Weaver
-
కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్.. చేనేత కుటుంబాలకు సాయం
సాక్షి,హైదరాబాద్: పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా మరో మానవీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.గడిచిన ఏడు నెలల్లో ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు స్టేట్ హోమ్‌లో ఉన్న వందమంది అనాథ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. కేటీఆర్ బుధవారం(జులై 24) తన పుట్టినరోజు జరుపుకున్నారు. -
నేతన్న విషాదాంతం!
సిరిసిల్లటౌన్: కొందరి దీన పరిస్థితి చూస్తే.. పగవారికి కూడా అటువంటి కష్టాలు రాకూడదని అనిపిస్తుంది. ఇదే తరహాలో సిరిసిల్ల నేత కార్మికుడి విషయంలో జరిగిన ఘటన మానవతావాదులను కలచివేసింది. పోలీసుల కథనం ప్రకారం.. సిరిసిల్ల పట్టణం నెహ్రూనగర్‌కు చెందిన ఈగ రాజు (45) రోకడ (ఎక్కడ పని ఉంటే అక్కడ సాంచాలు నడిపే పని) నేత కార్మికుడు. అయితే చాలా రోజులుగా సిరిసిల్లలో పనుల్లేక ఖాళీగా ఉంటున్నాడు.నాలుగు రోజుల క్రితం పనిని వెతుక్కుంటూ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఎటు వెళ్లాడో తెలియని స్థితిలో కుటుంబ సభ్యులు దిక్కుతోచకుండా ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం కరీంనగర్ జిల్లా వెదిర గ్రామం నుంచి ఫోన్ వచ్చింది. తమ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి వడదెబ్బతో చనిపోయాడని, ఆధార్‌కార్డులో సిరిసిల్ల వాసిగా అడ్రస్ ఉందని తెలిపారు.వెంటనే భార్య రేఖతో పాటు బంధువులు వెదిరకు వెళ్లారు. రాజు వేసుకున్న దుస్తుల ఆనవాళ్లను బట్టి అతనే అనిపించినా.. ఎండకు, ఆకలికి తాళలేక బక్కచిక్కి.. మొఖం రంగు మారిన క్రమంలో భార్య రేఖ తన భర్తను గుర్తు పట్టలేక పోయింది. చనిపోయింది తన భర్తకాదని, పని దొరికాక ఇంటికి వస్తాడన్న నమ్మకంతో సిరిసిల్లకు తిరిగి వచ్చింది. ఎస్సై సురేందర్ విచారణతో.. వెదిర గ్రామ కార్యదర్శి గౌరి రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామడుగు ఎస్సై సురేందర్.. ఈగ రాజు మృతి కేసును దర్యాప్తు చేశారు. బుధవారం సిరిసిల్లలో రాజు ఇంటికి వచ్చి నేరుగా విచారణ చేపట్టారు. ఇంట్లో ఉన్న ఫొటోలు, మృతుడిపై ఉన్న దుస్తులను బట్టి ఆ శవం ఈగ రాజుదిగా నిర్ధారించారు. కరీంనగర్లో పోస్టుమార్టం జరిపించి బుధవారం రాత్రి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్సై సురేందర్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులే కారణమా? ఈగ రాజు మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు తెలిపారు. కొంత కాలంగా రాజుకు పని లేకుండా ఖాళీగా ఉంటున్నాడని, కుటుంబ భారం మొత్తం భార్య రేఖ మోస్తోందని చెప్పారు. కొద్ది నెలల క్రితమే కూతురుకు వివాహం జరిగిందని, రాజుకు అనారోగ్యం.. తదితర కారణాలతో కుటుంబానికి అప్పులయ్యాయని తెలిపారు. ఈ క్రమంలోనే రాజు పని వెతుక్కుంటూ ఇంట్లోంచి వెళ్లిపోయాడని, చేతిలో డబ్బులేక మండుటెండల్లో సరైన ఆహారం లభించక, ఎండల ధాటికి మృతిచెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. -
Khadi Fabric: ఖాదీ ఎందుకంత స్పెషల్? జరీ అంత కాస్ట్లీ ఎందుకు?
ఎర్రకోట అనగానే ఎవరికై నా పతాకావిష్కరణ గుర్తుకొస్తుంది. వినువీధిలో త్రివర్ణ పతాక రెపరెపలు చూడగానే మనసు దేశభక్తితో ఉప్పొంగిపోతుంది. అటువంటి వేడుకలో ఖాదీకి కూడా చోటు లభిస్తే.. నేరుగా దేశ ప్రధాని మోదీతో ముచ్చటించే అవకాశం లభిస్తే.. మన ముఖం పొందూరు జరీ ఖాదీ పంచె అంచులా మెరిసిపోతుంది. ఉత్సాహం ఉప్పొంగి మనసే ఉత్సవ వేదికగా మారుతుంది. సరిగ్గా అటువంటి అపురూప అనుభవమే ఇద్దరు పొందూరు ఖాదీ కళాకారుల సొంతమైంది. స్వాతంత్య్రోద్యమంలో భాగస్వామి అయిన పొందూరు ఖాదీ ప్రతినిధులుగా దేశ రాజధాని ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని, ప్రధానితో మాట్లాడే అపురూప క్షణాలు జీవితంలో మర్చిపోలేనివని ఉత్సవాల్లో పాల్గొన్న నేతకారులు గర్వంగా చెబుతున్నారు. ఢిల్లీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వారినే ఎందుకు ఎంపిక చేశారు? వారి ప్రత్యేకత ఏమిటి? ఢిల్లీలో అనుభవాలు ఏమిటి? వారి నుంచే తెలుసుకుందాం. కాంతమ్మా.. కుశలమా.. ఈమె పేరు జల్లేపల్లి కాంతమ్మ. పొందూరు. వయసు 75. ఆరేళ్ల ప్రాయం నుంచి సంప్రదాయ ఖాదీ వస్త్రం తయారు చేస్తోంది. దేశంలోనే నూలును నాణ్యంగా వడికే నైపుణ్యం గల అతికొద్ది మంది వ్యక్తుల్లో కాంతమ్మ ఒకరు. ముగ్గురు కుమారులు బాగానే స్థిరపడినా.. ఖాదీ మీద మక్కువతో ఆమె పాత ఇంటిలోనే ఉంటూ రోజుకు 6 గంటలు ఇదే పనిలో నిమగ్నమవుతున్నారు. కేవలం రోజుకు రూ.200 మాత్రమే సంపాదిస్తున్నా.. కోట్ల రూపాయల విలువైన తృప్తి కోసమే తాను ఈ పని చేస్తున్నానని గర్వంగా చెబుతున్నారు ఆమె. తాను 75 ఏళ్ల వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నానని అంటే అది ఖాదీ పుణ్యమేనని.. చెబుతారు కాంతమ్మ. అసలు కాంతమ్మ ఎంచుకున్న సంప్రదాయ విధానం ఏమిటి? వాలుగు చేప ముల్లుతో పత్తిని శుభ్రపరచడం ఖాదీ వస్త్రం తయారీలో ఈ దశలు కీలకమైనవి.. నిడుచుటగా పిలిచే ప్రక్రియలో పత్తి గింజలను వేరు చేయడం పత్తిని మెత్తగా తయారు చేయడం చిలపలు పోయడం మరిచిపోలేని జ్ఞాపకం.. నేను చదువుకోలేదు. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసింది.. ఖాదీ తయారీలో భాగమవ్వడమే. నేను ఏ రోజూ కష్టపడుతున్నాననే భావన నాలో రానీయను. ఇష్టంగా పనిలో నిమగ్నమవుతా. నన్ను కలిసేందుకు చాలా మంది వస్తుంటారు. ఖాదీ తయారీలో ప్రక్రియల్ని ఓపికగా వివరిస్తా. వారికి అర్థమయ్యేంత వరకు విడిచిపెట్టను. ఖాదీ గొప్పతనాన్ని వారికి చెబుతా. ఢిల్లీ.. ఎర్రకోట ప్రధాన మంత్రి వంటి పదాలు వినడమే తప్ప.. నేను ఎప్పుడూ చూస్తానని కలలో కూడా ఊహించ లేదు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకు నాలాంటి సామాన్యురాలిని ఎర్రకోటకు పిలిచి స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాతో మాట్లాడడం నిజంగా నా అదృష్టం. చాలా గర్వంగా ఉంది. – జల్లేపల్లి కాంతమ్మ, పొందూరు. ఏకు చుట్టడం జరీ నేతలో మొనగాడు చిత్రంలో వీరిద్దరి పేర్లు భద్రయ్య, లక్ష్మి. భార్యభర్తలు. ఊరు పొందూరు. ఇద్దరూ నేతకారులే. జరీపంచె నేతలో ఒకే ఒక్కడు ఈ భ ద్రయ్య. మంచి నైపుణ్యం ఈయన సొంతం. ఏఎన్నార్ పేరుతో పిలిచే ఖాదీ పంచెకు బంగారం వర్ణంలో ఉండే అంచును అత్యంత అద్భుతంగా నేయడంలో ఈయనది అందెవేసిన చేయి. ఇంటర్ వరకు చదువుకున్న భద్రయ్య వృత్తిలో సంతృప్తి వెతుకునే వ్యక్తి త్వం ఉన్న మనిషి. రోజుకు కేవలం రూ.500 మాత్ర మే సంపాదించే ఈయన జరీనేతలో దేశవ్యాప్తంగా ఉన్న కొద్ది మంది నేతన్నలలో మొనగాడే. ఈ నేతకు ఇద్దరు వ్యక్తులు అవసరం కావడంతో భార్య సహకారంతో మనసుకు నచ్చిన పనిచేసి దేశప్రధాని మనసును గెలుచుకున్నాడు ఈ నేతన్న. ఏమిటీ జరీ నేత..ఖరీదు ఎందుకంత..! పంచెకు అంచు అందం. అంచు ఎంత ఎక్కువ తళుక్కుమంటే అంత ఖరీదైనదని అర్థం. శ్వేత, గోధుమ వర్ణంలో సున్నితంగా ఉండే ఖాదీ జరీపంచెలు కాస్త ఖరీదైన వ్యవహారం. మామూలు ఖాదీ పంచె రూ. 600 నుంచి రూ.800 మధ్యలో లభ్యమవుతుంది. ఒక్కో జరీ పంచె ఖరీదు రూ.11 వేల నుంచి రూ.13 వేల వరకు పలుకుతుందంటే దీని ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. జీవితాంతం గుర్తుండిపోయేలా.. ఉదయం లేవడం.. వృత్తిలో నిమగ్నమవ్వడం. నా కుటుంబం. ఇదే నా దినచర్య. ఢిల్లీకి బయల్దేరాలని ఖాదీ బోర్డు సభ్యులు చెబితే ఆశ్చర్యమేసింది. అదీ ఎర్రకోటలో జరిగే మువ్వన్నెల వేడుకకు.. ప్రధానిని కలిసేందుకు అంటే చాలా గర్వపడ్డాను. ప్రధానమంత్రిని దగ్గర నుంచి చూశా. ఓ నేతకారుడిగా నాకు దక్కిన ఈ గొప్పఅవకాశం.. ఆ అద్భుత క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. నాకు వృత్తిలో చేదోడు వాదోడుగా ఉండే నా భార్యతో సహా నేను ఢిల్లీకి వెళ్లడం జీవితంలో మరిచిలేనిది. – బళ్ల భద్రయ్య, పొందూరు -
వెండి చీరను ఆవిష్కరించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల నేత కళాకారుడు నల్లా విజయ్ మగ్గంపై నేసిన సువాసనలు వెదజల్లే వెండి చీరలను మంత్రి తారక రామారావు శనివారం ఆవిష్కరించారు. చీర తయారీకి దాదాపు నెలన్నర రోజుల సమయం పట్టిందని విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇప్పటివరకు విజయ్ నేసిన వస్త్ర ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు అతని కళా నైపుణ్యాన్ని ప్రశంసించారు. తెలంగాణ నేతన్నల అనితర సాధ్యమైన, అద్భుతమైన ప్రతిభకు విజయ్ నిదర్శనమని, ఆయన సిరిసిల్లకు మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. విజయ్‌కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. -
తెలంగాణ చేనేతకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చేనేత కళా నైపుణ్యానికి ప్రపంచ మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉందని అమెరికాకు చెందిన చేనేత, వస్త్ర పరిశోధకురాలు కైరా వెల్లడించారు. భారత్‌లో చేనేత ఉత్పత్తులు కేవలం చీరలకు మాత్రమే పరిమితం అవుతున్నాయన్నారు. ఇతర దుస్తులు, ఉత్పత్తులకు చేనేత, పట్టు పరిశ్రమను అనుసంధానించడం ద్వారా మార్కెటింగ్ విస్తృతి పెరుగుతుందని ఆమె తెలిపారు. చేనేత, వస్త్ర రంగంపై పరిశోధనలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కైరా బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీ రామారావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యటనలో తాను అధ్యయనం చేసిన విషయాలను కేటీఆర్‌కు వివరించారు. మరమగ్గాల కార్మికులు డబుల్ జకార్డ్ వంటి వినూత్న టెక్నిక్‌తో వస్త్రాలను ఉత్పత్తి చేయడాన్ని ప్రశంసించారు. రాష్ట్రంలోని పోచంపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ, నారాయణపేట, గద్వాల ప్రాంతాల్లో జరుగుతున్న చేనేత వస్త్రాల ఉత్పత్తి, అక్కడి స్థితిగతులపై తాను అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. పరిశోధనలో భాగంగా ఇప్పటి వరకు 9 దేశాల్లో పర్యటించగా, చేనేత అధ్యయనానికి భారత్‌లో తెలంగాణను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకున్నట్లు కైరా చెప్పారు. చేనేత కళా నైపుణ్యం, వస్త్రాలపై ప్రేమతో దీర్ఘకాల పరిశోధన కోసం తన సమయాన్ని వెచ్చిస్తున్న కైరా ప్రయత్నాన్ని కేటీఆర్ అభినందించారు. -
మామూలు చీర కాదు.. సిరి చందన పట్టు చీర.. ధర ఎంతంటే!
సిరిసిల్ల: అది మామూలు పట్టుచీర కాదు.. సుగంధాలు వెదజల్లే ‘సిరి చందన పట్టు చీర’.. ఒకటీ రెండు కాదు 27 రకాల సుగంధ ద్రవ్యాలను వినియోగించి తయారు చేసిన పట్టుచీర. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నల్ల విజయ్‌కుమార్ దీనిని రూపొందించారు. పవర్లూమ్పై నేసిన ఈ పట్టుచీరను ఇటీవలే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల చేతులమీదుగా ఆవిష్కరించారు కూడా. నాలుగు దశాబ్దాల కిందటే అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేసి ప్రపంచానికి చేనేత కళా వైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు కుమారుడే విజయ్ కుమార్. ఆయన 2012 నుంచీ మగ్గంపై ప్రయోగాలు చేస్తూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. పట్టుపోగులకు సుగంధాలు అద్ది సుగంధాలు పరిమళించే పట్టుచీరను నేసేందుకు 27 రకాల సుగంధ ద్రవ్యాలను విజయ్‌కుమార్ వినియోగించారు. శ్రీగంధం, నాగకేసరాలు, బిల్వగుజ్జు, పాలసుగంధి, జాపత్రి, జాజికాయ, ఇలాచీ, జటామాంస, భావంచలు, పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు, కోష్టం, తుంగదుంపలు, గంధ కచోరాలు, ఎర్ర చందనం, కస్తూరి, పసుపు, వట్టివేళ్లు, జవ్వాజి, కురువేళ్లు, దేవదారు, వస, గులాబీ రేకులు, సంపంగి, విరజాజి, కృష్ణతులసి, తాలిసపత్రి మిశ్రమంతో ద్రావణాన్ని తయారు చేశారు. దాన్ని వేడిచేసి అందులో పట్టుపోగులను రెండు రోజుల పాటు నానబెట్టారు. ఇలా సుగంధ పరిమళాలను సంతరించుకున్న పట్టు పోగులతో 15 రోజులపాటు శ్రమించి పట్టుచీరను నేశారు. 500 గ్రాముల బరువుతో 5.500 మీటర్ల పొడవుతో చీరను సిద్ధం చేశారు. ఈ చీర ధర రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుందని.. ఎవరైనా ఆర్డర్ చేస్తే రూపొందించి ఇస్తానని విజయ్‌కుమార్ చెబుతున్నారు. పదేళ్లుగా ఎన్నో ప్రయోగాలు సాంచాలపై వస్త్రోత్పత్తి సాగించే విజయ్‌కుమార్ 2012లో ప్రయోగాలు మొదలుపెట్టారు. తొలుత అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేశారు. తర్వాత ఉంగరంలోంచి దూరే చీర, దబ్బనంలోంచి దూరేంత సన్నని శాలువా, కుట్టు లేని జాతీయ పతాకం, కుట్టులేని లాల్చీపైజామా, అరటినారలతో శాలువా, తామర నారలతో చీర, వెండి కొంగుతో చీర, 220 రంగుల చీర, మూడు కొంగుల చీర.. ఇలా కొత్తగా రూపొందిస్తూ వచ్చారు. ఈ ప్రయోగాలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. కొంతమంది నేరుగా విజయ్‌కుమార్‌ను సంప్రదించి ప్రత్యేకంగా పట్టువస్త్రాలను తయారు చేయించి తమవారికి బహుమతులుగా ఇస్తుంటారు. ఇటీవల సిద్దిపేటకు చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను విజయ్‌కుమార్ వద్ద రూ.12 వేలకు కొని తిరుమల శ్రీవారికి బహూకరించారు. అమెరికా, న్యూజిలాండ్, బెంగళూర్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు, ఎన్నారైలు ఆర్డర్లు ఇచ్చి విభిన్నమైన వస్త్రాలను తయారు చేయించుకుంటారు. (క్లిక్: సర్కారు బడుల్లో వన్ క్లాస్–వన్ టీవీ) కొత్తగా ఏదైనా చేయాలని.. వస్త్రోత్పత్తి రంగంలో కొత్తగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో భిన్నమైన ప్రయోగాలు చేస్తున్నాను. ఊసరవెల్లిలా రంగులు మారే చీరను తయారుచేసే పనిలో ఉన్నాను. బంగారు పోగులతో కొంగును తయారు చేసే ఓ చీర ఆర్డర్ వచ్చింది. సున్నితమైన ఆ పనిని ముందుగా పూర్తి చేయాల్సి ఉంది. అది పూర్తయితే.. మరిన్ని ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నాను. తయారు చేసినవన్నీ వెంటనే అమ్ముడుపోతున్నాయి. – నల్ల విజయ్‌కుమార్, నేత కళాకారుడు -
Nethanna Nestham Scheme: నేతన్నలకు భరోసా!
చేనేతలను ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. నేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు పెద్ద పీట వేస్తున్నది. బతుకమ్మ చీరల ఆర్డర్లతో మరమగ్గాల కార్మికులకు బతుకునిస్తూనే, ప్రతి సోమవారం అధికారులంతా నేత దుస్తులు ధరించాలని పిలుపునిచ్చి చేనేతకు చేయూతనిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘తెలంగాణ వీవర్స్ థ్రిప్ట్ ఫండ్ సేవింగ్స్ అండ్ సెక్యూరిటీ స్కీమ్ (టీఎఫ్ఎస్ఎస్)ను 2017లో ప్రవేశపెట్టింది. అలాగే నేత కార్మికులకు పొదుపు పథకాలనూ అమలు చేస్తోంది. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికులందరినీ ‘త్రిఫ్ట్’ పథకంలో చేర్పించాలని చేనేత జౌళి శాఖ అధికారులను ఆదేశించింది. గతంలో రూ. 12 కోట్లతో ప్రారం భించిన ఈ పథకానికి ఈ ఏడాది రూ. 30 కోట్లు విడుదల చేయించారు. కార్మికుడిని యజమానిని చేయాలన్న ఉద్దేశంతో ‘వర్కర్ టూ ఓనర్’ పథ కాన్ని ప్రవేశపెట్టింది. బతుకమ్మ చీరల తయారీకి ఇప్పటి వరకు రూ. 2,000 కోట్లకు పైగా ఆర్డర్లు ఇచ్చింది. చేతి నిండా పని, పనికి తగ్గ వేతనం సంపాదిస్తున్న కార్మికులకు పొదుపు (త్రిప్టు) పథకాన్ని ప్రవేశపెట్టి చేయూతనిస్తున్నది. లాక్డౌన్ నేప థ్యంలో పరిశ్రమలు బంద్ అయ్యాయి. ఫలితంగా కార్మి కులు ఉపాధి కోల్పోయారు. కార్మికులు జమ చేసిన నగదుతో పాటు ప్రభుత్వం ఇచ్చే నిధులు మూడేండ్లకు ఇవ్వాల్సి ఉండగా, రెండేళ్లకే తిరిగి చెల్లించి వారి కుటుం బాలకు చేయూత నిచ్చింది. ఈ పథకం ఈ ఏడాది నుంచి పునః ప్రారంభిస్తున్నందున కార్మికులు చేరేందుకు ఆసక్తి చూపు తున్నారు. దేశంలో నేతన్నల సంక్షేమం కోసం ఎక్కడా లేని విధంగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆగస్టు 7న నుంచి రైతు బీమా తరహాలో ‘నేతన్న బీమా’ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వార్షిక ప్రీమియం కింద చేనేత, పవర్ లూం కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కోసం 50 కోట్లు కేటాయించి... ఇప్పటికే 25 కోట్లు విడుదల చేసింది. (క్లిక్: ఎలా చూసినా సంక్షేమ పథకాలు సమర్థనీయమే!) 60 ఏళ్ల లోపు వయసున్న అర్హులైన సుమారు 80 వేల మంది కార్మికులకు ‘నేతన్న బీమా’ పథకం అమలు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసేందుకు కార్యా చరణ మొద లెట్టినారు. ఈ నేపథ్యంలో బీమా కాలంలో లబ్ధిదారులైన... చేనేత, మర మగ్గాల కార్మికులు ప్రమాద వశాత్తు మరణించినా, సహజంగా మరణించినా, ఏదైనా ప్రమాదంలో పూర్తి అంగ వైకల్యం కలిగినా... కుటుంబానికి ఆర్థిక భరోసాగా 10 రోజుల్లో నామినీకి రూ. 5 లక్షల బీమా సొమ్ము అందుతుంది. ఇలా నేతన్నలకు చేయూతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం సేవలు అభినందనీయం. ‘ఇంటింటికీ త్రివర్ణ పతాకం’ కార్యక్రమం కోసం 33 లక్షల మీటర్ల నేత వస్త్రాన్ని టెస్కో ద్వారా కొనుగోలు చేయటం నేతన్నలపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతోంది. – డాక్టర్ సంగని మల్లేశ్వర్ కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం విభాగాధిపతి -
27 రకాల సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టుచీర
సిరిసిల్ల: అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్ పరిమళించే పట్టు చీరను రూపొందించారు. విజయ్‌కుమార్ ఇప్పటికే తండ్రి పరంధాములు స్ఫూర్తితో అనేక ప్రయోగాలు చేశారు. తాజాగా 27 రకాల సుగంధ ద్రవ్యాలను కలిపిన ద్రావణంలో పట్టు పోగులను ఉడకబెట్టి పవర్లూమ్పై పట్టు చీరను నేశాడు. సుగంధ ద్రవ్యాల ప్రభావంతో ఆ చీర పరిమళిస్తోంది. చీర ఐదున్నర మీటర్ల పొడవు, 46 ఇంచీల వెడల్పు, 400 గ్రాముల బరువుంది. నాలుగు రోజులపాటు శ్రమించి నేసిన ఈ చీర తయారీకి రూ.12 వేలు ఖర్చయినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. గతంలో మూడు కొంగుల చీర, ఉంగరంలో, దబ్బనంలో దూరే చీరలను, కుట్టు లేని లాల్చి, పైజామా, జాతీయ జెండాలను తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు. (క్లిక్: డబుల్ బెడ్రూం ఇల్లు వెనక్కి) -
పెడనలో విషాదం: అప్పు.. అధిక వడ్డీలు.. ప్రాణం తీసిన ఒత్తిళ్లు
పెడన: అప్పు చెల్లించాలనే ఒత్తిళ్లు, దానికి తోడు అధిక వడ్డీలు ఓ చేనేత కుటుంబం ఉసురు తీశాయి. కుమారుడితో సహా దంపతులు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన మంగళవారం కృష్ణా జిల్లా పెడనలో తీవ్ర విషాదం నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. కాసిన పద్మనాభం (55), నాగ లీలావతి (47) దంపతులకు కుమారుడు రాజా నాగేంద్రం, కుమార్తె వెంకట నాగలక్ష్మి ఉన్నారు. చేనేత కార్మికులైన వీరు కుమార్తెకు గతేడాది వివాహం చేశారు. కుమారుడు రాజా నాగేంద్రం (27)తో కలిసి పెడన పోలవరపుపేటలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పాలు పోసే వ్యక్తి వచ్చి తలుపులు కొట్టినా తీయకపోవడంతో పొరుగింటి వారికి సమాచారం చెప్పి వెళ్లిపోయాడు. కుమార్తె కుటుంబం వచ్చి ఎంత పిలిచినా పలకకపోవడంతో తలుపులు పగలగొట్టారు. పద్మనాభం ఒక గదిలో, తల్లీ కుమారుడు మరో గదిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. ప్రాణం తీసిన ఒత్తిళ్లు: మృతుడు పద్మనాభం పెడనకు చెందిన మెట్ల జీవన్‌ప్రసాద్, విఠల్ లోకేష్‌ల వద్ద కుమార్తె పెళ్లి కోసం, ఇతర ఖర్చుల కోసం రూ.2.60 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. దీనికి వడ్డీ కలిపి రూ.4.60 లక్షలు అయిందని పేర్కొంటూ జీవన్ ప్రసాద్ ప్రాంసరీ నోటు రాయించుకున్నాడు. మార్చిలోగా చెల్లించాలని ఒత్తిడి చేశాడు. ఈ మేరకు మృతుడు పద్మనాభం సూసైట్ నోట్ రాశాడు. సూసైడ్ నోట్ ఆధారంగా అప్పు చెల్లించాలని ఒత్తిడి చేసిన జీవన్‌ప్రసాద్, విఠల్ లోకేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. మట్టి ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.15 వేలను అందజేశారు. -
నేత బ్యాగు.. మోత బాగు
సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు నల్ల శ్రావణ్ చేతిలో ఇమిడిపోయే సూక్ష్మ బ్యాగును సృష్టించారు. అగ్గిపెట్టెలో ఇమిడేచీరను నేసి నాలుగు దశాబ్దాల కిందటే ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు కుమారుడే నల్ల శ్రావణ్. వస్త్రోత్పత్తిలో వినియోగించే వార్పు నైలాన్ పోగులు, వెప్టు పీసీ ధారంతో ఈ సూక్ష్మ సంచిని తయారు చేశాడు. పొడవు 24 ఇంచులు, వెడల్పు 16 ఇంచులతో కేవలం 24 గ్రాముల బరువుతో చేతిలో ఇమిడి పోయేలా బ్యాగును రూపొం దించాడు. ఈ బ్యాగును ‘కీ’ చైన్‌తో ఉంచుకునే అవకాశం ఉంది. ప్లాస్టిక్ కవర్లను సిరిసిల్లలో నిషేధించిన నేపథ్యంలో బట్టతో చేసిన సూక్ష్మ బ్యాగును ఎక్కడికైనా తీసుకెళ్లేలా తయారు చేశాడు. 10 కిలోల బరువు గల వస్తువులను మోయగల సామర్థ్యంతో బ్యాగును రూపొందించినట్లు శ్రావణ్ తెలిపారు. చేతిలో ఇమిడి పోయే బ్యాగును తయారు చేసినందుకు శ్రావణ్‌ను పలువురు అభినందించారు. -
నేతన్నల కోసం కేంద్రంతో కొట్లాడతా: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల: ‘‘రాష్ట్రంలోని లక్షలాది మంది నేతన్నల సంక్షేమానికి నిధులు కేటా యిం చాలని కేంద్రానికి ఏడేళ్లలో ఎన్నో ఉత్తరాలు రాశా. ఉలుకూ.. పలుకూ లేదు. ‘అయిననూ వెళ్లి రావాలి హస్తినకు’అన్నట్లు ఇప్పుడు ఎనిమిదోసారి రాస్తున్నా. ఇప్పటికైనా స్పందించి నిధులు మంజూరు చేస్తే సరి. లేకుంటే రాష్ట్రంలోని లక్షలాది మంది నేతన్నలతో కలిసి పోరాడతా’’నని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. సిరిసిల్ల కలెక్టరేట్లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగం తరువాత అత్యధిక మందికి ఉపాధినిచ్చే వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని వినమ్రంగా కోరుతున్నానని, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే ప్రధాని మోదీ తెలంగాణపై వివక్ష చూపడం సరికాదని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సిరిసిల్ల నేతన్నల కో సం మెగా పవర్లూమ్ క్లస్టర్ సాధించాలని డిమాం డ్ చేశారు. వచ్చే కేంద్ర బడ్జెట్లో నిధులు సాధించేందుకు తన పలుకుబడిని ఉపయోగించాలన్నారు. ఈమేరకు ఆయనకు కూడా లేఖ రాస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. కాకతీయకు రూ.897 కోట్లివ్వండి ఏడేళ్లలో రాష్ట్రానికి కేంద్రం అండగా నిలిచిన సందర్భాలే లేవని కేటీఆర్ విమర్శించారు. కేంద్రం బడ్జెట్ విడుదల చేస్తున్న సందర్భంగా వరంగల్‌లో ఏర్పా టు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు పీఎం మిత్ర పథకంలో రూ.897.92 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 1,250 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ అతిపెద్ద టెక్స్టైల్, అపెరల్ పార్క్‌కు నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు. గద్వాల, కొత్తకోట, నారాయణపేట, దుబ్బాక, జమ్మికుంట, కమలాపూర్, పోచంపల్లి వంటి పదకొండు కేంద్రాల్లో చేనేత సమూహాలను ఏర్పాటు చేసి నేతన్నలను ఆదుకోవాలని కోరారు. 15 బ్లాక్ లెవల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఇవ్వండి నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్‌హెచ్‌డీపీ)లో భాగంగా 15 బ్లాక్ లెవల్ హ్యాం డ్లూమ్ క్లస్టర్లు మంజూరు చేయాలని, గతంలో మంజూరైన 8 క్లస్టర్లకు రెండో ఇన్స్టాల్మెంట్ కింద రావాల్సిన రూ.7.20 కోట్లు వెంటనే ఇవ్వాలని మంత్రి కోరారు. హైదరాబాద్‌లో నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్నారు. మౌళిక వసతులు, ఆధునీకరణ, విస్తరణ, మార్కెట్ అభివృద్ధి, నైపుణ్య శిక్షణ తదితరాల కోసం సిరిసిల్లలోని టెక్స్టైల్, వీవింగ్, అపెరల్ పార్క్‌కు రూ.49.84 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేయాలని, ఈ పార్కులో రాష్ట్ర ప్రభుత్వం రూ.756.97 కోట్లు వాటాగా చెల్లిస్తుందని చెప్పారు. ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు పోచంపల్లి అనుకూలం ఉమ్మడి ఏపీలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ) సెంటర్‌ను తెలంగాణలోని పోచంపల్లిలో ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రులకు లేఖలు రాశానని.. అయినా నెల్లూరు జిల్లా వెంకటగిరి వెళ్లిందని కేటీఆర్ చెప్పారు. దీంతో రాష్ట్రంలో హ్యాండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులు నిర్వహించే సంస్థలేవీ లేవన్నారు. రాష్ట్రంలో ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కులో భవనాలు సిద్దంగా ఉన్నాయని చెప్పారు. ‘ఇన్ సిటు’ పథకంలో భాగంగా మరమగ్గాల ఆధునీకరణకయ్యే ఖర్చులో 50 శాతం భరించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉన్నందున 13,886 మరమగ్గాల ఆధునీకరణకు రూ.13.88 కోట్లను కేంద్రం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏటీయూఎఫ్ పథకం కింద రాష్ట్రంలో ఏర్పాటయ్యే వస్త్ర తయారీ పరిశ్రమలకు బ్యాంకుల రుణ పరపతి నిబంధనలు సడలించాలని కేటీఆర్ కోరారు. -
సిరిసిల్ల జరీ.. అగ్గిపెట్టెలో చేరి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అగ్గిపెట్టెలో ఇమిడేలా చీరను, దబ్బనంలో ఇమిడేలా మరో చీరను నేశాడు. కట్టుకునేందుకు వీలుగా ఉన్న ఈ రెండు చీరలను చేనేత మగ్గంపై బంగారం జరీ పోగులతో నేసి శభాష్ అనిపించుకున్నాడు. గతంలో చేనేత కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిన పలువురు చేనేత కళాకారులు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసినా.. అవి కట్టుకునేందుకు అనువుగా ఉండేవి కావు. అగ్గిపెట్టెలో పట్టే చీరతో నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఇప్పుడు హరిప్రసాద్ చేనేత మగ్గంపై గ్రాము బంగారం జరీతో నేసిన చీర కట్టుకునేందుకు అనువుగా ఉంది. మరోవైపు దబ్బనంలో దూరే చీరను సైతం హరిప్రసాద్ నేశాడు. ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించాడు. న్యూజిలాండ్‌కు చెందిన సునీత–విజయభాస్కర్‌రెడ్డి దంపతుల కోరిక మేరకు రూ.10 వేల ఖర్చుతో అగ్గిపెట్టెలో ఇమిడే కట్టుకునే చీరను నేశాడు. దబ్బనంలో ఇమిడే చీర ఈ చీర 5.5 మీటర్ల పొడవు, 160 గ్రాముల బరువుతో ఉంది. దబ్బనంలో దూరే చీరను సైతం కట్టుకునేందుకు వీలుగా నేశాడు. గ్రాము గోల్డ్ జరీ పట్టు దారాలతో ఈ చీరను నేశాడు. దీని బరువు 350 గ్రాములు ఉంటుంది. ఇప్పటికే సూక్ష్మ కళలో రాణిస్తున్న హరిప్రసాద్ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, దబ్బనంలో దూరే చీరను నేసి మరోసారి సిరిసిల్ల నేత కళను ప్రపంచానికి చాటి చెప్పాడు. -
121 కలర్స్, 121 డిజైన్ల ఇక్కత్
భూదాన్పోచంపల్లిః అగ్గిపెట్టెలో పట్టె చీరెను నేసి ఔరా అని పోచంపల్లి చేనేత కళాకారులు అంతర్జాతీయ ఖ్యాతికెక్కారు. మారుతున్న కాలానుగుణంగా ప్రజల అభిరుచికి తగ్గట్టు చేనేత కళాకారులు ఇక్కత్ డిజైన్లను సృష్టిస్తూ నూతన ఆవిష్కరణలకు జీవం పోస్తున్నారు. తాజాగా పోచంపల్లికి చెందిన భోగ బాలయ్య అనే చేనేత కళాకారుడు 121 రంగులు, 121 డిజైన్ల చీరెను తయారు చేసి అబ్బురపరుస్తున్నాడు. ఇక్కత్ చీరెలో కొత్తగా ఏదైనా చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని గత పదేళ్లుగా తాపత్రయం పడ్డాడు. నిరంతరం పరిశ్రమించి తన పదేళ్ల కలను సాకారం చేసుకొన్నాడు. 121 రంగులు, 121 డిజైన్ల చీరెను ఆవిష్కరణ.. కాగా భోగ బాలయ్య తనకు వచ్చిన ఆలోచనను చీరెపై ఆవిష్కరించాడు. 121 రంగులు, 121 రకాల డిజైన్లతో అద్బుతంగా చీరెను తయారు చేశాడు. అంతేకాక 11 రంగులతో ట్రెడిషనల్ టెంపుల్ ఆకృతి చీరెఅంచు దీని ప్రత్యేకత. అయితే 22 చిటికిలు, 1 చిటికికి 22 కొయ్యల, 6 కొలుకులతో చీరె తయారీకి ఉపయోగించాడు. కోయంబత్తూర్ నుంచి ప్రత్యేకంగా 2/20 నెంబర్ మస్టర్డ్ నూలును తెప్పించాడు. అలాగే నిలువు, పేక విధానంలో నిలువు 11, పేక (అడ్డం)లో 11 రంగులుగా విడదీసి రంగులద్దాడు. రంగులలో ముఖ్యంగా ఆకుపచ్చ, చిలుకపచ్చ, బంగారు వర్ణం, నీలి, గోధుమ, గ్రే, ఆరెంజ్, ఆనంద, లెమన్ ఎల్లో, వాయిలెట్, గులాబి ఉన్నాయి. ఇంత అద్భుతమైన చీరె నేయడానికి దీనివెనుక రెండేళ్ల శ్రమ దాగి ఉంది. అయితే ఈ చీరె పూర్తిగా వాస్ట్ కలర్స్, వాషబుల్, ఎకో ఫ్రెండ్లీ కావడం విశేషం. మంత్రి కేటీఆర్‌చే సన్మానం 121 రంగుల మల్టి కలర్స్, మల్టి మోటివ్స్ ఇక్కత్ చీరెను తయారు చేసిన భోగ బాలయ్య ప్రతిభను గుర్తించి ఇటీవల జాతీయ చేనేత దినోత్సవం రోజున హైద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుతో సత్కరించారు. జాతీయ అవార్డు కోసం ఎంట్రీ పంపించాడు. అదేవిధంగా సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు బాలయ్య రూపొందించిన మల్టికలర్స్ చీరెను చూసి అభినందించారు. చేనేత పరిశ్రమ గుర్తుండి పోవాలి: భోగ బాలయ్య చేనేతలో నూతన ఆవిష్కరణలు, కళల ద్వారా చేనేత పరిశ్రమ పదికాలాల పాటు మనుగడలో ఉంటుంది. అదేసమయంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని గత పదేళ్లుగా ఆరాటపడుతున్నాను. ఇందుకోసం గత రెండేళ్లుగా విభిన్న ఆలోచనలు, సృజనాత్మకంగా ఆలోచించి 121 డిజైన్లు, 121 రంగుల చీరెను తయారు చేశాను. -
జాతీయ చేనేత దినోత్సవం: నేతన్నల బతుకు దుర్భరం
సాక్షి, సిరిసిల్ల: చిన్న చేపను పెద్ద చేప మింగినట్లుగా.. చేనేత మగ్గాలను మరమగ్గాలు (పవర్‌లూమ్స్) మింగేశాయి. వాటిని ఇప్పుడు ఆధునిక మగ్గాలు మింగేస్తున్నాయి. కాళ్లు, చేతులు ఆడిస్తూ బట్టను నేసే నేత కార్మికుల బతుకు దుర్భరంగా మారింది. అనేక కులవృత్తులు కాలగర్భంలో కలిసిపోతుంటే చేనేత రంగం కాలానికి ఎదురునిలిచింది. వస్త్రాన్ని అందించి, ప్రపంచానికి నాగరికత నేర్పిన నేతన్నల జీవితం కష్టాలు, కన్నీళ్ల కలబోతగా మిగిలింది. దేశంలో వ్యవసాయం తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించిన వస్త్రోత్పత్తి రంగంలో ఆధునికత సంతరించుకుంది. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు ఇది వేదికవుతోంది. చేనేత మగ్గంపై అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి, ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నేత కళాకారుల ఖిల్లా సిరిసిల్లలో వస్త్రోత్పత్తి రంగం ఆధునికత వైపు అడుగులు వేస్తుంది. కరోనా కష్టకాలంలో చేనేత రంగం ఆటుపోట్ల మధ్య ఉంది. నేడు చేనేత దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. మరమగ్గాలపై బతుకమ్మ చీరల బట్ట ఉత్పత్తి చేనేత దినోత్సవ నేపథ్యం ఇదీ.. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాల ను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం చేనేత రంగంతో మొదలైంది. కలకత్తా టౌన్ హాల్లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి, విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలు ధరించి దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలు పునిచ్చారు. అప్పటి స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపునిస్తూ ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. చేనేత రంగం విశిష్టతను తెలియజేస్తూ కార్మికుల గౌరవాన్ని ప్రతిబింబించేలా జాతీయ స్థాయిలో ఏటా చేనేత కార్మికులకు సంత్‌కబీర్ అవార్డులను అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చేనేత వస్త్రాల ఎగుమతిలో 90 శాతం భారతదేశం భాగస్వామ్యం ఉండటం విశేషం. చేనేత బ్రాండ్‌గా భారతదేశాన్ని నిలిపేందుకు మద్రాసు విశ్వవిద్యాలయం సెనెట్ భవనంలో ప్రధాని, రాష్ట్రపతి చేనేత వస్త్రాల ప్రదర్శనను ప్రారంభించారు. ప్రాచీన వారసత్వం.. చేనేత రంగం ప్రాచీన వారసత్వంగా వస్తోంది. భారతదేశ వస్త్ర సంప్రదాయం ప్రపంచానికే ఆదర్శం. చేనేత మగ్గం ఇప్పుడు మరమగ్గంగా మారి, ఆధునిక మగ్గాలుగా అవతరించి అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా 43 లక్షల నేత కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నాయి. వస్త్రోత్పత్తి కేంద్రాలుగా పలు పట్టణాలు ఖ్యాతిగాంచాయి. షోలాపూర్, భీవండి, ముంబయి, అహ్మదాబాద్, ఇంచన్‌కరంజ్, సూరత్, మాలేగావ్, సిరిసిల్ల, వెంకటగిరి, గద్వాల్, భూదాన్ పోచంపల్లి, ఈరోడ్, చీరాల వంటి ప్రాంతాలు వస్త్రోత్పత్తికి నిలయాలుగా మారాయి. చేనేత వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా మన దేశానికి విదేశీ మారక ద్రవ్యం సమకూరుతోంది. సిరిసిల్లలోనే తొలి నేతన్న విగ్రహం సిరిసిల్లలో దేశంలోనే తొలి చేనేత కార్మికుడి కాంస్య విగ్రహం నెలకొల్పారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 78 వేల మరమగ్గాలు ఉండగా, ఒక్క సిరిసిల్లలోనే 34 వేలు ఉన్నాయి. వీటిలో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రం, 7 వేల మగ్గాలపై కాటన్ వస్త్రోత్పత్తి జరుగుతోంది. సిరిసిల్లలో 25 వేల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. నిత్యం 34 లక్షల మీటర్ల వస్త్రం తయారవుతుంది. రాష్ట్రంలోనే తొలి టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. ఇందులో 115 పరిశ్రమల్లో ఆధునిక మగ్గాలపై వస్త్రోత్పత్తి సాగుతోంది. ఇక్కడి వస్త్రాలు ముంబయి, భీవండి, సూరత్, ఢిల్లీ, షోలాపూర్ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. టెక్స్టైల్ పార్క్‌లో 3 వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. సిరిసిల్లలో కాటన్ వస్త్రం అద్దం యూనిట్లు 90 వరకు ఉన్నాయి. ఇక్కడి కాటన్ వస్త్రం దేశంలోని 6 రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. సిరిసిల్ల అద్దకంలో అగ్రస్థానంలో ఉంది. రెండో షోలాపూర్‌గా ఖ్యాతిగాంచిన సిరిసిల్లకు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, ఆర్వీఎం వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇవ్వడంతో కార్మికులకు మెరుగైన ఉపాధి పొందుతున్నారు. ఈ ఏడాది రూ.350 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లు రావడంతో నేతన్నలకు చేతినిండా పని దొరుకుతోంది. క్షీణదశలో చేనేత రంగం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 36 చేనేత సహకార సంఘాలు ఉండగా వీటిలో 6 వేల మంది సభ్యులున్నారు. నిజానికి 29 సంఘాలు మాత్ర మే సమర్థంగా పని చేస్తుండగా 4 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సిరిసిల్లలో 3 సహకార సంఘాలు పని చేస్తున్నాయి. సిరిసిల్ల మరమగ్గాలు అధికంగా ఉండగా చేనేత మగ్గాల సంఖ్య తగ్గిపోయింది. చేనేత మగ్గాలపై పని చేస్తున్నవారందరూ వృద్ధులే. చేనేతపై శిక్షణ ఇచ్చేందు కు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం మూతపడింది. దీంతో చేనేత రంగం క్షీణదశలో ఉంది. గుత్తాధిపత్యం.. కరువైన ఉపాధి వస్త్రోత్పత్తి రంగంలో అనేక సమస్యలున్నాయి. నూలు కొనుగోలు నుంచి బట్ట అమ్మకం వరకు కొందరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే పరిశ్రమ బందీ అయ్యింది. ఈ గుత్తాధిపత్యం కారణంగా కార్మి కులకు మెరుగైన ఉపాధి కరువైంది. ప్రభుత్వమే నూలు డిపోలను ఏర్పాటు చేసి, వస్త్రోత్పత్తికి అవసరమైన నూలు అందిస్తే ఆసాములకు, కార్మికులకు కాస్త మెరుగైన ఉపాధి లభిస్తుంది. కార్మికుల బీమా కల్పించడం, పొదుపు పథకం అమలు చే యడం, హెల్త్ కార్డులు ఇవ్వడం, కార్మికుల భార్యలకు గార్మెంట్ రంగంలో ఉపాధి కల్పించడం, వా రి పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందించాల్సి ఉంది. అద్దె ఇంట్లో ఉండే వారికి ఇల్లు, పేదలకు అంత్యోదయ కార్డులు, శ్రమించే కార్మికులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. కార్మికుల పొట్ట నింపాలి వస్త్ర పరిశ్రమలో శ్రమించే కార్మికుల పొట్ట నింపేలా ప్రభుత్వ విధానాలు ఉండాలి. ఇప్పుడు ‘పుండు ఒక్క చోట ఉంటే.. మందు మరోచోట రాస్తున్నారు’ ఇది సరైన విధానం కాదు. కార్మికులకు మేలు చేసేలా ఇప్పటికే ప్రభుత్వం కొంత చొరవ చూపింది. కానీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు ఉండాలి. వస్త్రోత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలి. స్థానికంగా నూలు డిపోలు ఏర్పాటు చేసి, నేరుగా నూలు అందించాలి. కార్మికుల సంక్షేమానికి బాటలు వేయాలి. – కొక్కుల భాస్కర్, పద్మశాలీ జాతీయ పరిషత్ అధ్యక్షుడు -
సిరిసిల్ల నేత కళాకారుడి నైపుణ్యం: అగ్గిపెట్టెలో ఇమిడే షర్ట్, లుంగీ
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరోసారి తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. చేనేత మగ్గంపై ఆయన అగ్గిపెట్టెలో ఇమిడే షర్ట్, లుంగీని నేశాడు. తన సాంచాల షెడ్డులో పట్టుపోగులతో రెండున్నర మీటర్ల షర్ట్ బట్ట, రెండు మీటర్ల పొడవైన లుంగీని నేశాడు. తర్వాత రెండున్నర మీటర్ల వస్త్రంతో షర్ట్‌ను కుట్టించాడు. లుంగీ, షర్ట్.. రెండూ అగ్గిపెట్టెలో ఇమిడి పోవడం విశేషం. లుంగీ 140 గ్రాములు, షర్ట్ 100 గ్రాముల బరువు ఉన్నాయి. హరిప్రసాద్ వారం పాటు శ్రమించి వీటిని తయారు చేశాడు. శనివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని.. శుక్రవారం వీటిని సిరిసిల్లలో ప్రదర్శించారు. గతంలో కూడా హరిప్రసాద్ సూక్ష్మ మరమగ్గం, మరమగ్గంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రాలను నేశాడు. -
బ్లాక్ ఫంగస్ భయం: మగ్గానికి ఉరేసుకున్న బాధితుడు
దొడ్డబళ్లాపురం: బ్లాక్ ఫంగస్ ఉన్నట్లు బయట పడటంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దొడ్డబళ్లాపురంలోని విద్యానగర్‌లో నివసిస్తున్న రవీంద్ర (58) మరమగ్గం కార్మికుడు. ఈయన కరోనాకు గురై బాగేపల్లిలోని కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స తీసుకున్నాడు. రోగ లక్షణాలు ఎక్కువ కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించగా బ్లాక్‌ఫంగస్ ఉన్నట్లు తేలింది. దీంతో అతన్ని బెంగళూరు విక్టోరియాకు తరలించారు. అక్కడ వైద్య సిబ్బందితో గొడవపడి తిరిగివచ్చిన రవీంద్ర గురువారం రాత్రి మగ్గం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి దహనం చేయడానికి నగరసభ అధికారులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. మగ్గానికి వేలాడుతున్న రవీంద్ర -
శ్రీవారికి అరుదైన కానుక
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి శుక్రవారం అరుదైన కానుక అందింది. సిరిసిల్లకు చెందిన విజయ్ అనే చేనేత కార్మికుడు తాను స్వయంగా తయారుచేసిన అగ్గిపెట్టెలో పట్టే పట్టు వస్ర్తాన్ని శ్రీవారికి సమర్పించుకున్నాడు. గతంలో కూడా విజయ్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర తయారు చేసిన విషయం తెలిసిందే. -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
– ఉసురు తీసిన అప్పులు, కుటుంబ సమస్యలు మదనపల్లెటౌన్: చేనేత కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లె పట్టణంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా రొద్దం మండలం సానిపల్లెకు చెందిన ఆరేళ్లప్పగారి గోవిందప్ప కొడుకు వెంకటాద్రి(30) చేనేత కార్మికుడు. ఐదేళ్ల క్రితం లక్ష్మిదేవి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇందుకోసం రూ.2 లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చలేకపోవడంతో వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చేశారు. దీంతో ఏడాది క్రితం స్వగ్రామంలో భార్య, పిల్లలు గోవర్ధన, అంకితను వదిలి మదనపల్లెకు వచ్చాడు. మారుతీనగర్‌లో నివాసం ఉంటూ కూలి మగ్గం నేస్తున్నాడు. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన కేఆర్ రూప అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఏం జరిగిందో కాని వారం రోజుల క్రితం రెండో భార్య రూప భర్త వెంకటాద్రికి చెప్పకుండా పుట్టినింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను తాను ఉంటున్న అద్దె ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం గమనించిన ఇంటి యజమాని వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఖాదర్‌బాషా అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై స్థానికులను ఆరా తీశారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అప్పుల బాధతో నేతన్న ఆత్మహత్య
సిరిసిల్ల: అప్పుల బాధ తాళలేక ఓ నేతన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన తొర్ర ఎల్లయ్య(55) నేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చే దారి కానరాక ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్ : అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మహాత్మాగాంధీ కాలనీలో శంకర ప్రసాద్(40) అనే చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుమారు రూ. 2 లక్షలు అప్పు ఉన్నట్లు వారు చెప్పారు. ప్రసాద్‌కు భార్య, ముగ్గురు ఆడపిల్లలున్నారు. సంఘటనా స్థలానానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రుణభారంతో విషం తాగిన నేతన్న
ఆర్థిక ఇబ్బందులు నేతన్న ఉసురుతీశాయి. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన నేత కార్మికుడొకరు అప్పుల బాధతో బలవన్మరణం చెందాడు. గ్రామంలో నేతపని చేసుకునే జెల్ల కుమారస్వామి(49) సరైన పని దొరక్క కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. కుటుంబ పోషణ కోసం అతడు రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ విషయమై తీవ్ర మనోదనతో ఉన్న కుమారస్వామి మంగళవారం రాత్రి నేత పనిలో వాడే నైటాఫ్ అనే రసాయనాన్ని తాగాడు. బుధవారం ఉదయం అతడు మృతి చెందిన విషయాన్ని కుటుంబసభ్యులు గమనించారు. అతనికి భార్య అలివేలు, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు ఎస్సై రాజశేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చేనేత కార్మికుడు, ఆత్మహత్య, నల్లగొండ, నైటాఫ్, రుణ భారం, The handloom worker , suicide , Nalgonda , naitaph , debt , Weaver,