నార్పల : మండలంలోని కొట్టాలలో ఓ పిచ్చికుక్క ధాటికి జనం బెంబేలెత్తిపోతున్నారు. గురువారం ఇద్దరిపై దాడి చేసి గాయపరిచిన కుక్క..శుక్రవారం మరో నలుగురిని కరిచింది. బాధితులను వెంటనే స్థానిక ఆస్పతికి తరలించి చికిత్స అందించారు. కాగా కనిపించిన వారినల్లా కుక్క కరుస్తుండటంతో వీధుల్లో తిరగాలంటేనే భయంగా ఉందని స్థానికులు వాపోయారు.