వేదమాతకు వందనం
ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మూడు రోజుల నుంచి కడు వేడుకగా జరుగుతున్నాయి. నాలుగు వేదాలను నాలుగు ముఖాలుగా చేసుకున్న వేదమాత గాయత్రీదేవి రూపంలో దుర్గమ్మ గురువారం భక్తులకు దర్శనమిచ్చింది. తెల్లవారుజామున మూడు గంటలకు అమ్మవారికి విశేష అలంకారం, నిత్య అర్చనల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
- విజయవాడ (ఇంద్రకీలాద్రి)
నేటి అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి
శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ శుక్రవారం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. తలచినంతనే అష్టరూపాల్లో అష్టసిద్ధుల్ని ప్రసాదించే శ్రీ మహా లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. మంగళప్రదమైన దేవత శ్రీ మహా లక్ష్మీదేవి. దుర్గా సప్తశతి అంతర్గతమైన దేవి ఆదిపరాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్ని ధరించి దుష్టరాక్షస సంహారాన్ని చేసింది. లోకస్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మిగా వరాలను ప్రసాదించే అష్టలక్ష్మిగా.. అమృత స్వరూపాన్ని దర్శించవచ్చు. అమ్మను వేడుకుంటే దుఃఖాన్ని నాశనం చేసి.. దరిద్రాన్ని పారద్రోలి అషై ్టశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
-విజయవాడ (ఇంద్రకీలాద్రి)