![Why Trivikram Take Backseat in Bheemla Nayak Prelease Event, Details Inside - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/24/477.jpg.webp?itok=iwr1eWd2)
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'భీమ్లా నాయక్'. రేపు(ఫిబ్రవరి 25)న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం అయ్యింది. అయితే ఈవెంట్ మొత్తంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్ లేకపోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఆయన ఫంక్షన్‌కి వచ్చారా లేదా అన్న సందేహం కూడా ఫ్యాన్స్‌లో మిగిలిపోయింది.
పవన్ సినిమా ఫంక్షన్‌కు అన్నీ తానై ముందుండి నడిపించే త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో మాత్రం బ్యాక్ స్టేజ్‌కే ఎందుకు పరిమితం అయ్యారన్నది ఇప్పడు చర్చనీయాంశమైంది. దీనికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా సోషల్ మీడియాలో లీక్ అయిన బండ్ల గణేష్ ఆడియో కాల్‌తో త్రివిక్రమ్ అప్‌సెట్ అయ్యారని, దీనివల్లే త్రివిక్రమ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడలేదని టాక్ వినిపిస్తోంది.
మరోవైపు ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి త్రివిక్రమ్ పేరే హైలైట్ అవుతూ వచ్చింది. నిజానికి యంగ్ ఫిల్మ్ మేకర్ సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ సోషల్ మీడియాలోనూ త్రివిక్రమ్ పేరు ఎక్కువగా వినిపిస్తుండటంతో ఈవెంట్‌లో ఎలాంటి హడావిడి లేకుండా కావాలనే బ్యాక్ స్టేజ్‌కి పరిమితం అయ్యారని టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. చదవండి: త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఆడియో లీక్‌పై స్పందించిన బండ్లగణేష్
Comments
Please login to add a commentAdd a comment