gampalagudem
-
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల దాడి
గంపలగూడెం (తిరువూరు): కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని రాజవరంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడిచేశారు. పైగా వైఎస్సార్సీపీ కార్యకర్తలే తమపై దాడిచేశారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పరం అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం రాత్రి టీడీపీ పార్టీ వారు అధికంగా మైక్ సౌండ్ పెట్టారని, కొంచెం తగ్గించాలని అడిగేందుకు వెళ్లిన తమపై ఆ పార్టీ నేతలు దాడి చేశారని వైఎస్సార్సీపీ కార్యకర్త ఓలేటి రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ వారి దాడిలో తనతో పాటు ఉప సర్పంచ్ ఓలేటి నాగేశ్వరరావు, ఓలేటి సురేష్, ఓలేటి శ్యామ్, ఓలేటి మనోజ్, బండారుపల్లి శ్రీనివాసరావులు గాయపడ్డారని పేర్కొన్నారు. బాధితులను తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సురేష్, రాహుల్, శ్రీనివాసరావును మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీకి చెందిన కొందరు తమపై దాడి చేశారంటూ టీడీపీ కార్యకర్త మోదుగు గోపి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో తనతో పాటు మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొన్నారు. -
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి,కృష్ణా : కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఉమ్మడిదేవరపల్లి వద్ద గురువారం ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరువూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉమ్మడిదేవరపల్లి వద్దకు రాగానే స్టీరింగ్ ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లి మోరీని డీకొట్టి ఆగిపోయింది. అయితే పక్కనే ట్రాన్స్పార్మర్ ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆ సమయంలో బస్సులో 40-50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. కొద్దిలో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
గంపలగూడెం మండలంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
నగదు మార్పిడి ముఠా అరెస్టు
గంపలగూడెం : నగదు మార్పిడికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వి.శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దనోట్లను రద్దు చేసిన తరువాత పాతనోట్లను తీసుకుని పది శాతం కమీషన్‌పై మార్పిడికి పాల్పడుతున్న ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన నలుగురి మండల పరిధిలోని గోసవీడులో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిలో తిరువూరు మండలం మునుకుళ్ళకు చెందిన శ్రీలం వెంకట్రామిరెడ్డి, వావిలాలకు చెందిన పినపాటి నాగేశ్వరరావు, తెలంగాణలోని ఖమ్మం జిల్లా వెంసూరు మండలం రామన్నపాలేనికి చెందిన గుండాల మురళి, వైరాకు చెందిన నాయుడు మల్లికార్జునరావులను ఉన్నట్లు వివరించారు. నిందితుల నుంచి రూ.4.40 లక్షల విలువైన రూ.2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న గంపలగూడెం ఎస్ఐ శివరామకృష్ణ వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిలో వెంకట్రామిరెడ్డి యాడ్కం సెల్ కమ్యూనికేషన్లో తెలంగాణ ప్రాంతంలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తుండగా మిగిలిన నలుగురు తొలుత రియల్ఎస్టేట్ వ్యాపారంలో పరిచయం అయినట్లు చెప్పారు. నోట్ల రద్దుతో వీరంతా కలిసి కమీషన్ వ్యాపారం ప్రారంభి, నోట్లు మార్చినందుకు వెంకట్రామిరెడ్డికి ఎనిమిది శాతం, మిగిలిన ముగ్గురికి రెండు శాతం లాభాన్ని పంచుకుంటున్నారని డీఎస్పీ తెలిపారు. వీరిపై చీటింగ్ , క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారిస్తున్నమన్నారు.