
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల నేత కళాకారుడు నల్లా విజయ్ మగ్గంపై నేసిన సువాసనలు వెదజల్లే వెండి చీరలను మంత్రి తారక రామారావు శనివారం ఆవిష్కరించారు. చీర తయారీకి దాదాపు నెలన్నర రోజుల సమయం పట్టిందని విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇప్పటివరకు విజయ్ నేసిన వస్త్ర ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు అతని కళా నైపుణ్యాన్ని ప్రశంసించారు. తెలంగాణ నేతన్నల అనితర సాధ్యమైన, అద్భుతమైన ప్రతిభకు విజయ్ నిదర్శనమని, ఆయన సిరిసిల్లకు మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. విజయ్‌కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.