దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. భక్తిరస చిత్రాలు తెరకెక్కించడంలో అయినా, రొమాంటిక్ పాటలు చిత్రీకరించడంలో అయినా ఆయనది ప్రత్యేక శైలి. ఎంతోమంది నటుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్ స్టేటస్ అందించారు. ముఖ్యంగా హీరోయిన్స్‌ను అందంగా చూపించడంలో రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా అనేలా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు.
దశాబ్దాలుగా తన సినిమాలతో అలరిస్తున్న రాఘవేంద్రరావు తాజాగా మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ‘కేఆర్‌ఆర్ వర్క్స్’ పేరుతో యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించిన ఆయన ఇప్పుడు కొత్తవారిని వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఎంతో టాలెంట్ ఉండి సరైన ప్లాట్‌ఫామ్ కోసం ఎదురుచూస్తున్న సామాన్యులకు ఇదొక చక్కని అవకాశం. కాగా ఈ చానల్‌ను దర్శకధీరుడు రాజమౌళి లాంచ్ చేయడం విశేషం.
ఈ సందర్భంగా రాఘవేంద్రరావు ఎన్నో దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మందిని పరిచయం చేశారు. ఎంత చేసినా అతని తపన ఆగలేదు. ఇప్పుడు మరింత మందిని వెండితెరకు పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు అంటూ రాఘవేంద్రరావుపై ప్రశంసలు కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment