Udaya Bhanu
-
ఆ యాంకర్లు భ్రష్టు పట్టిస్తున్నారు.. యాంకర్ వింధ్య షాకింగ్ కామెంట్స్
యాంకర్ అనే పేరు చెప్పగానే తెలుగు వాళ్లకు సుమ గుర్తొస్తుంది. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల నుంచి యాంకరింగ్ ఇండస్ట్రీలో తనదైన మార్క్ సృష్టించింది. ప్రస్తుత జనరేషన్లో చాలామందిని ఈమెని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఫీల్డ్‌లోకి వస్తున్నారని చెప్పొచ్చు. అలా వచ్చిన అమ్మాయే వింధ్య విశాఖ. షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో పాటు ఐపీఎల్‌లోనూ తెలుగు కామెంటరీతో ఈమె చాలా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటిది ఇప్పుడు తోటి యాంకర్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)'సుమక్క అంటే నాకు చాలా ఇష్టం. ఆమెని కలిసినప్పుడల్లా.. మాకు కొన్ని షోలు విడిచిపెట్టొచ్చు కదా అని ఫన్నీగా సతాయిస్తుంటాం. సుమక్క విషయానికొస్తే ఆమె టైమింగ్ సూపర్. ఉదయభాను ఇన్నేళ్ల నుంచి యాంకరింగ్ చేస్తున్నారు. గ్లామర్, లుక్స్ మాత్రం ఫెర్ఫెక్ట్గా మెంటైన్ చేస్తున్నారు. ఝాన్సీ గారికి సమాజం పట్ల నాలెడ్జ్ చాలా ఉంది. ఆమెతో కాసేపు మాట్లాడితే చాలా విషయాలు నేర్చుకోవచ్చు''ఇంకొందరు యాంకర్స్ ఉన్నారు. తెలుగు సరిగ్గా మాట్లాడలేరు. ఓ రకంగా చెప్పాలంటే వాళ్లు యాంకరింగ్‌ని భ్రష్టు పట్టిస్తున్నారు. కొన్ని షోల్లో బూతులని, డబుల్ మీనింగ్ కామెడీని వాళ్లు జనాలకు అలవాటు చేస్తున్నారా అనిపిస్తుంది' అని యాంకర్ వింధ్య చెప్పుకొచ్చింది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తుంటే 'జబర్దస్త్' షో, అందులోని యాంకర్స్ గురించే సెటైరికల్ కామెంట్స్ చేసిందా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) -
యాంకర్ ఉదయభాను నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా? (ఫొటోలు)
-
యాంకర్ ఉదయభాను నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా? (ఫొటోలు)
-
ఉదయ భాను కొత్తింటిని చూశారా?భలే రిచ్‌గా ఉందే!
బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్నా ఉదయ భానుది సెపరేట్ స్టైల్. ఒకప్పుడు స్టార్ యాంకర్‌గా రాణించిన ఉదయభాను బుల్లితెర శ్రీదేవిగా పాపులర్ అయ్యింది. అచ్చమైన తెలుగులో గలగలా మాట్లాడే ఉదయ భాను యాంకరింగ్‌కు ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు.యాంకర్లలో ఎక్కువ పారితోషికం అందుకున్న యాంకర్‌గానూ ఉదయభానుకు పేరుంది. చదవండి: సోషల్ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గని అందం ఆమె సొంతం. దీనికి తోడు తనదైన స్టైల్లో హోస్టింగ్ చేసే ఉదయభాను బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అలరించింది. అయితే పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక మాత్రం కనుమరుగైపోయింది. ఈమధ్యే మళ్లీ యాంకర్‌గా రీఎంట్రీ ఇచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లు, షోలు చేస్తుంది. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా కొత్త ఇంట్లోకి వెళ్లిన ఉదయభాను దీనికి సంబంధించిన హోంటూర్ వీడియోను పంచుకుంది. విశాలవంతమైన గదులతో రిచ్ లుక్‌లో ఇల్లు అదిరిపోయింది. ఇది చూసిన నెటిజన్లు ఉదయభానుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: భర్తను తలుచుకొని ఎమోషనల్ అయిన సురేఖ వాణి -
శాకుంతలం టీమ్ మాటలకు ఫ్లాట్ అయిన ఉదయభాను..సినిమా చూసి తీరాలంతే...
-
Udaya Bhanu Photos: యాంకర్ ఉదయభాను కవలపిల్లలు ఇప్పుడెలా ఉన్నారో చూశారా? (ఫొటోలు)
-
ఆదిరెడ్డి, అమర్దీప్.. బిగ్‌బాస్ 6లో ఇంకా ఎవరెవరంటే?
బిగ్‌బాస్ షో కోసం తెగ వెయిట్ చేస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. బిగ్‌బాస్ ఐదో సీజన్ తర్వాత నాన్‌స్టాప్ పేరుతో ఓటీటీలో బిగ్‌బాస్ ప్రారంభమైనా అది అందరికీ చేరువవలేదు. కేవలం హాట్‌స్టార్‌ను వీక్షించేవారు మాత్రమే దాన్ని చూసేందుకు వీలుండటంతో చాలావరకు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ రియాలిటీ షోను మిస్సయ్యారు. అయితే వారి నిరీక్షణకు తెరదించుతూ త్వరలోనే షో ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా సెప్టెంబర్‌లో కొత్త సీజన్ ఘనంగా లాంచ్ కానుంది. ఇందుకోసం కంటెస్టెంట్ల ఎంపిక దాదాపు పూర్తి కావొచ్చింది. కానీ కొందరు మాత్రం ఇంకా రావాలా? వద్దా? అన్న మీమాంసలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దీపికా పిల్లి, నేహా చౌదరి, శ్రీహాన్, ఆర్జే సూర్య, యాంకర్ ఉదయభాను, అమర్దీప్, ఆదిరెడ్డి, చలాకీ చంటి, గీతూ రాయల్, సింగర్ రేవంత్, యాంకర్ అరోహి.. షోలో అడుగు పెట్టబోతున్నారట. గత సీజన్లో సిరి రాగా, ఈసారి సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ వస్తుండటంతో అతడి మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇక బుల్లితెర నటుడు అమర్దీప్ ఇటీవలే తన ప్రేయసి, సహనటి తేజస్వితో నిశ్చితార్థం జరుపుకున్నాడు. మరి అతడు పెళ్లిని వాయిదా వేసుకుని వస్తాడా? లేదంటే త్వరగా పెళ్లి చేసేసుకుని బిగ్‌బాస్ షోకు రెడీ అవుతాడా? అన్నది చూడాలి! ప్రతి సీజన్లో ఓ కమెడియన్ ఉన్నట్లే ఈసారి కూడా ఓ హాస్యనటుడిని తీసుకురావాలనుకున్నారు. అందులో భాగంగానే చలాకీ చంటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గీతూ రాయల్.. సోషల్ మీడియాలో కొటేషన్లు చెప్తూ బాగా ఫేమస్ అయింది. అలాగే బిగ్‌బాస్ షోపై రివ్యూలు కూడా ఇచ్చింది. ఆది రెడ్డి కూడా ఈ షోపై రివ్యూలు ఇచ్చిన వ్యక్తే. బిగ్‌బాస్ ఓటీటీలో షోపై రివ్యూలు ఇచ్చిన యాంకర్ శివను లోనికి పంపించారు. ఈలెక్కన ఈసారి వీరిద్దరినీ కూడా హౌస్‌లోకి పంపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక అందరినీ మించి ఉదయభాను షోలో అడుగుపెడ్తే ఎలా ఉంటుందో చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఐపీఎల్ యాంకర్ నేహా చౌదరి బిగ్‌బాస్‌కు వస్తుండటం కూడా చాలామంది ఆశ్చర్యపరుస్తోంది. మరి వీరిలో ఎవరు చివరిదాకా ఉంటారు? ఎవరు మొదట్లోనే హ్యాండ్ ఇస్తారు? ఇంకా ఎవరెవరు హౌస్‌లోకి రాబోతున్నారు? వంటి విషయాలు తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే! చదవండి: ఎక్కువగా అబ్బాయి పాత్రలనే పోషించిన ఈ నటి గురించి తెలుసా? ఆర్ఆర్ఆర్లో కష్టమైన పాత్ర రామ్‌చరణ్‌దే.. -
ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను: ఉదయభాను భావోద్వేగం
స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే యాంకర్ ఉదయభాను. అప్పట్లో బుల్లితెరను ఓ ఊపు ఊపేసిందామె. తన మాటలతో, నవ్వులతో షోలో కొత్త వెలుగులు నింపేది. ఒకప్పుడు తెలుగులో టాప్ యాంకర్‌గా రాణించిన ఆమె కొన్నేళ్లుగా యాంకరింగ్‌కు దూరంగా ఉంది. తాజాగా ఆమె కమ్‌బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొద్దిరోజులుగా వరుసగా వీడియోలు పోస్ట్ చేస్తూ యూట్యూబ్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఉదయభాను పేరుతో కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన యాంకర్ 'మీ ప్రేమే నా బలం' పేరుతో మొట్టమొదటి వీడియోను వదిలింది. 'మీ అభిమానం నేను సాధించిన వరం, మీ ప్రేమ అభివర్ణించలేని అద్భుతం, నా ప్రతి అడుగులో నాకు తోడుగా నిలబడింది, నాకు ధైర్యమే నిలిచింది మీరే.. అంటూ అభిమానుల కోసం ఉద్వేగపూరితంగా మాట్లాడింది ఉదయభాను. మీ అభిమానంతో నన్ను ఎప్పుడూ పడిపోకుండా పట్టుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? మీకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేయడం తప్ప.. అందుకే వస్తున్నా మీ ఉదయభాను' అంటూ వీడియోను ముగించింది. ఇన్నాళ్ల తర్వాత మాకోసం యూట్యూబ్‌లో అడుగుపెట్టినందుకు థ్యాంక్స్ అంటూ ఫ్యాన్స్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మీ గొంతులోనే ఏదో తెలియని మ్యాజిక్ ఉందని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: తమన్నాతో గొడవ నిజమే, రెండు రోజులు..: అనిల్ రావిపూడి రికార్డులు బద్ధలు కొడుతున్న విక్రమ్, ఇప్పటిదాకా ఎంత వచ్చిందంటే? -
క్యూట్‌గా నవ్వులు చిందిస్తున్న ఈ కవలలు ఎవరో తెలుసా?
ఎంతో క్యూట్‌గా నవ్వులు చిందిస్తున్న ఈ కవలలు ఎవరో తెలుసా? అలా అడిగితే గుర్తు పట్టడం కష్టం కానీ, మీకోసం ఈ ఫోటోకి సంబంధించి ఒక క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో చెక్ చేసుకోండి. ఆ కవలల తల్లి టాలీవుడ్లో ఓ ప్రముఖ యాంకర్. అంతేకాదు హీరోయిన్గా కూడా కొన్ని సినిమాల్లో నటించింది. బుల్లి తెరపై తెలుగు తొలి తరం యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ క్లూతో అయినా వారెవరో గుర్తించారా? గుర్తించటం కష్టంగా ఉందా..? ఓకే.. విషయం మేమే చెప్పేస్తాం. చిరు నవ్వులు చిందిస్తున్న ఈ క్యూట్ కవలలు.. యాంకర్ ఉదయభాను కూతుళ్లు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఉదయం భాను. ఒకప్పుడు తెలుగులో టాప్ యాంకర్‌గా రాణించింది. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది యాంకర్స్ బుల్లి తెరపైకి రంగ ప్రవేశం చేశారు. ఆమె నిన్న మొన్నటి వరకు కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తూనే ఉంది. గర్భవతి అయినప్పటి నుంచి ఉదయ భాను యాంకరింగ్‌కి దూరంగా ఉంది. కవల పిల్లలకు జన్మనిచ్చిన చాలా రోజుల తర్వాత ఆమె కెమెరా ముందుకు వచ్చింది. ఆ మధ్య ఓ టీవీ చానల్ ప్రోగ్రామ్‌కి గెస్ట్‌గా వచ్చిన ఉదయ భాను.. తన ఇద్దరు పిల్లలను, భర్తను పరిచయం చేసింది. ఉదయభాను ఇప్పటి కూడా మునుపటి మాదిరే అందంగా ఉంది. దీంతో ఆమె మళ్లీ బుల్లి తెరపైకి వస్తుందేమో అని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం బుల్లి తెరపై సుమ, అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి వారు సత్తా చాటుతున్నారు. మరి వారికి పోటీగా ఈమె నిలుస్తుందా అనేది చూడాలి. -
ఆందోళన వద్దు.. 10 రోజుల్లో ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నింపుతాం..!
కృష్ణా: పులిచింతల స్టాప్‌లాగ్ గేట్ పనులను ప్రభుత్వ విప్ ఉదయ భాను పరిశీలించారు. స్టాప్ లాగ్ గేట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. నేటి రాత్రి (శనివారం)కి స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు పూర్తవుతుందన్నారు. 16వ గేటు కొట్టుకువపోవడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని ఉదయ భాను పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు భవిష్యత్తులో హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటును పరిశీలిస్తామని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాల వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన విమర్షించారు. లోకేష్ విషయం తెలియకుండా ట్వీట్లు చేస్తున్నారని దుయ్య బట్టారు. మచిలీపట్నం కోర్టు తీర్పుపై హైకోర్టుకి అపీల్‌కి వెళ్లకుండా.. చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేసింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాన్ని అప్పనంగా దోచిపెట్టే ప్రయత్నం చేయలేదా? అని అడిగారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే గత ప్రభుత్వం అన్ని రకాల సహాయం చేసిందని విమర్షించారు. 10 రోజుల్లో ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నింపుతామని, కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ ఉదయభాను తెలిపారు. -
రెండేళ్లలో విప్లవాత్మక పథకాల దూకుడు
-
Telangana Check Post: మేమేమన్నా పాకిస్తాన్ నుంచి వస్తున్నామా?
తిరుపతికి చెందిన అబ్దుల్లా (38) కరోనా బారిన పడడంతో స్థానికంగా వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఆయన భార్య హుటాహుటిన అంబులెన్స్ మాట్లాడుకుని హైదరాబాద్‌కు బయల్దేరారు. కానీ తెల్లవారుజామున 5.30 గంటలకు గద్వాల జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపేశారు. దాంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడా బెడ్స్ ఖాళీలేవన్నారు. తన భర్త ప్రాణాలు కాపాడాలంటూ ఆమె వేడుకున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. విష యం తెలుసుకున్న ఇన్చార్జి కలెక్టర్ రామసుందర్‌రెడ్డి అబ్దుల్లాను ఆస్పత్రిలో చేర్పించారు. పేరు లత. స్వస్థలం విజయనగరం జిల్లా. కరోనా బాధితురాలు. పరిస్థితి విషమించిందని వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు బయలుదేరారు. దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన వారిని.. కోదాడ మండలం రాంపురం చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపేశారు. అనుమతి లేదని చెప్పడంతో విధిలేక తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. సాక్షి, హైదరాబాద్, నెట్వర్క్: ఇతర రాష్ట్రాల నుంచి కరోనా పేషెంట్లతో వచ్చిన అంబులెన్సులను పోలీసులు రాష్ట్ర సరిహద్దుల్లోనే నిలిపేశారు. హైదరాబాద్‌లో ఆస్పత్రి బెడ్ అలాట్మెంట్, కోవిడ్ కంట్రోల్ రూం పాస్ ఉంటేనే పంపిస్తామంటూ ఆపేశారు. ఆరోగ్య పరిస్థితి విషమించి, ఆక్సిజన్ పెట్టుకుని వచ్చిన పేషెంట్లను కూడా వదిలిపెట్టలేదు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఒక్కొక్కటిగా వరుసగా వచ్చిన అంబులెన్సులు సరిహద్దుల వద్ద బారులు తీరాయి. కంట్రోల్ రూం పాస్ లేని ఖాళీ అంబులెన్స్‌లు, ఇతర ప్రైవేట్ వాహనాలను కూడా పోలీసులు తిప్పి పంపించేశారు. గద్వాల పోలీసులు 20కిపైగా అంబులెన్సులను నిలిపివేశారు. కోదాడలోని రామాపురం చెక్‌పోస్టు వద్ద ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతం నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన అంబులెన్సులు బారులు తీరాయి. అంతదూరం వచ్చిన అంబులెన్సులను వెనక్కి పంపడంతో రోగుల బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, దామరచర్ల, ఖమ్మం జిల్లా అశ్వారావుపేట చెక్‌పోస్టు, భద్రాచలం చెక్‌పోస్టుల వద్దా ఇదే పరిస్థితి కనిపించింది. ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చేవారు, కర్ణాటక ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్కారు ఆదేశాలతో.. పొరుగు రాష్ట్రాల కోవిడ్ పేషెంట్లు చికిత్స కోసం తెలంగాణలోని ఆస్పత్రులకు వస్తే.. ఆస్పత్రి అంగీకార పత్రం ఉండాలని, కోవిడ్ కంట్రోల్ రూంకు వివరాలు సమర్పించి అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మార్గదర్శకాలు జారీ చేశారు. దీంతో గురువారం వరకు ఆస్పత్రి కన్ఫర్మేషన్ ఉంటే అంబులెన్సులను అనుమతించిన పోలీసులు.. కంట్రోల్ రూం నుంచి లెటర్ లేదంటూ శుక్రవారం తెల్లవారుజాము నుంచే నిలిపివేశారు. పుల్లూరు చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత ఏపీ వైపు నుంచి వస్తున్న కోవిడ్ అంబులెన్సులను ఆపేయడంతో జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 23 అంబులెన్సులను సరిహద్దుల నుంచే వెనక్కి పంపించారు. రెండు అంబులెన్స్‌లకు కంట్రోల్ రూం లేఖలు ఉండటంతో అనుమతించారు. మరికొందరు పేషెంట్ల బంధువులు అంబులెన్సులతో సరిహద్దుల వద్దే వేచి చూశారు. అంబులెన్సులను అడ్డుకుంటున్న విషయం తెలిసి ఏపీకి చెందిన కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్లు చెక్‌పోస్టు వద్దకు వచ్చారు. అంబులెన్స్‌లకు అనుమతి ఇవ్వాలంటూ గద్వాల ఎస్పీ, స్థానిక అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని పోలీసులు స్పష్టం చేయడంతో ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. ఈ క్రమంలో కోవిడ్ రోగుల బంధువులు, ఏపీ బీజేపీ కార్యకర్తలు పుల్లూరు చెక్‌పోస్టు ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒక సందర్భంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, పెద్ద సంఖ్యలో కానిస్టేబుళ్లు చెక్‌పోస్టు వద్ద మోహరించి బందోబస్తు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం ఆరు గంటల తర్వాత అంబులెన్స్‌లకు అనుమతి ఇచ్చారు. రాత్రి 10 గంటల వరకు 12 అంబులెన్స్‌లకు హైదరాబాద్‌కు వెళ్లినట్టు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోనూ.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న కోవిడ్ అంబులెన్సులను కూడా సరిహద్దుల్లో అడ్డుకున్నారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్గి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద అంబులెన్సులను తిప్పి పంపేశారు. బాధితులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కుటుంబ సభ్యులు వేడుకున్నా.. తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు. కాళ్లుపట్టుకుంటాం.. వదలండి.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్ వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుంచే కోవిడ్ అంబులెన్సులను అడ్డుకున్నారు. మధ్యాహ్నం వరకే సుమారు 14 అంబులెన్స్‌లు తిప్పిపంపారు. హైదరాబాద్‌లోని ఆస్ప త్రుల్లో బెడ్ మంజూరు చేసిన పత్రం, కోవిడ్ కంట్రోల్ రూం అనుమతి ఉన్న కొద్దిమందిని మాత్రమే అనుమతించారు. బెడ్ ఉన్నా కంట్రోల్ రూం లేఖ లేకుంటే అనుమతి ఇవ్వలేదు. దీంతో కోవిడ్ పేషెంట్లు, వారి బంధువులు తీవ్ర ఆందో ళన వ్యక్తం చేశారు. పరిస్థితి విషమంగా ఉందని కన్నీళ్లు పెట్టుకుంటూ.. కాళ్లు పట్టుకుంటామంటూ బతిమాలారు. విజయనగరం నుంచి వచ్చిన లత, ఏలూరు నుంచి వచ్చిన రాజేశ్వరి, తిరుపతి నుంచి వచ్చిన అబ్దుల్లాల బంధువులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాది భారతదేశం కాదా.. మేమేమన్నా పాకిస్తాన్ నుంచి వస్తున్నామా? ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని అడ్డుకోవడం ఏమిటి’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం వరకైనా వదులుతారేమోనన్న ఆశతో కొందరు చెక్‌పోస్టు వద్దే ఎదురుచూశారు. కొందరి అంబులెన్సులలో ఆక్సిజన్ సిలిండర్లు అయిపోవడంతో.. జగ్గయ్యపేట, నందిగామ నుంచి తెప్పించుకున్నారు. తిరిగి వెళ్తున్న క్రమంలో ఇద్దరు పేషెంట్లు చనిపోయినట్లు తెలిసింది. కాగా.. అంబులెన్సులను ఆపేశారన్న విషయం తెలిసిన ఏపీ ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రామాపురం క్రాస్‌రోడ్డుకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించాలన్నారు. కరోనాతో ప్రాణాలు పోతుంటే.. ఎక్కడా లేనట్టు తెలంగాణ ప్రభుత్వం అంబులెన్స్‌లు నిలిపివేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు పోతుంటే.. ఆపేస్తారా? కరోనాతో ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి సీరియస్ అవుతోందని.. అన్నీ సమకూర్చుకుని, కంట్రోల్ రూం లెటర్ తీసుకుని బయల్దేరే సమయం ఎక్కడ ఉందని కరోనా రోగులు, వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమవారి ప్రాణాలు కాపాడుకునేందుకు అంత దూరం నుంచి వస్తే.. ఆంక్షల పేరుతో వెనక్కి పంపడమేంటని మండిపడ్డారు. తమను అనుమతించాలని కోరారు. కన్నీళ్లు పెట్టుకుంటూ.. కాళ్లు పట్టుకుంటామని బతిమాలారు. అయినా తామేమీ చేయలేమని.. ప్రభుత్వ ఆదేశాల మేరకే వ్యవహరిస్తున్నామని పోలీసులు చేతులెత్తేశారు. చివరికి చేసేదేమీ లేక కరోనా పేషెంట్ల బంధువులు ఆవేదనతోనే తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. మరికొందరు మాత్రం అనుమతి ఇవ్వకపోతారా అన్న ఆశతో చెక్‌పోస్టుల వద్ద వేచి ఉన్నారు. చివరికి హైకోర్టు ఆదేశాలు రావడంతో పోలీసులు సాయంత్రం ఆరేడు గంటల సమయం నుంచి అంబులెన్సులను వదిలిపెట్టారు. -
పొట్టి వీరయ్య మృతి: ఉదయభాను భావోద్వేగం
ఒకప్పుడు యాంకర్‌గా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ప్రముఖ యాంకర్ ఉదయభాను. ఇక సినిమాల్లో సైతం పలు పాత్రల్లో నటించి నటిగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారామె. తన గలగల మాటలతో ప్రేక్షకదారణ పొందిన ఆమె అప్పట్లో యాంకర్‌గా బుల్లితెరను ఏలిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలిచిన ఆమె ఆ తర్వాత యాంకరింగ్‌కు, నటనకు బ్రేక్ ఇచ్చారు. అనంతరం కొంతకాలానికి ఓ ఛానల్లో ప్రసారమైన పిల్లలు పిడుగులు అనే షో ద్వారా ఉదయభాను మళ్లీ యాంకర్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్లారు. ఇక ఈ షోను నుంచి కూడా తప్పుకున్న ఆమె అప్పటి నుంచి బుల్లితెరపై కనిపించడం తగ్గించారు. ఈ నేపథ్యంలో బయట జరుగుతున్న అఘాయిత్యాలపై అప్పడప్పుడు స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా ఉదయభాను ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య మరణంతో మరోసారి తెరపైకి వచ్చారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న పొట్టి వీరయ్య నిన్న(ఆదివారం) గుండెపోటుతో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఉదయభాను కూడా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నానంటూ కంటతడి పెట్టుకున్నారు. అంతేకాకుండా తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్‌తో అందరినీ కంటతడి పెట్టించారు.‘వీరయ్య అంకుల్ మరణవార్త తెలియగానే హృదయం ముక్కలైనట్టు అనిపించింది. ఇది భరించలేని నిజమని చెప్పడానికి ఎంతో బాధగా ఉంది. ఇప్పుడు కలుగుతున్న బాధను మాటల్లో చెప్పలేకపోతున్నా. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాను అంకుల్. ఓ మంచి వ్యక్తిని ఈ ప్రపంచం కోల్పోయింది. దేవుడా మా మీద అయిన కొంచెం దయచూపు’ అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: Potti Veeraiah: పొట్టి వీరయ్య కన్నుమూత -
ప్రజలను మోసగించేందుకు చంద్రబాబు కుట్రలు
వత్సవాయి(జగ్గయ్యపేట): నాలుగేళ్లపాటు కేంద్ర ప్రభుత్వంతో అధికారం పంచుకొని ఇప్పుడు ప్రత్యేక హోదా, కడప ఉక్కు, రైల్వే జోన్ అంటూ దొంగ దీక్షలతో ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ విజయవాడ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను విమర్శించారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం వత్సవాయిలో సంఘీభావ పాదయాత్ర ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన సభలో ఉదయభాను మాట్లాడుతూ బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విదేశాల చుట్టూ తిరుగుతున్నా రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు రాకపోగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందన్నారు. నాలుగేళ్లలో నిరుద్యోగ భృతి మాటెత్తని బాబు ఎన్నికలు సమీపిస్తుండటంతో నెలకు రూ.1000 ఇస్తానని కొత్త నాటకానికి తెరలేపారన్నారు. అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్న బాబుకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. సాగర్‌లో పుష్కలంగా నీరు ఉన్నా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ స్వార్థం కారణంగా కాలువలకు నీరు రాక నియోజకవర్గంలో పొలాలు ఎండిపోతున్నాయన్నారు. కాలువ లైనింగ్ పనులకు ఎక్కడా లేని విధంగా 25 శాతం ఎక్కువగా సింగిల్ టెండర్ వేసి కోట్లు దోచుకోవటానికి కాలువకు నీళ్లు రాకుండా చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పంచాయతీ విభాగపు జిల్లా అధ్యక్షుడు తన్నీరు నాగేశ్వరరావు, యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి పీ సునీల్, విజయవాడ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సంపత్ విజిత, నియోజకవర్గ యూత్ విభాగపు అధ్యక్షులు మార్కపూడి గాంధీ, నియోజకవర్గ ఎస్సీసెల్ కన్వీనర్ బూడిద నరసింహారావు, వత్సవాయి, జగ్గయ్యపేట మండల కన్వీనర్లు గాదెల రామారావు, చిలుకూరి శ్రీనివాసరావు, మండల ప్రచార కార్యదర్శి చింతకుంట్ల వెంకటరెడ్డి, డబ్బాకుపల్లి సొసైటీ అధ్యక్షులు చెంబేటి వెంకటేశ్వర్లు, మండల వాణిజ్య, మైనార్టీ, ఎస్టీసెల్, యూత్ అధ్యక్షులు పోలా నాగభూషణం, రన్ హస్సేన్, లావుడియా మగతానాయక్, నేలవెల్లి వెంకటప్పయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్టీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8న నారీ
సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం(ఎస్టీఎస్) ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా లేడిస్ నైట్ ఈవెంట్ 'నారి-2018'ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్కే రోజా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. సింగపూర్‌లోని ఆర్చర్డ్ హోటల్లో జరిగే ఈ కార్యక్రమానికి యాంకర్ ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. టాలీవుడ్ సింగర్ సమీరా భరద్వాజ్ తన గాత్రంతో అలరించనున్నారు. మిస్, మిసెస్ సింగపూర్ తెలుగు సమాజం, షార్ట్ ఫిలిమ్ పోటీలు, మహానటి థీమ్ వస్త్రధారణ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు భారీ ఎత్తున స్థానిక మహిళలు హాజరవ్వాలని సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 8న సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు స్వాతి ఓ ప్రకటనలో తెలిపారు. ఆటా, పాటలతో పాటూ మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు కార్యదర్శి సత్యచిర్ల పేర్కొన్నారు. -
పవన్ సినిమా ఐటమ్ సాంగ్ లో..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2018 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఘనవిజయం సాధించటంతో కొత్త సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం సీనియర్ యాంకర్ ను తీసుకున్నారట. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన జులాయి సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన ఉదయభాను, పవన్ సినిమాలోనూ ఐటమ్ సాంగ్ లో మెరవనుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే హాట్ యాంకర్ అనసూయ స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తుండటంతో ఉదయభాను రీ ఎంట్రీతో అనసూయకు గట్టిపోటి తప్పేలా లేదు. -
ఆడియో ఫంక్షన్లో ఉదయభానుకి ‘పంచ్’
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన గౌతమ్ నంద చిత్రం ఆడియో ఫంక్షన్లో యాంకర్ ఉదయభానుకు అదిరిపోయే పంచ్ ఇచ్చారు ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో అనేక మంది గౌతమ్ నంద చిత్రీకరణ సమయంలో తమ అనుభవాలను పంచుకున్నారు. అలాగే.. ఫైట్ మాస్టర్లు రామ్ లక్షణ్ లను కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ కాసింత ఎక్కువగానే చెప్పింది హోస్ట్ ఉదయభాను. అయితే.. స్టేజ్ పైకి రాగానే ఉదయభాను ఇచ్చిన బిల్డప్ అంతా తుస్సుమనిపించేశారు రామ్ లక్ష్మణ్ లు. 'మా గురించి ఉదయభాను గారు చాలా చెప్పింది. కానీ అదంతా నిజం కాదు. ఏదో మా మీద అభిమానం కొద్దీ అలా చెప్పిందంతే' అంటూ అంతటి పొగడ్తలకు తాము అర్హులం కామని.. అవన్నీ అవసరం లేదని చెప్పారు. అంతలోనే తన మాటలను కంటిన్యూ చేస్తూ.. 'ఒకటి అడగాలి.. నువ్వు వస్తేనే బ్రైట్.. ఇక ఇలాంటి బ్రైట్ చీర కట్టుకు వస్తే కుర్రోళ్ల పరిస్థితేంటి ఇక' అనేశాడు ఈ ఫైట్ మాస్టర్. దీంతో కాసింత సిగ్గు పడిపోయిన ఈ సీనియర్ యాంకర్.. రెండు మూడేళ్లుగా గ్యాప్ తాను కనిపించలేదని.. చాలామంది కనిపించాల్సిందిగా అడుగుతున్నారంటూ చెప్పుకొచ్చింది. అయినా సరే ఈ టాపిక్ వదిలిపెట్టని యాక్షన్ మాష్టర్లు.. 'మా ఫేవరేట్ హీరోయిన్ ఉదయభాను.. మేం హీరోలుగా నటించిన ఖైదీ బ్రదర్స్ లో హీరోయిన్ గా నటించింది. ఆ అభిమానంతో మమ్మల్ని కాసింత ఎక్కువగా పొగిడిందంతే' అని చెప్పేసి అప్పటి కాలంలో తమ హీరోయిన్ కాబట్టే.. ఇప్పుడు తమకు ఓవర్ గా బిల్డప్ ఇస్తోందని చెప్పేశారు రామ్ లక్షణ్. -
కవలలకు జన్మనిచ్చిన ఉదయభాను
హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను కవల పిల్లలకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె ఓ బాబు, పాపకు ఆమె జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఉదయభాను కొంత కాలంగా బుల్లితెరకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. -
ప్రతిపక్షనేతకు ఇదేనా గౌరవం.?
వైస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఉదయభాను జగ్గయ్యపేట అర్బన్: ప్రతిపక్ష నేత, ప్రజాప్రతి నిధులను ప్రభుత్వం పుష్కరాల సందర్భంగా అవమానించిందని వైస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను అన్నారు. శనివారం ఆయన గృహంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానిం చేందుకు పుష్కరాల ప్రారంభం రోజున ఆయన ఊర్లో లేని సమయంలో మంత్రి రావెల కిషోర్‌బాబు వెళ్లటం బాధాకరమన్నారు. పైగా తమకు అవమానం జరిగిందని ఆరోపణలు చేయటం తగదన్నారు. ముందుగా పిలవకుండా పుష్కరాలు ప్రారంభమైన తరువాత ఆహ్వానించటం పద్ధతేనా అని ప్రశ్నించారు. ఘాట్ల వద్ద కనీస వసతులు లేవని, మంచినీరు, టెంట్లు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేయకపోవటంతో భక్తులు, యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పుష్కర భక్తులను కిలోమీటర్ల దూరం నుంచి నడిపిస్తున్నారని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు తన్నీరు నాగేశ్వరరావు, ఎండీ అక్బర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్(చిన్నా), జిల్లా అధికార ప్రతినిధి మదార్‌సాహెబ్, పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రభాకర్, కౌన్సిలర్ నరసింహారావు పాల్గొన్నారు. -
పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: ఉదయభాను
హైదరాబాద్ : కాల్ మనీ వ్యవహారంలో పోలీసులను టీడీపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సామినేని ఉదయభాను ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో కృష్ణాజిల్లాలో కాల్‌మనీ వ్యవహారంపై సామినేని ఉదయ భాను స్పందించారు. ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సహా పలువురు టీడీపీ నేతల హస్తముందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనల్లో కాల్‌మనీ సూత్రధారులదే హడావుడి అని ఆయన చెప్పారు. పేదల రక్తం తాగుతున్న కాల్‌మనీ నిందితులను ఉరి తీసినా తప్పు లేదని ఉదయభాను అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై నోరు విప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. -
ప్రత్యేక హోదా రాలేదని వెళ్లిపోతున్నా...
-
ప్రత్యేక హోదా రాలేదని వెళ్లిపోతున్నా...
గుడివాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్న మనస్తాపంతో కృష్ణాజిల్లా గుడివాడలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు సిరిపురపు తులసీరాణి కుమారుడు ఉదయభాను (40) గురువారం అర్ధరాత్రి సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించగా గదిలో సూసైడ్ నోట్ లభించింది. ప్రత్యేక హోదా రాలేదన్న మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఉదయభాను ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. అవివాహితుడైన ఉదయభాను రేషన్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఉదయభాను ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు అతడి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వెక్కి వెక్కి ఏడ్చిన ఉదయభాను!.
-
వెక్కి వెక్కి ఏడ్చిన ఉదయభాను!
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణవార్త విని.. యాంకర్, నటి ఉదయభాను వెక్కి వెక్కి ఏడ్చేశారు. చక్రి ఈమధ్య కాలంలో చాలా లావుగా అయిపోయారని.. అయినా కూడా ఆయనకు రకరకాలుగా డ్రస్సులు వేసుకోవడం ఆయనకు ఇష్టమని చెప్పారు. నాలుగు అడుగులు వేసినా బాగా ఆయాపడుతున్నారని, అది చూసి కొంతమంది ఆయన ఉన్నంతసేపు ఊరుకుని.. వెళ్లగానే వెనకాల రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారని ఉదయభాను ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత లావుగా ఉంటే ఆరోగ్యం ఏమయిపోతుంది.. హ్యాపీగా, హెల్దీగా ఉండాలని ఆయనకు చెప్పేదాన్నంటూ.. కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు చూస్తే ఉన్నట్టుండి ఇలాంటి పరిస్థితి ఎదురైందని, ఆయన మీద చాలామంది విమర్శలుచేశారని.. కానీ, అంత మంచి హృదయం ఉన్నవాళ్లు మళ్లీ దొరకడం కష్టమని ఉదయభాను చెప్పారు. ఆయన లేని బాధను తాను మాటల్లో చెప్పలేనని, మనస్ఫూర్తిగా ' చక్రీ.. వియ్ మిస్ యు' అని మాత్రమే అనగలనని ఉదయభాను తెలిపారు. -
సమ్‌థింగ్ స్పెషల్ కావాలి: ఉదయభాను
మీ.. ఉదయభాను కడలికి పొంగు నేర్పింది ఆటుపోట్లు. జీవితానికి దిశానిర్దేశం చేసేది ఒడిదుడుకులు. ఒక్క ఘటన చాలు.. గుండెల్లో ప్రతిఘట న శక్తిని నింపడానికి. బలమైన సంఘటన చాలు బలీయమైన దారి వేయడానికి. అందుకే.. పట్నం వచ్చిన పల్లెటూరి పిల్ల మౌనానికి సూటిపోటి మాటలు.. మాటలు నేర్పాయి. ఆమె అమాయకత్వానికి ఎగతాళి గడుసుతనం నేర్పింది. యాంకర్‌గా తాను చెప్పే మాటలు కావివి.. ఉదయభానుగా తన సందేశమిదని సందేహాలూ వద్దు! అనుభవాలు నేర్పిన పాఠాలివి.. అంటోంది మీ ఉదయభాను. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ నా ఊరు. ఓ పల్లెటూరు. అమ్మ... స్కూల్లో ఫ్రెండ్స్. చుట్టపక్కల వాళ్ళు. ఇదే ప్రపంచం. అల్లరిగా ఆడుకోవడం. పెంకిగా గోలచేయడం. చిలిపిగా ఊరంతా తిరగడం. ఇంతే.. పదేళ్ల దాకా నాకు తెలిసిన లైఫ్. అమ్మకు మాత్రం నేనంటే ప్రాణం. ఆమె దృష్టిలో నేనే అందగత్తెను. ఆమెకు నచ్చిన ఫ్యాషన్ డ్రెస్ వేసేది. మూడు నెలల వయసులోనే డిఫరెంట్ ఫ్రాక్స్ కుట్టించి వేసేదట. కసి పెంచింది చిలిపిగా ఎగిరే ఈ సీతాకొక చిలకను సిటీకి పరిచయం చేసింది మా అమ్మే. వసంతం వస్తే మురిసిపోయే కోయిలమ్మ గ్రీష్మ తాపం భరించగలదా..? పల్లెటూరులో పిల్లవాగులా ప్రవహించిన నేను సిటీలైఫ్‌లో పరిగెత్తగలనా..? ఇక్కడి వ్యక్తిత్వాలు కొత్త.. ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో అసలే తెలియదు. ‘పైకి రావాలంటే పదిమందితో కలసిపోవాలి’ అన్న మాటలు బాగానే తోచాయి. ఊళ్ళో ఇలాగే ఉండేదాన్నే... సిటీలో ఇలా ఉండకూడదా...? ఎలా ఉంటే పైకొస్తాం? ఆలోచించాను. ఎన్నో రాత్రులు. ఒక్కోసారి బుర్ర హీటెక్కేది. ఎదుటివారి చులకన భావం నాలో కసి పెంచింది. అతి చిన్న వయసులో బుల్లితెరపై కన్పించే అవకాశం కల్పించింది. దూరదర్శన్‌లో హిట్ అయిన వసంత సమీరం ఫస్ట్ బ్రేక్ అనే చెప్పాలి. మాటల గోదారి.. మీరు బాగా మాట్లాడుతున్నారు.. ఓ టీవీ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ చెప్పడం ఆశ్చర్యం అన్పించింది. ఇదెలా సాధ్యమైంది? అన్న ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పాలనిపించలేదు. కానీ ఇప్పుడు చెప్పాలనుంది. జనాలు ఏం కోరుకుంటున్నారో తొందరగా అర్థం చేసుకున్నాను. ఇంగ్లిష్ నేర్చుకున్నాను. ఎప్పుడో మరచిపోయిన అక్షరాలను గుర్తు చేసుకున్నాను. రామ్మూర్తి అనే లెక్చరర్ వద్దకు ట్యూషన్‌కి వెళ్లాను. పట్టుదలగా ప్రయత్నించాను. ఆయన నన్ను తన కూతురు కన్నా ఎక్కువగా అభిమానించారు. ఫ్యాషన్‌గా మాట్లాడే స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఎంఏ ఇంగ్లిష్ చేస్తున్నాను. ఇంగ్లిష్ ఒకటేనా.. ఎన్నో పుస్తకాలు చదివాను. సాహిత్య పరమైన జ్ఞానాన్ని పెంచుకున్నాను. పట్టుదలే సోపానాలుగా మలచుకున్నాను. అప్పటి వరకు నన్ను డామినేట్ చేసిన బిడియం ఆమడ దూరం పారిపోయింది. యాంకర్‌గా నా కెరీర్ మంచి మలుపు తిరిగింది. పదిమంది కోసం.. ఏ భావమూ తెలియని ఈ పల్లెటూరి పిల్లను అప్పుడప్పుడూ మూగబోయిన గొంతులు పలకరిస్తాయి. వేదనామయ హృదయాలు ఆలోచింపజేస్తాయి. ఉదయభాను.. నాటోన్లీ యాంకర్.. సంథింగ్ స్పెషల్ కావాలి. దానికి వేదిక సోషల్ యాక్టివిటీ. సమాజ సేవ. చేయాలనుంది. చేసేందుకు దాదాపు మార్గం సిద్ధం చేసుకున్నాను. త్వరలోనే ప్రణాళిక ప్రకటిస్తాను. గప్‌చుప్ తినాలనిపిస్తే.. లవ్ మ్యారేజ్ నాది. బిజీ లైఫ్ సరేసరి. ఖాళీ ఉన్నప్పుడు మావారితో సరదాగా కాలక్షేపం చేస్తాను. అప్పుడు చిన్నపిల్లలా అలా బయటకు వెళ్లాలనిపిస్తుంది. వీధి చివరలో ఉండే గప్‌చుప్ బండి దగ్గర ఆగాలన్పిస్తుంది. అప్పుడప్పుడు అలా చేస్తూంటాను. ఇంతడైనమిక్గా కన్పించే నేను ఎప్పుడూ పబ్‌లు, క్లబ్‌లకు వెళ్లలేదు. నాకు నచ్చదు. అయితే బయటకు వెళ్తే మాత్రం నన్ను ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త తీసుకుంటాను. ఒక రకంగా బురఖా వేసుకుంటాననుకోండి. - వనం దుర్గాప్రసాద్ -
తెలుగుదేశం దాష్టీకం
సాక్షి, మచిలీపట్నం/ మోగులూరు (కంచికచర్ల రూరల్), న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల తొలివిడత పోలింగ్‌ను పురస్కరించుకొని జిల్లాలో పలు ప్రాంతాల్లో ఓటమి ఉక్రోషంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాష్టీకానికి పాల్పడ్డాయి. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయిలో సామినేని ఉదయభాను అల్లుడు విజయనర్శింహారెడ్ది కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. మక్కపేటలో పోలింగ్ సరళిని చూసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఉదయభానుపై కవ్వింపు చర్యలు చేపట్టారు. మీరెందుకు ఇక్కడికి వచ్చారంటూ వాగ్వివాదానికి దిగారు. వైఎస్సార్సీపీ నేతలకు తీవ్ర గాయాలు... కంచికచర్ల మండలం పరిటాలలో వైఎస్సార్ సీపీ నాయకుడు బత్తిన తిరుపతిరావుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కంచికచర్ల మండలంలోని నక్కలపేటలో టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేసి కొట్టడంతో ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. రాళ్లు రువ్వి.. కర్రలతో దాడి.. కంచికచర్ల మండలం మోగులూరులో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బండి జానకిరామయ్యపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటు అడగడాన్ని వారించిన ఆయనపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్లు రువ్వి, కర్రలతో దాడికి దిగారు. దీంతో జానకిరామయ్య తలకు గాయమైంది. ఆయనతోపాటు కన్నెకంటి కృష్ణయ్య, గద్దె వెంకటకృష్ణ, ఆవుల గోపయ్య, షేక్ ఖుద్దూస్, బండి వెంకటేశ్వరరావు కూడా గాయపడ్డారు. పోలీసులు వారిని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జానకిరామయ్యకు తలపై ఐదు కుట్లు పడ్డాయి. మిగిలిన వారు వైద్య సేవలు పొందుతున్నారు. శనివారం రాత్రి గనిఆత్కూరు గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పాటిబండ్ల హరిజగన్నాధరావుపై టీడీపీ స్థానిక నేతలు దాడి చేసి గాయపరిచారు. కుటుంబ సభ్యులు ఆయన్ను నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మచిలీపట్నంలోనూ... మచిలీపట్నం మండలంలోని పల్లెతాళ్లపాలెంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఆ ఘటనలో వైఎస్సార్సీపీ నాయకుడు చెక్కా కృష్ణారావుకు గాయాలయ్యాయి. తాళ్లపాలెం తదితర ప్రాంతాల్లో టీడీపీ నేతలు కొనకళ్ల బుల్లయ్య, కొల్లు రవీంద్రలు హడావుడి చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మచిలీపట్నం మండలం గుండుపాలెంలో గెలుపు తమదేనంటూ టీడీపీ కార్యకర్త వీరంగం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే తొడలు కొట్టి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. -
ఉదయభాను పొలిటికల్ ఎంట్రీ?
ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటి ఉదయభాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి ఆమె పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టనున్నారని చెబుతున్నారు. అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి వస్తానని గతంలో ఆమె చెప్పిన విషయాలను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయమని భాను భావిస్తున్నారు(ట). తెలుగనాట అగ్రస్థానంలో ఉన్న బుల్లితెర వ్యాఖ్యాతల్లో ఒకరైన ఉదయభానుకు మంచి క్రేజ్ ఉంది. వివాదాల కారణంగా ఆమె పలుమార్లు పతాక శీర్షికలకు ఎక్కారు. ఇప్పుడు ఆమె రాజకీయాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలవడంతో ఆశావహులు తమకు నచ్చిన పార్టీల్లో చేరిపోతున్నారు. రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందు సిద్ధమవుతున్నారు. ఉదయభాను కూడా ఈ కోవలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పాలిటిక్స్‌లో అడుగుపెట్టేందుకు ఆమె పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి. త్వరలోనే ఉదయభాను పొలిటికల్ ఎంట్రీ ఖాయమంటున్నారు. ఇదే నిజమయితే ఆమె ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తి కలిగించే విషయం. మరోవైపు ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. సొంత జిల్లా కరీంనగర్ నుంచి పోటీ చేస్తారని కొంతమంది, హైదరాబాద్ నుంచి పోటీ చేస్తారని మరి కొంతమంది అంటున్నారు. అయితే రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా ఉదయభాను విజయం సాధిస్తారని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆమె పొలిటికల్ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ఉదయభాను మార్ఫింగ్ ఫొటోలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు..
వెబ్‌సైట్‌పై కేసు నమోదు ‘మధుమతి’లో అశ్లీలత లేదని తేల్చిన సీసీఎస్ పోలీసులు ఒక సినిమాలో తాను నటించిన సన్నివేశాలను మార్ఫింగ్ చేశారంటూ సినీనటి ఉదయభాను చేసిన ఫిర్యాదు విషయంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకోనున్నారు. ఉదయభాను తన ఫిర్యాదుతోపాటు కొన్ని ఆధారాలను సైతం సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. ఈ ఫోటోలు నిజంగా మార్ఫింగ్ చేసినవా, కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక దర్యాప్తులో కీలకం కానుంది. ఇక ఉదయభాను ఫిర్యాదు ఆధారంగా సదరు వెబ్‌సైట్‌పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. మధుమతి సినిమా విషయంలో దర్శకుడు రాజ్‌శ్రీధర్ తనని మోసం చేశారని ఉదయభాను ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే, వెబ్సైట్లో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి ప్రచార చిత్రాలు రూపొందించారని, దీనిపై న్యాయపోరాటం చేయబోతున్నానని ఉదయభాను ప్రకటించారు. కనీసం తనకు సినిమా ప్రివ్యూను కూడా చూపించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన తరువాత ప్రివ్యూ చూసే అవకాశం రావడం దురదృష్టకరమన్నారు. తాను అశ్లీల దృశ్యాల్లో నటించినట్లు మార్ఫింగ్ చేసి తన ఇమేజ్ను దెబ్బ తీశారని.. నిజానికి తాను ఎలాంటి అశ్లీల దృశ్యాల్లోనూ నటించలేదని ఉదయభాను సీసీఎస్ డీసీపీ పాల్రాజుకు వివరించారు. అయితే, సినిమా ప్రివ్యూ చూసిన తరువాత అందులో ఎలాంటి అశ్లీలత లేదని పోలీసులు ధ్రువీకరించారు. -
ఉదయభాను ఫిర్యాదుతో వెబ్సైట్ నిర్వాహకులపై కేసు నమోదు
హైదరాబాద్: తన ఫోటోలను మార్ఫింగ్ చేశారన్న ప్రముఖ వ్యాఖ్యాత, సినిమా, టివి నటి ఉదయభాను ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ‘మధుమతి’ సినిమా విషయంలో ఆ చిత్ర దర్శకుడు రాజ్‌శ్రీధర్ తనని మోసం చేశారని ఉదయభాను ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘మధుమతి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచార చిత్రాలు రూపొందించారని, దీనిపై న్యాయపోరాటం చేయబోతున్నానని ఉదయభాను చెప్పారు. మంచి కథ అని చెప్పి ఎక్కడా ప్రమాణాలు పాటించకుండా దర్శకుడు సినిమాను చుట్టేశాడన్నారు. కనీసం ప్రివ్యూను కూడా తనకు చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను అశ్లీల దృశ్యాల్లో నటించినట్లు మార్ఫింగ్ చేసి తన ఇమేజ్ను దెబ్బ తీశారని ఆమె బాధపడ్డారు. హాట్ సీన్లలో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు. తాను చేసిన దాంట్లో అశ్లీలత లేదని తెలిపారు. పైగా పారితోషికం కింద తనకు రెండు లక్షల రూపాయలే ఇచ్చారని చెప్పారు. ఫొటోలు మార్ఫింగ్ విషయమై ఆమె సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయభాను ఫిర్యాదుతో పోలీసులు వెబ్సైట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. మార్ఫింగ్ జరిగినట్లు చెబుతున్న దృశ్యాలను, ఫోటోలను ల్యాబ్‌కు పంపారు. -
అనగ అనగా ఓ మధుమతి
-
నన్ను నమ్మించి మోసం చేశారు - ఉదయభాను
‘‘తెలుగు సినిమా గర్వపడే సినిమా ఇదని... ఈ చిత్రంతో జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు లభిస్తుందని నమ్మించి ‘మధుమతి’ చిత్ర దర్శకుడు రాజ్‌శ్రీధర్ నన్ను మోసం చేశారు’’ అని ఉదయభాను ఆరోపించారు. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘మధుమతి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచార చిత్రాలు రూపొందించారని, దీనిపై న్యాయపోరాటం చేయబోతున్నానని ఉదయభాను వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆమె పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘మంచి కథ అని చెప్పి ఎక్కడా ప్రమాణాలు పాటించకుండా దర్శకుడు సినిమాను చుట్టేశాడు. పైగా పారితోషికం కింద రెండు లక్షల రూపాయలే ఇచ్చారు’’ అని చెప్పారు. ఫొటోలు మార్ఫింగ్ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ మొదలు పెట్టారు. మార్ఫింగ్ చేయలేదు: ఈ వివాదం గురించి దర్శకుడు రాజ్‌శ్రీధర్ స్పందిస్తూ... ‘మధుమతి’ ప్రోమోలో తాను ఎలాంటి మార్ఫింగ్‌కూ పాల్పడలేదన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న ఉదయభాను ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు. తగిన సాక్ష్యాలతో ఆరోపణలు చేయాలని చెప్పారు. -
నా పేరు చెప్పుకుని బతుకుతున్నారు
-
హాట్ సీన్లలో ఉన్నది నేను కాదు: ఉదయభాను
హైదరాబాద్: 'మధుమతి' సినిమాలో కొన్ని సన్నివేశాలను మార్ఫింగ్ చేశారని ప్రముఖ వ్యాఖ్యాత, నటి ఉదయభాను ఆరోపించింది. తాను అశ్లీల దృశ్యాల్లో నటించినట్టు మార్ఫింగ్ చేసి తన ఇమేజ్ దెబ్బ తీశారని తెలిపింది. హాట్ సీన్లలో ఉన్నది తాను కాదని స్పష్టం చేసింది. తాను చేసిన దాంట్లో అశ్లీలత లేదని వెల్లడించింది. తన ఇమేజ్ను దెబ్బ తీసిన వారిని వదలబోనని ఆమె హెచ్చరించారు. దీనిపై సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. 'మధుమతి' మంచి సినిమా అని ఒప్పుకున్నానని పేర్కొంది. అయితే నిర్మాత, దర్శకుడు మాట తప్పారని ఆరోపించింది. కనీసం ప్రివ్యూనుకూడా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫోటోలను మార్పింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించింది. ఈ సినిమాలో కొన్ని పాటల్లో అద్భుతంగా నటించానని చెప్పింది. తన బాడీ రబ్బర్లా వంగుతుందని వెల్లడించింది.18 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నానని, తన పేరు చెప్పుకుని కొంతమంది బతుకుతున్నారని పేర్కొంది. తన మీద అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని ఉదయభాను వాపోయింది. వీటిని ఖండించేందుకే మీడియా ముందుకు వచ్చానని చెప్పింది. 'మధుమతి' సినిమా ప్రచారం కోసమే ఇదంతా చేస్తున్నారన్న విమర్శలను ఆమె కొట్టి పారేసింది. పబ్లిసిటీ నాకు ఇష్టం ఉండదని తెలిపింది. ఈ వివాదంపై నిర్మాతను, దర్శకుడ్ని పోలీసులు ప్రశ్నించినట్టు తెలిసింది. మార్ఫింగ్ జరిగాయంటున్న దృశ్యాలను అవసరమైతే ఫోరెన్సిక్ నిపుణులకు పంపిస్తామంటున్నారు పోలీసులు. -
మధుమతిలో నా పార్ట్ ఓకే: ఉదయభాను
-
మధుమతిలో నా పార్ట్ ఓకే: ఉదయభాను
'మధుమతి' హీరోయిన్ ఉదయభాను తనకు సినిమా ప్రివ్యూ చూపించలేదని అర్థరాత్రి హైదరాబాద్‌లో హంగామా సృష్టించింది. చిత్ర నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ప్రివ్యూ చూపించాల్సిందేనని పట్టుబట్టింది. ఎట్టకేలకు ఉదయభాను రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసుల సమక్షంలో ప్రివ్యూ చూసింది. ప్రివ్యూ చూసిన అనంతరం ఉదయభాను విలేకర్లతో మాట్లాడుతూ మధుమతి చిత్రంలో అసభ్యకరం ఏమీ లేదని... తన పాత్ర విషయంలో ఎలాంటి అభ్యంతరకరం లేదని సర్టిఫికెట్ ఇచ్చేసింది. అయితే విడుదల ముందే తనకు సినిమాను చూసే అధికారం ఉందని, అయితే నిర్మాతను అడిగితే థియేటర్లు ఖాళీ లేనందున ప్రివ్యూ చూపించలేదని చెప్పారని చెప్పింది. తాను ఎవరిపైన కేసు పెట్టలేదని ఉదయభాను స్పష్టం చేసింది. సినిమా చూడాలనుకున్నాను... చూశానంటూ ఆమె సింపుల్‌గా తేల్చేసింది. ఉదయభాను ప్రధాన పాత్రధారిణిగా రూపొందుతోన్న‘మధుమతి’ చిత్రానికి రాజ్‌శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గోమాతా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె.రాణి శ్రీధర్, రమేశ్‌బాబు తెరకెక్కించారు. ఉదయభాను ఈ సినిమాలో వేశ్య పాత్ర పోషించగా, విష్ణుప్రియన్, దీక్షాపంథ్ కీలక పాత్రధారులు. కాగా ప్రివ్యూ వివాదంపై దర్శకుడు రాజ్‌శ్రీధర్ మాట్లాడుతూ ....పోలీసులతో కలిసి ఉదయభాను సినిమా చూడాల్సిన విషయం ఏమీ వచ్చిందని ... ప్రివ్యూ చూపించమని అడిగితే తామే చూపించేవాళ్లమని అన్నారు. సెన్సార్ యూఏ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత సినిమాను పర్యవేక్షించటానికి పోలీసులు ఎవరని రాజ్‌శ్రీధర్ ప్రశ్నించారు. తన భవిష్యత్ ప్రణాళికలకు ఈ చిత్రం అడ్డు కానుందేమో అనే అనుమానంతోనే ఉదయభాను ఇలా వ్యవహరించి ఉంటుందని దర్శకుడు అభిప్రాయపడ్డాడు. మరోవైపు నిర్మాత మాట్లాడుతూ మధుమతి చిత్రంలో ఉదయభాను అద్భుతంగా నటించిందన్నారు. ఆమె నటించిన పాత్రకు తప్పకుండా అవార్డు వచ్చి తీరుతుందన్నారు. ఆ క్రెడిట్ అంతా ఉదయభానుదేనన్నారు. ఇక మధుమతి చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రంలో ఉదయభాను చాలా బోల్డ్ గా నటిస్తుందనే టాక్ మొదటి నుంచి ఉండటంతో..ఏదో అందాల ఆరబోత ఉంటుందనే అంచనాల్లో ఒక వర్గం ప్రేక్షకులు ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్స్ కూడా అదే విధంగా ఉండటంతో ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. మరి మధుమతిగా భాను ఏమేరకు ప్రేక్షకుల్ని ఆలరిస్తోందో చూడాలి. కాగా వచ్చే ఎన్నికల్లో ఉదయభాను పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు పుకార్లు జోరుగా షికార్లు చేస్తున్నాయి. -
మధుమతి సినిమా స్టిల్స్
-
మధుమతి సినిమా స్టిల్స్
రాజ్ శ్రీధర్ దర్శకత్వంలో రూపొందించిన మధుమతి సినిమా స్టిల్స్. ఉదమభాను, దీక్షా, శివకుమార్ ఈ చిత్రంలో ముఖ్య తారాగణం. -
ఉదయభానుపై ఫిర్యాదు చేస్తాం: రాజ్‌శ్రీధర్
హైదరాబాద్: తాను ప్రధానపాత్రలో నటించిన ‘మధుమతి’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి ఉదయభాను హాజరుకాకపోవడంపై దర్శకుడు రాజ్‌శ్రీధర్ మండిపడుతున్నారు. ఆమెపై మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా), ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 'ఆడియో ఫంక్షన్‌కు ఉదయభాను హాజరుకాకపోవడం మమ్మల్ని నిరాశకు గురిచేసింది. ప్రమోషన్లో కీలక ఘట్టమైన ఆడియో విడుదల కార్యక్రమానికి ఆమె రాకపోవడం శోచనీయం. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు' అని దర్శకుడు రాజ్‌శ్రీధర్ వాపోయారు. ఉదయభానుపై 'మా'కు ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ప్రత్యేక గీతం చేస్తానని చెప్పి ఉదయభాను మాట తప్పిందని తెలిపారు. చివరి నిమిషంలో వేరే నటితో స్పెషల్ సాంగ్ చేయించామని వెల్లడించారు. అయితే దీనిపై స్పందించేందుకు ఉదయభాను అందుబాటులో లేదు. -
మది దోచే మధుమతి
ప్రముఖ వ్యాఖ్యాత, నటి ఉదయభాను ప్రధాన పాత్రధారిణిగా రూపొందుతోన్న చిత్రం ‘మధుమతి’. రాజ్‌శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె.రాణి శ్రీధర్, రమేశ్‌బాబు నిర్మాతలు. రాజ్‌కిరణ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కుంచె రఘు ఆడియోసీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని ఐఏఎస్ అధికారి ఎన్.గోపాలకృష్ణకు అందించారు. ప్రచార చిత్రాలను మరో ఐఏఎస్ అధికారి కామాక్షి విడుదల చేశారు. సినిమా విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. ‘‘ఉదయభాను ఈ కథకు వందశాతం యాప్ట్. ఇందులో ఆమె పాత్ర యువతరం మది దోచుకునే విధంగా ఉంటుంది. వాణిజ్య అంశాల మేలుకలయిక అయిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది’’ అని దర్శకుడు చెప్పారు. సంగీత పరంగా అందరూ మెచ్చే సినిమా అవుతుందని రాజ్‌కిరణ్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు మధుర శ్రీధర్, భార్గవి పిళ్ళై కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మధుమతి సినిమా ఆడియో
రాజ్ శ్రీధర్ దర్శకత్వంలో రూపొందించిన మధుమతి సినిమా స్టిల్స్. ఉదమభాను, దీక్షా, శివకుమార్ ఈ చిత్రంలో ముఖ్య తారాగణం. -
హోరెత్తిన పోరు
ఉద్యమం @ 80 =వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆటో, రిక్షా ర్యాలీలు =స్వయంగా రిక్షా తొక్కిన ఉదయభాను, జోగి రమేష్, డీఎన్నార్ =కొనసాగుతున్న రిలేదీక్షలు =పలుచోట్ల పురందేశ్వరి దిష్టిబొమ్మల దహనం =కేంద్ర కార్యాలయాల మూసివేత ఆటోవాలా, రిక్షా కార్మికుడు, బస్సు డ్రైవర్, ఆస్పత్రి సిబ్బంది, ఉద్యోగి, విద్యార్థి.. ఇలా ప్రతి ఒక్కరూ మేము సైతమంటూ సమైక్యాంధ్ర సమరాంగణంలో కదంతొక్కుతున్నారు. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు గురువారం జిల్లాలో ఆటోలు, రిక్షాలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. వీధులన్నీ వైఎస్సార్సీపీ పతాకాల రెపరెపలయ్యాయి. సమైక్య నినాదాలతో మార్మోగాయి. సీమాంధ్ర అభివృద్ధికి రూట్‌మ్యాప్ అంటూ మంత్రాంగం నడిపిన కేంద్ర మంత్రి పురందేశ్వరిపై సమైక్యవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు బంద్ పాటించాయి. సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ఆటో, రిక్షా ర్యాలీలు జరిగాయి. జగ్గయ్యపేట పట్టణంలో ఆటోలు, రిక్షాబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను స్వయంగా రిక్షా తొక్కుతూ ర్యాలీలో పాల్గొన్నారు. మూడు కిలోమీటర్లకు పైగా ప్రధాన వీధుల్లో రిక్షాతొక్కుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ట్రేడ్ యూనియన్ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ నగర కన్వీనర్, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి జలీల్‌ఖాన్ వన్‌టౌన్‌లో ఆటో ర్యాలీ నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. పెడన నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఆటో, రిక్షాల ర్యాలీ జరిగింది. పెడన పట్టణం, మండలంలో ఉన్న వివిధ ఆటో యూనియన్ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బంటుమిల్లి సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి మహాత్మాగాంధీ, వైఎస్సార్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉప్పాల రాము స్వయంగా ఆటో నడిపారు. నందిగామ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ జరిగింది. 100కు పైగా ఆటోలతో, వైఎస్సార్సీపీ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో రిక్షాలు, ఆటోలతో నిరసన కార్యక్రమం చేశారు. పామర్రు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు, కంకిపాడు మండలాల్లో ఆటో ర్యాలీలు నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్తలు తాతినేని పద్మావతి, పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు. కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆటో, రిక్షా ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఏలూరు రోడ్డు నుంచి మాగంటి థియేటర్ వరకు ర్యాలీ జరిగింది. సంతమార్కెట్ వద్ద 23 అడుగుల భారీ వైఎస్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జెండాలు, ఆటోలు, రిక్షాలతో నిర్వహించిన ర్యాలీతో జాతీయ రహదారి కిక్కిరిసింది. తిరువూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రజాశక్తి విద్యాసంఘం సెంటర్ నుంచి కోర్టు, వంతెన, బస్టాండు సెంటరు మీదుగా ఈ ర్యాలీ సాగింది. పోలీసుస్టేషన్ సెంటరులో పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ, బస్టాండు సెంటరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రమేష్‌బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. పురందేశ్వరి తీరుపై ఆగ్రహం... విభజన తర్వాత సీమాంధ్ర అభివృద్ధికి రూట్‌మ్యాప్ అంటూ కేంద్ర మంత్రి పురందేశ్వరి విజయవాడలో జరిపిన దౌత్యం సమైక్యవాదుల్లో ఆగ్రహానికి గురిచేసింది. ఆమె తీరుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా గురువారం ఆందోళనలు హోరెత్తాయి. కలిదిండిలో డ్వాక్రా మహిళలు పురందేశ్వరి దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతృత్వంలో జాతీయ బ్యాంకులు, పోస్టల్, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ తదితర కేంద్ర కార్యాలయాల బంద్ జరిపారు. ఇరిగేషన్ ఉద్యోగులు స్వరాజ్య మైదానం వద్దనున్న తమ కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారందరినీ అరెస్ట్ చేసి సమీపంలోని సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో రెండు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరిగేషన్ ఉద్యోగులు సోనియా డౌన్ డౌన్ అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ నుంచి ఆయన స్వగ్రామమైన వక్కపట్లవారిపాలెంలో అంగీకార పత్రాన్ని జేఏసీ నాయకులు తీసుకున్నారు. జేఏసీ పిలుపు మేరకు దివిసీమలోని ఆరు మండలాల్లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను నాయకులు మూయించారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి, గుడివాడ, నూజివీడు మండలాల పరిధిలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ది నాగాయలంక పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యానమిత్రులు దీక్షలో కూర్చున్నారు. ధ్యానమిత్రుల రిలే దీక్షకు సంఘీభావంగా స్థానిక స్కాలర్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూలు విద్యార్థులు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రదర్శన జరిపి మానవహారం నిర్మించారు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఎదురుగా చేట్టిన రిలేదీక్షలు గురువారం 46వ రోజుకు చేరాయి. అవనిగడ్డలో చేపట్టిన దీక్షలు 57వ రోజుకు చేరాయి. ది కర్షక ఆటో వర్కర్స్, మేరీమాత ఆటో వర్కర్స్ యూనియన్‌కు చెందిన 46 మంది దీక్ష చేశారు. గుడివాడలో మున్సిపల్ కార్యాలయం ఎదుట విజయవాడ రోడ్‌పై మోకాళ్లపై ఉండి నిరసన తెలిపారు. పామర్రులో జాతీయ రహదారిపై జేఏసీ నాయకులు మోకాళ్లపై నిలబడి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. పెడనలో సెయింట్ విన్సెంట్ పల్లోటి హైస్కూల్ ఉపాధ్యాయులు, డ్రైవర్లు, యాజమాన్యం, సిబ్బంది ఒకరోజు రిలే దీక్ష చేపట్టారు. మచిలీపట్నంలో మూతబడ్డ ఓపీ... మచిలీపట్నం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు, సిబ్బంది గురువారం అత్యవసర సేవలకే పరిమితమయ్యారు. దీంతో ఆస్పత్రిలోని ఓపీ విభాగం పూర్తిగా మూతపడింది. ఆగిరిపల్లిలో మండల పెన్షనర్ల సంఘ సభ్యులు దీక్షలో పాల్గొన్నారు. జగ్గయ్యపేట జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షా శిబిరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సందర్శించి దీక్షలో కూర్చున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. వత్సవాయిలో సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మానవహారం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు. నందివాడ మండలం టెలిఫోన్‌నగర్ కాలనీలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు 47వ రోజుకు చేరుకున్నాయి. -
దీక్షబూని..
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయడాన్ని నిరసిస్తూ, సమైక్యాంధ్ర పరిరక్షణకు డిమాండు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి హైదరాబాద్‌లో శనివారం ఉదయం చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా నగరంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కూడా నిరవధిక దీక్షకు సిద్ధమయ్యారు. ఈ మేరకు పార్టీ నేతలు రాఘవయ్యపార్కు వద్ద నిరశన దీక్షా శిబిరానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పెడనలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ ఉప్పాల రాము కూడా నిరవధిక నిరశన చేపడుతున్నారు. జగన్మోహన్రెడ్డి జైలులో చేపట్టిన దీక్షకు సంఘీభావంగా రాము ఐదురోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో పార్టీ జిల్లా కన్వీనరు ఉదయభాను చేపట్టిన నిరవధిక దీక్ష మూడో రోజుకు చేరింది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు సతీమణి లక్ష్మీపార్వతి, పెడన మాజీ శాసనసభ్యులు జోగి రమేష్ శుక్రవారం ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. హనుమాన్‌జంక్షన్‌లో పార్టీ నేత దుట్టా రవిశంకర్ చేపట్టిన దీక్షను శుక్రవారం సాయంత్రం పోలీసులు భగ్నంచేశారు. మచిలీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని కోనేరుసెంటరులో నిర్వహిస్తున్న రిలే దీక్షలు రెండోరోజుకు చేరాయి. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు కుక్కల నాగేశ్వరరావు తదితరులు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మూడోరోజుకు చేరాయి. స్థానిక భద్రాచలం రోడ్డులో డాక్టర్ హనిమిరెడ్డి కాంప్లెక్స్ ఎదుట ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో శుక్రవారం కూర్చున్నవారికి పార్టీ మైలవరం పట్టణ కన్వీనర్ శీలం కోటిరెడ్డి, ఎన్. దుర్గాప్రసాద్, మహిళా నాయకురాలు వంగల పద్మ పూలమాలలు వేసి దీక్షలు ప్రారంభించారు. నూజివీడు జంక్షన్లో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 39వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను నియోజకవర్గ కన్వీనర్ మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు ప్రారంభించారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 59వ రోజుకు చేరాయి. పెడనలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అడ్‌హక్ కమిటీ సభ్యులు గూడవల్లి కేదారేశ్వరరావు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలను విరమించారు. అవనిగడ్డలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు దీక్షను పోలీసులు గురువారం రాత్రి భగ్నం చేయడంతో ఈ శిబిరంలో కొందరు నాయకులు రిలే నిరశన చేపట్టారు. టీనోట్ ప్రకటనకు నిరసనగా చల్లపల్లిలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చండ్ర వెంకటేశ్వరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు నిడమానూరి దిలీప్‌కుమార్ శుక్రవారం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు నగరం, జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో నాయకులు, కార్యకర్తలు 72 గంటల బంద్ నిర్వహించారు. రోడ్లపై టైర్లు తగలబెట్టి తమ నిరసన తెలిపారు. రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. షాపులు మూయించారు. బొత్స ఇక బార్‌షాపుల్లో బ్రోకర్‌గా చేయాల్సిందే.. జగ్గయ్యపేట : రాష్ట్ర విభజనకు సహకరించిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇకపై సీమాంధ్ర బార్‌షాపులో బ్రోకర్‌గా పనిచేయాల్సిందేనని వైఎస్సార్ సీపీ విజయవాడ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ విమర్శించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సమైక్యాంధ్రకు మద్దతుగా గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న నిరవధిక నిరాహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం రాత్రి ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ బొత్స జోడు పదవులను అడ్డం పెట్టుకొని సీమాంధ్ర ప్రజల్ని పట్టించుకోకుండా ఢిల్లీలో సోనియా భజన చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపాడన్నారు. ఇటువంటి సీమాంధ్ర ద్రోహులను క్షమించరాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విశ్వనాథం, నాగేశ్వరరావు, జిల్లా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు వేల్పుల పద్మకుమారి తదితరులు పాల్గొన్నారు.