Pawan Kalyan Bheemla Nayak Movie Trailer Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Bheemla Nayak Trailer: 'భీమ్లా నాయక్‌' ట్రైలర్‌ వచ్చేది అప్పుడే.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే

Published Sat, Feb 19 2022 4:35 PM | Last Updated on Thu, Dec 8 2022 12:48 PM

Pawan Kalyan Bheemla Nayak Trailer Date Confirmed - Sakshi

Bheemla Nayak Trailer Date Confirmed: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా కాంబినేషన్‌ల వస్తున్న మల్టిస్టారర్‌ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్‌ సరసన నిత్యామీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళ సూపర్‌ హిట్‌ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌పై ఇప్పటికే బజ్‌ క్రియేట్‌ అయ్యింది. నిజానికి నిన్న(ఫిబ్రవరి19)న ట్రైలర్‌ రిలీజ్‌ కావాల్సి ఉండగా వాయిదా పడింది. తాజాగా ట్రైలర్‌పై అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. ఈనెల21న జరగనున్న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేయనున్నారు. కాగా ఈ ఈవెంట్‌కు మంత్రి కేసీఆర్‌తో పాటు  సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చీఫ్‌ గెస్టులుగా రానున్నట్లు సమాచారం. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement