
సాక్షి,రంగారెడ్డి: పెద్ద అంబర్ పేట్ కండర్ షైన్ స్కూల్ బస్సు బీభత్సం సృటించింది. 10వ తరగతి పరీక్షలు కావడంతో విద్యార్థులను ఎకించుకొని బస్సు స్కూల్ వద్దకు రాగానే బ్రేకులు ఫెయిల్ కావడంతో పాఠశాల ఆవరణంలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ పైకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు పరీక్ష గదిలోకి వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు ఢీకొన్న సెక్యూరిటీ గార్డ్ పరిస్థితి విషమంగా ఉండటంతో హయత్ నగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదం గురించి అడిగినందుకు విద్యార్థుల తల్లిదండ్రులపై స్కూల్ యాజమాన్యం దౌర్జన్యానికి దిగారు. దీంతో వారి ప్రవర్తనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: 8 ఏళ్ల కిందటి ‘అచ్ఛేదిన్’ ఇవేనా..?: మోదీ ట్వీట్‌పై కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment