Bheemla Nayak Success meet: ‘‘మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’లో కథ కోషి (తెలుగులో రానా చేసిన పాత్ర) వైపు నుంచి చెప్పబడింది. ఈ కథను తెలుగులో భీమ్లా నాయక్ వైపు తీసుకురావడానికి ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది ఈ సినిమా రీమేక్ అనుకున్నప్పుడు మాకు ఎదురైన తొలి సవాల్. కథను ఎలా మార్చాలనే విషయంపై చాలా చర్చించాం’’ అని త్రివిక్రమ్ అన్నారు. పవన్ కల్యాణ్–రానా కాంబినేషన్‌లో సాగర్.కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో పవర్‌ఫుల్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ప్లే అందించిన త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘కోవిడ్ సమయంలో పవన్, రానా భయం లేకుండా జనాల మధ్య రిస్క్ చేసి పనిచేశారు. 600 మందితో సాంగ్ షూట్ చేయడం సాధారణ విషయం కాదు. మూడు రోజుల్లో గణేశ్ మాస్టర్ ఈ పాటను పూర్తి చేశాడు’’ అన్నారు. ‘‘భీమ్లా నాయక్’ సక్సెస్ రీసౌండ్‌కి కారణం త్రివిక్రమ్‌గారి ఆలోచనే’’ అన్నారు సాగర్ కె. చంద్ర. పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్లశ్యామ్ తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment