మది దోచే మధుమతి | Udaya Bhanu's Madhumati movie audio Launched | Sakshi
Sakshi News home page

మది దోచే మధుమతి

Published Sun, Nov 24 2013 1:36 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

Udaya Bhanu's Madhumati movie audio Launched

ప్రముఖ వ్యాఖ్యాత, నటి ఉదయభాను ప్రధాన పాత్రధారిణిగా రూపొందుతోన్న చిత్రం ‘మధుమతి’. రాజ్‌శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె.రాణి శ్రీధర్, రమేశ్‌బాబు నిర్మాతలు. రాజ్‌కిరణ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కుంచె రఘు ఆడియోసీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని ఐఏఎస్ అధికారి ఎన్.గోపాలకృష్ణకు అందించారు. ప్రచార చిత్రాలను మరో ఐఏఎస్ అధికారి కామాక్షి విడుదల చేశారు. సినిమా విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు.
 
‘‘ఉదయభాను ఈ కథకు వందశాతం యాప్ట్. ఇందులో ఆమె పాత్ర యువతరం మది దోచుకునే విధంగా ఉంటుంది. వాణిజ్య అంశాల మేలుకలయిక అయిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది’’ అని దర్శకుడు చెప్పారు. సంగీత పరంగా అందరూ మెచ్చే సినిమా అవుతుందని రాజ్‌కిరణ్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు మధుర శ్రీధర్, భార్గవి పిళ్ళై కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement