Matchbox
-
దుర్గమ్మకు అగ్గిపెట్టెలో చీర సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు విజయ్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను సోమవారం సమర్పించారు. బంగారం, వెండి జరీతో చేసిన ఈ చీరకు ప్ర త్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఐదు గ్రాముల బంగారం, పది గ్రాముల వెండిని ఉపయోగించి మంచి పట్టు దారాలతో ఈ చీరను నేశామన్నారు. దీని బరువు సుమారు 100 గ్రాములు ఉంటుందని తెలిపారు. చేనేత వృత్తిని కాపాడాలని అమ్మవారిని వేడుకున్నానని వివరించారు. చదవండి: రామోజీ.. మీ ప్రేమ మాకు అక్కర్లేదు.. అప్పుడెక్కడ దాక్కున్నావు? -
అంతర్జాతీయ వేదికపై మెరిసిన అగ్గిపెట్టె చీర
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తయారైన అగ్గిపెట్టెలో ఇమిడే చీర అంతర్జాతీయ వేదికపై మెరిసింది. సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడి, కట్టుకోవడానికి వీలుగా ఉండే పట్టుచీరను నేశారు. ఆ చీరను ఆ్రస్టేలియాలో ఉండే ఎన్ఆర్ఐ రాధిక కొనుగోలు చేసి ఆ్రస్టేలియా–ఇండియా బిజినెస్ కౌన్సిల్లో ప్రదర్శించారు. పట్టుదారం పోగులతో 100 గ్రాముల బరువు, 5.500 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో అగ్గిపెట్టెలో ఇమిడేలా చీరను విజయ్‌కుమార్ మరమగ్గం (పవర్లూమ్)పై నేశాడు. ఆ చీరను రాధిక ప్రదర్శించి సిరిసిల్ల నేత కళాకారుల నైపుణ్యాన్ని అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తీసుకొచ్చారు. చదవండి: మినరల్ వాటర్.. మిల్లెట్ భోజనం! -
నేత బ్యాగు.. మోత బాగు
సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు నల్ల శ్రావణ్ చేతిలో ఇమిడిపోయే సూక్ష్మ బ్యాగును సృష్టించారు. అగ్గిపెట్టెలో ఇమిడేచీరను నేసి నాలుగు దశాబ్దాల కిందటే ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు కుమారుడే నల్ల శ్రావణ్. వస్త్రోత్పత్తిలో వినియోగించే వార్పు నైలాన్ పోగులు, వెప్టు పీసీ ధారంతో ఈ సూక్ష్మ సంచిని తయారు చేశాడు. పొడవు 24 ఇంచులు, వెడల్పు 16 ఇంచులతో కేవలం 24 గ్రాముల బరువుతో చేతిలో ఇమిడి పోయేలా బ్యాగును రూపొం దించాడు. ఈ బ్యాగును ‘కీ’ చైన్‌తో ఉంచుకునే అవకాశం ఉంది. ప్లాస్టిక్ కవర్లను సిరిసిల్లలో నిషేధించిన నేపథ్యంలో బట్టతో చేసిన సూక్ష్మ బ్యాగును ఎక్కడికైనా తీసుకెళ్లేలా తయారు చేశాడు. 10 కిలోల బరువు గల వస్తువులను మోయగల సామర్థ్యంతో బ్యాగును రూపొందించినట్లు శ్రావణ్ తెలిపారు. చేతిలో ఇమిడి పోయే బ్యాగును తయారు చేసినందుకు శ్రావణ్‌ను పలువురు అభినందించారు. -
అరుదైన హాబీ.. ఇల్లు దాటకుండానే
భువనేశ్వర్: మనలో చాలా మందికి వేర్వేరు హాబీలు ఉంటాయి. కొందరికి వివిధ దేశాల కరెన్సీ, జాతీయ జెండాలు వంటివి కలెక్ట్ చేసే అలవాటు ఉంటే.. మరి కొందరికి అందమైన ఫోటోలు కలెక్ట్ చేయడం హాబీ. ఈ క్రమంలో భువనేశ్వర్‌కు చెందిన మూడవ తరగతి విద్యార్థి దిబ్యాన్షికి అగ్గిపెట్టలు కలెక్ట్ చేయడం సరదా. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాలకు చెందిన 5000 అగ్గిపెట్టలను సేకరించింది. అయితే వీటిని సేకరించడానికి బాలిక ఆయా దేశాలకు వెళ్లలేదు. బంధవులు, స్నేహితులు ఎవరైనా విదేశాలకు వెళ్లినప్పుడు వారిచేత వీటిని తెప్పించేదట. ఈ సందర్భంగా దిబ్యాన్షి మాట్లాడుతూ.. ‘మా నాన్న వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్. దాంతో వేరు వేరు ప్రాంతాలు, దేశాలకు తిరిగే వాడు. అలా వెళ్లిన ప్రతిసారి నా కోసం అగ్గిపెట్టెలు తెచ్చేవాడు. అలానే మా బంధువులు, స్నేహితులు విదేశాలకు వెళ్తే నా కోసం అగ్గిపెట్టెలు తెమ్మని కోరేదాన్ని. ఇలా సేకరించిన వాటిని ఒక థీమ్ ప్రకారం అరెంజ్ చేశాను’ అని దిబ్యాన్షి ఏఎన్ఐకి తెలిపింది. Bhubaneswar: Dibyanshi, a class three student has collected over 5,000 matchboxes from different countries. She says,"My father is wildlife photographer & travels a lot. I also ask my relatives to bring matchboxes for me. I've organized them according to various themes." (18.12) pic.twitter.com/0Pxn0B9UjR — ANI (@ANI) December 18, 2020 ఈ సందర్భంగా దిబ్యాన్షి తల్లి గోపా మొహంతి మాట్లాడుతూ.. ‘నా భర్త వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఓ సారి తన స్నేహితుడి కోసం అగ్గిపెట్టె తీసుకువచ్చాడు. దాని డిజైన్, ప్యాకింగ్ దిబ్యాన్షికి చాలా నచ్చింది. దాన్ని తన దగ్గరే ఉంచుకుంటాను అని కోరింది. ఇలా మూడేళ్ల నుంచి అగ్గిపెట్టెలు సేకరిస్తుంది. వీటిని థీమ్ ప్రకారం ప్లాస్టిక్ పెట్టెల్లే భద్రపరుస్తాము’ అని తెలిపారు. -
అగ్గిపెట్టె లేదన్నందుకు...
►యువకుడి దారుణ హత్య ►పాత కక్షలే కారణం బంజారాహిల్స్: అగ్గిపెట్టె అడిగితే లేదన్నందుకు పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని ఓ యువకుడిపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మక్సూద్‌అలీ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... ఎస్పీఆర్ హిల్స్‌లోని క్వారీలో సమీపంలోని బోరబండకు చెందిన ఆమేర్‌ఖాన్(22), అతని స్నేహితులు సొహైల్, షారూఖ్ ఆదివారం రాత్రి మద్యం సేవిస్తున్నారు. వారికి సమీపంలోనే నరేందర్ అనే యువకుడితో పాటు మరో నలుగురు స్నేహితులు మద్యం సేవిస్తున్నారు. ఈ సందర్భంగా నరేందర్ సిగరెట్ వెలిగించుకునేందుకు అమేర్‌ను అగ్గిపెట్టె అడిగాడు. ‘నేను సిగరెట్ తాగనని తెలుసుకదా అగ్గిపెట్టె ఎలా ఉంటుందని’ అమేర్ చెప్పాడు. ఆ తర్వాత ఆమేర్, అతని స్నేహితులు బైక్‌పై వెళ్లేందుకు సిద్ధపడుతుండగా నరేందర్ అమేర్‌ను పిలవడంతో అతను అక్కడికి వెళ్లాడు. అయితే కొద్ది సేపటికి అమేర్ కేకలు విన్న సొహైల్ అక్కడికి వెళ్లి చూడగా నరేందర్ కత్తితో ఆమేర్‌ను పొడుస్తున్నాడు. క్షణాల్లోనే ఆమేర్ కుప్పకూలిపోయాడు. నరేందర్ పారిపోతూ సొహైల్‌పై కూడా రాళ్లతో దాడికి యత్నించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. మృతుడి శరీరంపై 15 కత్తిపోట్లు గుర్తించారు. నరేందర్ కోసం గాలింపు చేపట్టారు. పాత కక్షల నేపథ్యంలోనే పథకం ప్రకారం ఈ దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. నరేందర్‌తో పాటు ఆయన స్నేహితులకోసం గాలింపు చేపట్టారు. -
అగ్గిపెట్టెలో పట్టుచీర
-
విమానంలోనూ అగ్గిపెట్టె నా వెంటే..
నిబంధనలు ఉల్లంఘించానన్న విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు న్యూఢిల్లీ: విమానాల్లో తానే భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. చైన్‌స్మోకర్ అయిన తాను విమానంలో ప్రయాణించేటప్పుడూ అగ్గిపెట్టెను తన వెంటే ఉంచుకుంటానని తెలిపారు. దేశంలో విమానాల్లో అగ్గిపెట్టె, లైటర్‌కు అనుమతిలేనప్పటికీ తన వెంటే తీసుకెళ్తానని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విమానయాన భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సాక్షాత్తు ఆ శాఖ మంత్రి ఇలా అన్నారు. మంగళవారమిక్కడ విమానయాన భద్రతపై నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మంత్రిని కాబట్టి విమానాశ్రయంలో ఎవరూ తనిఖీ చేయరని, అందువల్లే తీసుకెళ్తానని చెప్పారు. తాను మంత్రిగా లేనప్పుడు విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీచేసినప్పుడు చాలా అగ్గిపెట్టెలు, లైటర్లు పోగొట్టుకున్నట్లు పేర్కొన్నారు. అయితే విమానయాన మంత్రి అయిన తర్వాత తననెవరూ తనిఖీచేయడం లేదన్నారు. ఎల్లప్పుడూ తన జేబు లో అగ్గిపెట్టె ఉంటుందని, ఇప్పుడూ ఉందని అన్నారు. మీరు విమానంలో అగ్గిపెట్టెను ఎలా తీసుకెళ్తారన్న ప్రశ్నకు నేరుగా స్పందించకుండా.. అగ్గిపెట్టెతో ముప్పు వాటిల్లిన ప్రమాదాలున్నాయా అని తిరిగి ప్రశ్నించారు. -
అగ్గిపెట్టెలో చే‘నేత’ పట్టుచీర
తెలంగాణ రాష్ట్రంలో చేనేత కులస్తుల దశ మారిపో నుంది. పద్మశాలి (చేనేత) కులస్తుల కోసం, సీఎం కేసీఆర్ వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయ టానికి ముందుకురావడం అభినందనీయం. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమెరికా అధ్య క్షుడు ఒబామాకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరను మగ్గం పై నేసి కానుకగా ఇవ్వబోతున్న చేనేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్‌కు ప్రశంసలు. అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీర నేసి గతంలోనే రికార్డు సాధించిన నల్ల పరంధా ములు వంశీయుడీయన. సిరిసిల్ల, సుల్తానాబాద్, వరం గల్, జనగామ, హుజురాబాద్ ప్రాంతాల్లో నివసించే పద్మశాలి (చేనేత) కులస్తుల దయనీయ జీవితాలను మెరుగుపర్చేందుకు సత్వర చర్యలు తీసుకోవాలి. కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి, ఆదిలాబాద్ -
ఆవిష్కరణం: అగ్గిపెట్టె...ఎపుడు పుట్టె?
ఆదిమానవుడు రాయి రాయి రాపాడించి అగ్గిని రాజేయడం నేర్చుకున్నాడని పుస్తకాల్లో చదువుకున్నాం. మరి రాళ్లతో జనింపజేసిన అగ్గిని పెద్ద శ్రమలేకుండా అగ్గిపుల్లతో జనింపజేయడం ఎప్పటి నుంచి మొదలైంది, ‘అగ్గిపెట్టె’ వాడకం ఎవరిచేత ప్రారంభమైంది అంటే మాత్రం అంత సులువుగా సమాధానం చెప్పలేం. క్రీస్తుశకం ఆరో శతాబ్దంలో చైనీయులు తొలిసారి అగ్గిపుల్లను వాడటం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. రాపిడి చేత మండే స్వభావం ఉన్న రసాయనాలను మిశ్రమంగా చేసి ఒక పుల్లకు అతికించడం ద్వారా చైనా వాళ్లు అగ్గిపుల్లను సృష్టించారు. అయితే అలాంటి పుల్లలన్నింటినీ ఒక బాక్స్‌లో పెట్టుకుని వాడుకునే ఐడియా మాత్రం చైనావాళ్లకు వచ్చినట్టు లేదు. క్రీ.శ. 18వ శతాబ్దంలో తొలిసారి యూరప్‌లో ‘అగ్గిపెట్టె’ వాడకంలోకి వచ్చినట్టు తెలుస్తోంది. స్టిబ్నేట్, పొటాషియం కొలరేట్, గమ్, స్టార్చ్‌ల మిశ్రమంతో తయారు చేసిన అగ్గిపుల్లను, ఒక కరుకు కాగితంపై గీయడం ద్వారా ఆగ్గిపుడుతుందని జాన్ వాకర్ అనే ఇంగ్లిష్ రసాయన శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఆయన ఆవిష్కరణే అగ్గిపెట్టెకు ఒక రూపం కల్పించింది. బాక్స్‌లో పుల్లలను పెట్టి, బాక్స్‌కు రెండు వైపులా ‘రఫ్ స్పేస్’ను ఉంచి అగ్గిపెట్టెను అగ్గిని జనింపజేసే ఆయుధంగా అందించారు. పేటెంట్ వీరులైన పాశ్చాత్యులు దీనికీ పేటెంట్ పొందారు. స్వీడన్‌కు చెందిన లండ్‌స్ట్రమ్ బ్రదర్స్ అగ్గిపెట్టె పేటెంట్ రైట్స్ సొంతం చేసుకున్నారు. 1862 లో బ్రేనల్ అనే బ్రిటిష్ పారిశ్రామిక వేత్త తొలిసారి అగ్గిపెట్టెలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు. చెక్కపుల్లలతో మొదలైన అగ్గిపెట్టెల ప్రస్థానం మైనపు పుల్లలతోనూ కొనసాగుతోంది.