నగదు మార్పిడి ముఠా అరెస్టు | cash exchange team arrest | Sakshi
Sakshi News home page

నగదు మార్పిడి ముఠా అరెస్టు

Published Sat, Dec 17 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

నగదు మార్పిడి ముఠా అరెస్టు

నగదు మార్పిడి ముఠా అరెస్టు

గంపలగూడెం : నగదు మార్పిడికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వి.శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు.  కేంద్ర ప్రభుత్వ పెద్దనోట్లను రద్దు చేసిన తరువాత పాతనోట్లను తీసుకుని పది శాతం కమీషన్‌పై మార్పిడికి పాల్పడుతున్న ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన నలుగురి  మండల పరిధిలోని గోసవీడులో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిలో తిరువూరు మండలం మునుకుళ్ళకు చెందిన శ్రీలం వెంకట్రామిరెడ్డి, వావిలాలకు చెందిన పినపాటి నాగేశ్వరరావు, తెలంగాణలోని ఖమ్మం జిల్లా వెంసూరు మండలం రామన్నపాలేనికి చెందిన గుండాల మురళి, వైరాకు చెందిన నాయుడు మల్లికార్జునరావులను ఉన్నట్లు వివరించారు. నిందితుల నుంచి రూ.4.40 లక్షల విలువైన రూ.2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న గంపలగూడెం ఎస్‌ఐ శివరామకృష్ణ వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిలో వెంకట్రామిరెడ్డి యాడ్‌కం సెల్‌ కమ్యూనికేషన్‌లో తెలంగాణ ప్రాంతంలో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తుండగా మిగిలిన నలుగురు తొలుత రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో పరిచయం అయినట్లు చెప్పారు. నోట్ల రద్దుతో వీరంతా కలిసి కమీషన్‌ వ్యాపారం ప్రారంభి, నోట్లు మార్చినందుకు వెంకట్రామిరెడ్డికి ఎనిమిది శాతం, మిగిలిన ముగ్గురికి రెండు శాతం లాభాన్ని పంచుకుంటున్నారని డీఎస్పీ తెలిపారు. వీరిపై చీటింగ్‌ , క్రిమినల్‌ కేసులు నమోదు చేసి విచారిస్తున్నమన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement