సాక్షి,విజయవాడ : విజయవాడ దుర్గగుడిలో కాందాంబరి జత్వానికి రాచమర్యాదలు చేశారు ఆలయ అధికారులు. చీటింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న జత్వానీ కోసం ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేక ప్రోటోకాల్ కల్పించారు.
ఎమ్మెల్యే,ఎంపీ కాకపోయినా దగ్గరుండి వీఐపీ దర్శనం చేయించారు. పోలీసులపై కేసుపెట్టిన జత్వానీకి పోలీసుల సాయంతో దర్శనం చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీఐపీ దర్శన సమయం ముగిసినా..వీఐపీ దర్శనం కల్పించారు. చీటింగ్ కేసు నిందితురాలికి వీఐపీ దర్శనం కల్పించిన పోలీసులు,ఆలయ అధికారులపై భక్తులు మండిపడుతున్నారు.
దుర్గగుడిలో భక్తుల అసహనం
మరోవైపు ఇంద్రకీలాద్రికి ప్రోటోకాల్ దర్శనాలు పోటెత్తడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీఐపీ టైమ్ స్లాట్ దర్శనాలు అమలు కావడంతో భారీగా మొత్తంలో సిఫార్సు లెటర్స్ భక్తులు భారీగా క్యూకట్టారు.
దీంతో క్యూలైన్లు ముందుకు కదలక సామాన్య భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. రూ.500 రూపాయలు టిక్కెట్లు తీసుకున్న భక్తులు నాలుగు గంటలుగా క్యూలైన్‌లోనే దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. రూ.500 రూపాయల టికెట్ ఎందుకు పెట్టారంటూ క్యూలైన్లలోని భక్తులు పోలీసులు,అధికారులతో వాగ్వాదానికి దిగారు. రూ.500 రూపాయలు ఎందుకు పెట్టారంటూ మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment