
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2018 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఘనవిజయం సాధించటంతో కొత్త సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అందుకు తగ్గట్టుగా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం సీనియర్ యాంకర్ ను తీసుకున్నారట. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన జులాయి సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన ఉదయభాను, పవన్ సినిమాలోనూ ఐటమ్ సాంగ్ లో మెరవనుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే హాట్ యాంకర్ అనసూయ స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తుండటంతో ఉదయభాను రీ ఎంట్రీతో అనసూయకు గట్టిపోటి తప్పేలా లేదు.