హైదరాబాద్ : శంషాబాద్ సమీపంలో శనివారం తెల్లవారుజామున కారు డివైడర్ను ఢీకొట్టింది.ఈ ప్రమాదం ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం అందవలసి ఉంది.