విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శ్రావణ శుక్రవారం సందర్భంగా వరమహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తోంది. శుక్రవారం వేకువజామున అమ్మవారికి అర్చకులు అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక అలంకారం చేసిన తర్వాత ఉదయం 8.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.
అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. ముఖమండపం నుంచే దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశారు. అదనంగా ఒక క్యూలైన్ సహా మొత్తం ఐదు క్యూలైన్లను అందుబాటులో ఉంచారు.