kolipaka srinivas
-
అగ్గిపెట్టెలో చే‘నేత’ పట్టుచీర
తెలంగాణ రాష్ట్రంలో చేనేత కులస్తుల దశ మారిపో నుంది. పద్మశాలి (చేనేత) కులస్తుల కోసం, సీఎం కేసీఆర్ వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయ టానికి ముందుకురావడం అభినందనీయం. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమెరికా అధ్య క్షుడు ఒబామాకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరను మగ్గం పై నేసి కానుకగా ఇవ్వబోతున్న చేనేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్కు ప్రశంసలు. అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీర నేసి గతంలోనే రికార్డు సాధించిన నల్ల పరంధా ములు వంశీయుడీయన. సిరిసిల్ల, సుల్తానాబాద్, వరం గల్, జనగామ, హుజురాబాద్ ప్రాంతాల్లో నివసించే పద్మశాలి (చేనేత) కులస్తుల దయనీయ జీవితాలను మెరుగుపర్చేందుకు సత్వర చర్యలు తీసుకోవాలి. కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి, ఆదిలాబాద్ -
'జాగృతి' రచనల పోటీ
కోలిపాక శ్రీనివాస్ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధి, బెల్లంపల్లి హైదరాబాద్లోని ‘జాగృతి’ తెలుగు వారపత్రిక ఆరెస్కేమూర్తి స్మారక ‘హాస్య’, వ్యంగ్య’ రచనల పోటీ నిర్వహిస్తోంది. 500 పదాలకు మించని చిన్నరచనలతో రచయితలు పెద్ద బహుమతి గెలుచుకోవచ్చు. ప్రథమ బహుమతి రూ.5,000లు, ద్వితీయ బహుమతి రూ.3,000లు. ఈ పోటీకి రచనలు ఇలా పంపవచ్చు. 1. రచయితలు తమ రచనలు డీటీపీ చేయించి పంపాలి. అనూ ఫాంట్ అయితే ఓపెన్ ఫైల్, లేకుంటే పీడీఎఫ్ ప్రతిని www.jagritiweekly@gmail.comకు ఈమెయిల్ చేయాలి. బహుమతికి ఎంపిక కాని రచనల నుండి నచ్చినవాటిని సాధా రణ ప్రచురణకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ జాగృతికి ఉంది. కాగా, రచ నల్లో వస్తువు సామాజిక అంశాల్లో ఏదైనా కావచ్చు. సందర్భాను సారంగా అన్యభాషా పదాలు వాడినా రచన ప్రధానంగా తెలుగులోనే ఉండాలి. నిడివి 500 పదాలకు మించరాదు. అంగవైకల్యం, నిరక్షరా స్యత, పేదరికం, మతవిశ్వాసాలు, దేవతలను కించపర్చేవి, లింగవివక్ష చూపేవి కారాదు. హామీ పత్రం, పూర్తి చిరునామా తప్పనిసరిగా పం పాలి. రచనలు మాకు అందవలసిన చివరి తేదీ 31-12-2014. రచ నలు పంపవలసిన చిరునామా: జాగృతి ఆరెస్కే మూర్తి స్మారక వ్యంగ్య /రచనల పోటీ, జాగృతి భవనం, 3-4-228/4/1, లింగంపల్లి, కాచిగూడ, హైదరాబాద్ -27. సంపాదకుడు, జాగృతి తెలుగు వారపత్రిక, హైదరాబాద్ -
మళ్లీ కూయవే గువ్వా!
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి అకాల మరణంతో సంగీతాభిమానులు మూగపోయారు. చక్రి తన సంగీతంతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన 40 ఏళ్ల చక్రి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి తదితర సినిమాలను తన సంగీతంతోనే హిట్ అయ్యేలా చేశారు. ఓ మగువా నీతో స్నేహం కోసం పాట ద్వారా సత్యం సినిమాలో ప్రేమికులు మరువలేని గీతం అందించారు. ఇక గోపి- గోపిక - గోదావరి చిత్రంలో నువ్వక్కడుంటే నేనిక్కడుం టే ప్రాణం విలవిల అనే పాటను, విడిపోయిన ప్రేమికులు ఎప్పుడు విన్నా కన్నీరు పెట్టేంత గాఢానుభూతితో స్వరపర్చారు. ఇక చక్రం సినిమాలోని జగమంత కుటుంబం నాది పాట సాహిత్య, సంగీతాల మేలుకలయిగా జీవితాన్ని తాత్వీకరించిన గొప్ప గీతం. దాదాపు వంద సినిమాలకు సంగీతం అందించి లోకం వీడిపోయిన చక్రిని తల్చుకుంటూ మళ్లీ కూయవే గువ్వా అంటూ సినిమా ప్రపంచం రోదిస్తోంది. నాలుగు దశాబ్దాలు దాటక ముందే కనుమరుగైన చక్రికి అభిమానాంజలి. - కొలిపాక శ్రీనివాస్ బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా