పిచ్చి కుక్క స్వైరవిహారం.. | dog attacks the village..six injured | Sakshi
Sakshi News home page

పిచ్చి కుక్క స్వైరవిహారం..

Published Sun, Feb 15 2015 7:34 PM | Last Updated on Sat, Sep 29 2018 3:55 PM

dog attacks the village..six injured

పశ్చిమగోదావరి: రంగంపేట మండలంలోని ఈలకొలను గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. కనిపించిన ప్రతి వ్యక్తినీ కరవడం మొదలు పెట్టింది. ఈ ఘటనలో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అదే గ్రామానికి చెందిన కడియపు బాబూరావు, శ్రీనివాసరావు, కయ్యరాజు, వీర్రాజు, సూరిబాబుతో పాటు ఒక పేరుతెలియని ప్రయాణికుడు ఈ దాడిలో గాయపడ్డారు. వీరిని చికిత్సకోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిచ్చికుక్క గురించి అధికారులకు సమాచారమిచ్చినా ఆదివారం కావడంతో పాటు భారత్-పాక్ మ్యాచ్ ఉన్నందున ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు తెలిపారు.

(రంగంపేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement