడసాగాడు. ఒక్కసారిగా బోరునుంచి పైకి నీరు రావడంతో మిగతా విద్యార్థులతో కంగారు పడి పక్కకు పరిగెత్తాడు. అటుగా వస్తున్న స్కూల్ బస్‌ను గమనించ క పోవడంతో అది బలంగా ఢీకొట్టింది. కాళ్లకు తీవ్రగాయలవ్వడంతో వెంటనే స్థానిక 30 పడకల ఆస్పత్రికి తరలించారు. వైద్యాధికారి ఎం.రాంబాబు ప్రథమచికిత్స చేసి పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. లారీ ఢీకొట్టి వ్యక్తికి... ఎచ్చెర్ల క్యాంపస్: చిలకపాలెంలోని టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.సూర్య నారాయణ అనే వ్యక్తి గాయపడ్డారు. చికపాలెంలో అల్పాహారం తినేందుకు రోడ్డు దాటుతుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న తమిళనాడుకు చెందిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన సూర్యనారాయణను 108 వాహన సిబ్బంది శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు. ఇక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. గాయపడ్డ వ్యక్తిది కుప్పిలి గ్రామం. రిమ్స్ ఔట్ పోస్టు పోలీసులు ఎచ్చెర్ల స్టేషన్‌కు వివరాలను అందజేశారు.