
ఉదయభానుపై ఫిర్యాదు చేస్తాం: రాజ్‌శ్రీధర్
హైదరాబాద్: తాను ప్రధానపాత్రలో నటించిన ‘మధుమతి’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి ఉదయభాను హాజరుకాకపోవడంపై దర్శకుడు రాజ్‌శ్రీధర్ మండిపడుతున్నారు. ఆమెపై మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా), ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
'ఆడియో ఫంక్షన్కు ఉదయభాను హాజరుకాకపోవడం మమ్మల్ని నిరాశకు గురిచేసింది. ప్రమోషన్లో కీలక ఘట్టమైన ఆడియో విడుదల కార్యక్రమానికి ఆమె రాకపోవడం శోచనీయం. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు' అని దర్శకుడు రాజ్‌శ్రీధర్ వాపోయారు. ఉదయభానుపై 'మా'కు ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ప్రత్యేక గీతం చేస్తానని చెప్పి ఉదయభాను మాట తప్పిందని తెలిపారు. చివరి నిమిషంలో వేరే నటితో స్పెషల్ సాంగ్ చేయించామని వెల్లడించారు. అయితే దీనిపై స్పందించేందుకు ఉదయభాను అందుబాటులో లేదు.