dassara
-
వైభవంగా శ్రీవారి చక్రస్నానం .. కోనేటిలో భక్తుల స్నానాలు
-
సందడిగా సద్దుల బతుకమ్మ.. ఆటపాటలతో ఆడబిడ్డలు
-
ముక్కా చుక్కా..లక్కీ డ్రా
-
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..4వ రోజు పోటెత్తిన జనం
-
ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రులు !
-
దసరా రోజున కొత్త జాతీయ పార్టీని ప్రకటించనున్న సీఎం కేసీఆర్
-
ప్రవాసి దుర్గా మాతలు
పశ్చిమబెంగాల్: ఈ ఏడాది దసరా పండుగా సందర్భంగా దక్షిణ కోల్‌కతా బరిషా క్లబ్ వలసదారుల కష్టాలను ఇంతి వృత్తంగా తీసుకుని అమ్మ విభజన (భగెర్ మాత)పేరుతో దుర్గామాత విగ్రహన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలవడమే కాక ప్రతి ఒక్కర్ని ఆలోచింపజేసే విధంగా ఉంది. ఎడమవైపు బంగ్లాదేశ్‌ని కుడివైపు కుడి వైపు భారత సరిహద్దును సూచిస్తుంది. ఆమె ఏ మాతృభూమికి చెందనదిగా దీనంగా సరిహద్దులో దుర్గామాతను ఎత్తుకుని నలుగురు బిడ్డలతో కలిసి నిర్బంధ శిబిరాలలో శరణార్థ కుటుంబాలతో ఉన్నట్టుగా ఉంటుంది. (చదవండి: ఆ గాయని వస్తువులు మిలియన్ డాలర్లు!) ఈ విగ్రహం శరణార్థులకు ఎటువంటి పౌరసత్వం లేక భయం భయంగా కాలాన్ని వెళ్లదీస్తున్న ఘటనను వివరిస్తోంది. వలసలతో పిల్లలను తీసుకుని వచ్చే ప్రతి తల్లి ఒక దుర్గామాతతో సమానం. తన పిల్లల ప్రాణాల కోసం ఎంత దూరమైన వ్యయప్రయాసలు పడైన వలసవెళ్లే తల్లులు దుర్గామాత లాంటి దేవతేనని స్పష్టం చేసేలా ఉంది. వారి పట్ట మన వైఖరి ఎలా ఉండాలో అందరికీ అవగతమయ్యేలా ఆ విగ్రహన్ని ఆవిష్కరించారు. ఎండను వాననూ లెక్కచేయక ఆకలి చేతబట్టి పిల్లలతో వలసల వచ్చే ప్రతి తల్లి మూర్తిభవించిన దుర్గామాతతో సమానం. తన కుటుంబ రక్షణకై ప్రాణాలను అరచేత బట్టి వలస వచ్చే ప్రతితల్లిలోని అచంచలమైన ఆత్మివిశ్వాసానికి అందరూ తలవంచి నమస్కరించాల్సిందే అన్నట్లుగా ఆ విగ్రహన్ని రూపొందించారు. వారి పట్ల ప్రతి ఒక్కరి బాధ్యతలేమిటో గుర్తు చేసే విధంగా ఉంది (చదవండి: భారత స్పేస్ అసోసియేషన్‌ని ప్రారంభించనున్న మోదీ) -
ఆప్కో వస్త్రాలపై 50 శాతం తగ్గింపు
హైదరాబాద్: దసరా, దీపావళి పండుగల సందర్భంగా అన్ని రకాల చేనేత వస్త్రాలపై 50 శాతం ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నట్లు ఆప్కో చైర్మన్ గుజ్జ శ్రీను తెలిపారు. గురువారం తిలక్‌రోడ్‌లోని జీహెచ్ఎంసీ కాంప్లెక్స్‌లో ఆప్కో నూతన శాఖను ఆయన ప్రారంభించారు. ఈ ఆఫర్ ఈ నెల 31 వరకు ఉంటుందన్నారు. ఆప్కో వస్త్రాల కొనుగోలు ద్వారా చేనేతకు చేయూతనిచ్చినట్లుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఆఫీసర్ కె.జగదీశ్వర్‌రావు, డివిజన్ మార్కెటింగ్ ఆఫీసర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఏడాది దసరాకల్లా యాదాద్రి సిద్ధం
-
వచ్చే ఏడాది దసరాకల్లా యాదాద్రి సిద్ధం
- అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది దసరా నాటికి యాదాద్రి దేవాలయాన్ని భక్తుల సందర్శనకు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష జరిగింది. మంత్రులు కె.తారక రామారావు, లకా్ష్మరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో యాదాద్రి దేవస్థానం తుది నమూనాకు కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ప్రధాన ఆలయ సముదాయాల నిర్మాణం, భక్తులు సేదతీరేందుకు నిర్మించే కాటేజీలకు సంబంధించి త్రీడీ వీడియో, ఫొటోలను సీఎం వీక్షించారు. ఆలయ కట్టడాల నమూనాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు రాజగోపురాలతోపాటు ప్రాకార మండపాలు పూర్తిస్థాయి శిలతో నిర్మించనున్నారని, పూర్తిస్థాయి కృష్ణశిలతో నిర్మితం కావడం ఆలయ విశేషమని ఆయన అన్నారు. 500 మంది నిష్ణాతులైన శిల్పులు పనుల్లో నిమగ్నమయ్యారని అధికారులు తెలపడంతో సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. కాటేజీల నిర్మాణానికి ఓకే యాదాద్రిలో భక్తుల బస కోసం 250 ఎకరాల్లో నిర్మించ తలబెట్టిన కాటేజీల నమూనాలకు చిన్నచిన్న మార్పులతో సీఎం ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి, ప్రధాని తదితర వీవీఐపీల బస కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కాటేజీలు, దైవ సన్నిధి నిర్మాణాల తీరును అభినందించారు. ఆగమ శాస్త్ర సూత్రాలతో తంజావూరు వంటి వేల ఏళ్ల కిందటి సంప్రదాయ నిర్మాణ కౌశలానికి యాదాద్రి దేవాలయం ప్రాణప్రతిష్ట పోయనుందని అన్నారు. నిర్మాణాల అనంతరం గుట్టపైన వెల్లివిరిసే పచ్చదనంవల్ల ఆలయాల పరిసరాల ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వివరించారు. 108 అడుగుల ఆంజనేయ విగ్రహానికి ఆమోదం యాదాద్రి దేవస్థానం క్షేత్ర పాలకుడిగా 108 అడుగుల భారీ ఆంజనేయస్వామి పాలరాతి విగ్రహ నమూనాకు కేసీఆర్ ఆమోదం తెలిపారు. విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు చైనాకు చెందిన రూపశిల్పులు ముందుకు వచ్చారు. ఈ మేరకు భారీ ఆంజనేయ విగ్రహ నిర్మాణానికి ఆర్కిటెక్చర్ ఆనందసాయి ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ సభ్యులు త్వరలో చైనాను సందర్శించనున్నారు. పాలరాతితో తయారు చేసిన నమూనా ప్రతిమను వారికి అప్పగించి భారీ విగ్రహ రూపకల్పనకు నాంది పలుకనున్నారు. -
పని చేయటం మానేసి పండుగలా?
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ పని చేయటం మానేసి పండుగలు చేస్తోందని బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం రైతులు దసరా చేసుకునే పరిస్థితిలో లేరని ఆయన శనివారమిక్కడ అన్నారు. విద్యుత్ సమస్యలతో రైతాంగం సతమతం అవుతుందన్నారు. రాష్ట్రంలో పరిపాలన సాగటం లేదని, నాలుగు నెలల్లో ఒక్క రూపాయి కరెంట్ అయినా కొన్నారా అని నాగం ప్రశ్నించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడానికే ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.