
Pawan Kalyan Bheemla Nayak Official Trailer Out Now: పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా భీమ్లా నాయక్. తెలుగు ప్రేక్షకుల మోస్ట్ అవేయిటేడ్ అయిన ఈ మూవీ ఫిబ్రవరి 25న థియేటర్లలో సందడి చేయనుంది. అలాగే సోమవారం నాడు 8.10 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పలు అనివార్య కారణాల వల్ల ఒక గంట పోస్ట్ చేసి 9.10 గంటలకు భీమ్లా నాయక్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్లో తివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్‌లు అదిరిపోయాయి. తమన్ మ్యూజిక్‌తోపాటు పవన్ కల్యాణ్, రానా యాక్టింగ్ సూపర్బ్ అనిపించాయి.
సోమవారం ఫిబ్రవరి 21 జరగాల్సిన ఈ సినిమా ప్రిరిలీజ్ వేడుక వాయిదా పడింది. పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా తివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ మూవీలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. అయితే ఫిబ్రవరి 21న జరగాల్సిన ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment