తెలంగాణ రాష్ట్రంలో చేనేత కులస్తుల దశ మారిపో నుంది. పద్మశాలి (చేనేత) కులస్తుల కోసం, సీఎం కేసీఆర్ వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయ టానికి ముందుకురావడం అభినందనీయం.
తెలంగాణ రాష్ట్రంలో చేనేత కులస్తుల దశ మారిపో నుంది. పద్మశాలి (చేనేత) కులస్తుల కోసం, సీఎం కేసీఆర్ వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయ టానికి ముందుకురావడం అభినందనీయం. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమెరికా అధ్య క్షుడు ఒబామాకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరను మగ్గం పై నేసి కానుకగా ఇవ్వబోతున్న చేనేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్‌కు ప్రశంసలు.
అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీర నేసి గతంలోనే రికార్డు సాధించిన నల్ల పరంధా ములు వంశీయుడీయన. సిరిసిల్ల, సుల్తానాబాద్, వరం గల్, జనగామ, హుజురాబాద్ ప్రాంతాల్లో నివసించే పద్మశాలి (చేనేత) కులస్తుల దయనీయ జీవితాలను మెరుగుపర్చేందుకు సత్వర చర్యలు తీసుకోవాలి.
కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి, ఆదిలాబాద్