
సాక్షి, గుంటూరు: నగరంలోని స్వర్ణ భారతి నగర్‌లో దారుణం జరిగింది. వీధి కుక్క దాడిలో నాలుగేళ్ల ఐజాక్ అనే బాలుడు మృతిచెందాడు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాలుడిని గుంటూరు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. బాలుడు మృతితో తండ్రి నాగరాజు, తల్లి రాణి రోదిస్తున్నారు. బాలుడి తల్లి.. ఏడ్చి ఏడ్చి ఆసుపత్రిలో సొమ్ముసిల్లి పడిపోయారు.
వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. శునకాల దాడితో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారులపై ఇటీవల కుక్కల దాడులు పెరిగిపోయాయి. ఎటు చూసినా కుక్కల గుంపులే కనిపిస్తున్నాయి. ఏ సమయంలో చూసిన రోడ్లపైన కుక్కలు గుంపులుగా సంచరిస్తూనే ఉన్నాయి. కుక్కల నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.