
సాక్షి,కృష్ణా : కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఉమ్మడిదేవరపల్లి వద్ద గురువారం ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరువూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉమ్మడిదేవరపల్లి వద్దకు రాగానే స్టీరింగ్ ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లి మోరీని డీకొట్టి ఆగిపోయింది. అయితే పక్కనే ట్రాన్స్‌పార్మర్ ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆ సమయంలో బస్సులో 40-50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. కొద్దిలో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment