దొడ్డబళ్లాపురం: బ్లాక్ ఫంగస్ ఉన్నట్లు బయట పడటంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దొడ్డబళ్లాపురంలోని విద్యానగర్‌లో నివసిస్తున్న రవీంద్ర (58) మరమగ్గం కార్మికుడు. ఈయన కరోనాకు గురై బాగేపల్లిలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో చికిత్స తీసుకున్నాడు. రోగ లక్షణాలు ఎక్కువ కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించగా బ్లాక్‌ఫంగస్ ఉన్నట్లు తేలింది. దీంతో అతన్ని బెంగళూరు విక్టోరియాకు తరలించారు. అక్కడ వైద్య సిబ్బందితో గొడవపడి తిరిగివచ్చిన రవీంద్ర గురువారం రాత్రి మగ్గం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి దహనం చేయడానికి నగరసభ అధికారులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.
మగ్గానికి వేలాడుతున్న రవీంద్ర
బ్లాక్ ఫంగస్‌తో చేనేత కార్మికుడు బలవన్మరణం
Published Sat, May 29 2021 9:04 AM | Last Updated on Sat, May 29 2021 9:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment