durgamma
-
ఇంద్రకీలాద్రిపై అపచారం .. షూతో పోలీసుల డ్యూటీ
-
ఆ 'ఆదిపరాశక్తి' పేరు మీదుగా వెలిసిన మహానగరాలివే..!
దేశమంతటా పెద్దఎత్తున జరుపుకొనే పండగల్లో ఒకటైన ‘దసరా’ను పదిరోజుల పాటు వేడుకగా జరుపుకుంటారు. అందులో భాగంగా ఆ అమ్మను సేవించడం, ఆమె కొలువు తీరి ఉన్న ప్రాంతాలను దర్శించుకుని భక్తితో తన్మయులం కావడం సహజం. అందుకే ఈ పండుగ రోజులలో దేశవ్యాప్తంగా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు భక్తజన సంద్రాలుగా మారతాయి. అయితే ఇలా విభిన్న పేర్లతో, వేర్వేరు రూపాల్లో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి నామాల మీదుగా ఏకంగా కొన్ని నగరాలు... ఆ మాటకొస్తే మహానగరాలే వెలశాయంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ అది ముమ్మాటికీ నిజం. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పేర్ల మీద వెలసిన కొన్ని నగరాలు, వాటి ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం..కాళీ ఘాట్ పేరు... కోల్కతామామూలుగానే కోల్‌కతా పేరు చెప్పగానే కాళీమాత నిండైన విగ్రహమే మనో ఫలకంలో మెదులుతుంది. ఇక దసరా సందర్భంగా అయితే కోల్‌కతా మహా నగరంలో అమ్మవారి మండపాలే దర్శనమిస్తుంటాయి. ఇంతకూ కోల్‌కతాకు ఆ పేరు రావడానికి కారణమేమిటో తెలుసా? కోల్‌కతా అనేది బెంగాలీ భాషలోని కాలిక్ క్షేత్ర అనే పదం నుంచి ఉద్భవించింది. కాలిక్ క్షేత్ర అంటే.. కాళికా దేవి నిలయమైన ప్రాంతం అని అర్థం. ఎర్రటి కళ్లతో, నల్లటి రూపంతో, నాలుక బయటపెట్టి ఎంతో గంభీరంగా కనిపించే ఈ దేవి తనను భక్తి శ్రద్ధలతో పూజించే భక్తులను దయతో కా΄ాడుతుంది. అలాగే ‘కాళీఘాట్’ అనే పదం నుంచి ఈ నగరానికి కోల్‌కతా అనే పేరొచ్చినట్లు మరో కథనం ప్రచారంలో ఉంది. ఇక్కడ కాళీమాత కొలువైన ‘కాళీఘాట్ కాళీ దేవాలయా’నికి 200 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం.ముంబయి – ముంబాదేవిముంబాయికి దక్షిణ ముంబయిలోని బులేశ్వర్ అనే ప్రాంతంలో కొలువైన ఆలయంలోని ముంబాదేవి పేరు మీదుగానే ఆ పేరు వచ్చిందని ప్రతీతి. వెండి కిరీటం, బంగారు కంఠసరి, ముక్కుపుడకతో అత్యంత శోభాయమానంగా విరాజిల్లుతుంటుంది అమ్మవారు. పార్వతీమాత కాళికా దేవిగా అవతారమెత్తే క్రమంలో పరమ శివుని ఆదేశం మేరకు ఇప్పుడు ముంబయిగా పిలుస్తోన్న ప్రాంతంలో ఓ మత్స్యకారుల వంశంలో జన్మించిందట. మత్స్యాంబ అనే పేరుతో పుట్టిన అమ్మవారు అవతారం చాలించే సమయంలో మత్స్యకారుల కోరిక మేరకు ‘మహా అంబ’గా వెలిసిందని, కాలక్రమేణా ఆమె పేరు ‘ముంబా దేవి’గా మారినట్లు స్థల పురాణం చెబుతోంది.శ్యామలా దేవి పేరే సిమ్లాకుసిమ్లా.. సాక్షాత్తూ ఆ కాళీ మాతే శ్యామలా దేవిగా వెలసిన నగరం కాబట్టే సిమ్లాకు ఆ పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. ఈ గుడిని 1845లో బ్రిటిష్ పరిపాలనా కాలంలో బెంగాలీ భక్తులు జకు అనే కొండపై నిర్మించారట! ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో శ్యామవర్ణంలో మెరిసే దుర్గామాత రూపం చూపరులను కట్టిపడేస్తుంది.చండీ మందిర్...చండీగఢ్చండీ అంటే పార్వతీ దేవి ఉగ్ర రూపమైన చండీ మాత అని, గఢ్ అంటే కొలువుండే చోటు అని అర్థం.. ఇలా ఈ నగరానికి చండీగఢ్ అని పేరు రావడానికి అక్కడ కొలువైన ‘చండీ మందిర్’ దేవాలయమే కారణం. చండీగఢ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచకుల జిల్లాలో కల్క పట్టణంలో కొండపై వెలసిందీ దేవాలయం. ఈ చండీ గుడి, మాతా మానసి దేవి ఆలయం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి కనుచూపు మేరలో గల శివాలిక్ కొండలు ఈ ఆలయానికి అదనపు సొబగులు.మంగళూరు... మంగళాదేవికర్ణాటకలోని ముఖ్య పట్టణాల్లో ఒకటైన మంగళూరుకు ఇక్కడ కొలువైన మంగళాదేవి పేరు మీదే ఆ పేరొచ్చింది. పురాణాల ప్రకారం.. మంగళాదేవి ఆలయాన్ని పరశురాముడు నెలకొల్పినట్లు తెలుస్తుంది. నేపాల్ నుంచి వచ్చిన కొందరు సాధువుల సూచన మేరకు 9వ శతాబ్దంలో తులునాడును పరిపాలించిన అలుపారాజ వంశస్థుడు కుందవర్మన్ ఈ ఆలయాన్ని కేరళ శిల్పకళా రీతిలో కట్టించాడు. ప్రతిసారీ దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళాదేవికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దశమి రోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించిన తర్వాత నిర్వహించే రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది.పటన్ దేవి పేరుతో పట్నాపట్నాకు ఆ పేరు రావడానికి శక్తి స్వరూపిణి అయిన ‘పతన్ దేవి’ అమ్మవారు కొలువైన ఆలయమే కారణం. ఈ ఆలయం 51 సిద్ధ శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పురాణ గాథల ప్రకారం.. దక్షయజ్ఞం సమయంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి శరీరాన్ని మహావిష్ణువు ముక్కలుగా ఖండించగా, కుడి తొడభాగం ఈ ప్రాంతంలో పడిందట! అలా వెలసిన అమ్మవారిని మొదట్లో ‘సర్వానంద కారి పతనేశ్వరి’ అనే పేరుతో కొలిచేవారు. కాలక్రమంలో.. ఆ పేరు ‘పతనేశ్వరి’గా, ఇప్పుడు ‘పతన్ దేవి’గా రూపాంతరం చెందుతూ వచ్చింది.నైనాదేవి పేరుతో నైనితాల్ నగరందక్షయజ్ఞంలో దహనమైన సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడినట్లుగా స్థలపురాణం చెబుతోంది. మహిషాసురుడిని సంహరించిన కారణంగా నైనాదేవిని, మహిషపీత్ అని కూడా పిలుస్తారు. అలా మహిషుణ్ణి సంహరించిన సమయంలో దేవతలందరూ అమ్మవారిని ‘జై నైనా’ అంటూ నినదించడం వల్ల ఈ అమ్మవారు ‘‘నైనా దేవి’గా పూజలందుకుంటోందట. శక్తిపీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో విజయదశమి ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి.మరికొన్ని ప్రదేశాలుత్రిపుర – త్రిపుర సుందరి మైసూరు – మహిషాసుర మర్దిని కన్యాకుమారి – కన్యాకుమారి దేవి తుల్జాపుర్ – తుల్జా భవాని (మహారాష్ట్ర)హస్సాన్ – హసనాంబె (కర్ణాటక)అంబాలా – భవానీ అంబా దేవి (హరియాణా)– డి.వి.ఆర్. భాస్కర్ (చదవండి: బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా..) -
శరన్నవరాత్రులు..ఎనిమిదో రోజు దుర్గాదేవి అలంకారం
దుర్గతులను నివారించే పరాశక్తి ఎనిమిదో రోజున దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి.శ్లోకం: సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాదికే శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే.రాహుగ్రహ దోషాలను నివారించి, భక్తుల కష్టాలను శీఘ్రంగా దూరం చేస్తుంది. ఓం దుర్గ దుర్గాయ నమః అని వీలైనన్ని సార్లు జపిస్తే శత్రు బాధలు తొలగి, సుఖశాంతులతో వర్ధిల్లుతారని భక్తుల నమ్మకం. అంతేగాదు. ఈ రోజు 'ఓం కాత్యానాయ విద్మహే కన్యకుమారి ధీమహి! తన్నో దుర్గ్ ప్రచోదయాత్!' అంటూ ప్రార్థన చేసి, ఆరాధిస్తే మనకున్న దుర్గతులు పోతాయని పురాణ వచనం.మరోవైపు ఎనిమిదోరోజు కొన్ని చోట్ల నవదుర్గల ప్రకారం గౌరి దేవిని పూజిస్తారు. ఈ తల్లి తెల్లటి ముత్యంలా మెరుస్తుంది. ఆమె శక్తి అత్యంత ఫలప్రదమైనది. ఈ రోజున మహాగౌరీ దేవిని తెలుపు లేదా ఊదా రంగు దుస్తులు ధరించి పూజించాలినైవేద్యం: బెల్లం పొంగలి, చెక్కెర పొంగలి, పాయసాన్నం వంటివి నివేదిస్తారు (చదవండి: నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..!) -
మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు మంగళవారం మహాలక్ష్మిదేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు. సాయంత్రం నగరోత్సవం కనులపండువగా సాగింది. కనకదుర్గానగర్‌లో కళావేదికపై ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. బుధవారం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు మంగళవారం రాత్రి 11 గంటల నుంచే ఇంద్రకీలాద్రిపైకి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మూలా నక్షత్రం నాడు 2 లక్షల మందికిపైగా భక్తులు రానున్న నేపథ్యంలో అందుకు తగినట్లు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. క్యూలైన్లలో మార్పులు చేసింది. వీఐపీ దర్శనాలనూ రద్దు చేసింది. బుధవారం తెల్లవారుజామున 2.00 గంటల నంచి రాత్రి 11 గంటల వరకు భక్తులందరికీ ఉచితంగా అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తోంది. ఫ్లైవోవర్ కింద వాహనాలకు అనుమతి రద్దు చేసింది. సీఎం చంద్రబాబు బుధవారం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.నేడు శ్రీ సరస్వతిదేవిగా... ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బుధవారం శ్రీ సరస్వతిదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం. ఈ రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ అవతారంలో భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తారు. -
చరిత్రలో తొలిసారి..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా పూజ..!
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా మాత్ర విగ్రహాలు కొలువుదీరాయి. న్యూయార్క్ నగరంలో ఉండే ఎన్ఆరైలు ఈ దుర్గాపూజకు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఇదివరకటి మాదిరిగా వీడియో చాట్ల ద్వారా పూజలు జరుపుకోవాల్సిన పనిలేదు. ఈ దుర్గామాత విగ్రహాలను యూఎస్ఏ బెంగాలి క్లబ్ ఏర్పాటు చేసింది. ప్రారంభ పూజ అక్టోబర్ 5,6 తేదీల్లో ఘనంగా జరిగింది. 🚨 Durga Puja at Times Square, New York 🇺🇸 pic.twitter.com/dsTqktg14d— Indian Tech & Infra (@IndianTechGuide) October 7, 2024అందుకు సంబంధించిన ఫోటోలను పలువురు నెటిజన్లు "న్యూయార్క్ నగరం నడిబొడ్డున భారతీయ సంస్కృతి" అనే క్యాప్షన్‌తో సోషల్‌మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. అలాగే రుచికా జైన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబంధించిన ఓ వీడియోని కూడా షేర్ చేసింది. అందులో రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమాల గురించి వివరించింది. దశమి పూజతో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈ చారిత్రాత్మక ఘటన సిందూర్ ఖేలా టైమ్స్ స్క్వేర్ వద్ద కూడా చోటుచేసుకుంది. History has been Scripted !!!For the 1st time, Durga pujo was organized at the centre of Times Square, New York City, United States.Kudos to all the Bengalis living in New York who have made this possible!!! pic.twitter.com/n6iu4FGNp8— Sourav || সৌরভ (@Sourav_3294) October 6, 2024ఈ పండుగ ఆచారం ఐక్యత ఆవశక్యత గూర్చి చాటిచెబుతోంది. ఇలా ఈ నవరాత్రులను యునైటెడ్ కింగ్డమ్, లండన్, లీసెస్టర్, బర్మింగ్‌హామ్ వంటి నగరాల్లో భారత సంతతి విదేశీయులు ఎంతో ఉత్సహాంగా జరపుకుంటున్నారు. ఆ వేడుకల్లో వివిధ సాంస్కృతిక బృందాలు ఈవెంట్లు, గర్బా పార్టీలు నిర్వహిస్తున్నాయి. నిజానికి ఈ చారిత్రాత్మక ఘటనలు సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి ఒక గొప్ప అవకాశంగా ఉపయోగపడతాయి. అలాగే ఆస్ట్రేలియాలో కూడా భారతీయులంతా ఒకచోట చేరి ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం విశేషం. View this post on Instagram A post shared by RUCHIKA JAIN FIREFLYDO (@fireflydo) (చదవండి: కాన్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు) -
లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం అమ్మవారు శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. సాయంత్రం ఆదిదంపతుల నగరోత్సవం కనులపండువగా సాగింది. కనకదుర్గానగర్‌లో కళావేదికపై ప్రదిర్శించిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. సోమవారం శ్రీ మహా చండీదేవి అలంకరణలో భక్తులకు దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. వీఐపీలకే పెద్దపీట... ఇంద్రకీలాద్రిపై రోజు రోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల సిఫారసు లేఖలు రావడంతో అధికారులు ఏమీ చేయలేకపోయారు. వీఐపీలు తమకు నిర్దేశించిన సమయంలోనే దర్శనానికి రావాలని కలెక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేదు. రూ.500 టికెట్ కొన్నవారికి దర్శనానికి ఐదు గంటలు పట్టింది. రూ.100, రూ.300 దర్శనం టికెట్లు కొన్న వారికే త్వరగా దర్శనమవుతోంది. జత్వానీకి రాచమర్యాదలు చీటింగ్ కేసులో నిందితురాలు, సినీ నటి కాదంబరీ జత్వానీకి ఇంద్రకీలాద్రిపై రాచమర్యాదలు చేశారు. తల్లిదండ్రులతో కలిసి ఆదివారం ఇంద్రకీలాద్రికి వచ్చిన ఆమెకు పోలీసులు ప్రత్యేక ప్రొటోకాల్ ఏర్పాటు చేశారు. ఆమెకు ఇద్దరు కానిస్టేబుళ్లు దగ్గరుండి మరీ వీఐపీ దర్శనం చేయించారు. -
నవరాత్రి అలంకరణలో నవనవోన్మేషంగా...
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ పది విశేష అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు.3వ తేదీ గురువారం – శ్రీబాలా త్రిపుర సుందరీదేవిదసరా ఉత్సవాలలో తొలిరోజున దుర్గమ్మ శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి.4వ తేదీ శుక్రవారం – శ్రీగాయత్రిదేవిరెండోరోజున దుర్గమ్మ శ్రీ గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రి అమ్మవారిని దర్శించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. వేదమాత గా గాయత్రిదేవిని దర్శించుకోవడం వలన సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం ΄÷ందుతారు.5వ తేదీ శనివారం – శ్రీఅన్నపూర్ణాదేవిదసరా ఉత్సవాలలో మూడోరోజున దుర్గమ్మను శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులు దర్శించుకున్నారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో శ్రీ దుర్గమ్మను దర్శించడం వల్ల అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే భాగ్యాన్ని ΄÷ందగలుగుతారు.6వ తేదీ ఆదివారం- శ్రీలలితా త్రిపుర సుందరీదేవిదసరా ఉత్సవాలలో నాల్గో రోజున దుర్గమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులు దర్శించుకున్నారు. శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దర్శమిచ్చే సమయంలో పరమేశ్వరుడు మహాకామేశ్వరుడిగా, అమ్మవారు త్రిపుర సుందరీదేవిగా భక్తుల పూజలందుకుంటారు.7వ తేదీ సోమవారం – శ్రీ మహాచండీదేవిఐదవ రోజున దుర్గమ్మ శ్రీమహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాచండీ అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి, శత్రువులు మిత్రులుగా మారి కోరికలు అన్ని సత్వరమే తీరుతాయి.8వ తేదీ మంగళవారం – శ్రీమహాలక్ష్మీదేవిఆరో రోజున దుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోక స్ధితికారిణిగా, «అమృత స్వరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తుంది. శ్రీమహాలక్ష్మీదేవిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్య్ర΄ాప్తి కలుగుతుంది. 9వ తేదీ బుధవారం – శ్రీసరస్వతిదేవిఏడవరోజయిన మూల నక్షత్రం రోజున సరస్వతి అవతారంలో దుర్గాదేవి భక్తులకు దర్శనమిస్తారు. సరస్వతీదేవిని సేవించడం వల్ల సర్వ విద్యలయందు విజయం ΄÷ందుతారు.10వ తేదీ గురువారం – శ్రీదుర్గాదేవి 8వ రోజున దుర్గమ్మ శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను ΄ోగొట్టి దుర్గగా వెలుగొందినది. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని ఆర్చించటం సద్గతులను ప్రసాదిస్తుంది.11వ తేదీ శుక్రవారం – శ్రీమహిషాసుర మర్ధనిదేవిదసరా ఉత్సవాలలో 9వ రోజున దుర్గమ్మ శ్రీమహిషాసురమర్ధనిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినిౖయె, దుష్టుడైన మహిషాసురుని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషుల, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసురమర్ధనిదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల అరిష్ట్వర్గాలు నశించి, సాత్విక బావం ఉదయిస్తుంది. సర్వ దోషాలు పంటాపంచలు అవుతాయి. ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయి.12వ తేదీ శనివారం – శ్రీరాజరాజేశ్వరిదేవిదసరా ఉత్సవాలలో 10వ రోజున దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చెరుకుగడను వామహస్తంతో ధరించి, దక్షిణ హస్తం తో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహా మంత్ర స్వరూపిణి గా, శ్రీచక్రరాజ దేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరిదేవిని దర్శించి అర్చించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి.– సుభాని, సాక్షి, ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) -
దుర్గ గుడిలో కాదంబరీ జత్వానికి రాచ మర్యాదలు
సాక్షి,విజయవాడ : విజయవాడ దుర్గగుడిలో కాందాంబరి జత్వానికి రాచమర్యాదలు చేశారు ఆలయ అధికారులు. చీటింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న జత్వానీ కోసం ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేక ప్రోటోకాల్ కల్పించారు. ఎమ్మెల్యే,ఎంపీ కాకపోయినా దగ్గరుండి వీఐపీ దర్శనం చేయించారు. పోలీసులపై కేసుపెట్టిన జత్వానీకి పోలీసుల సాయంతో దర్శనం చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీఐపీ దర్శన సమయం ముగిసినా..వీఐపీ దర్శనం కల్పించారు. చీటింగ్ కేసు నిందితురాలికి వీఐపీ దర్శనం కల్పించిన పోలీసులు,ఆలయ అధికారులపై భక్తులు మండిపడుతున్నారు. దుర్గగుడిలో భక్తుల అసహనంమరోవైపు ఇంద్రకీలాద్రికి ప్రోటోకాల్ దర్శనాలు పోటెత్తడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీఐపీ టైమ్ స్లాట్ దర్శనాలు అమలు కావడంతో భారీగా మొత్తంలో సిఫార్సు లెటర్స్ భక్తులు భారీగా క్యూకట్టారు. దీంతో క్యూలైన్లు ముందుకు కదలక సామాన్య భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. రూ.500 రూపాయలు టిక్కెట్లు తీసుకున్న భక్తులు నాలుగు గంటలుగా క్యూలైన్లోనే దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. రూ.500 రూపాయల టికెట్ ఎందుకు పెట్టారంటూ క్యూలైన్లలోని భక్తులు పోలీసులు,అధికారులతో వాగ్వాదానికి దిగారు. రూ.500 రూపాయలు ఎందుకు పెట్టారంటూ మండిపడుతున్నారు. -
అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఇంద్రకీలాద్రి(విజయవాడ పర్పింమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మూడోరోజు అన్నపూర్ణాదేవీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. సెలవుల నేపథ్యంలో ఆదివారం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దర్శనానికి వచ్చే వీఐపీలు తమకు నిర్దేశించిన సమయంలోనే రావాలని కలెక్టర్ డాక్టర్ సృజన, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు విజ్ఞప్తి చేశారు. దుర్గమ్మకు మంగళ సూత్రాల సమర్పణ ప్రకాశం జిల్లా కొండేపికి చెందిన చిరువ్యాపారి కళ్లకుంట అంకులయ్య, రాజేశ్వరి దంపతులు దుర్గమ్మకు బంగారు మంగళ సూత్రాలు తయారు చేయించారు. రూ.18 లక్షలు విలువ చేసే 203 గ్రాముల బంగారు మంగళ సూత్రాలను శనివారం సమర్పించారు. అలాగే గుంటూరుకు చెందిన చేబ్రోలు పుల్లయ్య అనే భక్తుడు 5.7 కిలోల వెండితో తయారు చేసిన హంస వాహనాన్ని శనివారం జగన్మాతకు సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో కె.ఎస్.రామారావు దాతలను అభినందించారు. కనులవిందుగా నగరోత్సవం దసరా మహోత్సవాల్లో భాగంగా ఆది దంపతుల నగరోత్సవం నయనమనోహరంగా సాగింది. ఉత్సవమూర్తులతో మల్లేశ్వరాలయం దిగువన ఉన్న మహామండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవంలో అర్చకులు, పండితులు, కళాకారులు, అధికారులు పాల్గొని సేవలందించారు. కళావేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నేటి అలంకారం.. శ్రీలలితా త్రిపుర సుందరీదేవిఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో నాలుగోరోజైన ఆదివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహా మంత్రాధిదేవతగా వేం చేసి ఆరాధించే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. శ్రీలక్ష్మీదేవి, శ్రీ సరస్వతిదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా, చిరు మందహాసంతో, వాత్సల్యరూపిణిగా చెరుకుగడను చేత పట్టుకుని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వనున్నది.ద్వారకా తిరుమల నుంచి పట్టువ్రస్తాలు దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పట్టువ్రస్తాలను సమర్పించేందుకు ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో మూర్తి, ఆలయ అర్చకులు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పట్టువ్రస్తాలను సమర్పించారు. అనంతరం ఆయనకు, దేవస్థాన అర్చకులకు, దుర్గగుడి దేవస్థానం తరఫున ఈవో కె.ఎస్.రామారావు అమ్మవారి ప్రసాదాలను అందచేశారు. -
Dussehra 2024 : శరన్నవరాత్రులు, అన్నపూర్ణాదేవిగా పూజలు
దసరా సందర్బంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవ రాత్రులలో తొలి రోజు బాలా త్రిపుర సుందరిగా, రెండో రోజు గాయత్రిదేవిగా భక్తుల పూజలందుకున్న ఆ జగన్మాత మూడో రోజు(అక్టోబర్ 5వ తేదీ శనివారం)అమ్మవారిని అన్నపూర్ణా దేవి రూపంలో పూజిస్తారు. మూడోరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజలందుకోనుంది.ఆది పరాశక్తిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి 'భిక్షాందేహి కృపావలంబన కరీ, మాతాన్నపూర్ణేశ్వరీ!' అని ప్రార్థిస్తారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అన్నం పరబ్రహ్మస్వరూపం. సకల జీవరాశికి ఆహారాన్ని ప్రసాదించాలని అన్నపూర్ణ దేవిని వేడుకుంటారు. అంతేకాదు ఈ రోజునే తల్లులందరూ స్తనవృద్ధి గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. (నవరాత్రుల ఉపవాసాలు : ఈజీగా, హెల్దీగా సగ్గుబియ్యం కిచిడీ)అన్నపూర్ణ దేవికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈ రంగులు ఇచ్చేందుకు ప్రతీక. ఈ రోజు అమ్మవారికి గారెలు, కట్టె పొంగలి, దధ్యోజనం నైవేద్యంగా పెడతారు. ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధివికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత కలుగుతాయి. మరోవైపు శరన్నవరాత్రుల్లో భాగంగా నాడు మూడో రోజు చంద్రఘంట మాతను ఆరాధిస్తారు. దుర్గా దేవి మూడో రూపమే చంద్రఘంట దేవి.చంద్రఘంట మాత పూజ చేసే వారు ఎక్కువగా ఎరుపు, నారింజ రంగులను ఉపయోగిస్తారు. ఎర్ర చందనం, ఎర్ర చున్ని, ఎర్రని పువ్వులు, ఎర్రని పండ్లను నైవేద్యంగా నివేదిస్తారు. అలాగే చంద్రఘంట అమ్మవారికి పాలతో చేసిన తియ్యని పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. (నవరాత్రి ప్రసాదాలు: పచ్చికొబ్బరితో లడ్డు ) -
Dussehra 2024 నవదుర్గా నమోస్తుతే!
నేటినుంచి ఆశ్వీయుజ మాసం ఆరంభం అవుతోంది. ఈ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిది రోజులను నవ రాత్రులు అంటారు. నవ రాత్రులంటే మహిళలు దేవిని స్మరిస్తూ పండగ చేసుకుంటారు. ఈ అమ్మవారి ఆరాధనా మహోత్సవాన్ని ’శరన్నవరాత్రి ఉత్సవాలు’గా, ’దేవీనవ రాత్రులు’గా పిలుస్తుంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈతొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది.భక్తులు ఈ తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేపట్టి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో,వాళ్లు తనకి అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి. దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి, మహా పవిత్రమైనవి. ఈ తొమ్మిది రోజులపాటు ఒక్కోరోజు ఒక్కో రూపంగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. ఇలా తొమ్మిది రోజుల పాటు నవదుర్గలను ఆరాధించడం వలన ధనధాన్యాలు ... సంతాన సౌభాగ్యాలు ... సుఖశాంతులు చేకూరుతాయని పండితులు చెబుతారు. ఇక దేవీ నవరాత్రి పూజలు చేయుట, అనునది అనాది కాలంగా వస్తున్న శాస్త్రవిధి. ‘అశ్వనీ‘ నక్షత్రంలో కలసి వచ్చిన పూర్ణిమమాసమే ‘ఆశ్వీయుజమాసం‘ అవుతుంది. ఈ మాసమందు ’దేవీనవరాత్రుల’ను శరన్నవరాత్రులని పిలుస్తూ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు.∙ప్రథమాశైలపుత్రి,ద్వితీయా బ్రహ్మచారిణీ ∙తృతీయాచంద్రఘంటీతి, ∙కూష్మాండేతి చతుర్థికీ ∙పంచమా స్కందమాతేతి∙షష్టాకాత్యాయనేతి ∙సప్తమా కాళరాత్రిచ ∙అష్టమాచాతి భైరవీ ∙నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా. మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ ‘దసరావైభవం‘ ఒకటి. ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేస్తూ విశేష పూజలతో పాటు నిత్యం శ్రీలలితా సహస్రనామ పారాయణ గావిస్తూ ‘శరన్నవరాత్రులు‘ గా వ్యవహరిస్తారు. శ్రవణానక్షత్రయుక్త ’దశమి’ తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు. దసరాకు మరోపేరు ‘దశహరా‘ అంటే! పది పాపాలను హరించేది అని అర్థం చెబుతారు దైవజ్ఞలు. ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి, హస్తా నక్షత్రంలో కూడియున్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించడం చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది. అందువల్ల ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభిస్తారు. అందులో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలనిపెద్దలు చెబుతున్నారు.దుర్గమ్మకు దసరా అలంకారాలు∙స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ( పాడ్యమి) ∙శ్రీ బాల త్రిపుర సుందరి (విదియ) ∙శ్రీ అన్నపూర్ణా దేవి (తదియ) ∙శ్రీ గాయత్రి దేవి (చవితి) ∙శ్రీ లలిత త్రిపుర సుందరి(పంచమి) ∙శ్రీ మహాలక్ష్మి దేవి (షష్టి) ∙శ్రీ సరస్వతి దేవి (సప్తమి) ∙శ్రీ దుర్గాదేవి (అష్టమి) ∙శ్రీ మహిషాసురమర్ధిని దేవి (నవమి) ∙శ్రీ రాజ రాజేశ్వరి దేవి (దశమి) -
దుర్గాదేవి విగ్రహాల తయారీలో 'పుణ్యమట్టి' కథేంటో తెలుసా..!
బొజ్జ గణపయ్య నవరాత్రులు పూర్తైన వెంటనే దసరా సందడి, హడవిడి మొదలైపోతుంది. ఇక శిల్పులంతా దుర్గాదేవి విగ్రహాల తయారీలో తలమునకలై ఉంటారు. అయితే ఈ దుర్గమ్మ విగ్రహాల తయారీలో ఓ ప్రత్యేకత ఉంది. అది అనాదిగా వస్తున్న సంప్రదాయమని చెబుతున్నారు శిల్పకారులు. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వింత చూసి ఎంతైన 'అమ్మ' కదా ఏ బిడ్డను చులకనగా వదిలేయదు కదా..అనిపిస్తుంది. ఇంతకీ ఏంటా ప్రత్యకత అంటే..దుర్గమ్మ విగ్రహాలు తయారు చేయాడానికి నాలుగు విషయాలు అత్యంత కీలకం. తయారీకి శిల్పులు గంగానది ఒడ్డును ఉన్న మట్టి, గోవు పేడ, గో మూత్రం, ఇంకా వేశ్యల ఇంటిలోని మట్టిని ఉపయోగిస్తారు. ఈ మట్టిని ” నిషిద్ధో పల్లిస్ ” అని పిలుస్తారు. ఇందులో ఏది లేకపోయినా విగ్రహం అసంపూర్ణమని వారు భావిస్తారట. అంతేగాదు అందుకోసం ప్రతి శిల్పకారుడు వేశ్య గృహాలకు వెళ్లి వారి ప్రాంగణంలో మట్టి కావాలని అభ్యర్థిస్తారట. తమకు మట్టి లభించేవరకు వాళ్లని ప్రాధేయపతారు. అంతేగాదు దసరా సీజన్ రాగానే వారిని గౌరవంగా, చిరునవ్వుతో పలకరించి మరీ మట్టిని తీసుకునే ప్రయత్నం చేస్తారట శిల్పకారులు. ఈ ఆచారాన్ని బెంగాలీ శిల్పకారులు ఇప్పటికీ పాటిస్తుండటం విశేషం. ఎందుకు ఇలానే అనేందుకు స్పష్టమైన వివరణ లేదు. కానీ కొన్ని కథానాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఆ కారణం ఏంటంటే..దుర్గాదేవి మహిషాసురిడితో తలపడుతున్న సమయంలో ఆమెను తాకే ప్రయత్నం చేశాడట. దీంతో ఆమె కోపంతో తన పరాక్రమాన్ని అంతా ఉపయోగించి ఆ రాక్షసుడిని అంతం చేసిందట. అందుకే ఆ సంప్రదాయమని పండితుల వచనం. మరొక కథనం ప్రకారం..నారీ శక్తికి సూచన దుర్గమ్మ. సమాజంలో ప్రతి మహిళకు గౌరవం దక్కాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని తీసుకువచ్చారని చెబుతుంటారు. అంతేగాదు ఇలా వేశ్య ఇంటిలోని మట్టితో దుర్గామాత విగ్రహం తయారు చేస్తే అందులోకి అమ్మవారి కళ వచ్చి శోభాయమానంగా కనిపిస్తుందట. మన పెద్దలు ఈ సంప్రదాయం ఎందుకని పెట్టారో స్పష్టంగా తెలియకపోయినా.. దేవుడి దృష్టిలో అందరూ సమానమే..ఎవ్వరిని కించపరచకూడదు, హేయభావంతో చూడకూడదు అనే చక్కని సందేశాన్ని ఇస్తోంది ఈ ఆచారం..!(చదవండి: Dussehra 2024 సంబరాల దసరా: ఇంత తతంగం ఉంటుంది!) -
Dussehra 2024 సంబరాల దసరా: ఇంత తతంగం ఉంటుంది!
దసరా.. అన్ని వర్గాల వారికీ ఆనందాన్ని పంచే పండగ! ఎన్నో సెంటిమెంట్లను సరదాలను, మెసుకొచ్చే శుభదినం. కొత్త బట్టలు, కొత్త కార్లు, కొత్త ఇల్లు, సరికొత్త ఆభరణాలు కొత్త మొబైల్, ఇలా కొంగొత్తగా వేడుక ఉండాలని ఆరాట పడతారు. కొత్త వ్యాపారాలు చేసే వారు దసరా ముహూర్తం కోసం ఎదురు చూస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయల్లా విలసిల్లాలని మొక్కుకుంటారు. అంతేనా ఉద్యోగులకు బోనస్‌లు, బహుమతులు అబ్బో.. ఆ సందడే వేరు! మనసంతా షాపింగ్సరదా అంటేముందుగా గుర్తొచ్చేది షాపింగ్. ఆఫ్లైన్లైనా ఆన్లైన్లైనా షాపింగ్ మాత్రం మస్ట్. దీన్ని క్యాష్ చేసుకునేందుక రకకరకాల ఆఫర్లతో మురిపిస్తుంటాయి కంపెనీలు. ఏ మాత్రం హడావిడి లేకుండా, జాగ్రత్తగా షాపింగ్ చేసేయ్యడమే. లేకపోతే మోసపోయే అవకాశం ఉంది. మనకి కావలన్నపుడు నచ్చినవి దొరక్క, డీలా పడ్డం కాదు, చీప్‌గా దొరికినపుడు దక్కించుకోవడమే ఇదీ లేటెస్ట్ ట్రెండ్కలిసొచ్చే సెలవులుదసరా అంటే పిల్లలకు కూడా చాలా సంబరం. ఎందుకంటే దాదాపు పది రోజులు ఎంచక్కా సెలవులొస్తాయి. అమ్మచేతి కమ్మనైన వంటలు (అపుడపుడు మొట్టికాయలు కూడా) తినేయొచ్చు. కొత్త బట్టలొస్తాయి, కొత్త బొమ్మలూ వస్తాయి. సన్నిహిత బంధువుల పిల్లకాయలొస్తారు. ఇంకేంముంది ఇల్లు పీకి పందిరేయడమే.స్వీట్లుస్వీట్లు లేని దసరా ఊహించుకోగలమా? చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఆ జగన్మాతను పూజించుకోవడంతోపాటు, నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. లడ్డూలు, జిలేబీలు, గులాబ్ జామూన్ పూతరేకులతోపాటు, జంతికలు, కారప్పూస, సఖినాలు ఇలా రకరకాల పిండి వంటల తయారీలో మహిళలు ఫుల్ బిజీగా ఉంటారు. ఇక దసరా నాడు, గారెలూ, బజ్జీలూ, వడలు, ఇక ఆ తరువాత కోడికూర, మటన్ మంచింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. దసరా భక్తిదసరా' అనే 'దశ' అంటే 'పది' ,'హర' అంటే 'ఓటమి' అనే రెండు సంస్కృత పదాలనుంచి వచ్చింది. దసరా నవరాత్రులు, లేదా దేవీ నవర్రాతులు పేరుతో తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మను కొలుస్తారు. ఈ శరన్నవ రాత్రల్లో దేశవ్యాప్తంగా ఉన్న అమ్మవారి దేవాలయాలు సర్వంగా సుందరంగా ముస్తాబవుతాయి. రాముడు (విష్ణువు ఎనిమిదవ అవతారం), శని యుగంలో జన్మించిన పది తలల రాక్షసుడు రావణుడిని సహరించిన శుభ సందర్భాన్ని, పాండవుల అజ్ఞాత వాసం వీడి, శమీ వృక్షం మీదున్న ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకున్న సందర్భాన్ని కూడా దసరాగా జరుపుకుంటారు. ఇందులో భాగమే రావణ దహనం, శమీ పూజలు తొమ్మిది రోజులు, తొమ్మిది అవతారాలుఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా పాటిస్తారు. శరదృతువు ఆరంభంలో వచ్చిన పండుగు కనుక శరన్నరాత్రులు అంటారు. ఈ సమయంలో అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో పూజిస్తారు. తొమ్మిది రకాల పైవేద్యాలు సమర్పిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి. మహా సరస్వతి, నందయ, రక్త దంతి, శాకంబరి దుర్గ, మాతంగి, భ్రమరి అవతారాల్లో అమ్మవారిని ఆరాధిస్తారు. బాలాత్రిపుర సుందరి , గాయత్రి, అన్నపూర్ణ, లలితా త్రిపుర సుందరి, మహాలక్ష్మి, సరస్వతి మహిషాసరమర్ధిని, దర్గమ్మ, రాజరాజేశ్వరి, మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. బొమ్మల కొలువుదసరా సంబరాల్లో బొమ్మల కొలువు మరో ముఖ్యమైన ఆచారం. ఈ బొమ్మల కొలువును తీర్చిదిద్దడంలో మహిళలు, అమ్మాయిలు తమ కళాత్మక దృష్టిని ప్రదర్శిస్తారు. ఇది కేవలం భక్తిప్రధానమే కాక, విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా సంస్కృతీ సంపన్నమైన ఆచారాలకు ప్రతిబింబంగా ఉంటుంది. -
అందుబాటులో దుర్గమ్మ దసరా ఆర్జిత సేవా టికెట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై వచ్చే నెల 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో వచ్చాయి. దసరా ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేకంగా ఖడ్గమాలార్చన, కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమాలను నిర్వహిస్తారు. ఆయా టికెట్ల ధరలను దేవస్థానం ఖరారు చేయగా, ఆన్‌లైన్‌తో పాటు దేవస్థానం ఆవరణలోని టికెట్ కౌంటర్, మహామండపం దిగువన టోల్‌ఫ్రీ నంబర్ కౌంటర్లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక ఖడ్గమాలార్చనకు రూ. 5,116, ప్రత్యేక కుంకుమార్చనకు రూ. 3 వేలుగా నిర్ణయించారు. మూలా నక్షత్రం రోజున నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చన టికెట్ ధర రూ. 5 వేలు. ఇక ప్రత్యేక శ్రీచక్రనవార్చనకు టికెట్ ధర రూ. 3 వేలు, ప్రత్యేక చండీహోమం టికెట్ ధర రూ. 4 వేలుగా నిర్ణయించారు. ఇక ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించే వేద విద్వత్ సభ అక్టోబర్ 10న, అర్చన సభ 11న నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. దసరా ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారికి విశేష అలంకారాలు, ప్రత్యేక పూజలు, నివేదనలు, వేద సభ, అర్చక సత్కారం వంటి వైదిక కార్యక్రమాలపై వైదిక కమిటీ సభ్యులతో ఈవో రామారావు గురువారం సమావేశం నిర్వహించారు. -
ఇంద్రకీలాద్రి : దుర్గమ్మకు 2 లక్షల గాజులతో అలంకరణ మహోత్సవం (ఫొటోలు)
-
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రికార్డు స్థాయిలో కానుకలు, మొక్కుబడులను సమర్పిస్తున్నారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను మంగళవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 22 రోజులకు గాను రూ.2,92,28,842ల నగదు లభించింది. సరాసరిన రోజుకు రూ.13.28 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు చెప్పారు. 740 గ్రాముల బంగారం, 6.95 కిలోల వెండి, భారీగా ఇతర దేశాల కరెన్సీ లభించినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ–హుండీ ద్వారా రూ.89,193 విరాళాలు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు సమర్పించినట్లు చెప్పారు. -
దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆదివారం బంగారు బోనం సమర్పించింది. 11 రకాల బోనాలు, పట్టుచీర, పసుపు, కుంకుమ, పూజా సామగ్రి బంగారు బోనంతో పాటు అందజేసింది. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీన్మార్ డప్పులు, కోలాట నృత్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య ఇంద్రకీలాద్రికి చేరిన ఊరేగింపునకు దుర్గగుడి చైర్మన్ రాంబాబు, ఈవో భ్రమరాంబ, ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులకు బంగారు బోనం అందజేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న శాకంబరీదేవి ఉత్సవాలు ఆదివారం రెండో రోజూ వైభవంగా కొనసాగాయి. రికార్డు స్థాయిలో సుమారు 70 వేల పైచిలుకు భక్తులు అమ్మవారిని శాకంబరీదేవిగా దర్శించుకున్నారు. కాగా, దుర్గమ్మను శాకంబరీదేవి అలంకారంలో రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆదివారం దర్శించుకున్నారు. -
శాకంబరీదేవిగా కనకదుర్గమ్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. శాకంబరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరించారు. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులు, వ్యాపారులు, భక్తుల నుంచి సేకరించిన కూరగాయలతో అమ్మవారి ఆలయాన్ని ముస్తాబు చేశారు. తొలి రోజు రాత్రి 9.30గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. ఆలయ పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు, పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మ సేవలో హైకోర్టు న్యాయమూర్తులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.సుజాత, జస్టిస్ సుబ్బారెడ్డి, జస్టిస్ శ్రీనివాసరెడ్డి తదితరులు శనివారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో వేర్వేరుగా ఆలయానికి వచ్చిన న్యాయమూర్తులకు అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈఈ కె.వి.ఎస్.కోటేశ్వరరావు అమ్మవారి ప్రసాదం, శేషవ్రస్తాలతో సత్కరించారు. -
దుర్గమ్మకు రూ.7.50 లక్షల ఆభరణాల సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు రూ.7.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు సమర్పించారు. హైదరాబాద్ ఏఎస్రావు నగర్‌కు చెందిన డి.వెంకట సత్యవాణి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 104 గ్రాముల బంగారపు లక్ష్మీకాసుల హారం, 29 గ్రాముల బంగారపు పచ్చల నక్లెస్, 391 గ్రాముల వెండి పళ్లెం దేవస్థానానికి సమర్పించారు. వీటిని అమ్మవారి ఉత్సవాలలో ఉపయోగించాలని దాత కోరారు. కాగా, దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి చెన్నై ఇందిరానగర్‌కు చెందిన భోగరం వెంకట మార్కాండేయ శర్మ కుటుంబం రూ.5 లక్షల విరాళాన్ని ఆలయ ఈవో భ్రమరాంబకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవ్రస్తాలను అందచేశారు. -
దుర్గమ్మకు అగ్గిపెట్టెలో చీర సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు విజయ్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను సోమవారం సమర్పించారు. బంగారం, వెండి జరీతో చేసిన ఈ చీరకు ప్ర త్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఐదు గ్రాముల బంగారం, పది గ్రాముల వెండిని ఉపయోగించి మంచి పట్టు దారాలతో ఈ చీరను నేశామన్నారు. దీని బరువు సుమారు 100 గ్రాములు ఉంటుందని తెలిపారు. చేనేత వృత్తిని కాపాడాలని అమ్మవారిని వేడుకున్నానని వివరించారు. చదవండి: రామోజీ.. మీ ప్రేమ మాకు అక్కర్లేదు.. అప్పుడెక్కడ దాక్కున్నావు? -
లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదవ రోజైన శుక్రవారం లలితాత్రిపుర సుందరీ అలంకారంలో దుర్గమ్మ దర్శనమిచ్చారు. చక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా భక్తులను అనుగ్రహించారు. శుక్రవారం కావడంతో లక్ష మందికి పైగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి పైన ఆది దంపతుల నగరోత్సవం శుక్రవారం వైభవంగా సాగింది. కాగా, ఆశ్వయుజ శుద్ధ షష్ఠి ఆరో రోజైన శనివారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. రేపు మూలా నక్షత్రం.. ఆదివారం అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రం రోజున సరస్వతీ దేవి రూపంలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహించనున్నారు. ఆ రోజు ఆలయానికి 2 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో ఆ రోజు వీఐపీ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. మూలానక్షత్రం రోజు వృద్ధులు, వికలాంగులు దర్శనాలకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. కాగా, మూలా నక్షత్రం సందర్భంగా ఆదివారం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేయనున్నారు. -
అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో నాలుగో రోజైన గురువారం దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి అమ్మవారికి పట్టు వ్రస్తాలను సమర్పించారు. గురువారం సుమారు 70 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. అన్నపూర్ణాదేవి విశేష అలంకారం కావడంతో భక్తులు ప్రసాద స్వీకరణకు బారులు తీరారు. సాయంత్రం శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభు త్వ విఫ్ కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. నేడు శ్రీలలితా త్రిపుర సుందరిగా.. దసరా ఉత్సవాల్లో 5వ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. -
గోదావరి జలాలతో దుర్గమ్మ కాళ్లు కడుగుతాం
పాపన్నపేట(మెదక్): గోదావరి జలాలతో ఏడుపాయల దుర్గమ్మ కాళ్లు కడుగుతామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వన దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించి మెదక్ జిల్లా పాపన్నపేటలో ఏడుపాయల జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ మదిలో ఊపిరి పోసుకున్న అద్భుతమైన ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్టు అని నేడు అది శివుడి జడల నుంచి గంగమ్మ పొంగి పొర్లినట్లు, 618 మీటర్ల ఎత్తుకు నీటిని పంపిణీ చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్, కొండపోచమ్మల నుంచి సింగూరు ప్రాజెక్టుకు నీరు వస్తుందని, దీంతో మంజీర పాయల్లో గోదావరి జలాలు పరుగులు తీసి దుర్గమ్మ ఆలయాన్ని తాకుతూ ముందుకు పరుగులు పెడతాయన్నారు. మెతుకుసీమలో నీటి కరువు ఉండదని 10 జిల్లాలు లబ్ధి పొందుతాయన్నారు. రాష్ట్రంలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం రూ.1,500 కోట్లు కేటాయించారని అందులో నుంచి ఏడుపాయల, ఘనపురం ప్రాజెక్టు అభివృద్ధికి రూ.100 కోట్లు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారని తెలిపారు. ప్రతీ జాతరకు రూ. కోటి: తలసాని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ హేమలత, కలెక్టర్ హరీశ్ జాతర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతీ ఏడుపాయల జాతరకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేస్తుందన్నారు. ఏడుపాయల ఆదాయం కూడా పెరిగిందని, మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చొరవతో ఏడుపాయల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. -
ప్రవాసి దుర్గా మాతలు
పశ్చిమబెంగాల్: ఈ ఏడాది దసరా పండుగా సందర్భంగా దక్షిణ కోల్‌కతా బరిషా క్లబ్ వలసదారుల కష్టాలను ఇంతి వృత్తంగా తీసుకుని అమ్మ విభజన (భగెర్ మాత)పేరుతో దుర్గామాత విగ్రహన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలవడమే కాక ప్రతి ఒక్కర్ని ఆలోచింపజేసే విధంగా ఉంది. ఎడమవైపు బంగ్లాదేశ్‌ని కుడివైపు కుడి వైపు భారత సరిహద్దును సూచిస్తుంది. ఆమె ఏ మాతృభూమికి చెందనదిగా దీనంగా సరిహద్దులో దుర్గామాతను ఎత్తుకుని నలుగురు బిడ్డలతో కలిసి నిర్బంధ శిబిరాలలో శరణార్థ కుటుంబాలతో ఉన్నట్టుగా ఉంటుంది. (చదవండి: ఆ గాయని వస్తువులు మిలియన్ డాలర్లు!) ఈ విగ్రహం శరణార్థులకు ఎటువంటి పౌరసత్వం లేక భయం భయంగా కాలాన్ని వెళ్లదీస్తున్న ఘటనను వివరిస్తోంది. వలసలతో పిల్లలను తీసుకుని వచ్చే ప్రతి తల్లి ఒక దుర్గామాతతో సమానం. తన పిల్లల ప్రాణాల కోసం ఎంత దూరమైన వ్యయప్రయాసలు పడైన వలసవెళ్లే తల్లులు దుర్గామాత లాంటి దేవతేనని స్పష్టం చేసేలా ఉంది. వారి పట్ట మన వైఖరి ఎలా ఉండాలో అందరికీ అవగతమయ్యేలా ఆ విగ్రహన్ని ఆవిష్కరించారు. ఎండను వాననూ లెక్కచేయక ఆకలి చేతబట్టి పిల్లలతో వలసల వచ్చే ప్రతి తల్లి మూర్తిభవించిన దుర్గామాతతో సమానం. తన కుటుంబ రక్షణకై ప్రాణాలను అరచేత బట్టి వలస వచ్చే ప్రతితల్లిలోని అచంచలమైన ఆత్మివిశ్వాసానికి అందరూ తలవంచి నమస్కరించాల్సిందే అన్నట్లుగా ఆ విగ్రహన్ని రూపొందించారు. వారి పట్ల ప్రతి ఒక్కరి బాధ్యతలేమిటో గుర్తు చేసే విధంగా ఉంది (చదవండి: భారత స్పేస్ అసోసియేషన్‌ని ప్రారంభించనున్న మోదీ) -
నదిలో విహారం లేకుండానే తెప్పోత్సవం
సాక్షి, విజయవాడ: కృష్ణానదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో దుర్గమ్మ నది విహారానికి అధికారులు అనుమతి నిరాకరించారు. ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఈ ఏడాది తెప్పోత్సవానికి ఆటంకం ఏర్పడింది. ఫ్రంట్ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని కో ఆర్డినేషన్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఇతర అధికార యంత్రంగం కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలలో చివరి రోజు (ఆదివారం) ఆది దంపతులు కృష్ణానదిలో విహరించడం ఆనవాయితీ. అయితే ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటం, ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో తెప్పోత్సవం నిర్వహణపై జిల్లా కలెక్టర్‌తో దేవస్థాన అధికారులు చర్చించి, తెప్పోత్సవంపై తుది నిర్ణయం తీసుకున్నారు. కాగా ఉత్సవ మూర్తులను హంస వాహనంపై ఉంచి మూడుసార్లు వాహనాన్ని ముందుకు వెనక్కు తిప్పుతారు. దీంతో నదీ విహారం పూర్తయినట్లే.. గతంలో 2004లో ఇదే తరహాలో తెప్పోత్సవాన్ని నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా దుర్గగుడి ఇంజినీర్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘ప్రకాశం బ్యారేజీలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున స్వల్ప మార్పులతో తెప్పోత్సవం నిర్వహించాలని నిర్ణయం జరిగింది. నదిలో విహారం లేకుండా దుర్గా మళ్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహిస్తాం. తెప్పోత్సవం సందర్భంగా రేపు సాయంత్రం కృష్ణా నదిలో దుర్గా మళ్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు యథాతథంగా పూజలు జరుపుతాం. పరిమిత సంఖ్యలో అర్చకులతో నదిలో ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహిస్తాం. తెప్పోత్సవం జరుగుతున్నంత సేపు కొత్తగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‌పై వాహనాలు, భక్తులు రాకపోకలు ఆపేస్తాం.’ అని తెలిపారు. (చదవండి: ‘సీఎం జగన్ స్పందన అభినందనీయం’) సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సే ముఖ్యమని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కోవిడ్ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలని అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. నవంబర్, డిసెంబర్లో మరోసారి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందన్నారు. దసరా తర్వాత సెకెండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
ఏడు వారాల నగలతో దుర్గమ్మ దర్శనం
సాక్షి, విజయవాడ: ఈ నెల 12 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఏడు వారాల నగలతో దర్శనమివ్వనున్నారు. శనివారం దుర్గగుడి ఈవో ఎంవి.సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. సోమవారం-ముత్యాల అలంకారం, మంగళవారం-పగడాలు అలంకారం, బుధవారం-పచ్చల అలంకారం, గురువారం- కనక పుష్య రాగాల అలంకారం, శుక్రవారం-వజ్రాల అలంకారం, శనివారం-నీలాల అలంకారం, ఆదివారం- కెంపుల అలంకారంలో దర్శనమివ్వనున్నారని ఈవో వెల్లడించారు. అమ్మవారికి దేవస్థానంలో రెండు కిరీటాలు ఉన్నాయని.. వజ్ర కిరీటం చేయించాలనే యోచనలో ఉన్నామని తెలిపారు. దాతల నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ప్రసాదం పోటు, అన్నదానం, కేశ ఖండన శాల నిర్మాణాలకు ఈ నెలాఖరుకు ప్లాన్ పూర్తవుతుందన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి పూర్తి చేస్తామని తెలిపారు. కేశ ఖండనశాల వేలానికి ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా నిర్వహించామన్నారు. కేశ ఖండనశాల తలనీలాల కాంట్రాక్ట్‌ను రద్దు చేశామని.. మరలా టెండర్లను ఆహ్వానిస్తామని ఈవో సురేష్‌బాబు పేర్కొన్నారు. -
సర్వం శక్తిమయం
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః... యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః... చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనంగా విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటారనే సంగతి అందరికీ తెలిసినదే. లోక కంటకుడైన మహిషాసురుడిని దుర్గాదేవి వధించిన సందర్భంగా దసరా పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని కూడా తెలిసినదే. విజయదశమికి సంబంధించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. రాముడు రావణుడిని వధించినది ఆశ్వయుజ శుద్ధ దశమి రోజేనని కూడా పురాణగాథలు ఉన్నాయి. అందుకే విజయదశమి రోజున రావణాసురుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. పన్నెండేళ్ల అరణ్యవాసం తర్వాత విరాటరాజు కొలువులో పాండవులు ఏడాది అజ్ఞాతవాసం గడిపారు. అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలోనే ద్రౌపదిని వేధించిన కీచకుడిని భీముడు హతమారుస్తాడు. కీచకుడి మరణవార్త విన్న దుర్యోధనుడు పాండవులు విరాటరాజు వద్ద తలదాచుకుని ఉంటారని తలచి, విరాట రాజ్యంపై దండెత్తాడు. అప్పటికి అజ్ఞాతవాసం గడువు తీరిపోతుంది. కౌరవులు ఉత్తర గోగ్రహణానికి పాల్పడినప్పుడు ఉత్తరకుమారుడి సారథిగా బృహన్నల వేషంలో వెళ్లిన అర్జునుడు, కౌరవసేనను చూసి భీతిల్లిన ఉత్తరకుమారుడికి ధైర్యం చెప్పి, జమ్మిచెట్టుపై దాచి ఉంచి ఆయుధాలను బయటకు తీస్తాడు. జమ్మిచెట్టు మీద నుంచి విజయుడనే పేరు గల అర్జునుడు ఆయుధాలను తీసిన రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి కావడంతో, ఈ రోజుకు విజయ దశమిగా పేరు వచ్చిందనే గాథ కూడా ప్రాచుర్యంలో ఉంది. విజయదశమి రోజున భారతదేశంలోనే కాకుండా కొన్ని ఇతర దేశాల్లోనూ ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. దసరా రోజున దుర్గాదేవిని ప్రధానంగా ఆరాధిస్తారు. దుర్గా ఆలయాలతో పాటు అన్ని శక్తి ఆలయాల్లోనూ శక్తి స్వరూపాలుగా తలచే గ్రామదేవతల ఆలయాల్లోనూ దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలయ్యే ఈ వేడుకలు దశమి నాటితో పూర్తవుతాయి. సనాతన సంప్రదాయంలో శాక్తేయం ప్రత్యేక మతంగా ఉండేది. కొన్నిచోట్ల జంతుబలుల వంటి పద్ధతులపై ఆంక్షలు ఉన్నా, దసరా వేడుకలు చాలావరకు శాక్తేయ పద్ధతుల్లోనే నిర్వహిస్తారు. నవరాత్రులలో దుర్గాదేవిని నవరూపాలలో ఆరాధిస్తారు. దుర్గాదేవికి గల ఈ తొమ్మిది రూపాలనే నవదుర్గలని అంటారు. ఇదేకాకుండా, అమ్మవారిని దశమహావిద్య రూపాల్లోనూ ఆరాధిస్తారు. నవదుర్గలు నవదుర్గల పేర్లు వరుసగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని తొమ్మిదిరోజుల పాటు దుర్గా దేవిని ఈ రూపాలలో పూజిస్తారు. ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయినీతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతిచాష్టమం నవమం సిద్ధిదాప్రోక్తా నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా దుర్గాదేవికి గల ఈ తొమ్మిది నామాలను సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పినట్లు ప్రతీతి. మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లోని కొందరు నవదుర్గలను కులదైవంగా ఆరాధిస్తారు. చండీ సప్తశతిలో అమ్మవారికి మరో తొమ్మిది పేర్లు ప్రస్తావించి ఉన్నాయి. అవి: మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరి. అయితే, ఈ నామాలను నవదుర్గలుగా వ్యవహరించలేదు. నవదుర్గల ప్రాచీన ఆలయం మొదట గోవాలోని రేడి ప్రాంతంలో ఉండేది. ఈ ప్రాంతాన్ని పాలించిన పోర్చుగీసువారు ఆలయ వ్యవహారాల్లో దాష్టీకం చలాయించడంతో పదిహేడో శతాబ్దిలో ఆ ఆలయంలోని దేవీ దేవతా మూర్తులన్నింటినీ మహారాష్ట్రలోని వెంగుర్లకు తరలించి, శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. శాక్తేయం చరిత్ర వేదాలలో ఎక్కడా అమ్మవారి ప్రస్తావన ప్రత్యేకంగా లేదు. అయితే, సింధూలోయ నాగరికత కాలంలోనే ఆదిశక్తి ఆరాధన వాడుకలో ఉన్నట్లు పురావస్తు ఆధారాలు ఉన్నాయి. సింధూలోయ నాగరికతకు చెందిన ప్రజలు శివుడిని పశుపతిగా, లింగమూర్తిగా ఆరాధించేవారు. ఆదిశక్తిని జగజ్జననిగా, లోకమాతగా ఆరాధించేవారు. ఉపనిషత్తులలో ‘ఉమ’ పేరిట అమ్మవారి ప్రస్తావన కనిపిస్తుంది. మార్కండేయ పురాణంలో ఆదిశక్తిని ‘మహామాయ’గా ప్రస్తావించడం కనిపిస్తుంది. లలితా సహస్రనామం, చండీ సప్తశతి వంటి అమ్మవారి స్తోత్రాలు దాదాపు మహాభారత కాలం నాటివని చరిత్రకారుల అంచనా. లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణంలోనిది. క్రీస్తుశకం మూడో శతాబ్దం నాటికి భారత ఉపఖండంలో శాక్తేయ మతం బాగా వ్యాప్తిలో ఉండేది. త్రిపురా ఉపనిషత్తును శాక్తేయ సంప్రదాయంలోని తాంత్రిక విధి విధానాలకు మూలంగా భావిస్తారు. పదిహేడో శతాబ్దికి చెందిన పండితుడు భాస్కరరాయలు త్రిపురా ఉపనిషత్తుకు భాష్యాన్ని రాశాడు. దేవీభాగవతం, కాళికా పురాణం వంటి ఉపపురాణాల్లో అమ్మవారి గాథలు విపులంగా ఉంటాయి. దేవీభాగవతంలోని సప్తమ స్కందాన్ని ‘దేవీగీత’గా పరిగణిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తానేనని, సరస్వతి లక్ష్మి పార్వతులు తానేనని, సూర్యచంద్రులు, నక్షత్రాలు తానేనని... సమస్త చరాచర సృష్టి తానేనని అమ్మవారు స్వయంగా వెల్లడించినట్లుగా దేవీభాగవతం చెబుతోంది. దేవీ తత్వాన్ని శ్లాఘిస్తూ, ఆదిపరాశక్తిని స్తుతిస్తూ అద్వైత మత వ్యవస్థాపకుడు ఆదిశంకరాచార్యులు ‘సౌందర్య లహరి’ని రచించారు. ‘సౌందర్యలహరి’ని శ్రీవిద్యా రహస్యాలను బోధించే మంత్రంగా, తంత్రంగా, దేవీ సౌందర్యాన్ని కీర్తించే స్తోత్రంగా, అద్భుత ఛందోవిన్యాసంతో రచించిన కావ్యంగా పరిగణిస్తారు. క్రీస్తుశకం ఒకటో శతాబ్ది నాటికి కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఆదిశక్తిని ప్రధాన దైవంగా లలితా త్రిపురసుందరి రూపంలో ఆరాధించే ‘శ్రీకుల’ సంప్రదాయం ఉంది. శాక్తేయంలో ఇదొక ప్రధాన సంప్రదాయం. ఈ సంప్రదాయం పాటించేవారు శ్రీవిద్య ఆరాధన సాగిస్తుంటారు. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటికి శాక్తేయం దక్షిణాదికి కూడా విస్తరించింది. దక్షిణాదిలో కూడా ఎక్కువగా శ్రీకుల సంప్రదాయమే పాటిస్తారు. శాక్తేయంలో మరో ప్రధాన సంప్రదాయమైన ‘కాళీకుల’ సంప్రదాయం నేపాల్‌తో పాటు ఉత్తర భారత, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో వాడుకలో ఉంది. కాళీకుల సంప్రదాయానికి చెందిన వారు ఎక్కువగా కాళి, చండి, దుర్గ రూపాల్లో ఆదిశక్తిని ఆరాధిస్తారు. ఆదిశక్తి రూపాలైన దశమహావిద్యల ఆరాధన, సాధన కొనసాగిస్తుంటారు. దసరా నవరాత్రుల వంటి ప్రత్యేకమైన పర్వదినాలలో అమ్మవారికి తాంత్రిక పద్ధతుల్లో కోళ్లు, మేకలు, దున్నపోతులు వంటి జంతువులను బలి ఇస్తారు. నేపాల్, అస్సాం, పశ్చిమబెంగాల్, ఒడిశా వంటి ప్రాంతాల్లో నవరాత్రి వేడుకల్లో జంతుబలులు జరుగుతాయి. దశ మహావిద్యల ప్రశస్తి ఆదిశక్తికి గల పదిరూపాలను దశ మహావిద్యలుగా భావిస్తారు. శాక్తేయ సంప్రదాయం పాటించేవారు ఈ విద్యలను సాధన చేస్తారు. గురుముఖత మంత్రోపదేశం పొంది, నియమబద్ధంగా వీటిని సాధన చేయడం వల్ల ఇహపరాలలో సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతారు. దశ మహావిద్యలలో మొదటిది కాళి. ఏళ్ల తరబడి యోగసాధనలో సాధించలేని ఫలితాలను కాళీ సాధనతో శీఘ్రంగానే సాధించవచ్చని ప్రతీతి. కవి కాళిదాసు కాళీ సాధనతోనే గొప్ప విద్యావంతుడయ్యాడంటారు. రెండో విద్య తార. తారా ఉపాసకులలో వశిష్ట మహర్షి ప్రసిద్ధుడు. మూడవది ఛిన్నమస్త. హిరణ్యకశిపుడు వంటివారు ఛిన్నమస్త సాధన చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. నాలుగవది షోడశి. షోడశి ఆరాధన జ్ఞానసంపద, ఐశ్వర్య సంపద కలిగిస్తుందని ప్రతీతి. ఐదవది భువనేశ్వరి. భువనేశ్వరీ సాధన మానసిక స్థైర్యాన్ని, శాంతిని, ఐహిక ఆముష్మిక ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ఆరవది త్రిపుర భైరవి. ఈ విద్య సాధన ద్వారా ఇహపర సౌఖ్యాలను పొందవచ్చని అంటారు. ఏడవది ధూమావతి. ధూమావతి సాధనతో దారిద్య్రబాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఎనిమిదవది బగళాముఖి. శత్రుబాధ తొలగడానికి బగళాముఖిని ఆరాధిస్తారు. పరశురాముడు బగళాముఖి సాధన చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. తొమ్మిదవది మాతంగి. మాతంగి సాధనతో సమస్త మనోభీష్టాలూ నెరవేరుతాయని నమ్ముతారు. పదవది కమల. భృగు మహర్షి పూజించడం వల్ల ఈ దేవతను భార్గవి అని కూడా అంటారు. కమలా సాధన వల్ల సుఖశాంతులు లభిస్తాయని చెబుతారు. దశ మహావిద్యల ఆరాధన వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. కాళీ ఆరాధన వల్ల శని గ్రహదోషం నుంచి ఉపశమనం దొరుకుతుంది. గురుగ్రహ దోషం ఉన్నవారు తారా ఆరాధన చేయడం వల్ల ఫలితం పొందవచ్చు. షోడశి ఆరాధనతో బుధగ్రహ దోషాలు సమసిపోతాయి. చంద్రగ్రహ దోషం నుంచి ఉపశమనానికి భువనేశ్వరిని ఆరాధించాలి. రాహు దోష విమోచన కోసం ఛిన్నమస్తను, కేతు దోష పరిష్కారం కోసం ధూమావతిని ఆరాధించాలి. బగళాముఖి ఆరాధన వల్ల కుజదోషం నుంచి ఉపశమనం దొరుకుతుంది. జాతకంలో రవిగ్రహం బలహీనంగా ఉంటే మాతంగిని ఆరాధించాలి. శుక్రగ్రహ దోషాల నుంచి ఉపశమనానికి కమలను ఆరాధించాలి. ఇక జన్మలగ్నమే దోషభూయిష్టంగా ఉంటే భైరవిని ఆరాధించడం ద్వారా ఫలితం ఉంటుందని జ్యోతిశ్శాస్త్రం చెబుతోంది. గ్రహదోషాలకు ఇతరేతర ఉపశమన పద్ధతులు ఎన్ని ఉన్నా, వాటితో పోల్చుకుంటే దశ మహావిద్యల సాధన వల్ల శీఘ్ర ఫలితాలను పొందడం సాధ్యమవుతుందని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. ఇతర మతాలపై ప్రభావం దేవీ ఆరాధన ప్రధానమైన శాక్తేయం ఇతర మతాలను కూడా ప్రభావితం చేసింది. బౌద్ధ, జైన మతాలలో శాక్తేయ తాంత్రిక పద్ధతులు కనిపిస్తాయి. ముఖ్యంగా బౌద్ధంలోని వజ్రయాన శాఖకు చెందిన వారు తాంత్రిక పద్ధతుల్లో ఆరాధన చేసే సంప్రదాయం ఉంది. సనాతన మతాలైన శైవ, వైష్ణవాలపైన కూడా శాక్తేయం గణనీయమైన ప్రభావం చూపింది. శక్తి రూపాలైన మాతృకలను బౌద్ధులు పూజించేవారు. బౌద్ధ మాతృక కుడ్యశిల్పాలు ఎల్లోరా గుహలలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇవి క్రీస్తుశకం ఆరు–ఏడు శతాబ్దాల మధ్యకాలం నాటివని చరిత్రకారుల అంచనా. ఈ గుహలలోనే దుర్గాదేవి సహా ఇతర దేవతల శిల్పాలు కూడా కనిపిస్తాయి. జైనులు శక్తిరూపాలైన విద్యాదేవతలను, శాసనదేవతలను పూజించేవారు. ఇక సిక్కుల దశమగ్రంథంలో గురు గోవింద్‌సింగ్ చాలా శాక్తేయ దేవతలను ప్రస్తావించారు. వీటిలో చండీ ప్రస్తావన ప్రధానంగా కనిపిస్తుంది. – పన్యాల జగన్నాథదాసు దశ మహావిద్యల ఆలయాలు దశ మహావిద్యలకు దేశంలో ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రసిద్ధ ఆలయాల గురించి తెలుసుకుందాం...కోల్‌కతాలోని కాళీ ఆలయాలు ప్రసిద్ధమైనవి. వీటిలో ఒకటి కాళీఘాట్ ఆలయం, మరొకటి దక్షిణకాళి ఆలయం. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయానికి చేరువలోనే కాళీ ఆలయం కూడా ఉంది. భువనేశ్వర్‌లో రక్షకాళీ ఆలయం, కటక్‌లో మహానది ఒడ్డున కాళీ ఆలయం, వరంగల్‌లోని భద్రకాళి ఆలయం ప్రసిద్ధి పొందినవే. పశ్చిమబెంగాల్లో బీర్భూమ్ జిల్లాలోని తారాపీuŠ‡ పట్టణంలో తారాదేవి ఆలయం ఉంది. హిమాచల్ రాజధాని సిమ్లాలోను, అదే రాష్ట్రంలోని నాలాగఢ్‌లోను, భవన్లోను, బహిదా బాఘ్‌లోను కూడా తారా ఆలయాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో అల్మోరా జిల్లా ఉడాల్‌కోట్‌లోను, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోనూ తారాదేవికి ఆలయాలు ఉన్నాయి.బెంగళూరులోని కెంపపుర ప్రాంతంలోను, చెన్నైలోని భారతీదాసన్ కాలనీలోను భువనేశ్వరి ఆలయాలు ఉన్నాయి. లక్నోలోని అదిల్‌నగర్ ప్రాంతంలోను, విశాఖపట్నం జిల్లా యాతపాలెం గ్రామంలోనూ భువనేశ్వరి ఆలయాలు ఉన్నాయి.మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోను, ఉజ్జయినిలో కాలభైరవ ఆలయానికి చేరువలో ఛత్తీస్‌గఢ్‌లోని రాజనంద్‌గాంవ్‌లో కూడా పాతాళభైరవి ఆలయాలు ఉన్నాయి. ఒడిశాలోని బౌ«ద్ పట్టణంలో భైరవి ఆలయం ఉంది. తమిళనాడులోని సేలం పట్టణంలో లింగభైరవి ఆలయం ఉంది. అస్సాంలో గువాహటిలోని సుప్రసిద్ధ శక్తిపీఠం కామాఖ్య ఆలయానికి చేరువలోనే ఛిన్నమస్త ఆలయం ఉంది.పశ్చిమబెంగాల్లోని బిష్ణుపూర్, బంకురా పట్టణాలతో పాటు జార్ఖండ్‌లోని రాజ్రప్పలో ఛిన్నమస్తాదేవి ఆలయాలు ఉన్నాయి. కర్ణాటకలోని మంగళూరులోను, ఉడిపిలోనూ ధూమావతి ఆలయాలు ఉన్నాయి. కేరళలోని కాసర్గోడ్ జిల్లా పాలడుక్క గ్రామంలో కూడా ధూమావతి ఆలయం ఉంది.తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా పాప్పకుళంలో బగళాముఖి ఆలయం ఉంది. మధ్యప్రదేశ్‌లోని షాజపూర్ జిల్లా నల్ఖేడా గ్రామంలోను, హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా సమేలి గ్రామంలోను, ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిద్వార్‌లోను, ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లోను, పంజాబ్‌లోని లూధియానాలోను, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లోనూ బగళాముఖి ఆలయాలు ఉన్నాయి.కర్ణాటకలోని బెల్గాంలోను, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలోను, తమిళనాడులోని నాగపట్టణం జిల్లా నాంగూరులోను, మధ్యప్రదేశ్‌లోని ఝబువా పట్టణంలోను మాతంగీదేవి ఆలయాలు ఉన్నాయి.కర్ణాటకలోని బెల్గాం జిల్లా చిక్కలదిన్ని గ్రామంలోను, మహారాష్ట్రలోని థానే జిల్లా దండిపడా గ్రామంలోను, తమిళనాడులోని తిరువారూరులో త్యాగరాజ ఆలయానికి చేరువలోను కమలాదేవి ఆలయాలు ఉన్నాయి. -
దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు
విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అధికారులు పట్టువస్త్రాలను సమర్పించారు. టీటీడీ బృందం గురువారం ఉదయం దుర్గగుడికి చేరుకోగా అధికారులు స్వాగతం పలికారు. టీటీడీ జేఇఓలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, డాలర్ శేషాద్రి తదితరులు అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ దుర్గా నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రతిఏటా టీటీడీ నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ గా వస్తోందని, దానిలో భాగంగా వస్త్రాలను అందచేశామని అన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో న్యాయమూర్తులు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను శనివారం పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి, అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ వైస్ చైర్మన్ వై.రామకృష్ణ, రైల్వేకోర్టు న్యాయమూర్తి రామచంద్రరావు అమ్మను దర్శించుకున్న వారిలో ఉన్నారు. తొలుత వీరికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలు ఇచ్చారు. -
నేత్రపర్వంగా ఊంజల సేవ
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రిపై ఆది దంపతులకు ఊంజల సేవ నేత్రపర్వంగా సాగింది. తిరుమలలో శ్రీనివాసునికి నిత్యం జరిగే దీపోత్సవ సేవ తరహాలో ఇంద్రకీలాద్రిపై ఆది దంపతులకు ఊంజల సేవను దుర్గగుడి అధికారులు ప్రారంభించారు. కార్తీక మాసాన్ని పురష్కరించుకుని ఈ సేవను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. గణపతి పూజ , పంచహారతుల అనంతరం శ్రీ గంగా పార్వతి సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్లను రాజగోపురం వద్దకు పల్లకిపై ఊరేగింపుగా తీసుకువచ్చారు. రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన దీపోత్సవ స్టాండ్‌లోని ఊయ్యాలలో ఆది దంపతుల ఉత్సవ మూర్తులను ఉంచి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై తొలిసారిగా నిర్వహించిన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, ఆలయ అధికారులతో పాటు పెద్ద ఎత్తున భక్తజనులు పాల్గొన్నారు. తొలుత అమ్మవారి ప్రధాన ఆలయంతోపాటు మల్లేశ్వరాలయం, నటరాజ స్వామి వారి ఆలయం వద్ద ఆకాశ దీపాలను ఏర్పాటుచేశారు. తుమ్మగూడెం శ్రీ శ్రీనివాస భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు, భక్తి గేయాలు ఆకట్టుకున్నాయి. కార్తీక మాసం నెల రోజులు అమ్మవారికి కళా సేవ చేసేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసినట్లు కళాకారులు పేర్కొన్నారు. మల్లేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మల్లేశ్వరాలయంలో స్వామి వారికి లక్ష బిల్వార్చన, సహాస్ర లింగార్చన చేశారు. శివ పంచాక్షరీ జపం, లక్ష్మీ గణపతి మంత్రజపం, రుద్రహోమం నిర్వహించారు. -
మహాలక్ష్మీ మనసాస్మరామి
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దీపావళిని పురస్కరించుకుని ఆదివారం దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కాసుల పేరు, కంఠాభరణాలు, నెక్లెస్‌లు, హారాలు, గజ తోరణాలు.. ఇలా ఒకటేమిటి అనేక బంగారు నగలను అమ్మవారికి అలంకరించారు. ఆ ముగ్ధమనోహర రూపాన్ని దర్శించుకున్న భక్తులు తన్మయత్వానికి గురయ్యారు. తెల్లవారుజామున ప్రత్యేక అలంకరణ అనంతరం నిత్య పూజలు జరిగాయి. నాలుగు గంటలకు ఖడ్గమాల పూజ నిర్వహించగా, ఈవో సూర్యకుమారి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మహానివేదన అనంతరం రద్దీ మరింత పెరిగింది. శ్రీచక్రనవార్చన, చండీయాగంలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. సాయంత్రం పంచహారతులు, పల్లకీ సేవ అనంతరం అమ్మవారి ఆలయం చుట్టూ దీపాలు వెలిగించి దీపావళి వేడుకలు నిర్వహించారు. కొనసాగిన గాజుల పంపిణీ అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు పంపిణీ చేశారు. ఉచిత, రూ.300 టికెట్ క్యూలైన్లో దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ సిబ్బంది గాజులు అందజేశారు. దీపావళి రోజున మహాలక్ష్మిగా అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా గాజులను అందుకోవడం సంతోషంగా ఉందని పలువురు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. -
రూ.500 టికెట్ల విక్రయం నిలిపివేత
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాల సందర్భంగా దేవస్థానం విక్రయిస్తున్న రూ.500 వీఐపీ టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. ఆదివారం ఉదయం నుంచి ఈ టికెట్ల విక్రయాలను నిలిపివేయాలని ఆలయ అధికారులు ఆదేశించినట్లు కౌంటర్లలో సిబ్బంది చెబుతున్నారు. శనివారం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు పలువురు భక్తులు టికెట్ల ధరలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. టికెట్ల ధరలు పెంచడాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పాటు పలు ఆధ్యాత్మిక సంస్థలు వ్యతిరేకించాయి. ఈ విషయం కూడా సీఎం దష్టిలో ఉండటంతో రూ.500 టికెట్ల విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. -
ఇంద్రకీలాద్రీపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మను దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులలో భవాని దీక్షపరులు అధికంగా ఉన్నారు. మండలం పాటు భవాని మాల ధరించి దీక్ష చేపట్టిన భవానీలు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దీక్షలను విరమిస్తున్నారు. నిన్న ఒక్క రోజే దుర్గమ్మను 2.10 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
త్రిశూలధరణిగా అమ్మవారి దర్శనం
-
అమ్మవు నీవే... అఖిల జగాలకు!
దుష్టశిక్షణకు శిష్టరక్షణకు ప్రతీక దసరా. స్త్రీశక్తి విజయానికి నిలువెత్తు నిదర్శనం దసరా. దేశవ్యాప్తంగా ఊరూవాడా ఏకమై ఉమ్మడిగా జరుపుకొనే వేడుక దసరా. ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగజ్జననిని జనమంతా భక్తితో ఆరాధించే పండుగ దసరా. దుర్గతులను దూరం చేసే దుర్గమ్మను నవరాత్రులలో పూజించే వేడుక దసరా. మన దేశంలో నలుమూలలా దసరా వేడుకలు ఘనంగా జరుగుతాయి. కోల్‌కతా, మైసూరు వంటి నగరాలలో దసరా నవరాత్రి వేడుకలు అమిత వైభవంగా జరుగుతాయి. దేశంలోని చాలా నగరాలు, పట్టణాల్లో తాత్కాలికంగా వెలిసే దుర్గామాత మంటపాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతాయి. శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు ప్రత్యేకపూజలతో కళకళలాడుతూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. దసరా వేడుకలు భారత్‌కు మాత్రమే కాదు, పొరుగునే ఉన్న నేపాల్, శ్రీలంకలలో కూడా దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. తొలిసారిగా చైనా సందడి కోల్‌కతా దసరా వేడుకలపై ఈసారి చైనా ఆసక్తి ప్రదర్శిస్తోంది. కోల్‌కతాలోని చైనా కాన్సులేట్ అధికారులు, సిబ్బంది ‘ఇంపాక్ట్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలసి ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. చైనా ప్రతినిధులు అధికారికంగా దసరా వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కానుంది. ‘ఇంపాక్ట్’ ప్రతినిధులతో కలసి చైనా కాన్సులేట్ అధికారులు కోల్‌కతా నగరంలో వెలసిన దుర్గామాత మంటపాలను నవరాత్రులలో పంచమి నాటి నుంచి... అంటే అక్టోబర్ 6 నుంచి సందర్శించనున్నారు. భద్రత, అలంకరణ వంటి వివిధ అంశాల్లో మేటిగా నిలిచిన పది ఉత్తమ మంటపాల ఫలితాలను దసరా ముందు రోజు ప్రకటించనున్నారు. ఉత్తమ మంటపాల నిర్వాహకులకు ఎలాంటి నగదు బహుమతులు చెల్లించరు గాని, వారికి ఉచితంగా చైనాను సందర్శించే అవకాశం కల్పించనున్నట్లు కోల్‌కతాలోని చైనా కాన్సుల్ జనరల్ మా ఝాన్వు ప్రకటించారు. మైసూరులో మహారాజ వైభోగంగా... మైసూరులో దసరా వేడుకలు మహారాజ వైభోగంగా జరుగుతాయి. ఏనుగుల ఊరేగింపు, ఊరేగింపులో జానపద కళాకారుల ప్రదర్శనల సందడిని చూసి తీరాల్సిందే. మైసూరులో దసరా నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించే సంప్రదాయం పదిహేనో శతాబ్దిలో విజయనగర రాజుల కాలం నుంచే మొదలైంది. విజయనగర సామ్రాజ్యం పతనమయ్యాక వడయార్ రాజ వంశీకులు దసరా వేడుకలకు పునర్వైభవం తీసుకొచ్చారు. వడయార్ రాజులు పదిహేడో శతాబ్ది తొలినాళ్లలో ఈ వేడుకలను శ్రీరంగపట్నంలో నిర్వహించేవారు. మూడవ కృష్ణరాజ వడయార్ హయాంలో 1805 సంవత్సరం నుంచి మైసూరులో దసరా వేడుకల నిర్వహణ ప్రారంభమైంది. నవరాత్రుల సందర్భంగా చాముండీ హిల్స్ ప్రాంతంలోని మైసూరు ప్యాలెస్‌లో వడయార్ రాజులు దర్బార్ నిర్వహించే ఆనవాయితీ కూడా అప్పటి నుంచే మొదలైంది. ఆ ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది. నవరాత్రులలో మైసూరు ప్యాలెస్ విద్యుద్దీపకాంతులతో ధగధగలాడుతూ దేదీప్యమానంగా మెరిసిపోతుంది. నవరాత్రుల సందర్భంగా వడయార్ రాజవంశీకుల ఆరాధ్య దైవమైన చాముండేశ్వరీ దేవిని 750 కిలోల బంగారంతో నిర్మించిన స్వర్ణమంటపంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దసరా రోజున మైసూరు ప్యాలెస్ నుంచి ఏనుగులతో సకల రాజ లాంఛనాలతో జరిగే దసరా ఊరేగింపులో లక్షలాది మంది జనం ఉత్సాహంగా పాల్గొంటారు. ఊరేగింపును తిలకించడానికి దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో జనం తరలి వస్తారు. ఈ ఊరేగింపు మైసూరు వీధుల గుండా సాగి, పరేడ్ గ్రౌండ్స్ సమీపంలోని జమ్మిచెట్టు వద్ద ఏర్పాటు చేసే ‘బన్నిమంటపం’ వరకు సాగుతుంది. జమ్మిని కన్నడంలో ‘బన్ని’ అంటారు అందుకే ఈ మంటపాన్ని ‘బన్నిమంటపం’ అంటారు. ఏనుగులతో భారీ స్థాయిలో సాగే ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని అప్పట్లో బ్రిటిషర్లు ‘జంబో సవారీ’అనేవారు. ఇప్పటికీ ఆ పేరే వాడుకలో ఉంది. పదవ చామరాజ వడయార్ హయాంలో 1880 నుంచి నవరాత్రుల సందర్భంగా దసరా ప్రదర్శన ఏర్పాటు చేసే ఆనవాయితీ మొదలైంది. ప్రస్తుతం దసరా వేడుకలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాజవంశీకులు నిర్వహిస్తూ వస్తున్నా, 1981 నుంచి ప్రదర్శన బాధ్యతలను మాత్రం కర్ణాటక ఎగ్జిబిషన్ అథారిటీ నిర్వహిస్తూ వస్తోంది. దసరా నవరాత్రి వేడుకల్లో మైసూరులోని ఆడిటోరియమ్స్ అన్నీ సంగీత కచేరీలు, నృత్యప్రదర్శనలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఇక నవరాత్రుల సందర్భంగా జరిగే కుస్తీపోటీలు మైసూరు వేడుకలకే ప్రత్యేక ఆకర్షణ. మైసూరుతో పాటు కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరి, గోకర్ణలోని భద్రకర్ణిక, బప్పనాడులో దుర్గాపరమేశ్వరి, కడియాలిలోని మహిష మర్దిని వంటి శక్తి ఆలయాల్లోనూ దసరా వేడుకలు సంప్రదాయబద్ధంగా, అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. శివమొగ్గలోనైతే దసరా వేడుకలు దాదాపు మైసూరు వేడుకలనే తలపిస్తాయి. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ చలనచిత్రోత్సవాలను కూడా నిర్వహించడం విశేషం. నలుదిశలా నవరాత్రులు దసరా వేడుకలు అనగానే చప్పున స్ఫురించే పేర్లు కోల్‌కతా, మైసూరే అయినా మన దేశంలో నలుదిశలా దసరా నవరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతాయి. ముఖ్యంగా శక్తి ఆరాధన ఎక్కువగా ఉండే తూర్పు, ఉత్తర భారత ప్రాంతాల్లో దసరా నవరాత్రి వేడుకలు అత్యంత సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల గురించి చెప్పుకోవాలంటే విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారికి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. దసరా రోజున కృష్ణానదిలో అమ్మవారికి తెప్పోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. శ్రీశైలంలోని భ్రమరాంబికా దేవికి, ఆలంపురంలోని జోగులాంబా దేవికి కూడా ఘనంగా నవరాత్రి వేడుకలను నిర్వహిస్తారు. తెలంగాణలో జరిగే నవరాత్రి వేడుకలకు బతుకమ్మ సంబరాలు మరింత వన్నె తెస్తాయి. రకరకాల పూలతో బతుకమ్మలను అలంకరించి, కొలువుదీర్చి మహిళలంతా పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. తెలంగాణలో వయసులో చిన్నవారు పెద్దల చేతికి జమ్మి ఆకులను ఇచ్చి, వారి ఆశీస్సులు అందుకుంటారు. ఒడిశాలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా దసరా వేడుకల కోలాహలం కనిపిస్తుంది. నగరాల్లోను, పట్టణాల్లోను అడుగడుగునా దేవీ మంటపాలు దర్శనమిస్తాయి. కటక్‌లో చండీ, జాజ్పూర్లో బిరజా, పూరీలో బిమలా, గంజాం జిల్లాలోని తరాతరిణి తదితర శక్తి ఆలయాల్లో నవరాత్రి వేడుకలు నేత్రపర్వంగా జరుగుతాయి. తమిళనాడు, కేరళలలో దసరా నవరాత్రులలోని తొమ్మిదోరోజు సరస్వతీ పూజ చేస్తారు. విజయ దశమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చదువుల్లో రాణిస్తారనే నమ్మకం ఆ రాష్ట్రాల్లో ఉంది. కొట్టాయంలోని సరస్వతీ ఆలయంలో విజయదశమి నాడు వేలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్‌కు చేరువలో ఉండే జార్ఖండ్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లో కూడా దసరా వేడుకలు దాదాపు ఇదే తీరులో జరుగుతాయి. అసోంలోని కామాక్షీ శక్తిపీఠంలో జరిగే నవరాత్రి వేడుకల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొంటారు. నవరాత్రుల సందర్భంగా మహారాష్ట్రలో తునికాకు చెట్లను పూజిస్తారు. తెలంగాణలో పెద్దలకు జమ్మి ఆకులిచ్చి ఆశీస్సులు పొందే ఆచారం ఉన్నట్లే, మహారాష్ట్రలో పెద్దలకు తునికాకులు ఇచ్చి, ఆశీస్సులు పొందే ఆచారం ఉంది. ఉత్తరాదిలో రైతుల పండుగ దసరా నవరాత్రులను ఉత్తరాదిలో వ్యవసాయదారుల పండుగగా జరుపుకొంటారు. నవరాత్రుల తొలిరోజున స్థానికంగా పండే గోధుమలు, బార్లీ వంటి ధాన్యాల విత్తులను మట్టికుండీలో నాటుతారు. దసరా నాటికి విత్తనాలు మొలకలెత్తుతాయి. మొలకలతో ఉన్న కుండీలను దసరా రోజున నదుల్లో లేదా చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బీహార్ ప్రాంతాల్లో చాలామంది ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఉత్తరాఖండ్‌లోని కుమావ్ ప్రాంతంలో రంగస్థల సంప్రదాయాల ప్రకారం ‘రామ్‌లీలా’ వేడుకను ప్రదర్శిస్తారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు ప్రాంతంలో దసరా వేడుకలు కొంత విలక్షణంగా జరుగుతాయి. మిగిలిన ప్రాంతాల్లో విజయదశమి నాటితో నవరాత్రి వేడుకలకు ముగింపు పలికితే, కులు ప్రాంతంలో మాత్రం విజయదశమి నాటి నుంచే ఈ వేడుకలు మొదలై వారం రోజుల పాటు జరుగుతాయి. రావణుడిని రాముడు విజయదశమి రోజున సంహరించడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో విజయదశమి రోజున రావణ దహనాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు. ఊరూరా కూడళ్లలో భారీ పరిమాణంలో తయారు చేసే రావణ, కుంభకర్ణ, మేఘనాదుల దిష్టిబొమ్మలను తగులబెడతారు. బీహార్‌లోని మైథిలీ ప్రజలు నవదుర్గా పూజలు నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో మహాలయ అమావాస్యకు ముందు నుంచే పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఊరూరా దుర్గాదేవి మంటపాలతో పాటు రకరకాల ప్రదర్శనలు ఏర్పాటవుతాయి. గుజరాత్లో దసరా నవరాత్రి వేడుకల్లో దాండియా, గార్భా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో జరిగే దసరా నవరాత్రి వేడుకల్లో భిన్నసంస్కృతులు ప్రతిఫలిస్తాయి. వివిధ రాష్ట్రాల్లో దసరా వేడుకల నిర్వహణలో కొంత వైవిధ్యం ఉన్నప్పటికీ, ప్రతిచోటా ఈ సందర్భంగా ఆయుధపూజలు నిర్వహిస్తారు. ఇళ్లలో, కార్యాలయాల్లో, కర్మాగారాల్లో వాడుకునే పనిముట్లను, యంత్రాలను, వాహనాలను పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు చేస్తారు. విదేశాల్లో విజయదశమి భారత్‌లోనే కాకుండా చాలా ఇతర దేశాల్లోనూ దసరా నవరాత్రి వేడుకలు జరుగుతాయి. పొరుగునే ఉన్న నేపాల్‌లోని శక్తి క్షేత్రాల్లో అత్యంత సంప్రదాయబద్ధంగా దసరా వేడుకలను నిర్వహిస్తారు. దసరాను నేపాలీలు ‘దసైన్’గా పిలుచుకుంటారు. ఇండోనేసియాలో స్థిరపడ్డ భారతీయులు జకార్తా, టాంగెరాంగ్లలో నిర్మించిన దుర్గాదేవి ఆలయాల్లో నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మలేసియా, సింగపూర్లలో బెంగాలీ సంఘాలు ఈ సందర్భంగా దుర్గాదేవి పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయంతో పాటు పలుచోట్ల నవరాత్రి వేడుకలు జరుగుతాయి. ఈ సందర్భంగా పద్మానదిలో పడవ పందేలను కూడా నిర్వహిస్తారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ బెంగాలీలు, అస్సామీలు దాదాపు యాభయ్యేళ్లుగా అక్కడ దసరా నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అమెరికాలోని యాభై రాష్ట్రాల్లోనూ అక్కడ స్థిరపడ్డ భారతీయులు ఈ వేడుకలను ఉత్సాహంగా జరుపుకొంటారు. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ అక్కడ స్థిరపడ్డ భారతీయులు కొన్ని దశాబ్దాలుగా దసరా నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. చైనాలోని భారతీయులు 2004 నుంచి షాంఘై నగరంలో ఈ వేడుకలను నిర్వహించడం ప్రారంభించారు. శరన్నవరాత్రుల పుట్టుపూర్వోత్తరాలు దసరా నవరాత్రులను శరదృతువు ప్రారంభంలో వచ్చే ఆశ్వియుజమాసంలో జరుపుకోవడం వల్ల వీటిని శరన్నవరాత్రులని కూడా అంటారు. నిజానికి దుర్గాదేవిని చైత్రమాసం ప్రారంభంలో వచ్చే వసంత నవరాత్రుల్లో ఆరాధించడమే సరైన పద్ధతి అని, ఆశ్వియుజంలో ఈ దుర్గాదేవిని పూజించడమంటే, అకాలంలో అమ్మవారిని మేల్కొల్పడమేనని బెంగాలీల్లో కొందరు నమ్ముతారు. దీనినే వారు ‘అకాల్ బోధొన్’ అంటారు. రామాయణ కాలానికి ముందు వసంత నవరాత్రులలోనే అమ్మవారిని ఆరాధించేవారట. రావణుడితో యుద్ధం జరిగినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీరాముడు ఆశ్వియుజ మాసంలో చండీహోమాన్ని నిర్వహించి, దుర్గాదేవి అనుగ్రహాన్ని పొంది రావణుడిని సంహరించాడని ప్రతీతి. అప్పటి నుంచే శరన్నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించడం మొదలైందని చెబుతారు. ఇక చరిత్రను పరిశీలిస్తే, దుర్గాదేవి ఆరాధన మధ్యయుగాల నాటికే దేశం నలుమూలలా జరుపుకొనేవారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని పరశురామేశ్వర ఆలయంలో లభించిన క్రీస్తుశకం ఆరోశతాబ్ది నాటి శిల్పం ద్వారా అప్పట్లోనే దుర్గాదేవి నవరాత్రులు వైభవోపేతంగా జరిగేవని తెలుస్తోంది. అప్పట్లో పలు శివాలయాల్లో దేవీ నవరాత్రులు జరిగేవి. తొలినాళ్లలో ఈ వేడుకలు ఆలయాలకు, రాజప్రాసాదాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. కాలక్రమంలో సామాన్యులు సామూహికంగా ఊరూరా దసరా నవరాత్రులను జరుపుకోవడం మొదలైంది. కవర్‌స్టోరీ: పన్యాల జగన్నాథదాసు -
'డిసెంబర్లో అంతర్జాతీయ సంగీత కార్యక్రమం'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇక నుంచి ప్రతి నెలా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని సీఎం దంపతులు శనివారం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి కావాలని అమ్మ వారిని కోరుకున్నానన్నారు. డిసెంబర్లో అంతర్జాతీయ సంగీత కార్యక్రమం నిర్వహిస్తామని బాబు తెలిపారు. -
రైల్వేస్టేషన్లో దుర్గమ్మ ప్రసాదం రెడీ
విజయవాడ (రైల్వేస్టేçÙన్) : దుర్గగుడి అధికారులు రైల్వేస్టేçÙన్లో ఏర్పాటు చేసిన కౌంటర్లో ప్రసాదాలను బుధవారం నుంచి విక్రయిస్తున్నారు. ఈ కౌంటర్లో ఆదివారం నుంచి ప్రసాదం అందుబాటులో లేదు. ఈ విషయాన్ని బుధవారం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై దుర్గగుడి అధికారులు స్పందించారు. రైల్వేస్టేçÙన్లోని కౌంటర్‌కు ప్రసాదాలను పంపారు. ఈ మేరకు మధ్యాహ్నం నుంచి భక్తులకు ప్రసాదం విక్రయిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు 24 గంటలు ప్రసాదం విక్రయిస్తామని సిబ్బంది తెలిపారు. -
బతుకమ్మ ఆడి..దుర్గమ్మను కొలిచి
-
నాలుగో రోజు అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి
ఈ రోజు అమ్మవారిని కాశీపురాధీశ్వరి అయిన అన్నపూర్ణాదేవిగా గోధుమరంగు చీరతో అలంకరిస్తారు. సకల దానాలలో ఉత్కృష్టమైనది అన్నదానం. లోకాలకు క్షుధార్తి తీర్చేది అమ్మ స్వరూపం. ఎందరున్నా అమ్మకాదు, ఎన్ని తిన్నా అన్నం కాదు. ఎడమ చేతిలో రసాన్న పాత్ర ధరించి ఆదిభిక్షువుగా యాచించ వచ్చిన లయకారుడ యిన విశ్వేశ్వరుడికి కుడిచేతితో అన్నప్రదానం చేస్తూ దయతో మనపై కరుణామృతాన్ని కురిపిస్తూ తనకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ అమ్మ అన్నపూర్ణగా దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శిస్తే కాశీవాస పుణ్యం లభిస్తుందని ఆర్యోక్తి. శ్లోకం: అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధర్థం భిక్షాం దేహిచ పార్వతి భావం: ఓ అన్నపూర్ణాదేవీ, సాక్షాత్తూ శంకరుని ప్రాణేశ్వరివైన నీవు మాకు జ్ఞానాన్ని, వైరాగ్యాన్నీ భిక్షగా ప్రసాదించు తల్లీ! నివేదన: అప్పాలు, షడ్రసోపేత మహానైవేద్యం (ఓపిక లేనివారు స్నానం చేసి శుచిగా వండిన అన్నం, పప్పు, కూరలను కూడా నివేదించవచ్చు) ఫలమ్: పాడిపంటలు, ధనధాన్యాభివృద్ధి, నూతన గృహ యోగం కలుగుతాయి. ఉపాసకులకు జ్ఞానం, వైరాగ్యం ప్రాప్తిస్తాయి. -దేశపతి అనంత శర్మ -
అటుపావనఝరి .. ఇటు సాంస్కృతిక సిరి
1934 నుంచి అవిచ్ఛిన్నంగా దేవీచౌక్‌లో నవరాత్ర వేడుకలు 83వ వసంతంలోకి అడుగుపెట్టిన సంబరాలు నాటి మూడులాంతర్ల సెంటరే నేటి దేవీచౌక్ రూ.200 ఖర్చుతో మెుదలు.. నేడు రూ.లక్షలతో నిర్వహణ చారిత్రక నగరి రాజమహేంద్రవరానికి దైవమిచ్చిన ద్రవరూపవరంలా ప్రవహించే జీవనది గోదావరి జలతరంగిణి అయితే.. దానికి కూతవేటు దూరంలోని ఓ కూడలి పావన శరన్నవరాత్ర మహోత్సవాల సందర్భంగా ‘జనతరంగిణి’గా తుళ్లిపడుతుంది. అదే దేవీచౌక్. దేశంలో దసరా ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు తరువాత అంతటి ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి తెలుగువారి సాంస్కృతిక రాజధాని నడిబొడ్డున ఇక్కడ జరిగే బాలా త్రిపురసుందరి అమ్మవారి నవరాత్ర వేడుకలు. ఎనిమిది దశాబ్దాలకు పైగా నగర సాంస్కృతిక, ఆధ్యాత్మిక చరిత్రలో అంతర్భాగమైన దేవీచౌక్ ఉత్సవాలలో– ఒక్కప్రదర్శనలో పాల్గొన్నా, జన్మ ధన్యమైనట్టు కళాకారులు భావించేవారు, నేటికీ భావిస్తున్నారు. అంతరించిపోతున్న పౌరాణిక నాటకాలకు ఊపిరులూదుతున్న ఈ ఉత్సవాలలో భక్తి, కళలు, రక్తి, ముక్తి పెనవేసుకుపోయి నగర కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేస్తున్నాయి. పున్నమినాటి పండు వెన్నెల్లో గోదావరి అలల మిలమిలలను చూస్తే వచ్చే సంతోషంతో.. నవరాత్ర వేడుకల్లో రాత్రి వేళల్లో దేవీచౌక్ సంరంభాన్ని తిలకిస్తే కలిగే ఆనందం పోటీ పడుతుందంటే అతిశయోక్తి కాదు. రాజమహేంద్రవరం కల్చరల్ : నగరంలోని ముఖ్య కూడళ్లలో ఒకటైన దేవీచౌక్‌ను 1962 వరకూ మూడు లాంతర్ల సెంటరుగా వ్యవహరించే వారు. మునిసిపాలిటీ ఇక్కడ మూడు లాంతర్లతో దీపాలు బిగించడంతోనే ఆ పేరు వచ్చింది. 1940 నుంచి1974 మధ్యకాలం దేవీచౌక్ ఉత్సవాలకు స్వర్ణయుగమని భావించవచ్చు. నాటక, సినీరంగాలకు చెందిన ప్రముఖ కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వడానికి ఆసక్తి చూపేవారు. మొదట్లో హరికథలు, బుర్రకథలు, భజనలు ప్రదర్శించగా తరువాత సురభి కళాకారుల పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు ప్రదర్శించేవారు. దిగ్గజ కళాకారులకు వేదికగా.. దేవీచౌక్ ఉత్సవాలలోఒక్కఛాన్స్ వస్తే చాలనుకునే కళాకారులు నాడు భావించేవారు, నేటికీ భావిస్తున్నారు. అలనాటి ప్రముఖ కళాకారులు ఈలపాటి రఘురామయ్య, సూరిబాబు, షణ్ముఖ ఆంజనేయరాజు, పీసపాటి, రేలంగి వెంకట్రామయ్య, అభినవ అంజనేయుడు సంపత్‌నగర్ లక్ష్మణరావు వంటి ఎందరో కళాకారులు ఇక్కడప్రదర్శనల ద్వారా సార్థకం చేసుకున్నట్టు భావించేవారు. సినీ ప్రముఖులు సి.ఎస్.రావు–రాజసులోచన, జెమినీగణేశన్–సావిత్రి, ఆదినారాయణ రావు–అంజలి, చలం–శారద దంపతులు, కైకాల సత్యనారాయణ, నూతన్‌ప్రసాద్, రావు గోపాలరావు తదితరులు ఇక్కడ సత్కారాలను అందుకున్నారు. వీరే సారథులు.. ఉత్సవాలను ఏటా నిర్వహించే శ్రీదేవి ఉత్సవకమిటీలో ప్రస్తుతం తోలేటి ధనరాజు అధ్యక్షునిగా, బత్తుల రాజేశ్వరరావు, ముత్యాల కుమారరెడ్డి ఉపాధ్యక్షులుగా, పడాల శివరామలింగేశ్వరరావు కార్యదర్శిగా, ఆండ్ర నమశ్శివాయ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. నలుగురు సహాయకార్యదర్శులు, 38 మంది కమిటీసభ్యులు ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషిచేస్తున్నారు. దేవీచౌక్‌గా రూపాంతరం ఇలా... 1934లో దివంగత బత్తుల నాగరాజు, బత్తుల మునియ్య సోదరులు దేవీ నవరాత్ర ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. నాడు కేవలం రూ.200తో చేపట్టిన ఈ ఉత్సవాలను నేడు దాతల సహకారంతో, లక్షలాది రూపాయలతో నిర్వహిస్తున్నారు. మాజీ శాసనసభ్యుడు దివంగత బత్తుల మల్లికార్జునరావు (చంటి)ఉత్సవాలకు ఊపు తీసుకువచ్చారు. 1963లో కలకత్తానుంచి బాలాత్రిపురసుందరి పాలరాతి విగ్రహాన్ని తెచ్చి, ప్రతిషి్ఠంచిన నాటినుంచి మూడులాంతర్ల సెంటర్ కాస్తా దేవీచౌక్‌గా మారిపోయింది. ఇది నా పూర్వజన్మ సుకృతం దేవీచౌక్ ఉత్సవాలకు మూలస్తంభంగా చెప్పుకోవలసిన దివంగత బత్తుల మల్లికార్జునరావు మా తండ్రి. గత పదేళ్లుగా ఉత్సవాలకు అలంకరణ బాధ్యతను నిర్వహిస్తున్నాను. ఇది నా పూర్వజన్మ సుకృతం. అమ్మవారి ఆశీస్సులే నా ప్రగతికి కారణమని అనుకుంటున్నాను. – బత్తుల రాజరాజేశ్వరరావు, శ్రీదేవి ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు నగర సాంస్కృతిక వైభవానికి ప్రతీక దేవీచౌక్‌లో 1992–93 ప్రాంతాలలో బుర్రకథలను వినిపించేవాడిని. సినిమాలు, టీవీలు స్వైరవిహారం చేస్తున్న ఈ రోజుల్లో పౌరాణిక నాటకాలను ప్రదర్శించడం అభినందనీయం.నగర సాంస్కృతికవైభవానికి ప్రతీక దేవీచౌక్ ఉత్సవాలు. – రాజగురు డాక్టర్ ఎం.ఆర్.వి.శర్మ సమాజానికి శ్రేయస్కరం దేవీచౌక్ ఉత్సవాల్లో ప్రతినిత్యం సామూహిక కుంకుమపూజలు, లలితాపారాయణలు జర గడం సమాజానికి ఎంతో మంచిది. అంతరించిపోతున్న నాటకకళకు ఈ ఉత్సవాలు ఊపిరులూదుతున్నాయి. – డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి, సాహితీవేత్త దేవీచౌక్ పేరును చాటిన ఉత్సవాలు దేవీపూజలకు మెసూరు, పశ్చిమ బెంగాల్, మన రాజమహేంద్రిలోని దేవీచౌక్ ఉత్సవాలు పెట్టిందిపేరు. దేవీచౌక్ పేరు రాష్ట్రంలోనే ప్రచారంలోకి రావడానికి ఈ ఉత్సవాలే కారణం. – గ్రంధి రామచంద్రరావు, హిందూ ధర్మ ప్రచార మండలి సభ్యుడు నగర కీర్తి కిరీటంలో కలికితురాయి తెలుగువారి సాంస్కృతిక రాజధాని కీర్తి కిరీటంలో కలికితురాయి దేవీచౌక్ ఉత్సవాలు. నేటికీ కళాకారులు ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. – సరసకవి డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు ఆ అవకాశంకోసం ఎదురుచూస్తున్నాను ఎన్నోఅద్భుతమైన నాటకాలకు దేవీచౌక్ వేదిక అయింది. ఆరోజుల్లో ప్రజలు నిలబడి నాటకాలు చూసేవారు. గాయకునిగా దేవీచౌక్‌లో అవకాశానికి ఎదురుచూస్తున్నాను. – ఎర్రాప్రగడ రామకృష్ణ, కవి, గాయకుడు మన సంస్కృతిలో అంతర్భాగం కళాకారులు తమప్రతిభకు గీటురాయిగా ఈ ఉత్సవాలను భావించేవారు, నేటికీ భావిస్తున్నారు. ఈ ఉత్సవాలు మన సంస్కృతిలో అంతర్భాగం. – ప్రాణహితకవి సన్నిధానం నరసింహశర్మ -
ఇక దుర్గమ్మ శీఘ్రదర్శనం టికెట్ ధర రూ.300
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో దుర్గగుడిని అభివృద్ధి చేస్తామని చెబుతున్న ఆలయ అధికారులు తొలిగా అమ్మవారి దర్శనం టికెట్ల ధరలను పెంచారు. శీఘ్రదర్శనం టికెట్ ధరను రూ.100 నుంచి ఏకంగా రూ.300కు పెంచుతూ దుర్గగుడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పుష్కరాల్లో వీఐపీ, శీఘ్రదర్శనం టికెట్ల ధరలను దేవస్థానం రూ.500గా నిర్ణయించింది. దీనిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రూ.300కు మార్చారు. అయితే, ఈ ధర కేవలం పుష్కరాల వరకే అని భక్తులు భావించారు. పుష్కరాలు ముగిసినా అదే రేటు కొనసాగించారు. అలాగే, భవిష్యత్తులో అమ్మవారి అంతరాలయ దర్శనానికి అనుమతిస్తారా, అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే శుక్ర, ఆదివారాలు, పండుగ రోజుల్లో అంతరాలయ దర్శనాన్ని నిలిపివేస్తున్నారు. రూ.300 టికెట్ కూడా శీఘ్రదర్శనమే తప్ప అంతరాలయ దర్శనం కాదనే ప్రచారం జరుగుతోంది. కాగా, అమ్మవారి దర్శనం టికెట్‌ను ఒక్కసారిగా పెంచడంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రూ.20 టికెట్‌ను యధావిధిగా కొనసాగిస్తారా.. లేదా అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత దర్శనం మూడు లైన్లు యధావిధిగానే కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. -
దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పల్లె
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కుటుంబ సమేతంగా బుధవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన పల్లె రఘునాథరెడ్డికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. -
దుర్గమ్మ సేవలో జస్టిస్ రమణ
ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ ఈవో సూర్యకుమారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను బహూకరించారు. అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సిద్దా రాష్ట్ర రవాణామంత్రి సిద్దా రాఘవరావు బుధవారం దర్శించుకున్నారు. -
దుర్గమ్మ దర్శనానికి కొనసాగుతున్న రద్దీ
విజయవాడ (ఇంద్రకీలాద్రి ) : దుర్గమ్మను యాత్రికులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. సోమవారం సుమారు 1.30 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేశారు. 20 వేల మందికి అన్న ప్రసాదాన్ని అందజేశారు. 2.70 లక్షల లడ్డూలు సిద్ధం పుష్కర యాత్రికుల కోసం అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు 2.70 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచినట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు. దేవస్థానానికి సోమవారం రూ. 22,75,600 ఆదాయం వచ్చింది. లిఫ్టుపై కొనసాగుతున్న వివాదం పుష్కరాల్లో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లులకే లిఫ్టు సదుపాయం కల్పిస్తున్నామని దుర్గగుడి అధికారులు చెబుతుండగా, పూర్తి స్థాయిలో పోలీసు సిబ్బందే వినియోగించుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. -
రైల్వేస్టేషన్లో దుర్గమ్మ దర్శనం
విజయవాడ(రైల్వే స్టేష): యాత్రికుల సౌకర్యార్థం దుర్గామలేశ్వర దేవస్థాన అధికారులు రైల్వేస్టేçÙన్ ఆవరణలో దుర్గమ్మ ప్రతిమ ఏర్పాటు చేశారు. అమ్మ దర్శనానికి వెళ్లలేని పలువురు యాత్రికులు స్టేషన్లో దర్శనం చేసుకుంటున్నారు. దేవస్థాన ప్రసాదం కౌంటర్లలో లడ్డు, పులిహోర 24 గంటలు విక్రయిస్తున్నారు. దేవస్థాన అధికారుల ఏర్పాట్లపై పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
దుర్గమ్మ దర్శనానికి భక్తుల పోటు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : పుష్కర యాత్రికులతో ఆదివారం దుర్గమ్మ సన్నిధి కిటకిటలాడింది. పుష్కరాల మూడో రోజు, ఏకాదశి పర్వదినం కలిసి రావడంతో రికార్డు స్థాయిలో యాత్రికులు అమ్మవారి దర్శనానికై తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి మొదలైన యాత్రికుల రద్దీ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. ఆదివారం ఒక్క రోజే సుమారు లక్షన్నర మంది భక్తులు శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సోమవారం ఆగస్టు 15 సెలవు కావడంతో ఇదే తరహా రద్దీ కొనసాగే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు మహా మండపం, మల్లికార్జునస్వామి వారి ఆలయం వైపు నుంచి కొండ కిందకు చేరుకుంటున్నారు. మహా మండపంలోని ప్రసాదాల కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా 5 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీ, రూ.300 శీఘ్రదర్శనం టికెట్లతో పాటు నాలుగు ఉచిత సర్వ దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అన్ని క్యూలైన్ మార్గాలలో నిరంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా దేవస్థాన సిబ్బంది చర్యలు తీసుకున్నారు. అశోకస్థూపం వరకు క్యూలైన్లలో రద్దీ అమ్మవారి దర్శనానికి రికార్డు స్థాయిలో భక్తులు తరలిరావడంతో క్యూలైన్లలో రద్దీ నెలకుంది. మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు రద్దీ మరింత పెరిగింది. దీంతో అశోకస్ధూపం వరకు ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు బారలు తీరి కనిపించారు. దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టింది. రికార్డు స్థాయి ఆదాయం అమ్మవారికి ఆదివారం ఒక్క రోజే రూ. 20.87 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులతో పాటు పుష్కర యాత్రికులకు 20 వేల మందికి అన్న ప్రసాద వితరణ జరిగింది. -
దుర్గమ్మకు చేరువగా కృష్ణమ్మ
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : దుర్గమ్మకు కృష్ణమ్మ మరింత చేరువైంది. నిన్నటి వరకు నీటి జాడలేని దుర్గాఘాట్‌లో గురువారం సాయంత్రానికి మూడు అడుగుల మేర నీరు చేరింది. దుర్గాఘాట్‌లో నీటిమట్టం పెరగడంతో అమ్మవారి భక్తులతోపాటు సందర్శకుల తాకిడి పెరిగింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన పలువురు భక్తులు దుర్గాఘాట్‌లోనే పుణ్యస్నానాలు ఆచరించారు. యాత్రకుల రద్దీ ప్రారంభం శుక్రవారం ఉదయం నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచే యాత్రకుల రద్దీ ప్రారంభమైంది. బస్సు, రైళ్ల ద్వారా నగరానికి చేరుకున్న భక్తులు స్నానఘాట్లకు వస్తున్నారు. పుష్కర యాత్రికులతోపాటు నగరానికి చెందినవారు ఘాట్లలో ఏర్పాట్లను తిలకించేందుకు వస్తుండడంతో సదండి వాతావరణం నెలకొంది. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.1.28 కోట్లు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్లకు భక్తులు హుండీల ద్వారా రూ.1,28,93,966లను కానుకలుగా సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం ఆలయ సిబ్బంది మహామండపంలోని ఆరో అంతస్తులో లెక్కించారు. నగదుతో పాటు 350 గ్రాముల బంగారం, 4.410 కిలోల వెండి లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తం 22 రోజులకు 20 హుండీల ద్వారా లభించినట్లు చెప్పారు. -
ఘనంగా బోనాల ఉత్సవాలు
పోటాపోటీగా బోనాల పండగా ఆకట్టుకున్న కేరళ కళాకారులు నృత్యాలు బోనాలు, బండ్ల ఊరేగింపుతో ముగిసిన జాతర చిందులేసిన మాజీ ఎమ్మెల్యేజగ్గారెడ్డి మెదక్: పట్టణంలోని స్వర్ణకారుల ఆధ్వర్యంలో ఆదివారం మహాకాళి మాతకు ఘనంగా బోనాలను తీశారు. మహిళలు బోనాలతో పట్టణంలో ఊరేగింపు తీశారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసం, యువకుల నృత్యాల మధ్య ఊరేగింపు ముందుకు సాగింది. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటి:జిల్లాకేంద్రమైన సంగారెడ్డిలో ఆదివారం బోనాల సందడి నెలకొంది. ఆషాడమాసం చివరి ఆదివారం కావడంతో బోనాల ఉత్సవాల ముగింపు సంగారెడ్డిలో జోరుగా కొనసాగింది. ఈ సందర్భంగా పలు కులసంఘాలు పోటీపడి వేర్వేరుగా బోనాలు ఊరేగింపు నిర్వహించాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన బోనాల ఊరేగింపులో కేరళకు చెందిన కళాకారులు వేసిన వేషా«ధరణలు ఆకట్టుకున్నాయి. యువతసైతం డిజేసౌండ్ల నడుమ నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాలు జరుపుకున్నారు. మరోవైపు బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకొని అమ్మవారి ఆలయాలకు వచ్చారు. పట్టణంలోని సంగమేశ్వర ఆలయం నుండి హస్తబలి రేణుక ఎల్లమ్మ ఆలయం వరకు నిర్వహించిన బోనాల ఊరేగింపును స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని రాంమందిర్ నుండి ప్రారంభమైన బోనాల ఉత్సవాలను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రారంభించారు. రాంమందిర్నుండి ప్రధానరహదారి మీదుగా ఉప్పర్ బజార్, ప్రైడే మార్కెట్, భవాని మాత ఆలయం మీదుగా దుర్గమాత ఆలయం ఈ బోనాల ఊరేగింపు కొనసాగింది. కింది బజార్ బోనాలను హనుమాన్ నగర్‌లోని నల్లపోచమ్మ ఆలయం నుండి భవాని మందిర్ వరకు వచ్చి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల్లో కలిశారు. అంతకు ముందు నలంద నగర్‌నుండి వచ్చిన బోనాలు నేరుగా దుర్గామాత ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చారు. బోనాల ఊరేగింపుల్లో పోతరాజులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం చిందులేశారు. ప్రత్యేకంగా కేరళనుండి వచ్చిన కళాకారులు వివిధ దేవతా మూర్తుల వేషాధరణాలు వేయడం అందరిని ఆకట్టుకున్నాయి. తొలిసారిగా బోనాల పండగాను కుల సంఘాలు వేర్వేరుగా నిర్వహించడంతో పోలీసులు ముందస్తుగా బందో బస్తు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఐదుమంది సీఐలు, పదిమంది ఎస్‌ఐలతోపాటు 50మంది కానిస్టేబుళ్లతో పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మొత్తంగా బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం సంగారెడ్డి పట్టణంలో ప్రశాంత వాతావరణంలో జరిగాయి. మరోవైపు బోనాల సందర్భంగా ఆలయ సమీపంలోని ప్రధాన రహదారులపై సరైన లైట్లు ఏర్పాటు చేయక పోవడంతో భక్తులు అంధకారంలోనే బోనాలు ఊరేగించారు. మెదక్:మెదక్ పట్టణంలో ఆదివారం స్వర్ణకారుల ఆధ్వర్యంలో కాళికామాతకు ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు. కాగా మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ స్థానిక మున్సిపాలిటి ఆధ్వర్యంలో ఎదురెళ్లి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు బాగా కురిసి పంటలు పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారికి మొక్కుకున్నారు. ఆయన వెంట కమిషనర్ ప్రసాదరావు తదితరులు ఉన్నారు. -ముత్యాలమ్మకు భక్తితో పూజలు, -మొక్కులు తీర్చుకున్న భక్తులు. నర్సాపూర్ఃపట్టణంలోని ముత్యాలమ్మ తల్లికి ఆదివారం పట్టణ ప్రజలు భక్తి శ్రద్దలతో ఘణంగా పూజలు చేశారు. ఉదయం నుంచి భక్తులు ఆలయానికి వెల్లి పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం బండ్లు ఊరేగింపుగా వచ్చి ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేశారు. మహిళలు బోనాలతో వచ్చి ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసిన అనంతరం తల్లికి నైవేద్యం సమర్చించి తమ మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం పట్టణంలోని పద్మాశాలి సంఘం ఆద్వర్యంలో అమ్మవారికి వస్తా్రలు సమర్పించారు. పూజలు, ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ రమణ, ఎంపీటీసీలు సురేష్, రాజేందర్, పలువురు వార్డు సభ్యులు ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా ఆలయానికి వెల్లె దారిలో బురదగా ఉన్నప్పటికి దారిని బాగు చేయకపోవడం పట్ల ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు. సిద్దిపేట జోన్:సిద్దిపేట పట్టణంలో ఆదివారం అశాడమాస ముంగిపు సందర్భంగా పెద్ద ఎత్తున భోనాలు నిర్వహించారు. స్థానిక దీకొండ మైసమ్మ దేవాలయంలో వార్షికోత్సవాలను పురస్కరించుకోని నిర్వహకులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా అమ్మవారి మైలలు తీయుటు, ఓడి బియ్యంతో పాటు కాలనీకి చెందిన ప్రతి ఇంటి నుంచి ఒక్కోక్క భోనంతో భోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పునాకలతో పట్టణంలో భోనాలు కోట్టోచ్చినట్లుగా మారింది. అదే విధంగాస్థానిక శ్రీనగర్ కాలనీ వాసులు భోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు శ్రీనివాస్‌రెడ్డి, పాల శేఖర్, శ్రీను, నరేష్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్:జహీరాబాద్ పట్టణం బోనాల ఉత్సవాలతో సందడిగా మారింది. ఆదివారం పట్టణంలోని హౌసింగ్‌బోర్డు, బాగారెడ్డిపల్లి కాలనీ మహిళలు దేవాలయాలకు బోనాలను ఊరేగింపు తీసుకెళ్లారు. హౌసింగ్‌బోర్డు కాలనీ పోచమ్మ దేవాలయానికి కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాల్లో మున్సిపల్ చర్‌పర్సన్ లావణ్యచందు, కౌన్సిలర్ రాజశేఖర్, నర్సింహారెడ్డి, ముత్యాలచందు, తేజ్‌రెడ్డి, బాల్‌రెడ్డి, ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో కాలనీలోని 7,12వ వార్డులు సందడిగా మారాయి. 13వ వార్డు పరిధిలోని బాగారెడ్డి పల్లిలో సైతం బోనాలు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాలనీ నుంచి శ్రీ చక్ర పోచమ్మ దేవాలయానికి నిర్వహించిన ఉత్సవాలు అలరించాయి. 1వ వార్డు పరిధిలోని మాణిక్‌ప్రభు వీధిలో గల పోచమ్మ దేవాలయానికి కాలనీ మహిళలు బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాల్లో వార్డు కౌన్సిలర్ కండెం సుజాత, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు, కాలనీ ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మండలంలోని పస్తాపూర్ గ్రామంలో గల భూలక్ష్మమ్మ, దుర్గమ్మ దేవాలయాలకు గ్రామ ప్రజలు ఘనంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది. ఉత్సవాల్లో సర్పంచ్ రామకృష్ణారెడ్డితో పాటు మాణిక్‌రెడ్డి, పెంటారెడ్డి, విఠల్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో భోనాల ఊరేగింపు హజరైన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సదాశివపేట: మండల పరిధిలోని నందికంది గ్రామంలో ఆదివారం భక్తిశ్రద్దలతో ఘనంగా మహిళలు బోనాల ఊరేగింపు నిర్వహించారు. మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ కుందెన రాజు ఆధ్వర్యంలో బోనాల పండుగ సందర్భంగ బోనాల ఊరేగింపు కార్యక్రమం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, హజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన చింటుగౌడ్, రమేశ్‌యాదవ్, సంగయ్య, బుచ్చం, మాణయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్‌రూరల్ : ఆషాడ మాసం చివరి ఆదివారం కావడంతో భక్తులు అమ్మవార్లకు బోనాలను సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ పరిధిలోని సిరి ఎన్క్లేవ్ కాలనీలో అధ్యక్షుడు జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బోనాలను నెత్తినపెట్టుకున్న మహిళలు, ఆడపడుచులు డప్పు చప్పుళ్ల నడుమ తమ పిల్లాపాపలతో ఊరేగింపుగా తరలివచ్చి ప్రజ్ఞాపూర్‌లోని పోచమ్మతల్లికి సమర్పించారు. ఈ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవార్లను వేడుకున్నారు. అలాగే పట్టణంలోని పోచమ్మ, మహంకాళి అమ్మవార్లకు పలువురు మహిళలు బోనాలను సమర్పించారు. తూప్రాన్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు తూప్రాన్:పట్టణంలోని మహంకాళి దేవాలయంలో మూడు రోజులపాటు సాగే బోనాల ఉత్సావాలు ఆదివారం ఉదయం నుంచే పట్టణంలో పండుగ వాతవారణం నెలకొంది. ఆదివారం ఉజ్జయిని మహంకాళి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ ఉత్సవాలు స్థానిక సర్పంచ్ చిట్టిమిల్ల శివ్వమ్మ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. బోనాల ఉత్సవాల్లో మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బోనాల పండుగను సీఎం కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయం గుర్తుచేశారు. తెలంగాణలో ఈఏడు వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. సీఎం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఉదయం నుంచి అమ్మవారిని పెద్దసంఖ్యలో దర్శించుకుని బోనాలు సమర్పించారు. పోతారాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణ నెలకొంది. యువకులు ప్రత్యేకంగా దేవతామూర్తులను అలంకరించి అమ్మవారికి తొట్టేలను సమర్పించారు. అమ్మవారికి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘటంను ఊరేగింపుగా తీసుకువచ్చి బోనాలు సమర్పించారు. జాతర సందర్భంగా బొమ్మల దుకాణాలు ఏర్పాటుచేశారు. అమ్మవారి ఆలయం వద్ద కళాకారులతో దుంధాం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక సీఐ.రమేశ్‌బాబు, ఎస్ఐ వెంకటేశ్ తమ సిబ్బందితో బందో బస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామునిగారి శ్రీశైలంగౌడ్, టీఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్, సర్పంచ్ శివ్వమ్మ, ఎంపీపీ ఉపాధ్యక్షుడు అనంతరెడ్డి, ఉప సర్పంచ్ నందాల శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మునిపల్లి : మండలంలోని ఆయా గ్రామాల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండలంలోని తాటిపల్లి, ఖమ్మంపల్లి, పోల్కంపల్లి గ్రామాల్లో దుర్గమ్మ, పోచమ్మ అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. ఆయా గ్రామాల్లో అన్నదానం చేశారు. -
ఏడుపాయల దుర్గమ్మ సేవలో శ్రీకాంత్
పాపన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం మహాయజ్ఞంలా కొనసాగుతోందని, ప్రతి మొక్క భూమాతకు పచ్చని బుట్టులా మారాలని సినీ నటుడు శ్రీకాంత్ పేర్కొన్నారు. శుక్రవారం ఏడుపాయలకు వచ్చిన ఆయన దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. ముందుగా ఈఓ వెంకట్‌కిషన్‌రావు, విష్ణువర్దర్‌రెడ్డి, ఆయల సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏడుపాయలను దర్శించుకోలేదన్నారు. దట్టమైన అడవి మధ్యన మంజీరా, ప్రహరీలా ఉన్న రాతి గుట్టల్ని చూస్తుంటే మనస్సు పులకించిందన్నారు. హరితహారంలో యావత్ సినీ పరిశ్రమ పాల్గొని మొక్కలు నాటిందన్నారు. ఆయన వెంట బంధువులు, ఆలయ సిబ్బంది గోపాల్, రవి, శ్రీనివాస్, అచ్చన్నపల్లి శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, పూజారులు శంకరశర్మ, పార్థివశర్మ ఉన్నారు. సెల్ఫీల కోసం ఆరాటం తమ అభిమాన నటుడితో సెల్ఫీలు తీసుకునేందుకు యువకులు, మహిళలు పోటీపడ్డారు. చిరుజల్లులు పడుతున్నా శ్రీకాంత్ ఓపిగ్గా అందరినీ పలకరించి, ఫొటోలు దిగడం విశేషం. -
మళ్లీ తెరపైకి మాడ వీధులు
తిరుమల తరహాలో ఏర్పాట్లు కార్యరూపంలోకి రానున్న ప్రతిపాదనలు కొండపై ఉన్న కార్యాలయాలు దిగువకు మార్చేందుకు సన్నాహాలు దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై తిరుమల తరహాలో మాడ వీధుల నిర్మాణ ప్రతిపాదనకు కదలిక వచ్చింది. కొండపై ఉన్న దేవస్థానం కార్యాలయాలను దిగువకు తర లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న మాడ వీధుల ఏర్పాటు అంశం ఇప్పుడు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడ : తిరుమల తరహాలో ఇంద్రకీలాద్రిపై కూడా మాడ వీధులు నిర్మించాలనే ఆలోచన తెరపైకి వచ్చింది. కొద్దికాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనను కార్యరూపంలోకి తెచ్చేందుకు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్టే అనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆలయ ఆవరణలోని దేవస్థానం కార్యాలయాలను కొండ దిగువన ఉన్న ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్ (జమ్మిదొడ్డి)లోకి మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ కార్యాలయాలన్నింటినీ తొల గించి అక్కడ మాడ వీధులు ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్‌కు దేవస్థాన విభాగాలు ఇంద్రకీలాద్రిపై సుమారు 8వేల చదరపు అడుగుల్లో ఈవో కార్యాలయంతో పాటు స్టోర్స్, ప్రసాదాల తయారీ, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్, సమాచార కేంద్రం తదితర విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలన్నింటినీ ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్‌కు తరలిస్తారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు కార్యాలయం, వీఐపీల కోసం నిర్మించిన సూట్లు, ఏసీ గదులు మార్చడం లేదు. రెండో అంతస్తుతో పాటు పైన తాత్కాలికంగా షెడ్లు వేసి విభాగాలన్నింటినీ తరలిస్తారని సమాచారం. ఆ తరువాత మరొక చోట స్థలం తీసుకుని శాశ్వత భవనం నిర్మిస్తారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఇంద్రకీలాద్రిపై ఉన్న కార్యాలయ భవనాలను తొలగించి మాడ వీధులు నిర్మించాలని భావిస్తున్నారు. మాడపాటి గెస్ట్‌హౌస్‌లో ఆరు సూట్లు మాడపాటి గెస్ట్‌హౌస్‌లో 27రూములు ఉన్నా యి. పుష్కరాలకు వీవీఐపీలు వస్తే ప్రస్తుతం ఉన్న సూట్లు సరిపోవడం లేదు. అందువల్ల 12 రూములను ఆరుసూట్లుగా మార్చాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. దీనికోసం సుమారు రూ.50లక్షలతో ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు తయారు చేశారని, పనులు ఈ నెలాఖరులో ప్రారంభించాలని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. దుర్గమ్మ ఆలయానికి భద్రతెంత!? ప్రస్తుతం అమ్మవారి ప్రధాన దేవాలయానికి వెనుక వైపు కార్యాలయ భవనాలు ఉన్నాయి. కొండ పక్కగా ఎప్పుడో కట్టిన ఈ భవనాలు అడ్డుగా ఉండటం వల్ల ఇప్పటివరకు ఎలాంటి కొండచరియలు విరిగిపడలేదు. ఇప్పుడు ఈ భవనాలను పగలగొడితే కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
అధికారం కోసమే ప్రత్యేక హోదా అన్నారు
చిత్తూరు: ఏపీ పర్యటనలో మోదీ ప్రత్యేకహోదా అంశం ప్రస్తావించక పోవడాన్ని వైఎస్సాఆర్ సీపీ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. గత ఎన్నికల ప్రచారంలో శ్రీనివాసుని సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్న మోదీ.. ఇప్పుడు దుర్గమ్మ సాక్షిగా మాట తప్పారని అన్నారు. అధికారం కోసమే చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకహోదాను పలికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదా అవసరమే లేదనట్లు మాట్లాడుతున్నారని అన్నారు. -
వేదమాతకు వందనం
ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మూడు రోజుల నుంచి కడు వేడుకగా జరుగుతున్నాయి. నాలుగు వేదాలను నాలుగు ముఖాలుగా చేసుకున్న వేదమాత గాయత్రీదేవి రూపంలో దుర్గమ్మ గురువారం భక్తులకు దర్శనమిచ్చింది. తెల్లవారుజామున మూడు గంటలకు అమ్మవారికి విశేష అలంకారం, నిత్య అర్చనల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. - విజయవాడ (ఇంద్రకీలాద్రి) నేటి అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ శుక్రవారం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. తలచినంతనే అష్టరూపాల్లో అష్టసిద్ధుల్ని ప్రసాదించే శ్రీ మహా లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. మంగళప్రదమైన దేవత శ్రీ మహా లక్ష్మీదేవి. దుర్గా సప్తశతి అంతర్గతమైన దేవి ఆదిపరాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్ని ధరించి దుష్టరాక్షస సంహారాన్ని చేసింది. లోకస్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మిగా వరాలను ప్రసాదించే అష్టలక్ష్మిగా.. అమృత స్వరూపాన్ని దర్శించవచ్చు. అమ్మను వేడుకుంటే దుఃఖాన్ని నాశనం చేసి.. దరిద్రాన్ని పారద్రోలి అషై ్టశ్వర్యాలను ప్రసాదిస్తుంది. -విజయవాడ (ఇంద్రకీలాద్రి) -
మహా జాప్యం
నిరుపయోగంగా మారిన మహామండపం రూ.32కోట్లు ఖర్చుచేసినా అక్కరకు రాని వైనం ఈ ఏడాది దసరాకు తప్పని క్యూలైన్లు దుర్గమ్మ దర్శనభాగ్యం కల్పించే మహాద్వారమన్నారు.. ఏడేళ్లు శ్రమించి ఏడంతస్తులు కట్టారు.. భారీ అంచనాలతో రూ.32కోట్లతో నిర్మించిన అతిపెద్ద భవంతిని మూణ్ణాళ్లకే తుస్సుమనిపించారు. భక్తుల సౌకర్యార్థం, దుర్గమ్మ త్వరిత దర్శనార్థం ఇంద్రకీలాద్రిపై నిర్మించిన మహామండపం నిరుపయోగంగా మారింది. దేవస్థానం ఆధ్వర్యంలో సరైన ప్రచారం కల్పించకపోవడం వల్ల భక్తులు ఘాట్‌రోడ్డులోని క్యూలైన్ల ద్వారానే దర్శనానికి వస్తున్నారు. దీంతో వచ్చే దసరాకూ మళ్లీ లక్షలు ఖర్చుచేసి క్యూలైన్లు నిర్మించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంద్రకీలాద్రి : దసరా ఉత్సవాలకు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మహామండపంలోని రెండు అంతస్తుల్లో క్యూలైన్లు.. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో కంపార్టుమెంట్లు, కల్యాణ మండపాలు.. ఇలా ఒకటేమిటి అన్నీ ప్రత్యేకతలేనని ఆలయ అధికారులు గొప్పగా చెప్పుకొన్నారు. ఆచరణలో మాత్రం మహామండపం నిరుపయోగంగా మారింది. కనీసం శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున వచ్చే భక్తులను సైతం మహామండపం క్యూలైన్లోకి మళ్లించలేదు. దీంతో ఎండలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండపాన్ని వినియోగంలోకి తీసుకురావడంలో దేవస్థాన ఇంజినీరింగ్ విభాగం విఫలమైందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. మండుటెండలో కాళ్ల కింద కనీసం పట్టాలయినా లేకుండా గంటల తరబడి క్యూలైన్లోనే భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితులు కల్పించారు. నెలన్నరలో రానున్న దసరా ఉత్సవాలకు సైతం మహామండపంలో పూర్తిస్థాయిలో పనులు కాకపోవచ్చునని అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. క్యూలైన్లు ప్రారంభమైనా ప్రయోజనమేదీ? రెండేళ్ల కిందట ఈవోగా బాధ్యతలు నిర్వహించిన ప్రభాకర్ శ్రీనివాస్ తన హయాంలో జరిగిన దసరా ఉత్సవాల్లో అప్పటి సబ్ కలెక్టర్ హరిచందనతో మెట్లకు ప్రారంభోత్సవం చేయించారు. దర్శనం అనంతరం మెట్ల మార్గం గుండా భక్తులు అర్జున వీధికి చేరుకున్నారు. ఇక ప్రస్తుత ఈవో నర్సింగరావు ఈ ఏడాది ఏప్రిల్ 10న పీఠాధిపతులు, మంత్రుల స్వహస్తాలతో మండపాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్‌లోనే ఈవో స్వయంగా క్యూలైన్లు ప్రారంభించి రూ.100 టికెట్ కొనుగోలు చేసిన వారు మెట్ల ద్వారా ఆలయ ప్రాంగణానికి చేరుకోవచ్చని ప్రకటించారు. వాస్తవానికి మండపంలో ఏర్పాటుచేసిన రెండు లిప్టుల ద్వారా భక్తులను ఆలయం వద్దకు చేర్చితే భక్తుల నుంచి స్పందన వచ్చేది. అయితే రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో దేవస్థానం అధికారులు లిఫ్టును మూసేయడంతో మహామండపం మీదుగా ఆలయానికి చేరుకునే వారి సంఖ్య పదిలోపు ఉంటుంది. ఈ టికెట్లను విక్రయించేందుకు సిబ్బందిని నియమించగా పక్షం రోజుల్లో కనీసం వారి వేతనానికి కూడా రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, మహామండపాన్ని మాత్రం ఇంతవరకు దేవస్థానానికి స్వాధీనం చేయలేదని చెబుతున్నారు. శ్రావణ వ్రతాలూ నిర్వహించలేదు శ్రావణమాసంలో ఆది, శుక్రవారాలలో రద్దీని మహామండపం మీదుగా మళ్లించేందుకు అవకాశం ఉన్నా ఆలయ అధికారులు చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారి తీయడమే కాకుండా మండపం నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. కనీసం సామూహిక వరలక్ష్మి వ్రతాలను సైతం మండపంలో నిర్వహించలేదు. దసరా క్యూలైన్లు కెనాల్ రోడ్డులోనే.. ఈ ఏడాది దసరా ఉత్సవాలకు మహా మండపంలోని క్యూలైన్ కాంప్లెక్స్‌ను సద్వినియోగం చేసుకుంటే దేవస్థానానికి లక్షలాది రూపాయలు మిగిలేవి. అయితే, పనులు ఇంకా పూర్తి కాలేదనే కారణంతో కూడా కెనాల్‌రోడ్డు మీదుగా క్యూ లైన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కోట్ల రూపాయల పనులు చేపట్టినా మండపాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. -
అచ్చమైన మిథునం
ఇటీవల ఓ వృద్ధ జంట జీవితాన్ని వెండితెరపై ‘మిథునం’ పేరిట అందమైన కావ్యంగా ఆవిష్కరించారు తనికెళ్ల భరణి. అటువంటి అచ్చమైన జంట స్థానికంగా ఒకరికిఒకరై తోడుగా జీవనం సాగిస్తున్నారు. తొమ్మిది పదుల వయసులోనూ చెక్కు చెదరని అనుబంధంతో మెలుగుతున్నారు. ఈ ఆదర్శ దంపతుల జీవితం... నిజ జీవిత మిథునం. ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం పాత లైబ్రరీ భవనం పక్కన 95 ఏళ్ల జొరిగే ముత్యాలు, 85 ఏళ్ల భార్య దుర్గమ్మ మేదర వృత్తే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి సాగనంపారు. కుమారులెందరో పుట్టి మరణించడంతో ఓ బాలుడ్ని పెంచుకున్నారు. రెక్కలొచ్చాక ఆ బిడ్డకు ఎగిరిపోయాడు. దీంతో వృద్ధ దంపతులిద్దరూ ఒకరికి ఒకరై 60 ఏళ్లుగా పోలవరం మెయిన్‌రోడ్డుకి ఆనుకుని ఉన్న ఇంట్లో జీవించేవారు. రహదారి విస్తరణలో ఈ ఇల్లు కూడా పోవడంతో చిన్న గుడారం ఏర్పాటు చేసుకుని కాలం వెళ్ల దీస్తున్నారు. భర్తకు స్నానం చేయించడంతో పాటు అన్నం తినిపించడం వంటి అన్ని పనులు భార్య దుర్గమ్మ చేస్తుంది. భర్త బుట్టలు అల్లుతుంటే సాయం అంది స్తుంది. ఆర్థికంగా ఎటువంటి ఆధారం లేకపోయినా ఈ జంట ఆనందంగా జీవనం సాగిస్తోంది. -
వరమహాలక్ష్మిగా దుర్గమ్మ
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శ్రావణ శుక్రవారం సందర్భంగా వరమహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తోంది. శుక్రవారం వేకువజామున అమ్మవారికి అర్చకులు అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక అలంకారం చేసిన తర్వాత ఉదయం 8.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. ముఖమండపం నుంచే దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశారు. అదనంగా ఒక క్యూలైన్ సహా మొత్తం ఐదు క్యూలైన్లను అందుబాటులో ఉంచారు. -
దుర్గమ్మ దర్శనానికి పుష్కర భక్తజనం
విజయవాడ : గోదావరి పుష్కరాలకు రాజమండ్రి, కొవ్వూరు తదితర ప్రాంతాలకు వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో ఆలయప్రాంగణం కిటకిటలాడుతోంది. నాలుగు రోజుల కంటే గురువారం రద్దీ కాస్త తగ్గుముఖం పట్టడంతో భక్తులను అంతరాలయ దర్శనానికి అనుమతించారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలోనే భోజనాలు చేస్తున్నారు. ప్రత్యేక బస్సులు, మినీ వ్యానుల్లో వస్తున్న భక్తులు తమ వాహనాలను కనకదుర్గనగర్, భవానీపురం టీటీడీ స్థలంలో నిలుపుకుని దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సుల్లో దుర్గాఘాట్‌కు చేరుకుని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి చేరుతున్నారు. రద్దీకి తగినట్టుగా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు భక్తులకు మైక్ ద్వారా పలు సూచనలు, సలహాలను ఇస్తున్నారు. ఈవో నర్సింగరావు గురువారం స్వయంగా మైక్ ప్రచార కేంద్రానికి చేరుకుని భక్తులకు సూచనలు చేశారు. 10వ రోజు ఆదాయం రూ.18.23 లక్షలు పుష్కరాలను పురస్కరించుకుని 10వ రోజు దుర్గమ్మ దేవస్థానానికి రూ.18,23,501 ఆదాయం సమకూరింది. రూ.100, రూ.20 టికెట్ విక్రయాల ద్వారా రూ.7.53 లక్షల ఆదాయం వచ్చింది. 10వ రోజు 71 వేల లడ్డూలను విక్రయించారు. వివిధ సేవలు, కాటేజీల అద్దెల రూపంలో ఈ ఆదాయం సమకూరింది. -
యువకుడు సహా తల్లిదండ్రులపై దాడి
నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలం వెల్మగూడెంలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడు సహా తల్లిదండ్రులపై యువతి తల్లిదండ్రులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యువకుడు తల్లి తీవ్రంగా గాయపడటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతని తల్లి దుర్గమ్మ మృతిచెందినట్టు సమాచారం. దాంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంద్రకీలాద్రిపై టెన్షన్ టెన్షన్
విజయవాడ : మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు దుర్గగుడి ఘాట్‌రోడ్డుపై గురువారం బీభత్సం సృష్టించాడు. అమ్మవారి దర్శనం చేసుకునేందుకు తనను అనుమతించలేదంటూ ఘాట్‌రోడ్డులోని మొదటి మలుపు వద్ద కొండ శిఖరానికి ఎక్కి దూకేస్తానంటూ బెదిరించాడు. అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని కిందకు దింపడంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలోని కొమరాడకు చెందిన అంపిరి గౌరీశంకర్ (26) గురువారం దుర్గమ్మ దర్శనానికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న గౌరీశంకర్‌ను సెక్యూరిటీ సిబ్బంది క్యూలైన్లోకి అనుమతించలేదు. దీంతో గౌరీశంకర్ ఘాట్‌రోడ్డులోని మొదటి మలుపు వద్ద నుంచి కొండ శిఖరానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి కేకలు వేయడంతో భక్తులు గమనించి ఆలయ ప్రాంగణంలోని పోలీస్ అవుట్‌పోస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపకశాఖ అధికారి బి.శ్రీనివాసరావు నేతృత్వంలోని సిబ్బంది వి.శివనాగిరెడ్డి, వి.శ్రీనివాసరావు, పి.శివకృష్ణ కొండ ఎక్కి గౌరీశంకర్‌కు కిందకు దింపే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన గౌరీశంకర్ తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగగా, బుజ్జగించి కిందకు దింపారు. అయితే, గౌరీశంకర్ మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం అతడిని వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
గోదావరిలోకి దూసుకెళ్లిన మృత్యు ‘తూఫాన్’
-
భగవంతుడా...
గోదావరిలోకి దూసుకెళ్లిన మృత్యు ‘తూఫాన్’ ఏపీలోని ధవళేశ్వరం వద్ద పెను విషాదం.. ఒకే ఇంట్లో 14 మంది మృతి మరో రెండు కుటుంబాల్లో 8 మందిని కాటేసిన మృత్యువు పుణ్యక్షేత్రాలను సందర్శించి వస్తుండగా ఘటన మాటలకందని మహా విషాదం అంటే ఇదేనేమో.. తిరుమలలో వెంకన్నకు, శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరునికి, శ్రీశైలంలో మల్లన్నకు, బెజవాడలో దుర్గమ్మకు మొక్కిన చేతులు.. తెల్లవారితే సింహాచలంలో అప్పన్న సన్నిధిలో జోడించాలనుకున్న చేతులు.. నిశ్చేతనమయ్యాయి. శుక్రవారం రాత్రి గోదారమ్మ తీరం వెంట పిల్లా పాపల కేరింతలతో సాగిపోతున్న వారి ప్రయాణం మధ్యలోనే ముగిసింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీపై ఎడమ వైపు వెళ్తున్న తూఫాన్ వాహనం డ్రైవర్ ఒక్క క్షణం రెప్ప వాల్చటంతో కుడివైపు తిరిగింది. నిశిరాత్రివేళ బ్యారేజీ గోడను ఢీకొట్టి 30 అడుగుల లోతులో పడటంతో పెను ప్రమాదం జరిగింది. 22 మంది మృత్యువాత పడ్డారు. ఇద్దరు బిడ్డల నిండు జీవితాలను కాపాడుకునేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన ఓ తండ్రి.. కుమారుడిని మాత్రం రక్షించుకుని కన్నుమూశాడు. ఆ బాలుడు ఈ ఘోరకలికి ప్రత్యక్షసాక్షిగా, మృత్యుంజయుడిగా మిగిలాడు.సాక్షి, విశాఖపట్నం, రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పెను ప్రమాదంలో 22 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఏడుగురు చిన్నారు లున్నారు. వీరంతా విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మోసయ్యపేటకు చెందిన వారి సమీప బంధువులు. ఇష్టదైవాల్ని దర్శించుకుని, తిరుగుముఖం పట్టిన వీరు గమ్యం చేరకుండానే మృత్యు వాతపడ్డారు. ఈ బృందంలోని ఒకే ఒక్క బాలుడు జరిగిన ఘోరకలికి ప్రత్యక్షసాక్షిగా, మృత్యుంజయుడయ్యూడు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ప్రధాన గేట్లు దాటిన వెంటనే వచ్చే మలుపులో వారు ప్రయాణిస్తున్న వాహనం నేరుగా స్కవర్ స్లూయిజ్లోకి బోల్తా కొట్టింది. ఆ వాహనం 30 అడుగుల ఎత్తు నుంచి కింద ఉన్న సిమెంట్ గచ్చుపై పడిపోయింది. ప్రయాణికులు గచ్చుపై పడడంతో బలమైన తీవ్ర గాయాలై మృతిచెందారని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన వాహనం శుక్రవారం అర్ధరాత్రి 12.51 సమయంలో ఏలూరు సమీపాన కలపర్రు టోల్గేట్ దాటినట్టు నమోదయింది. కలపర్రు నుంచి ధవళేశ్వరం సుమారు 95 కిలోమీటర్లు. దీన్ని బట్టి అర్ధరాత్రి రెండున్నర, మూడు గంటల మధ్యలో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాద సంఘటన తెల్లవారుజాము 5.30 వరకూ ఎవరికీ తెలియలేదు. మృత్యువు నుంచి బయటపడిన కిరణ్‌సాయి బ్యారేజీ దిగువ రోడ్డుకు వచ్చి ‘మా అక్కకు నీళ్లు కావాలంటూ..’ అరవడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులకు తెలిసింది. వారు దగ్గరలో ఉన్న లాకు కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. కార్యాలయ సిబ్బంది ధవళేశ్వరం పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన తూఫాన్ వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతుడు గోపి స్నేహితుడు జె.హేమంత్ మొదట చనిపోయినవారిని గుర్తిం చాడు. ఘటనాస్థలిలో 21 మంది మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన కిరణ్, బాలిక సంధ్యలను చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సంధ్య మృతిచెందింది. కిరణ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఎప్పుడూ తీర్థయాత్రలకు జనాన్ని తీసుకెళ్లే ఈగల అప్పారావు ఈ ఏడాది తన కుటుంబ సభ్యులను, బంధువులను 22 మందిని తీసుకెళ్లాడు. స్వతహాగా డ్రైవరు అయిన అప్పారావు సొంత తుఫాన్ వ్యాన్ (ఏపీ 31 టీసీ-3178)లో 6వ తేదీన తిరుపతి తదితర పుణ్యక్షేత్రాలకు వీరిని వెంటబెట్టుకువెళ్లాడు. 9వ తేదీన తిరుపతి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. 12వ తేదీన (శుక్రవారం) విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. అదే రోజు రాత్రి అక్కడి నుంచి బయలుదేరారు. శనివారం ఉదయం సింహాచలం అప్పన్నను దర్శించుకుని స్వగ్రామం మోసయ్యపేటకు వెళ్లాలనుకున్నారు. ఈలోపే ప్రమాదం బారిన పడ్డారు. తెల్లారేసరికి పిడుగులాంటి వార్త.. తమ వారంతా యాత్రలు ముగించుకుని వచ్చేస్తున్నారని ఇంటి వద్ద మిగిలిన వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. తెల్లవారే సరికి పిడుగులాంటి వార్త టీవీల్లో వచ్చింది. గోదావరిలో తూఫాన్ వ్యాన్ బోల్తాకొట్టిందని అందులో ఉన్న 22 మంది మృత్యువాతపడ్డారని.. విశాఖ జిల్లా అచ్యుతాపురం మోసయ్యపేట వాసులని. అంతే.. మన డ్రైవర్ ఆప్పారావు వ్యానే అని నిర్ధారణకొచ్చారు. తెల్లారగానే ఊరు ఊరంతా విషాదంలో మునిగిపోయింది. పరుగుపరుగున అప్పారావు, వారి బంధువుల ఇంటికి తండోపతండోలుగా వెళ్లారు. అప్పారావు కుటుంబంతా మృత్యువాతపడగా.. ఇప్పుడా కుటుంబంలో అప్పారావు తండ్రి 85 ఏళ్ల వెంకులు ఒక్కడే బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. అయిన వారందరినీ పోగొట్టుకుని విగతజీవిలా ఉన్నాడు. యాత్ర ముగించుకుని వీరు శనివారం సింహాచలం నృసింహస్వామిని దర్శించుకుని స్వగ్రామం మోసయ్యపేటకు చేరుకోవలసి ఉంది. వారి ఆచారం ప్రకారం గ్రామం నుంచి శుక్రవారం రాత్రే 20 మందితో కలిసి తోడపెద్దు (ఆంబోతు)ను సింహాచలం పంపించారు. వీరంతా సింహాచలంలో అప్పారావు కుటుంబం కోసం వేచి చూస్తున్న తరుణంలోనే ఘోరం జరిగిపోయింది. మోసయ్యపేటతో పాటు సమీపంలోని అచ్యుతాపురం, పరిసర గ్రామాలు శనివారం శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు మృతుల ఇళ్ల వద్దకు చేరుకుని కన్నీరు పెట్టుకున్నారు. డ్రైవర్ అప్పారావుగా పేరు గడించిన అప్పారావుకు ఈ ప్రాంతంలో మంచిపేరుంది. పాతికేళ్లుగా స్థానికుల్ని తీర్థయాత్రలకు తీసుకెళ్తుండడంతో అందరితో పరిచయాలున్నాయి. దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన ఆ కుటుంబీకులను ఓదార్చడానికి భారీ సంఖ్యలో ఇరుగుపొరుగు గ్రామాల వారు వచ్చారు. కాగా ఏపీ హోం మంత్రి చినరాజప్ప మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మృతుల వివరాలు ఈగల అప్పారావు(55), అతని భార్య కనక(40), పెద్ద కుమారుడు రాజు(27) కోడలు లక్ష్మి (23), రెండో కుమారుడు ప్రసాద్ (25), కోడలు అన్నపూర్ణ(21), మూడో కుమారుడు గోపి(24), అప్పారావు కుమార్తె కోనా వెంకటలక్ష్మి(27), అల్లుడు రమణ(30), అప్పారావు మనుమలు కోన సాయి(8), ఈగల హర్ష(2), ఈగల నవ్య(4), ఈగలఅమిత్(5), ఈగల కార్తీక్ (7) మృతి చెందారు. అప్పారావుకు వరసకు సోదరుడైన ఈగల రాంబాబు(32), అతని భార్య కొండమ్మ(30), తల్లి చిన్నమ్మ(60), రాంబాబు కుమార్తె సంధ్య(14), అప్పారావు సోదరి దార్ల చిట్టమ్మ(68), గాజువాక మండలం కుర్మన్నపాలెంకు చెందిన అప్పారావు మరదలు పుర్రే సునీత(29), మరో మరదలు రంబిల్లి మండలం కొత్తకోడూరుకు చెందిన అల్లు లక్ష్మి(35), సునీత కుమారుడు పుర్రే పవన్(8) మృతి చెందగా, రాంబాబు కుమారుడు కిరణ్‌సాయిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. మూడు గంటల తర్వాత వెలుగులోకి.. ధవళేశ్వరం నుంచి సాక్షి ప్రతినిధి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి తూఫాన్ వ్యాను బోల్తా పడి ప్రమాదం జరిగిన మూడు గంటల తరువాత కాని ఈ సంఘటన వెలుగు చూడలేదు. కాటన్ హయాంలో నిర్మించిన పాత ఆనకట్ట, తరువాత నిర్మించిన బ్యారేజీ స్కవర్ల ఆపరేషన్ నిర్వహించే స్లూయిజ్ వద్ద వ్యాను బోల్తా కొట్టింది. అక్కడ 30 అడుగుల లోతున సిమెంట్ తొట్టెలా ఉంటుంది. ప్రమాదం జరిగిన చోట బ్యారేజీపై లైటింగ్ లేకపోవడం వల్ల ప్రమాదాన్ని గుర్తించ లేకపోయారు. ప్రమాదానికి గురైన వాహనం శుక్రవారం అర్ధరాత్రి 12.51 గంటల సమయంలో ఏలూరు సమీపాన కలపర్రు టోల్ గేట్ దాటినట్టు నమోదయింది. కలపర్రు నుంచి ధవళేశ్వరం సుమారు 95 కిలోమీటర్లు. దీన్నిబట్టి అర్ధరాత్రి సుమారు రెండున్నర, మూడు గంటల మధ్యలో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాద సంఘటన తెల్లవారుజాము 5.30 గంటల వరకూ ఎవరికీ ఈ విషయం తెలియలేదు. ముందే తెలిస్తే కొందరి ఊపిరైనా నిలిచేది: ప్రమాదం జరిగిన వెంటనే ఎవరికైనా తెలిసి ఉంటే కొంతమందైనా ప్రాణాలతో బయటపడేవారు. వాస్తవానికి కాటన్ బ్యారేజీపై సిబ్బంది రాత్రి గస్తీ నిర్వహిస్తారు. తెల్లవారుజాము వరకూ విషయం ఇరిగేషన్ సిబ్బందికి కూడా తెలియలేదు. ఘటనా స్థలానికి కూతవేటు దూరంలోనే లాకు కార్యాలయం ఉన్నప్పటికీ అక్కడ ఉన్న సిబ్బందికి మత్స్యకారులు చెప్పేవరకూ ప్రమాద విషయం తెలియక పోవడం గమనార్హం. -
దుర్గమ్మ దర్శన వేళలు పెంపు
ఇంద్రకీలాద్రి : జగజ్జనని దుర్గమ్మ దర్శన వేళలను పెంచుతూ దేవస్థానం నిర్ణయం తీసుకుంది. రాష్ర్ట రాజధానిగా అమరావతిని ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అమ్మవారి దర్శనానికి విశేషంగా తరలివస్తున్నారు. దీనికితోడు రెండు నెలలుగా సాధారణ భక్తుల సంఖ్య కూడా పెరిగింది. శుక్ర, ఆదివారాల్లో భక్తులు 40 నుంచి 50వేల వరకు వస్తుండటంతో దర్శనానికి ఇబ్బందికరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు రోజులు దర్శన వేళలను పెంచుతూ ఈవో నర్సింగరావు నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రాత్రి 9 గంటల వరకే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇకపై శుక్ర, ఆదివారాల్లో తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారితో పాటు మల్లేశ్వరస్వామి, ఇతర ఉపాలయాల్లో దర్శన భాగ్యం కల్పిస్తారు. దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలను ఏఈవో స్థాయి అధికారులు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. కొండపై భక్తుల రద్దీకి అనుగుణంగా ఘాట్‌రోడ్డుపైకి వాహనాలను అనుమతించాలా, వద్దా అనేది ఏఈవోలు నిర్ణయిస్తారు. శుక్ర, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొండపైకి ప్రయివేటు రవాణా వాహనాలతో పాటు కార్లు నిలిపివేస్తారు. 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అంతరాలయ దర్శనాన్ని కూడా నిలిపివేస్తారు. -
నయనానందకరంగా కనకదుర్గమ్మ తెప్పోత్సవం
-
సరస్వతీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ: పోటెత్తిన భక్తజనం
సాక్షి, విజయవాడ : సర్వలోకపావని.. జగన్మాత కనకదుర్గమ్మను సరస్వతీదేవి అలంకారంలో దర్శించుకునేందుకు అశేష భక్తజనవాహిని ఇంద్రకీలాద్రికి తరలివచ్చింది. ఎటుచూసినా జనం.. ఎక్కడ విన్నా దుర్గమ్మ నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మ జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కళకళలాడింది. క్యూలైన్లు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. రద్దీ దృష్ట్యా గురువారం వేకువజామున 1.45 గంటల నుంచే అమ్మ దర్శనానికి భక్తులను అనుమతించారు. బుధవారం అర్ధరాత్రి నుంచే క్యూలైన్లో వేచి ఉన్నవారు తొలి దర్శనం చేసుకుని పులకించిపోయూరు. రద్దీ గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఉదయం గంటన్నరలోపే దర్శనం కాగా, సాయంత్రం నాలుగు గంటల సమయం పట్టింది. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయూయి. ఒకదశలో బొడ్డుబొమ్మ సెంటర్‌ను దాటాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో ముందుగా నిర్ణయించినట్టే అంతరాలయ దర్శనం రద్దుచే శారు. కేవలం ముఖమండప దర్శనం చేయించారు. టికెట్లు రద్దుచేసి భక్తులకు అన్ని క్యూల్లోనూ ఉచిత ప్రవేశం కల్పించారు. జోరువానను సైతం లెక్కచేయకుండా.. ఫైలిన్ తుపాను కారణంగా బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జోరున వర్షం కురుస్తూనే ఉంది. భక్తులు వర్షాన్ని, చలిని సైతం లెక్కచేయకుండా దర్శనానికి వచ్చారు. ప్రముఖుల రాక రాష్ర్ట ప్రభుత్వం తరఫున దుర్గమ్మకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ర్ట గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సతీమణి రాధికారెడ్డి, సీపీ బత్తిన శ్రీనివాస్ దంపతులు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, దర్శకుడు అడ్డాల శ్రీను తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. మూడు విడతలుగా కుంకుమార్చన మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని భవానీదీక్షా మండపంలో మూడు విడతలుగా కుంకుమార్చన జరిగింది. ఉభయదాతల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు త్వరత్వరగా దర్శనం చేయించి పంపించేందుకు ప్రయత్నించారు. కొండపైకి వాహనాల అనుమతి రద్దు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో గురువారం తెల్లవారుజాము నుంచి కొండపైకి వీఐపీ, మీడియా వాహనాలను అనుమతించలేదు. దేవస్థానం రెండు బస్సులను కూడా నిలిపివేయడంతో వృద్ధులు, వికలాంగులు కొండపైకి చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. ఎన్సీసీ వలంటీర్ల సహాయంతో ఆలయూనికి చేరుకున్నారు. ఒకానొక సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, దర్శనానికి మూడు గంటల సమయం పట్టడంతో పలువురు భక్తులు నీరసించి క్యూలైన్లోనే కుప్పకూలిపోయూరు. సీపీ శ్రీనివాసులు, సబ్ కలెక్టర్ హరిచందన, ఈవో ప్రభాకర శ్రీనివాస్ తదితరులు ఎప్పటికప్పుడు ఆలయంలో కలియ తిరుగుతూ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి భార్య రాకతో పోలీసుల హల్చల్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సతీమణి రాధికారెడ్డి రాకతో పోలీసులు హడావుడి చేశారు. జాతీయ రహదారిపై రాజగోపురం వద్ద అరగంట సేపు వాహనాలు నిలిపివేయడంతో ప్రయూణికులు ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు, వికలాంగులు నడుచుకుంటూ వస్తున్నా పట్టించుకోని అధికారులు ముఖ్యమంత్రి సతీమణి వాహనాన్ని రాజగోపురం వరకు తీసుకొచ్చి ప్రభుభక్తిని చాటుకున్నారు. -
దుర్గమ్మ దర్శనానికి నేతలు దూరం
= సమైక్య సెగతో ముఖం చాటేసిన మంత్రులు = కానరాని ద్వితీయశ్రేణి నేతలు సాక్షి, విజయవాడ : రాజకీయ నేతలకు సమైక్య సెగ తలగడంతో వారంతా దుర్గమ్మ దర్శనానికి దూరంగా ఉన్నారు. నేతలు ఏటా దసరా ఉత్సవాల్లో కొండపైన హల్చల్ చేసేవారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ అనుచరగణంతో దుర్గమ్మ దర్శనానికి వచ్చి వీఐపీ దర్శనాలు చేసుకునేవారు. వారికి ఆలయమర్యాదలతో స్వాగతం.. వేదపండితులతో ఆశ్వీరాదం.. అమ్మవారి కుండువాలు.. ప్రసాదాలు ఒకటేమిటి ఆ హడావుడే వేరుగా ఉండేది. ఇక ఉత్సవాల ఏర్పాటులో కూడా నేతలు తమదైన పాత్ర పోషించేవారు. దేవాదాయశాఖ మంత్రి నుంచి కిందిస్థాయిలో ఉత్సవ కమిటీ సభ్యుల వరకు ఎవరికివారు అధికారులకు ఉచిత సలహాలిచ్చి వాటిని పాటించాలంటూ హడావుడి చేసేవారు. ఇందకీలాద్రిపై పండగ పది రోజులూ రాజకీయ నాయకుల హడావుడే ఎక్కువగా కనపడేది. ఈ ఏడాది కనబడితే ఒట్టు.. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఆ పరిస్థితి ఎక్కడా కానరావడం లేదు. దసరా ఉత్సవాలు సగం రోజులు అయిపోయాయి. ఇప్పటికే పలుమార్లు ఉత్సవాల నిర్వహణపై అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించినా, వాటికి ప్రజాప్రతినిధులు దూరంగానే ఉన్నారు. కనీసం ఒక్క సలహా కాని, సూచన కాని చేయడం లేదు. ఇక దుర్గగుడిపై రాజకీయ నాయకులు కనపడితే ఒట్టు. ఒకరిద్దరు నాయకులు అమ్మవారిపై భక్తితో వచ్చినా దర్శనం చేసుకుని వెళ్లిపోతున్నారు తప్ప.. అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఏమాత్రం సాహసించడం లేదు. ప్రస్తుత పరిస్థితులు బాగోనందున ఉత్సవాల్లో జోక్యం చేసుకుని విమర్శలుపాలు కావడం ఎందుకని దూరంగా ఉన్నామంటూ విజయవాడ నగరానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి ‘సాక్షి ’ వద్ద వ్యాఖ్యానించారు. ఉద్యమ సెగే కారణం... నాయకులు ఉత్సవాలకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం సమైక్య ఉద్యమమేనని భక్తులు నమ్ముతున్నారు. గత ఏడాది దసరా ఉత్సవాల్లో మూలానక్షత్రం రోజున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య విచ్చేసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి తోట నరసింహంతో పాటు రాష్ట్ర మంత్రులు ప్రసాద్‌కుమార్, విశ్వరూప్, కన్నా లక్ష్మీనారాయణ, కేపీ సారథి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు గత ఏడాది దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీ నేత కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి కృష్ణంరాజు తదితర నాయకులంతా అమ్మవారిని దర్శించుృున్నవారే. ఈ ఏడాది వారిలో చాలామంది ముఖం చాటేశారు. ఎంపీ లగడపాటి, కొనగళ్ల నారాయణరావులు ప్రజలకు అందుబాటులోనే లేరు. టీడీపీ, బీజేపీ నాయకులు కూడా ఇంద్రకీలాద్రి ఎక్కేందుకు సాహసించడం లేదు. దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య మాత్రం గురువారం సాయంత్రం దుర్గగుడి వస్తారనే ప్రచారం జరుగుతోంది. జిల్లా మంత్రి కేపీ సారథి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని సమాచారం. వీరుగాక మిగిలిన మంత్రులు దుర్గగుడి వైపు చూసేందుకు కూడా సాహసించడం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం ముమ్మరంగా సాగుతున్నందున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ఈ ఏడాది దుర్గగుడికి రాకపోవచ్చని తెలిసింది. ఈసారి ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, చిన్నం రామకోటయ్య మాత్రమే దుర్గగుడికి వచ్చారు. సమైక్యానికి మద్దతు ప్రకటించి అమ్మవారి దర్శనం చేసుకుని చల్లగా జారుకున్నారు. ఉత్సవ కమిటీ ఊసే లేదు... గత ఏడాది ఉత్సవాలు ప్రారంభమైన రెండోరోజే 51 మందితో ఉత్సవ కమిటీ వేశారు. ఈ ఏడాది ముఖ్యమంత్రి సమైక్య ఉద్యమంలో తలమునకలై ఉన్నందున ఉత్సవ కమిటీ గురించి పట్టించుకోలేదని చెబుతున్నారు. భక్తులకు సౌకర్యాలకు మాత్రం ఏమాత్రం లోటు రాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
నేటి నుంచి దసరా ఉత్సవాలు
సాక్షి,విజయవాడ : దసరా మహోత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. అమ్మవారి దర్శనానికి రాష్ట్రం నలుమూలలు నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. శనివారం నుంచి తొమ్మిది రోజుల పాటు పది అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిని రంగురంగుల విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ కాంతుల మధ్య అమ్మవారి స్వర్ణశిఖరం ధగధగలాడుతోంది. ఎన్టీటీపీఎస్ ఉద్యోగుల సమ్మె వల్ల కొండపై విద్యుత్తు దీపాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు భారీ జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రికి చేరుకునే నలు దిక్కులా భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై స్వాగత తోరణాలు కట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పటికీ దుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తారని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఆ అంచనాలతో సకల సౌకర్యాలు కల్పించారు. ఆనవాయితీ ప్రకారం శుక్రవారం సాయంత్రం నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వీటిని ఉత్సవాల తొలిరోజున అమ్మవారికి అలంకరిస్తారు. తొమ్మిది రోజుల్లో పది అలంకారాలు ఏటా దసరా ఉత్సవాలు పది రోజులు జరుగుతాయి. ఈ ఏడాది మాత్రం తొమ్మిది రోజుల్లోనే ముగుస్తాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో అష్టమి రోజున దుర్గాదేవిగా, నవమి నాడు మహిషాసురుడ్ని చంపిన మహిషాసురమర్దనీదేవిగా అమ్మవారు దర్శనం ఇస్తారు. ఈసారి ఈ రెండు తిథులు ఒకే రోజు 12వ తేదీ శనివారం వచ్చాయి. దీంతో అదే రోజు ఉదయం దుర్గాదేవిగా, మధ్యాహ్నం నుంచి శ్రీ మహిషాసుమర్దనీదేవిగా అలంకరించనున్నారు. అంటే ఆ రోజు అమ్మవార్ని రెండు అలంకారాల్లో భక్తులు దర్శించుకోవచ్చు. ఆఖరు రోజున శ్రీ రాజరాజేశ్వరీ రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఇలా ఒకే రోజు రెండు తిథులు రావడం అరుదుగానే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. నేడు స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా దర్శనం తొలిరోజున అమ్మవారు స్వర్ణకవచాలంకృత కనకదుర్గమ్మగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మెలిమి బంగారపు వన్నే కలిగిన పట్టుచీర ధరించి చేతిలో త్రిశూలం ధరించి శిరస్సుపై సూర్యచంద్రులు, భుజాలపై శంకుచక్రాలతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తెల్లవారు జామున స్నపనాభిషేకం జరిపి అమ్మవారికి ప్రత్యేక అలంకారం చేస్తారు. అనంతరం ఉదయం అమ్మవారి ప్రధాన ఉత్సవమూర్తులను భవానీదీక్షా మండపానికి తీసుకుని వచ్చిన అనంతరం దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు. ప్రత్యేక బస్సులు నగరంలో సమైక్య బంద్, ఉద్యమకారుల రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకోవడం కొంత కష్టమే. ఆర్టీసీ బస్సులు తిరగనందున ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రైవేటు బస్సుల్ని ఏర్పాటు చేశారు. ఈ బస్సులను రైల్వేస్టేషన్ నుంచి కొండవరకూ నడుపుతారు.