దుర్గమ్మకు అగ్గిపెట్టెలో చీర సమర్పణ  | Saree Offering In Matchbox To Vijayawada Durgamma | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు అగ్గిపెట్టెలో చీర సమర్పణ 

Published Tue, Apr 11 2023 9:24 AM | Last Updated on Tue, Apr 11 2023 2:38 PM

Saree Offering In Matchbox To Vijayawada Durgamma - Sakshi

అధికారులకు చీర చూపిస్తున్న విజయ్‌ 

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు విజయ్‌ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను సోమవారం సమర్పించారు.

బంగారం, వెండి జరీతో చేసిన ఈ చీరకు ప్ర త్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ ఐదు గ్రాముల బంగారం, పది గ్రాముల వెండిని ఉపయోగించి మంచి పట్టు దారాలతో ఈ చీరను నేశామన్నారు. దీని బరువు సుమారు 100 గ్రాములు ఉంటుందని తెలిపారు. చేనేత వృత్తిని కాపాడాలని అమ్మవారిని వేడుకున్నానని వివరించారు.
చదవండి: రామోజీ.. మీ ప్రేమ మాకు అక్కర్లేదు.. అప్పుడెక్కడ దాక్కున్నావు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement