'డిసెంబర్లో అంతర్జాతీయ సంగీత కార్యక్రమం'
'డిసెంబర్లో అంతర్జాతీయ సంగీత కార్యక్రమం'
Published Sat, Oct 8 2016 7:32 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇక నుంచి ప్రతి నెలా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని సీఎం దంపతులు శనివారం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి కావాలని అమ్మ వారిని కోరుకున్నానన్నారు. డిసెంబర్లో అంతర్జాతీయ సంగీత కార్యక్రమం నిర్వహిస్తామని బాబు తెలిపారు.
Advertisement
Advertisement