Anchor Udaya Bhanu Launches New Youtube Channel, First Video Goes Viral - Sakshi
Sakshi News home page

Udaya Bhanu Youtube Channel: గుండెల్లో పెట్టుకున్నారు, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను?

Published Mon, Jun 6 2022 1:49 PM | Last Updated on Mon, Jun 6 2022 3:19 PM

Udaya Bhanu Launches New Youtube Channel, Shares First Video - Sakshi

స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే యాంకర్‌ ఉదయభాను. అప్పట్లో బుల్లితెరను ఓ ఊపు ఊపేసిందామె. తన మాటలతో, నవ్వులతో షోలో కొత్త వెలుగులు నింపేది. ఒకప్పుడు తెలుగులో టాప్‌ యాంకర్‌గా రాణించిన ఆమె కొన్నేళ్లుగా యాంకరింగ్‌కు దూరంగా ఉంది. తాజాగా ఆమె కమ్‌బ్యాక్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొద్దిరోజులుగా వరుసగా వీడియోలు పోస్ట్‌ చేస్తూ యూట్యూబ్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఉదయభాను పేరుతో కొత్త యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన యాంకర్‌ 'మీ ప్రేమే నా బలం' పేరుతో మొట్టమొదటి వీడియోను వదిలింది.

'మీ అభిమానం నేను సాధించిన వరం, మీ ప్రేమ అభివర్ణించలేని అద్భుతం, నా ప్రతి అడుగులో నాకు తోడుగా నిలబడింది, నాకు ధైర్యమే నిలిచింది మీరే.. అంటూ అభిమానుల కోసం ఉద్వేగపూరితంగా మాట్లాడింది ఉదయభాను. మీ అభిమానంతో నన్ను ఎప్పుడూ పడిపోకుండా పట్టుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు.

ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? మీకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేయడం తప్ప.. అందుకే వస్తున్నా మీ ఉదయభాను' అంటూ వీడియోను ముగించింది. ఇన్నాళ్ల తర్వాత మాకోసం యూట్యూబ్‌లో అడుగుపెట్టినందుకు థ్యాంక్స్‌ అంటూ ఫ్యాన్స్‌ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మీ గొంతులోనే ఏదో తెలియని మ్యాజిక్‌ ఉందని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: తమన్నాతో గొడవ నిజమే, రెండు రోజులు..: అనిల్‌ రావిపూడి
రికార్డులు బద్ధలు కొడుతున్న విక్రమ్‌, ఇప్పటిదాకా ఎంత వచ్చిందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement