చేతి సంచిలా మారిన సూక్ష్మ బ్యాగు. (ఇన్‌సెట్‌లో) మడిచినప్పుడు చిన్నగా..
సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు నల్ల శ్రావణ్ చేతిలో ఇమిడిపోయే సూక్ష్మ బ్యాగును సృష్టించారు. అగ్గిపెట్టెలో ఇమిడేచీరను నేసి నాలుగు దశాబ్దాల కిందటే ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు కుమారుడే నల్ల శ్రావణ్. వస్త్రోత్పత్తిలో వినియోగించే వార్పు నైలాన్ పోగులు, వెప్టు పీసీ ధారంతో ఈ సూక్ష్మ సంచిని తయారు చేశాడు. పొడవు 24 ఇంచులు, వెడల్పు 16 ఇంచులతో కేవలం 24 గ్రాముల బరువుతో చేతిలో ఇమిడి పోయేలా బ్యాగును రూపొం దించాడు.
ఈ బ్యాగును ‘కీ’ చైన్‌తో ఉంచుకునే అవకాశం ఉంది. ప్లాస్టిక్ కవర్లను సిరిసిల్లలో నిషేధించిన నేపథ్యంలో బట్టతో చేసిన సూక్ష్మ బ్యాగును ఎక్కడికైనా తీసుకెళ్లేలా తయారు చేశాడు. 10 కిలోల బరువు గల వస్తువులను మోయగల సామర్థ్యంతో బ్యాగును రూపొందించినట్లు శ్రావణ్ తెలిపారు. చేతిలో ఇమిడి పోయే బ్యాగును తయారు చేసినందుకు శ్రావణ్‌ను పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment