brake failure
-
డంపర్ ట్రక్కు బీభత్సం
డెహ్రాడూన్: డంపర్ ట్రక్కు ఢీకొట్టడంతో ఓ కారు రూపు ఇలా మారిపోయింది. అందులోని ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్–డెహ్రాడూన్ హైవేపైనున్న లచ్చివాలా టోల్ ప్లాజా వద్ద సోమవారం ఉదయం 7.3 0గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పి వేగంగా దూసుకువచ్చిన ఈ డంపర్ ట్రక్కు ప్లాజా వద్ద వరుసగా ఆగి ఉన్న మూడు కార్లను వెనుక నుంచి ఢీకొట్టింది. ఒక కారు ఇలా ఇనుప స్తంభాన్ని గుద్దుకుని ఇలా నుజ్జవగా మరో రెండు కార్లలోని వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. నుజ్జయిన కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. తెహ్రిలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఉద్యోగులైన వీరిద్దరూ విధులకు వెళ్తూ ఇలా ప్రమాదం బారినపడ్డారు. అతివేగం, ట్రక్కు బ్రేకులు ఫెయిలవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. -
ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికులు దుర్మరణం
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హజ్ యాత్రికులతో వెళుతున్న బస్సు సోమవారం అదుపుతప్పి వంతెనను ఢీట్టింది. దీంతో బస్సు బోల్తా పడి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 20 మంది ప్రయాణికులు మరణించారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడినట్లు సౌదీ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఖమీస్ ముషైత్ నుంచి అభాకు వెళ్తుండగా అసిర్ ప్రావిన్స్‌లోని అకాబత్ షార్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ‘బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 20కు చేరింది. మరో 29 మంది గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం’ అని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా బస్సులో ప్రయాణిస్తున్న బాధితులందరూ వివిధ దేశాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడంతో వాళ్లంతా మక్కా, మదినా యాత్ర కోసం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 2019 అక్టోబర్‌లోనూ మదీనా సమీపంలో బస్సు మరొక భారీ వాహనాన్ని ఢీకొనడంతో 35 మంది విదేశీయులు మరణించారు. చదవండి: ఇదోక జబ్బులా ఉంది! స్కూల్లో కాల్పులు ఘటనపై జోబైడెన్ ఫైర్ -
పెద్ద అంబర్‌పేట్‌లో స్కూల్ బస్సు బీభత్సం
సాక్షి,రంగారెడ్డి: పెద్ద అంబర్ పేట్ కండర్ షైన్ స్కూల్ బస్సు బీభత్సం సృటించింది. 10వ తరగతి పరీక్షలు కావడంతో విద్యార్థులను ఎకించుకొని బస్సు స్కూల్ వద్దకు రాగానే బ్రేకులు ఫెయిల్ కావడంతో పాఠశాల ఆవరణంలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ పైకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు పరీక్ష గదిలోకి వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు ఢీకొన్న సెక్యూరిటీ గార్డ్ పరిస్థితి విషమంగా ఉండటంతో హయత్ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదం గురించి అడిగినందుకు విద్యార్థుల తల్లిదండ్రులపై స్కూల్ యాజమాన్యం దౌర్జన్యానికి దిగారు. దీంతో వారి ప్రవర్తనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: 8 ఏళ్ల కిందటి ‘అచ్ఛేదిన్’ ఇవేనా..?: మోదీ ట్వీట్‌పై కేటీఆర్ -
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి,కృష్ణా : కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఉమ్మడిదేవరపల్లి వద్ద గురువారం ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరువూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉమ్మడిదేవరపల్లి వద్దకు రాగానే స్టీరింగ్ ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లి మోరీని డీకొట్టి ఆగిపోయింది. అయితే పక్కనే ట్రాన్స్పార్మర్ ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆ సమయంలో బస్సులో 40-50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. కొద్దిలో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
రోడ్డుపై లారీ బీభత్సం : ఆరుగురికి గాయాలు
హైదరబాద్: అధిక వేగంతో వస్తున్న లారీ బ్రేకులు ఫెయిలై రహదారిపై ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేసింది. ఎదురుగా వస్తున్న రెండు ఆటోలు, ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన బహుదూర్‌పూరా తాడ్‌బండ్ మోచీ కాలనీ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని... డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుమలలో సుమో బోల్తా 18 మందికి గాయాలు
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివా రం ఉదయం పాపవినాశనం మార్గం లో ఓ సుమో బోల్తా పడడంతో 18 మంది గాయపడ్డారు. తిరుపతికి చెం దిన ఏపీ 03 డబ్ల్యూ 6399 టాటా సుమో ఉదయం 9.30 గంటలకు వరంగల్ జిల్లా తోరూరు మండలం హరిప్రాలకు చెందిన 18 మంది ప్ర యాణికులతో పాపవినాశనానికి బ యలుదేరింది. అక్కడికి అత్యంత సమీపంలోని మలుపు వద్ద బ్రేక్ ఫెయి ల్ కావడంతో వాహనం లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. సుమోలోని అందరూ గాయపడ్డారు. వీరంతా ఒకరికొకరు బంధువులు. వీరిలో సుజాత (25), జ్యోతి(23) పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరిని తిరుమల అశ్వినీ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. వాహనం అతివేగం వల్లే బ్రేక్ ఫెయిలైందని భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కించడాన్ని ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.