రోడ్డుపై లారీ బీభత్సం : ఆరుగురికి గాయాలు | Six injured in lorry accident due to brake failure | Sakshi
Sakshi News home page

రోడ్డుపై లారీ బీభత్సం : ఆరుగురికి గాయాలు

Published Sat, Feb 14 2015 8:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM

Six injured in lorry accident due to brake failure

హైదరబాద్: అధిక వేగంతో వస్తున్న లారీ బ్రేకులు ఫెయిలై రహదారిపై ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేసింది. ఎదురుగా వస్తున్న రెండు ఆటోలు, ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన బహుదూర్పూరా తాడ్బండ్  మోచీ కాలనీ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది.

అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని... డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement