Serial Actress Lahari Car Met With Bike At Shamshabad - Sakshi
Sakshi News home page

Serial Actress Lahari: శంషాబాద్‌ వద్ద రోడ్డు ప్రమాదం.. కారులో ‘గృహలక్ష్మి’ సీరియల్‌ నటి

Published Wed, Dec 8 2021 9:58 AM | Last Updated on Thu, Dec 9 2021 10:56 PM

Serial Actress Lahari Car Met With Bike At Shamshabad - Sakshi

Gruhalakshmi Serial Actress Lahari, Collided With Car At Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రముఖ సీరియల్‌ నటి లహరి కారు, బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో లహరి కారు డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చున్నట్లు తెలిసింది.


(చదవండి: ప్రియుడిని పెళ్లాడిన సీరియల్‌ నటి.. ఫోటోలు వైరల్‌)

ఘటన జరిగిన తరువాత లహరి కారు నుంచి బయటకు దిగలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుని.. కార్‌తో పాటు లహరిని కూడా స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో లహరి మద్యం సేవించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఆమెకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేయనున్నారు. 

చదవండి: ‘గతంలో ఆ వ్యక్తితో నవ్య స్వామి బ్రేకప్‌.. ఇప్పుడు రవి కృష్ణతో రిలేషన్‌!’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement