పశ్చిమబెంగాల్: ఈ ఏడాది దసరా పండుగా సందర్భంగా దక్షిణ కోల్‌కతా బరిషా క్లబ్ వలసదారుల కష్టాలను ఇంతి వృత్తంగా తీసుకుని అమ్మ విభజన (భగెర్ మాత)పేరుతో దుర్గామాత విగ్రహన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలవడమే కాక ప్రతి ఒక్కర్ని ఆలోచింపజేసే విధంగా ఉంది. ఎడమవైపు బంగ్లాదేశ్‌ని కుడివైపు కుడి వైపు భారత సరిహద్దును సూచిస్తుంది. ఆమె ఏ మాతృభూమికి చెందనదిగా దీనంగా సరిహద్దులో దుర్గామాతను ఎత్తుకుని నలుగురు బిడ్డలతో కలిసి నిర్బంధ శిబిరాలలో శరణార్థ కుటుంబాలతో ఉన్నట్టుగా ఉంటుంది.
(చదవండి: ఆ గాయని వస్తువులు మిలియన్ డాలర్లు!)
ఈ విగ్రహం శరణార్థులకు ఎటువంటి పౌరసత్వం లేక భయం భయంగా కాలాన్ని వెళ్లదీస్తున్న ఘటనను వివరిస్తోంది. వలసలతో పిల్లలను తీసుకుని వచ్చే ప్రతి తల్లి ఒక దుర్గామాతతో సమానం. తన పిల్లల ప్రాణాల కోసం ఎంత దూరమైన వ్యయప్రయాసలు పడైన వలసవెళ్లే తల్లులు దుర్గామాత లాంటి దేవతేనని స్పష్టం చేసేలా ఉంది.
వారి పట్ట మన వైఖరి ఎలా ఉండాలో అందరికీ అవగతమయ్యేలా ఆ విగ్రహన్ని ఆవిష్కరించారు. ఎండను వాననూ లెక్కచేయక ఆకలి చేతబట్టి పిల్లలతో వలసల వచ్చే ప్రతి తల్లి మూర్తిభవించిన దుర్గామాతతో సమానం. తన కుటుంబ రక్షణకై ప్రాణాలను అరచేత బట్టి వలస వచ్చే ప్రతితల్లిలోని అచంచలమైన ఆత్మివిశ్వాసానికి అందరూ తలవంచి నమస్కరించాల్సిందే అన్నట్లుగా ఆ విగ్రహన్ని రూపొందించారు. వారి పట్ల ప్రతి ఒక్కరి బాధ్యతలేమిటో గుర్తు చేసే విధంగా ఉంది
Comments
Please login to add a commentAdd a comment