వెక్కి వెక్కి ఏడ్చిన ఉదయభాను!
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణవార్త విని.. యాంకర్, నటి ఉదయభాను వెక్కి వెక్కి ఏడ్చేశారు. చక్రి ఈమధ్య కాలంలో చాలా లావుగా అయిపోయారని.. అయినా కూడా ఆయనకు రకరకాలుగా డ్రస్సులు వేసుకోవడం ఆయనకు ఇష్టమని చెప్పారు. నాలుగు అడుగులు వేసినా బాగా ఆయాపడుతున్నారని, అది చూసి కొంతమంది ఆయన ఉన్నంతసేపు ఊరుకుని.. వెళ్లగానే వెనకాల రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారని ఉదయభాను ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత లావుగా ఉంటే ఆరోగ్యం ఏమయిపోతుంది.. హ్యాపీగా, హెల్దీగా ఉండాలని ఆయనకు చెప్పేదాన్నంటూ.. కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు చూస్తే ఉన్నట్టుండి ఇలాంటి పరిస్థితి ఎదురైందని, ఆయన మీద చాలామంది విమర్శలుచేశారని.. కానీ, అంత మంచి హృదయం ఉన్నవాళ్లు మళ్లీ దొరకడం కష్టమని ఉదయభాను చెప్పారు. ఆయన లేని బాధను తాను మాటల్లో చెప్పలేనని, మనస్ఫూర్తిగా ' చక్రీ.. వియ్ మిస్ యు' అని మాత్రమే అనగలనని ఉదయభాను తెలిపారు.