హాట్ సీన్లలో ఉన్నది నేను కాదు: ఉదయభాను | Udaya Bhanu fires on morphing of Madhumati | Sakshi
Sakshi News home page

హాట్ సీన్లలో ఉన్నది నేను కాదు: ఉదయభాను

Published Fri, Dec 13 2013 3:55 PM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM

హాట్ సీన్లలో ఉన్నది నేను కాదు: ఉదయభాను

హాట్ సీన్లలో ఉన్నది నేను కాదు: ఉదయభాను

హైదరాబాద్: 'మధుమతి' సినిమాలో కొన్ని సన్నివేశాలను మార్ఫింగ్ చేశారని ప్రముఖ వ్యాఖ్యాత, నటి ఉదయభాను ఆరోపించింది. తాను అశ్లీల దృశ్యాల్లో నటించినట్టు మార్ఫింగ్ చేసి తన ఇమేజ్ దెబ్బ తీశారని తెలిపింది. హాట్ సీన్లలో ఉన్నది తాను కాదని స్పష్టం చేసింది. తాను చేసిన దాంట్లో అశ్లీలత లేదని వెల్లడించింది. తన ఇమేజ్ను దెబ్బ తీసిన వారిని వదలబోనని ఆమె హెచ్చరించారు. దీనిపై సిసిఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది.

'మధుమతి' మంచి సినిమా అని ఒప్పుకున్నానని పేర్కొంది. అయితే నిర్మాత, దర్శకుడు మాట తప్పారని ఆరోపించింది. కనీసం ప్రివ్యూనుకూడా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫోటోలను మార్పింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించింది. ఈ సినిమాలో కొన్ని పాటల్లో అద్భుతంగా నటించానని చెప్పింది. తన బాడీ రబ్బర్లా వంగుతుందని వెల్లడించింది.18 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నానని, తన పేరు చెప్పుకుని కొంతమంది బతుకుతున్నారని పేర్కొంది.

తన మీద అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని ఉదయభాను వాపోయింది. వీటిని ఖండించేందుకే మీడియా ముందుకు వచ్చానని చెప్పింది. 'మధుమతి' సినిమా ప్రచారం కోసమే ఇదంతా చేస్తున్నారన్న విమర్శలను ఆమె కొట్టి పారేసింది. పబ్లిసిటీ నాకు ఇష్టం ఉండదని తెలిపింది. ఈ వివాదంపై నిర్మాతను, దర్శకుడ్ని పోలీసులు ప్రశ్నించినట్టు తెలిసింది. మార్ఫింగ్ జరిగాయంటున్న దృశ్యాలను అవసరమైతే ఫోరెన్సిక్‌ నిపుణులకు పంపిస్తామంటున్నారు పోలీసులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement