Madhumati
-
ఉదయభాను ఫిర్యాదుతో వెబ్సైట్ నిర్వాహకులపై కేసు నమోదు
హైదరాబాద్: తన ఫోటోలను మార్ఫింగ్ చేశారన్న ప్రముఖ వ్యాఖ్యాత, సినిమా, టివి నటి ఉదయభాను ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ‘మధుమతి’ సినిమా విషయంలో ఆ చిత్ర దర్శకుడు రాజ్‌శ్రీధర్ తనని మోసం చేశారని ఉదయభాను ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘మధుమతి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచార చిత్రాలు రూపొందించారని, దీనిపై న్యాయపోరాటం చేయబోతున్నానని ఉదయభాను చెప్పారు. మంచి కథ అని చెప్పి ఎక్కడా ప్రమాణాలు పాటించకుండా దర్శకుడు సినిమాను చుట్టేశాడన్నారు. కనీసం ప్రివ్యూను కూడా తనకు చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను అశ్లీల దృశ్యాల్లో నటించినట్లు మార్ఫింగ్ చేసి తన ఇమేజ్ను దెబ్బ తీశారని ఆమె బాధపడ్డారు. హాట్ సీన్లలో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు. తాను చేసిన దాంట్లో అశ్లీలత లేదని తెలిపారు. పైగా పారితోషికం కింద తనకు రెండు లక్షల రూపాయలే ఇచ్చారని చెప్పారు. ఫొటోలు మార్ఫింగ్ విషయమై ఆమె సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయభాను ఫిర్యాదుతో పోలీసులు వెబ్సైట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. మార్ఫింగ్ జరిగినట్లు చెబుతున్న దృశ్యాలను, ఫోటోలను ల్యాబ్‌కు పంపారు. -
అనగ అనగా ఓ మధుమతి
-
నన్ను నమ్మించి మోసం చేశారు - ఉదయభాను
‘‘తెలుగు సినిమా గర్వపడే సినిమా ఇదని... ఈ చిత్రంతో జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు లభిస్తుందని నమ్మించి ‘మధుమతి’ చిత్ర దర్శకుడు రాజ్‌శ్రీధర్ నన్ను మోసం చేశారు’’ అని ఉదయభాను ఆరోపించారు. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘మధుమతి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచార చిత్రాలు రూపొందించారని, దీనిపై న్యాయపోరాటం చేయబోతున్నానని ఉదయభాను వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆమె పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘మంచి కథ అని చెప్పి ఎక్కడా ప్రమాణాలు పాటించకుండా దర్శకుడు సినిమాను చుట్టేశాడు. పైగా పారితోషికం కింద రెండు లక్షల రూపాయలే ఇచ్చారు’’ అని చెప్పారు. ఫొటోలు మార్ఫింగ్ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ మొదలు పెట్టారు. మార్ఫింగ్ చేయలేదు: ఈ వివాదం గురించి దర్శకుడు రాజ్‌శ్రీధర్ స్పందిస్తూ... ‘మధుమతి’ ప్రోమోలో తాను ఎలాంటి మార్ఫింగ్‌కూ పాల్పడలేదన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న ఉదయభాను ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు. తగిన సాక్ష్యాలతో ఆరోపణలు చేయాలని చెప్పారు. -
హాట్ సీన్లలో ఉన్నది నేను కాదు: ఉదయభాను
హైదరాబాద్: 'మధుమతి' సినిమాలో కొన్ని సన్నివేశాలను మార్ఫింగ్ చేశారని ప్రముఖ వ్యాఖ్యాత, నటి ఉదయభాను ఆరోపించింది. తాను అశ్లీల దృశ్యాల్లో నటించినట్టు మార్ఫింగ్ చేసి తన ఇమేజ్ దెబ్బ తీశారని తెలిపింది. హాట్ సీన్లలో ఉన్నది తాను కాదని స్పష్టం చేసింది. తాను చేసిన దాంట్లో అశ్లీలత లేదని వెల్లడించింది. తన ఇమేజ్ను దెబ్బ తీసిన వారిని వదలబోనని ఆమె హెచ్చరించారు. దీనిపై సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. 'మధుమతి' మంచి సినిమా అని ఒప్పుకున్నానని పేర్కొంది. అయితే నిర్మాత, దర్శకుడు మాట తప్పారని ఆరోపించింది. కనీసం ప్రివ్యూనుకూడా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫోటోలను మార్పింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించింది. ఈ సినిమాలో కొన్ని పాటల్లో అద్భుతంగా నటించానని చెప్పింది. తన బాడీ రబ్బర్లా వంగుతుందని వెల్లడించింది.18 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నానని, తన పేరు చెప్పుకుని కొంతమంది బతుకుతున్నారని పేర్కొంది. తన మీద అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని ఉదయభాను వాపోయింది. వీటిని ఖండించేందుకే మీడియా ముందుకు వచ్చానని చెప్పింది. 'మధుమతి' సినిమా ప్రచారం కోసమే ఇదంతా చేస్తున్నారన్న విమర్శలను ఆమె కొట్టి పారేసింది. పబ్లిసిటీ నాకు ఇష్టం ఉండదని తెలిపింది. ఈ వివాదంపై నిర్మాతను, దర్శకుడ్ని పోలీసులు ప్రశ్నించినట్టు తెలిసింది. మార్ఫింగ్ జరిగాయంటున్న దృశ్యాలను అవసరమైతే ఫోరెన్సిక్ నిపుణులకు పంపిస్తామంటున్నారు పోలీసులు. -
సినిమా రివ్యూ: మధుమతి
తెలుగు తెరపై అడపాదడపా అతిధి పాత్రలతో తళుక్కుమంటున్న టాప్ యాంకర్ ఉదయభాను ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'మధుమతి'. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ శ్రీధర్ దర్శకుడు. విడుదలకు ముందే చిన్నపాటి వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన శృంగార భరిత చిత్రం 'మధుమతి' డిసెంబర్ 13వ తేది శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్ద చిత్రాల అలికిడి లేని నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. కథ: కార్తీక్ ఓ కంపెనీ యజమాని.. ప్రేమ, పెళ్లి అంటేనే చిరాకు పడే కార్తీక్ ఆడవాళ్లకు ఆమడ దూరంలో ఉంటాడు. పెళ్లి చేసుకోవాలంటూ ఇంట్లోవాళ్లు బలవంతం పెట్టడంతో తనకు పెళ్లయిపోయిందని అబద్దం ఆడుతాడు. దాంతో భార్యను చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో మధుమతి అనే వేశ్యను భార్యగా నటించాలని కొ్న్ని రోజుల కోసం ఒప్పందం కుదుర్చుకుంటాడు. మధుమతిని భార్యగా ఇంట్లోవాళ్లకు పరిచయం చేస్తాడు. మధుమతిలో మంచితనం, కార్తీక్ ప్రవర్తన తీరుతో ఇద్దరూ పరస్పరం ఇష్టపడతారు.వారి ఇష్టం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. కార్తీక్, మధుమతి విడిపోతారా, వారిద్దరి ప్రేమ కథ చివరికి ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం. టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్లలో ఒకరైన ఉదయభాను మధుమతి పాత్రకు న్యాయం చేకూర్చింది. కీలక సన్నివేశాల్లో మధుమతిగా ఉదయభాను ఆకట్టుకుంది. తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించేలా ఉదయభాను లేకపోయింది. ఈచిత్రంలో వ్యక్తిగతంగా మంచి మార్కులే సంపాదించుకుంది. కార్తీక్ పాత్రలో హీరోగా విష్ణుప్రియన్ ఆకట్టుకోలేకపోయారు. మధుమతి పాత్రనే ప్రధాన పాయింట్ గా నమ్ముకుని ఈ చిత్రాన్ని నిర్మించారు దర్శకుడు రాజ్ శ్రీధర్. అయితే తొలి భాగం ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ప్రభాస్ శ్రీను, కమెడియన్ వేణు హస్యం ఆకట్టుకోలేక అభాసుపాలైంది. దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించడంలో విఫలమయ్యాడని చెప్పవచ్చు. క్లైమాక్స్ లో ట్విస్ట్ కన్విన్సింగ్ గా లేకపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేసే అంశం. కెమెరా పనితనం ఓకే అనిపించింది, మ్యూజిక్, ఇతర విభాగాలు సోసోగా ఉన్నాయి. ఈ చిత్రంపై నెలకొన్న వివాదాలు, చిత్ర నిర్మాతలపై ఉదయభాను హాట్ హాట్ వ్యాఖ్యలు మధుమతిని ఏమేరకు రక్షిస్తాయో వేచి చూడాల్సిందే. -
మధుమతిలో నా పార్ట్ ఓకే: ఉదయభాను
-
మధుమతిలో నా పార్ట్ ఓకే: ఉదయభాను
'మధుమతి' హీరోయిన్ ఉదయభాను తనకు సినిమా ప్రివ్యూ చూపించలేదని అర్థరాత్రి హైదరాబాద్‌లో హంగామా సృష్టించింది. చిత్ర నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ప్రివ్యూ చూపించాల్సిందేనని పట్టుబట్టింది. ఎట్టకేలకు ఉదయభాను రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసుల సమక్షంలో ప్రివ్యూ చూసింది. ప్రివ్యూ చూసిన అనంతరం ఉదయభాను విలేకర్లతో మాట్లాడుతూ మధుమతి చిత్రంలో అసభ్యకరం ఏమీ లేదని... తన పాత్ర విషయంలో ఎలాంటి అభ్యంతరకరం లేదని సర్టిఫికెట్ ఇచ్చేసింది. అయితే విడుదల ముందే తనకు సినిమాను చూసే అధికారం ఉందని, అయితే నిర్మాతను అడిగితే థియేటర్లు ఖాళీ లేనందున ప్రివ్యూ చూపించలేదని చెప్పారని చెప్పింది. తాను ఎవరిపైన కేసు పెట్టలేదని ఉదయభాను స్పష్టం చేసింది. సినిమా చూడాలనుకున్నాను... చూశానంటూ ఆమె సింపుల్‌గా తేల్చేసింది. ఉదయభాను ప్రధాన పాత్రధారిణిగా రూపొందుతోన్న‘మధుమతి’ చిత్రానికి రాజ్‌శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గోమాతా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె.రాణి శ్రీధర్, రమేశ్‌బాబు తెరకెక్కించారు. ఉదయభాను ఈ సినిమాలో వేశ్య పాత్ర పోషించగా, విష్ణుప్రియన్, దీక్షాపంథ్ కీలక పాత్రధారులు. కాగా ప్రివ్యూ వివాదంపై దర్శకుడు రాజ్‌శ్రీధర్ మాట్లాడుతూ ....పోలీసులతో కలిసి ఉదయభాను సినిమా చూడాల్సిన విషయం ఏమీ వచ్చిందని ... ప్రివ్యూ చూపించమని అడిగితే తామే చూపించేవాళ్లమని అన్నారు. సెన్సార్ యూఏ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత సినిమాను పర్యవేక్షించటానికి పోలీసులు ఎవరని రాజ్‌శ్రీధర్ ప్రశ్నించారు. తన భవిష్యత్ ప్రణాళికలకు ఈ చిత్రం అడ్డు కానుందేమో అనే అనుమానంతోనే ఉదయభాను ఇలా వ్యవహరించి ఉంటుందని దర్శకుడు అభిప్రాయపడ్డాడు. మరోవైపు నిర్మాత మాట్లాడుతూ మధుమతి చిత్రంలో ఉదయభాను అద్భుతంగా నటించిందన్నారు. ఆమె నటించిన పాత్రకు తప్పకుండా అవార్డు వచ్చి తీరుతుందన్నారు. ఆ క్రెడిట్ అంతా ఉదయభానుదేనన్నారు. ఇక మధుమతి చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రంలో ఉదయభాను చాలా బోల్డ్ గా నటిస్తుందనే టాక్ మొదటి నుంచి ఉండటంతో..ఏదో అందాల ఆరబోత ఉంటుందనే అంచనాల్లో ఒక వర్గం ప్రేక్షకులు ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్స్ కూడా అదే విధంగా ఉండటంతో ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. మరి మధుమతిగా భాను ఏమేరకు ప్రేక్షకుల్ని ఆలరిస్తోందో చూడాలి. కాగా వచ్చే ఎన్నికల్లో ఉదయభాను పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు పుకార్లు జోరుగా షికార్లు చేస్తున్నాయి. -
మధుమతి సినిమా స్టిల్స్
-
మధుమతి సినిమా స్టిల్స్
రాజ్ శ్రీధర్ దర్శకత్వంలో రూపొందించిన మధుమతి సినిమా స్టిల్స్. ఉదమభాను, దీక్షా, శివకుమార్ ఈ చిత్రంలో ముఖ్య తారాగణం. -
మది దోచే మధుమతి
ప్రముఖ వ్యాఖ్యాత, నటి ఉదయభాను ప్రధాన పాత్రధారిణిగా రూపొందుతోన్న చిత్రం ‘మధుమతి’. రాజ్‌శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె.రాణి శ్రీధర్, రమేశ్‌బాబు నిర్మాతలు. రాజ్‌కిరణ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కుంచె రఘు ఆడియోసీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని ఐఏఎస్ అధికారి ఎన్.గోపాలకృష్ణకు అందించారు. ప్రచార చిత్రాలను మరో ఐఏఎస్ అధికారి కామాక్షి విడుదల చేశారు. సినిమా విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. ‘‘ఉదయభాను ఈ కథకు వందశాతం యాప్ట్. ఇందులో ఆమె పాత్ర యువతరం మది దోచుకునే విధంగా ఉంటుంది. వాణిజ్య అంశాల మేలుకలయిక అయిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది’’ అని దర్శకుడు చెప్పారు. సంగీత పరంగా అందరూ మెచ్చే సినిమా అవుతుందని రాజ్‌కిరణ్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు మధుర శ్రీధర్, భార్గవి పిళ్ళై కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.