ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి అకాల మరణంతో సంగీతాభిమానులు మూగపోయారు. చక్రి తన సంగీతంతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన 40 ఏళ్ల చక్రి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి తదితర సినిమాలను తన సంగీతంతోనే హిట్ అయ్యేలా చేశారు. ఓ మగువా నీతో స్నేహం కోసం పాట ద్వారా సత్యం సినిమాలో ప్రేమికులు మరువలేని గీతం అందించారు. ఇక గోపి- గోపిక - గోదావరి చిత్రంలో నువ్వక్కడుంటే నేనిక్కడుం టే ప్రాణం విలవిల అనే పాటను, విడిపోయిన ప్రేమికులు ఎప్పుడు విన్నా కన్నీరు పెట్టేంత గాఢానుభూతితో స్వరపర్చారు. ఇక చక్రం సినిమాలోని జగమంత కుటుంబం నాది పాట సాహిత్య, సంగీతాల మేలుకలయిగా జీవితాన్ని తాత్వీకరించిన గొప్ప గీతం. దాదాపు వంద సినిమాలకు సంగీతం అందించి లోకం వీడిపోయిన చక్రిని తల్చుకుంటూ మళ్లీ కూయవే గువ్వా అంటూ సినిమా ప్రపంచం రోదిస్తోంది. నాలుగు దశాబ్దాలు దాటక ముందే కనుమరుగైన చక్రికి అభిమానాంజలి.
- కొలిపాక శ్రీనివాస్
బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా
మళ్లీ కూయవే గువ్వా!
Published Wed, Dec 17 2014 4:14 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM
Advertisement
Advertisement